మహీంద్రా బ్రాండ్ నుండి అత్యధికంగా అమ్ముడయ్యే టాప్ మోడళ్లు ఏవో తెలుసా..?

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra and Mahindra) ఇటీవలి కాలంలో భారతదేశంలో మంచి సానుకూల వృద్ధిని సాధిస్తోంది. ఈ కంపెనీ కొత్తగా ప్రవేశపెడుతున్న మోడళ్లు మరియు కార్లలో అందిస్తున్న అధునాతన సేఫ్టీ ఫీచర్ల కారణంగా ప్రజల్లో మహీంద్రా బ్రాండ్ పట్ల విశ్వసనీయత క్రమంగా పెరుగుతోంది. ఫలితంగా, ఈ బ్రాండ్ అమ్మకాలు కూడా మెరుగ్గా ఉంటున్నాయి. మహీంద్రా గత నెలలో కార్ల విక్రయాల్లో 8 శాతం వృద్ధిని సాధించింది. గత నెలలో కంపెనీ మొత్తం 19,400 కార్లను విక్రయించింది. ఈ సంఖ్య నవంబర్ 2020 నెలలో విక్రయించిన 17,971 కార్ల కంటే 8 శాతం ఎక్కువ.

మహీంద్రా బ్రాండ్ నుండి అత్యధికంగా అమ్ముడయ్యే టాప్ మోడళ్లు ఏవో తెలుసా..?

అక్టోబర్ 2021 నెల విక్రయాలతో పోలిస్తే, గత నెలలో మహీంద్రా విక్రయాలు 3 శాతం తక్కువగా ఉన్నాయి. గత అక్టోబర్‌లో మహీంద్రా కార్ల విక్రయాలు 20,034 యూనిట్లుగా ఉన్నాయి. నవంబర్ 2020తో పోల్చితే నవంబర్‌ 2021లో మహీంద్రా కార్ల అమ్మకాలు 8 శాతం పెరగడానికి ప్రధాన కారణం కంపెనీ ఇటీవల విడుదల చేసిన ఎక్స్‌యూవీ700 (Mahindra XUV700) ఎస్‌యూవీ. మహీంద్రా అందిస్తున్న థార్ ఎస్‌యూవీ కూడా అమ్మకాల పరంగా దూసుకుపోతోంది.

మహీంద్రా బ్రాండ్ నుండి అత్యధికంగా అమ్ముడయ్యే టాప్ మోడళ్లు ఏవో తెలుసా..?

గత నెలలో మహీంద్రా బొలెరో మరియు ఎక్స్‌యూవీ300 ఎస్‌యూవీలో అత్యధికంగా అమ్ముడైన మోడళ్లుగా నిలిచాయి. నవంబర్ 2021 నెలలో మొత్తం 5,442 బొలెరో కార్లు అమ్ముడయ్యాయి. అయితే, ఇవి నవంబర్ 2020లో విక్రయించిన 6,055 యూనిట్ల కంటే 10.12 శాతం తక్కువ. ఇదే సమయంలో మహీంద్రా నుండి అత్యంత పాపులర్ అయిన కాంపాక్ట్ ఎస్‌యూవీ ఎక్స్‌యూవీ300 (Mahindra XUV300) అమ్మకాలు 4,005 యూనిట్లుగా ఉన్నాయి. నవంబర్ 2020లో విక్రయించిన 4,458 యూనిట్లతో పోలిస్తే ఇవి 10.16 శాతం తక్కువ.

మహీంద్రా బ్రాండ్ నుండి అత్యధికంగా అమ్ముడయ్యే టాప్ మోడళ్లు ఏవో తెలుసా..?

మహీంద్రా అందిస్తున్న స్కార్పియో (Mahindra Scorpio) ఎస్‌యూవీ గత నెలలో 3,370 యూనిట్ల అమ్మకాలతో మూడవ స్థానంలో ఉంది. నవంబర్ 2020లో స్కార్పియో అమ్మకాలు 3,725 యూనిట్లుగా ఉన్నాయి, ఈ సమయంలో స్కార్పియో అమ్మకాలు 9.53 శాతం తగ్గాయి. ఇదిలా ఉంటే, మహీంద్రా వచ్చే ఏడాది స్కార్పియో ఎస్‌యూవీలో ఆఫ్-రోడ్ సెలెక్టర్ మరియు 4-వీల్-డ్రైవ్ సిస్టమ్‌తో అప్‌డేట్ చేయాలని ప్లాన్ చేస్తోంది. ఇదే గనుక జరిగితే వచ్చే ఏడాది నుండి స్కార్పియో అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది.

మహీంద్రా బ్రాండ్ నుండి అత్యధికంగా అమ్ముడయ్యే టాప్ మోడళ్లు ఏవో తెలుసా..?

ఈ జాబితాలో మహీంద్రా ఎక్స్‌యూవీ700 నాల్గవ స్థానంలో ఉంది. గడచిన సెప్టెంబర్ 2021 నెలలో మహీంద్రా ఈ మూడు వరుసల 7-సీటర్ ఎస్‌యూవీని మార్కెట్లో విడుదల చేసింది. గత నెలలో కంపెనీ మొత్తం 3,207 యూనిట్ల ఎక్స్‌యూవీ700 కార్లను విక్రయించింది. ఇక సెకండ్ జనరేషన్ మహీంద్రా థార్ అమ్మకాల విషయానికి వస్తే, గత నెలలో ఇవి 3,181 యూనిట్లుగా నమోదయ్యాయి. నవంబర్ 2020 నెలతో పోలిస్తే, ఈ మోడల్ అమ్మకాలు 23.82 శాతం పెరిగాయి.

మహీంద్రా బ్రాండ్ నుండి అత్యధికంగా అమ్ముడయ్యే టాప్ మోడళ్లు ఏవో తెలుసా..?

గత నెలలో మిగిలిన మహీంద్రా కార్లు అన్నీ కన్నా 100 యూనిట్ల కంటే తక్కువగా అమ్ముడయ్యాయి. మహీంద్రా మరాజో 99 యూనిట్ల విక్రయాలతో ఈ జాబితాలో 6వ స్థానంలో ఉంది. విడుదల సమయంలో కస్టమర్ల దృష్టిని బాగా ఆకర్షించిన మరాజో మోడల్ అమ్మకాలు ఇటీవలి సంవత్సరాలలో బాగా క్షీణించాయి. గతేడాది నవంబర్‌లో కేవలం 226 మరాజో కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. మహీంద్రా యొక్క ఏకైక లగ్జరీ కారు అయిన ఆల్ట్యూరాస్ జి4 గత నెలలో 80 యూనిట్ల విక్రయాలను నమోదు చేసి, ఈ జాబితాలో 7వ స్థానంలో ఉంది.

మహీంద్రా బ్రాండ్ నుండి అత్యధికంగా అమ్ముడయ్యే టాప్ మోడళ్లు ఏవో తెలుసా..?

అయితే, నవంబర్ 2020 నెలలో కేవలం 23 ఆల్ట్యూరాస్ జి4 కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఈ సమయంలో ఈ లగ్జరీ కారు అమ్మకాలు దాదాపు 247.83 శాతం పెరిగాయి. నవంబర్ 2020లో 23 యూనిట్లను విక్రయించిన మహీంద్రా యొక్క మైక్రో-ఎస్‌యూవీ యూవీ100 మరియు 892 యూనిట్లను విక్రయించిన ఎక్స్‌యూవీ500 గత నెలలో ఒక్క యూనిట్ కూడా అమ్ముడుపోలేదు.

మహీంద్రా బ్రాండ్ నుండి అత్యధికంగా అమ్ముడయ్యే టాప్ మోడళ్లు ఏవో తెలుసా..?

Mahindra కార్లపై డిసెంబర్ 2021 డిస్కౌంట్స్..

ఇయర్ ఎండ్ సేల్ లో భాగంగా మహీంద్రా తమ కార్లపై భారీ తగ్గింపులను అందిస్తోంది. కాంపాక్ట్ ఎస్‌యూవీ మహీంద్రా ఎక్స్‌యూవీ300 రూ. 31,000 వరకు క్యాష్ డిస్కౌంట్స్, రూ. 25,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ. 4,000 కార్పొరేట్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. అలాగే, మహీంద్రా బొలెరో ఎస్‌యూవీపై రూ. 3,000 కార్పొరేట్ డిస్కౌంట్ మరియు రూ. 10,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ లను కంపెనీ అందిస్తుంది. అయితే, ఇటీవల విడుదల చేసిన కొత్త మహీంద్రా బొలెరో నియోపై ఎటువంటి ఆఫర్ అందుబాటులో లేదు.

మహీంద్రా బ్రాండ్ నుండి అత్యధికంగా అమ్ముడయ్యే టాప్ మోడళ్లు ఏవో తెలుసా..?

మహీంద్రా మరాజోలోని M2, M4 ప్లస్ మరియు M6 ప్లస్ వేరియంట్లపై కంపెనీ ఈ నెలలో రూ. 20,000 వరకు క్యాష్ డిస్కౌంట్ అందిస్తోంది. అంతే కాకుండా ఇందులో రూ. 15,000 ఎక్స్‌ఛేంజ్ బోనస్ మరియు రూ. 5,200 కార్పొరేట్ బెనిఫిట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మహీంద్రా బుజ్జి ఎస్‌యూవీ కెయూవీ100 కంపెనీ ఈ నెలలో రూ. 38,055 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ. 20,000 ఎక్స్చేంజ్ బోనస్ మరియు రూ. 3,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్ లను అందిస్తోంది.

మహీంద్రా బ్రాండ్ నుండి అత్యధికంగా అమ్ముడయ్యే టాప్ మోడళ్లు ఏవో తెలుసా..?

మహీంద్రా నుండి అత్యధిక ప్రజాదరణ పొందిన స్కార్పియో ఎస్‌యూవీపై కంపెనీ రూ. 15,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ. 4,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్ లను అందిస్తుంది. కంపెనీ ఇందులో త్వరలోనే ఓ కొత్త తరం మోడల్‌ను కూడా తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. మహీంద్రా అల్టురాస్ జి4 పై కంపెనీ గరిష్టంగా రూ. 50,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 11,500 కార్పొరేట్ డిస్కౌంట్ మరియు రూ. 20,000 వరకు అడిషినల్ ఆఫర్లను అందిస్తోంది.

Most Read Articles

English summary
Mahindra car sales in november 2021 bolero and xuv300 are the best selling models
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X