ఫిబ్రవరి నెలలో మహీంద్రా అమ్మకాలకు బ్రేక్.. కారణం ఏంటో?
ఇండియన్ మార్కెట్లో ప్రముఖ వాహన తయారీ సంస్థగా ప్రసిద్ధిచెందిన మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఇటీవల తన 2021 ఫిబ్రవరి అమ్మకాల నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం మహీంద్రా ఫిబ్రవరి నెలలో 15,391 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలను అమ్మినట్లు తెలిపింది. ఇదే గత ఏడాది 10,938 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలను మాత్రమే అమ్మకాలు జరిపింది.

మహీంద్రా గత నెలలో 11 ఎలక్ట్రిక్ కార్లను కూడా విక్రయించినట్లు తెలిపింది. గత 3-4 నెలలుగా సెమీకండక్టర్ కొరత వల్ల కంపెనీ చాలా ఇబంధులను ఎదుర్కొంటోంది. ఈ కారణంగా థార్ మరియు మరికొన్ని మోడళ్ల ఉత్పత్తి కొంత తగ్గే అవకాశం ఉంటుంది.

మహీంద్రా కంపెనీ యొక్క కమర్షియల్ వాహన అమ్మకాల విషయానికి వస్తే, కంపెనీ గత నెలలో 11,559 యూనిట్ల వాణిజ్య వాహనాలను విక్రయించింది. ఫిబ్రవరి 2021 లో మహీంద్రా ఎలక్ట్రిక్ త్రీ వీలర్ అమ్మకాలు 41 శాతం తగ్గి 19,699 యూనిట్లకు చేరుకున్నాయి. మహీంద్రా 2-టన్నుల, 3.5 టన్నుల వాహన అమ్మకాలు కూడా 46 శాతం తగ్గి 7,446 యూనిట్లకు చేరుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

3.5 టన్నులకు పైగా మరియు మీడియం మరియు హెవీ కమర్షియల్ వెహికల్ అమ్మకాలు 581 యూనిట్లు మాత్రమే, ఇవి దాదాపు ఈ సంవత్సరం 33 శాతం క్షీణతను నమోదు చేశాయి. మహీంద్రా త్రీ వీలర్ వాహన అమ్మకాలు కూడా 39 శాతం తగ్గి 2357 యూనిట్లకు చేరుకున్నాయి.

మహీంద్రా కంపెనీ యొక్క దేశీయ అమ్మకాలు మరియు ఎగుమతుల విషయానికొస్తే, ఇది కూడా 11.4 శాతం తగ్గి 28,777 యూనిట్లకు చేరుకుంది. అదే సమయంలో, గత ఏడాది ఇదే ఫిబ్రవరిలో మొత్తం వాహనాల అమ్మకాలు 32,476 యూనిట్లు.

భారతదేశంలో కొత్త మహీంద్రా థార్ ప్రారంభించినప్పటి నుండి, మంచి అమ్మకాలతో ముందుకు వెళ్తోంది. కొత్త థార్ ఇంజన్ మరియు వేరియంట్ల ప్రకారం కారు డెలివరీ చేయడానికి 5 నుండి 8 నెలల వరకు వినియోగదారులు వేచి ఉండాల్సి ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇదిలా ఉండగా, కొత్త థార్ బుకింగ్ 39,000 దాటిందని కంపెనీకి అధికారికంగా ప్రకటించింది.

కొత్త మహీంద్రా థార్ భారత మార్కెట్లో 2020 అక్టోబర్ 2 న ప్రారంభించబడి, వీటి డెలివరీలు నవంబర్ నుంచి ప్రారంభమయ్యాయి.థార్ 2020 డిసెంబర్‌లో 6,500 బుకింగ్‌లు పొందగా, 2021 జనవరిలో 6,000 యూనిట్లు బుక్ అయ్యాయి. థార్ బుకింగ్స్ రోజుకు 250 నుండి 300 యూనిట్ల పొందుతున్నట్లు కంపెనీ నివేదించింది.

మహీంద్రా థార్ యొక్క బుకింగ్స్ గమనిస్తే వాహనదారులను ఎంతగా ఆకట్టుకుందో మనకు తెలుస్తుంది. మహీంద్రా థార్ బుకింగ్‌లో 45 శాతం ఆటోమేటిక్ వేరియంట్లు ఉన్నాయి. అదే సమయంలో, చాలామంది దాని నాన్ కన్వర్టిబుల్ రూప్ టాప్ ప్రాధాన్యత ఇస్తున్నారు.ఏది ఏమైనా ఈ నెలలో కంపెనీ యొక్క అమ్మకాలు చాలా వరకు మందగించాయని తెలుస్తుంది.


Click it and Unblock the Notifications








