సేఫ్టీలో టాటాకి ఏమాత్రం తీసిపోని మహీంద్రా కార్స్.. వరుసగా 5-స్టార్ రేటింగ్ పొందుతున్న Mahindra వాహనాలు

భారతదేశంలో కొత్త భద్రతా నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత, ఆటోమొబైల్ కంపెనీలు ఇప్పుడు అత్యంత సురక్షితమైన కార్లను తయారు చేయడంలో పోటీపడుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఇప్పుడు ఎంట్రీ లెవల్ ప్యాసింజర్ కార్లు కూడా అత్యంత సురక్షితంగా మారుతున్నాయి. మనదేశంలో ఇప్పటి వరకూ అత్యంత సురక్షితమైన కార్లను అందిస్తున్న దేశీయ ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ టాటా మోటార్స్ కాగా, ఇప్పుడు మహీంద్రా కూడా ఈ జాబితాలో అగ్రస్థానాన్ని చేరుకునేందుకు పోటీపడుతోంది.

సేఫ్టీలో టాటాకి ఏమాత్రం తీసిపోని మహీంద్రా కార్స్.. వరుసగా 5-స్టార్ రేటింగ్ పొందుతున్న Mahindra వాహనాలు

వాస్తవానికి, భారతీయ కంపెనీలు తయారు చేసే కార్లు సురక్షితంగా ఉండవని చాలా కాలంగా చర్చ జరుగుతోంది. కానీ ఇప్పుడు 'మేడ్ ఇన్ ఇండియా' కార్లు విదేశీ కార్లకు ఏమాత్రం తీసిపోకుండా గ్లోబల్ ఎన్‌సిఎపి (Global NCAP) క్రాష్ టెస్టుల్లో అత్యుత్తమ ఫలితాలను కనబరుస్తున్నాయి. ఈ క్రాష్ టెస్టులో మొదటిగా 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించిన ఇండియన్ కారుగా టాటా నెక్సాన్ (Tata Nexon) చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత టాటా ఆల్ట్రోజ్ (Tata Altroz) ఈ జాబితాలోకి చేరింది.

సేఫ్టీలో టాటాకి ఏమాత్రం తీసిపోని మహీంద్రా కార్స్.. వరుసగా 5-స్టార్ రేటింగ్ పొందుతున్న Mahindra వాహనాలు

ఆల్ట్రోజ్ తర్వాత 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకున్న మూడవ భారతీయ కారుగా మహీంద్రా ఎక్స్‌యూవీ300 (Mahindra XUV300) నిలిచింది. ఈ మోడల్ అత్యుత్తమ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకోవడంతో మహీంద్రా బ్రాండ్ కార్లపై కస్టమర్లలో విశ్వాసం బాగా పెరిగింది. ఫలితంగా, ఈ మోడల్ కారు అమ్మకాలే కాకుండా, మహీంద్రా బ్రాండ్ అమ్మకాలు కూడా జోరందుకున్నాయి. తాజాగా, మహీంద్రా థార్, మరాజో మరియు ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీలు కూడా ఈ విభాగంలో అత్యుత్తమ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకున్నాయి. ఆ వివరాలేంటో చూద్దాం రండి.

సేఫ్టీలో టాటాకి ఏమాత్రం తీసిపోని మహీంద్రా కార్స్.. వరుసగా 5-స్టార్ రేటింగ్ పొందుతున్న Mahindra వాహనాలు

Mahindra XUV300: 5-స్టార్ సేఫ్టీ రేటింగ్

మహీంద్రా ఎక్స్‌యూవీ300 కోసం గ్లోబల్ ఎన్‌సిఏపి (NCAP - న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్) నిర్వహించిన క్రాష్ టెస్టులలో ఇది పెద్దల భద్రత విషయంలో 17 పాయింట్లకు గాను 16.42 పాయింట్లను సాధించింది. అలాగే, పిల్లల భద్రత విషయంలో ఈ మోడల్ 49 పాయింట్లకు గాను 37.44 పాయింట్లను దక్కించుకుంది.

సేఫ్టీలో టాటాకి ఏమాత్రం తీసిపోని మహీంద్రా కార్స్.. వరుసగా 5-స్టార్ రేటింగ్ పొందుతున్న Mahindra వాహనాలు

ఓవరాల్‌గా చూస్తే, ఈ చిన్న కారు పెద్దల భద్రత విషయంలో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను మరియు పిల్లల భద్రత విషయంలో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకుంది. ఈ కారులో రెండు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబిఎస్, నాలుగు చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్స్, కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్ మరియు ఫ్రంట్ సీట్‌బెల్ట్ ప్రిటెన్షనర్ వంటి సేఫ్టీ ఫీచర్లను కంపెనీ స్టాండర్డ్‌గా అందిస్తుంది.

సేఫ్టీలో టాటాకి ఏమాత్రం తీసిపోని మహీంద్రా కార్స్.. వరుసగా 5-స్టార్ రేటింగ్ పొందుతున్న Mahindra వాహనాలు

Mahindra Marazzo: 4-స్టార్ సేఫ్టీ రేటింగ్

మహీంద్రా మరాజో ఎమ్‌పివి భారత ప్యాసింజర్ కార్ మార్కెట్లో కంపెనీ ఆశించిన విజయం సాధించనప్పటికీ, సేఫ్టీ విషయంలో మాత్రం శభాష్ అనిపించుకుంది. మహీంద్రా మరాజో కోసం గ్లోబల్ NCAP నిర్వహించిన క్రాష్ టెస్ట్‌లలో ఇది ఓవరాల్ 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకుంది. ఈ కారు పెద్దల భద్రత విషయంలో 17 పాయింట్లకు గాను 12.85 పాయింట్లను స్కోర్ చేసింది.

సేఫ్టీలో టాటాకి ఏమాత్రం తీసిపోని మహీంద్రా కార్స్.. వరుసగా 5-స్టార్ రేటింగ్ పొందుతున్న Mahindra వాహనాలు

అదే సమయంలో, పిల్లల భద్రత విషయంలో మహీంద్రా మరాజో 49 పాయింట్లకు గాను 22.22 పాయింట్లను స్కోర్ చేసి మొత్తంగా 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. మహీంద్రా మారాజో ఎమ్‌పివిలో కంపెనీ రెండు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబిఎస్, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్‌లు మరియు నాలుగు చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు వంటి సేఫ్టీ ఫీచర్లను స్టాండర్డ్‌గా అందిస్తుంది.

సేఫ్టీలో టాటాకి ఏమాత్రం తీసిపోని మహీంద్రా కార్స్.. వరుసగా 5-స్టార్ రేటింగ్ పొందుతున్న Mahindra వాహనాలు

Mahindra Thar: 4-స్టార్ సేఫ్టీ రేటింగ్

సరికొత్త డిజైన్ మరియు ఫీచర్లతో వచ్చిన కొత్త తరం 2020 మహీంద్రా థార్ ఎస్‌యూవీ మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్మడుపోవడానికి మరొక కారణం దాని ఓవరాల్ 4-స్టార్ సేఫ్టీ రేటింగ్. ఈ ఆఫ్-రోడ్ ఎస్‌యూవీ పెద్దల భద్రత విషయంలో 17 పాయింట్లకు గాను 12.52 పాయింట్లను స్కోర్ చేయగా, పిల్లల భద్రత విషయంలో 49 పాయింట్లకు గాను 41.11 పాయింట్లను స్కోర్ చేసి మొత్తంగా 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది.

సేఫ్టీలో టాటాకి ఏమాత్రం తీసిపోని మహీంద్రా కార్స్.. వరుసగా 5-స్టార్ రేటింగ్ పొందుతున్న Mahindra వాహనాలు

కొత్త తరం మహీంద్రా థార్ ఎస్‌యూవీని మొదటిసారిగా మార్కెట్లో విడుదల చేసినప్పుడు, కంపెనీ ఇందులో 6-సీటర్ వెర్షన్ కూడా అందించేంది. అయితే, ఇందులో ISOFIX చైల్డ్ సీట్ మౌంట్‌లు, వెనుక ప్రయాణీకులకు త్రీ-పాయింట్ సీట్‌బెల్ట్‌లు మరియు రోల్ కేజ్‌ వంటి సేఫ్టీ ఫీచర్లు లేనందున, కంపెనీ ఇందులోని బేస్ AX స్టాండర్డ్ మరియు AX వేరియంట్‌లను నిలిపివేసింది. కంపెనీ ఈ ఎస్‌యూవీలో రెండు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబిఎస్ మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఫీచర్లను స్టాండర్డ్‌గా అందిస్తోంది.

సేఫ్టీలో టాటాకి ఏమాత్రం తీసిపోని మహీంద్రా కార్స్.. వరుసగా 5-స్టార్ రేటింగ్ పొందుతున్న Mahindra వాహనాలు

Mahindra XUV700: 5-స్టార్ సేఫ్టీ రేటింగ్

మహీంద్రా అండ్ మహీంద్రా తాజాగా మార్కెట్లోకి విడుదల చేసిన లేటెస్ట్ ఎస్‌యూవీ ఎక్స్‌యూవీ700 కోసం గ్లోబల్ ఎన్‌క్యాప్ నిర్వహించిన క్రాష్ టెస్టులో ఇది 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకుంది. పెద్దల సేఫ్టీ విషయంలో ఈ కారు 17 పాయింట్లకు గాను 16.03 పాయింట్లను స్కోర్ చేసింది. అలాగే, పిల్లల భద్రత విషయంలో ఇది 49 పాయింట్లకు గాను 41.66 పాయింట్లను స్కోర్ చేసి ఓవరాల్ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది.

సేఫ్టీలో టాటాకి ఏమాత్రం తీసిపోని మహీంద్రా కార్స్.. వరుసగా 5-స్టార్ రేటింగ్ పొందుతున్న Mahindra వాహనాలు

గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్ కోసం ఉపయోగించిన మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీలో రెండు ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబిఎస్, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్స్ వంటి బేసిక్ సేఫ్టీ ఫీచర్లు మాత్రమే ఉన్నాయి. అయితే, ఈ కారులో సైడ్ బాడీ ఎయిర్‌బ్యాగ్‌లు, సైడ్ హెడ్ కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) మరియు అన్ని సీటింగ్ పొజిషన్‌లలో త్రీ పాయింట్ సీట్ బెల్ట్‌లు వంటి ఫీచర్లను స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లుగా జోడించడం ద్వారా మహీంద్రా ఎక్స్‌యూవీ700 యొక్క ఓవరాల్ సేఫ్టీని మరింత మెరుగుపరచవచ్చని టెస్టింగ్ ఏజెన్సీ పేర్కొంది.

Most Read Articles

English summary
Mahindra cars becoming more safer than before safety ratings of xuv300 xuv700 marazzo thar
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X