మా డిజైన్ కాపీ కొట్టి మహీంద్రా థార్ ఎస్‌యూవీని తయారు చేశారు: జీప్!

భారత యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా అందిస్తున్న ఆఫ్-రోడర్ ఎస్‌యూవీ థార్ మరియు అమెరికన్ ఎస్‌యూవీ బ్రాండ్ జీప్ విక్రయిస్తున్న వ్రాంగ్లర్ ఎస్‌యూవీలు రెండూ కూడా ముందు వైపు నుండి చూడటానికి ఇంచు మించు ఒకే డిజైన్‌ను పోలి ఉన్నట్లు కనిపిస్తాయి.

మా డిజైన్ కాపీ కొట్టి మహీంద్రా థార్ ఎస్‌యూవీని తయారు చేశారు: జీప్!

ఇప్పుడిదే పెద్ద సమస్యగా మారి, మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థకు కొత్త తలనొప్పి చెచ్చిపెడుతోంది. తాజాగా, ఆస్ట్రేలియాలో మహీంద్రా థార్ ఎస్‌యూవీని లాంచ్ చేయడాన్ని జీప్ ఆస్ట్రేలియా సంస్థ వ్యతిరేకించింది. ఎఫ్‌సిఏ యాజమాన్యంలో ఉన్న జీప్ బ్రాండ్ ఈ విషయంపై కోర్టుకు కూడా వెళ్లింది.

మా డిజైన్ కాపీ కొట్టి మహీంద్రా థార్ ఎస్‌యూవీని తయారు చేశారు: జీప్!

మహీంద్రా థార్ యొక్క డిజైన్ పాత జీప్ వ్రాంగ్లర్ డిజైన్‌ను పోలి ఉందని, ఇది తమ డిజైన్ నిబంధనల ఉల్లంఘన క్రిందకు వస్తుందని జీప్ బ్రాండ్ తమ ఫిర్యాదులో పేర్కొంది. మునుపటి నివేదిక ప్రకారం, ఆస్ట్రేలియాలో మహీంద్రా థార్ ఎస్‌యూవీని కొనడానికి తమ ఆసక్తిని నమోదు చేసుకోవాలని కంపెనీ ఆస్ట్రేలియాలోని ప్రజలను కోరింది.

MOST READ:అవసరమైన వారికి ఉచితంగా ఆక్సిజన్ అందిస్తున్న 26 ఏళ్ల యువతి.. నిజంగా గ్రేట్ కదా..!

మా డిజైన్ కాపీ కొట్టి మహీంద్రా థార్ ఎస్‌యూవీని తయారు చేశారు: జీప్!

ఈ నేపథ్యంలో, జీప్ బ్రాండ్ మహీంద్రా థార్‌ను ఆస్ట్రేలియా మార్కెట్లోకి రాకుండా అడ్డుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకు ప్రధాన కారణంగా, జీప్ వ్రాంగ్లర్‌తో పోల్చుకుంటే మహీంద్రా థార్ ధర ఎన్నో రెట్లు తక్కువగా ఉండటమే. దీంతో, చాలా మంది జీప్ వ్రాంగ్లర్‌కు ప్రత్యామ్నాయంగా మహీంద్రా థార్‌ను ఎంచుకునే అవకాశం ఉంది.

మా డిజైన్ కాపీ కొట్టి మహీంద్రా థార్ ఎస్‌యూవీని తయారు చేశారు: జీప్!

ఈ పరిస్థితులను అధ్యయనం చేసిన జీప్ ఆస్ట్రేలియా సంస్థ, మహీంద్రా థార్ డిజైన్‌పై కోర్టుకెక్కింది. ఈ మేరకు ఈ అమెరికన్ కంపెనీ ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఆస్ట్రేలియాను సంప్రదించింది. మహీంద్రా ఆస్ట్రేలియాలో తమ ఆఫ్-రోడ్ ఎస్‌యూవీ అమ్మకాలను ప్రారంభించడానికి ముందు 90 రోజుల నోటీసు వ్యవధిని జీప్ డిమాండ్ చేసింది.

MOST READ:కరోనా రోగులకోసం తన టయోటా కారు విరాళంగా ఇచ్చేసిన ఎమ్మెల్యే

మా డిజైన్ కాపీ కొట్టి మహీంద్రా థార్ ఎస్‌యూవీని తయారు చేశారు: జీప్!

దీనికి ప్రతిస్పందనగా, మహీంద్రా అన్ని ఊహాగానాలను క్లియర్ చేస్తూ ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం, "భారతదేశంలో సరికొత్త థార్ 2020 కోసం తాము చాలా బలమైన డిమాండ్‌ను చూస్తున్నామని, అందువల్ల ప్రస్తుతం దేశీయ మార్కెట్ డిమాండ్‌కే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నామని, థార్ యొక్క ప్రస్తుత వేరియంట్‌ను భారతదేశం వెలుపల మార్కెట్లలో ప్రవేశపెట్టడానికి తక్షణ ప్రణాళికలేవీ లేవని, కాబట్టి ఈ దశలో వ్యాజ్యంలో పాల్గొనడంలో ఏ మాత్రం అర్ధం లేదని" కంపెనీ పేర్కొంది.

మా డిజైన్ కాపీ కొట్టి మహీంద్రా థార్ ఎస్‌యూవీని తయారు చేశారు: జీప్!

అంతేకాకుండా, మహీంద్రా థార్ యొక్క ఏదైనా కొత్త వేరియంట్‌ను ఆస్ట్రేలియాలో ప్రారంభించాలని తాము నిర్ణయించుకున్నప్పుడు, ఎఫ్‌సిఎకు 90 రోజుల నోటీసును అందిస్తామని, అక్కడి మార్కెట్లో తమ ఉత్పత్తిని విక్రయించే హక్కులను పరిరక్షించడానికి అన్ని చర్యలు తీసుకుంటామని, ఆస్ట్రేలియాలో తమ వాహనాల విస్తరణను అనేక వాహన విభాగాలలో కొనసాగిస్తున్నామని కూడా కంపెనీ తమ ప్రటనలో తెలిపింది.

MOST READ:ఒకే వ్యక్తి 20 క్రూయిజర్ బైక్స్ కలిగి ఉన్నాడు, వాటి విలువ అక్షరాలా 3.5 కోట్లు

మా డిజైన్ కాపీ కొట్టి మహీంద్రా థార్ ఎస్‌యూవీని తయారు చేశారు: జీప్!

నిజానికి, మహీంద్రా థార్ కోసం భారత మార్కెట్లోనే భారీ డిమాండ్ ఉంది. వేరియంట్‌ను బట్టి ఈ మోడల్ కోసం వెయిటింగ్ పీరియడ్ సుమారు 10 నెలల వరకూ ఉంటోంది. ప్రస్తుత పరిస్థితులు, విడిభాగాల కొరత, తక్కువ ఉత్పత్తి సామర్థ్యం మరియు ఎక్కువ డిమాండ్ కారణంగా కంపెనీ ఈ మోడల్‌ను ఆశించిన స్థాయిలో ఉత్పత్తి చేయలేకపోతోంది.

మా డిజైన్ కాపీ కొట్టి మహీంద్రా థార్ ఎస్‌యూవీని తయారు చేశారు: జీప్!

ఈ నేపథ్యంలో, ప్రస్తుతం దేశీయ మార్కెట్‌పైనే కంపెనీ ప్రధానంగా దృష్టి సారించింది. భారతదేశంలో పెండింగ్‌లో ఉన్న థార్ బుకింగ్‌లను క్లియర్ చేసిన తర్వాత కంపెనీ ఈ మోడల్‌ను విదేశాలకు ఎగుమతి చేసే అంశాన్ని పరిశీలించే అవకాశం ఉంది. అలాగని, విదేశాలలో మహీంద్రా థార్ ఆఫ్-రోడ్ ఎస్‌యూవీ అమ్మకాన్ని కంపెనీ పూర్తిగా తోసిపుచ్చలేదు. భవిష్యత్తులో ఇది మరిన్ని కొత్త దేశాలకు ఎగుమతి కావచ్చు.

MOST READ:'తౌక్టే' తుఫాను వల్ల భారీగా దెబ్బతిన్న లగ్జరీ కార్[వీడియో]

మా డిజైన్ కాపీ కొట్టి మహీంద్రా థార్ ఎస్‌యూవీని తయారు చేశారు: జీప్!

మహీంద్రా థార్ విషయానికి వస్తే, ప్రస్తుతం ఇది మార్కెట్లో ఏఎక్స్ మరియు ఎల్ఎక్స్ అనే రెండు వేరియంట్లలో మాత్రమే లభిస్తుంది. ఈ రెండు వేరియంట్లు పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తున్నాయి. ఈ రెండు ఇంజన్ ఆప్షన్లు కూడా 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో కానీ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో కానీ లభిస్తాయి.

మా డిజైన్ కాపీ కొట్టి మహీంద్రా థార్ ఎస్‌యూవీని తయారు చేశారు: జీప్!

మహీంద్రా థార్ అంటే కేవలం ఆఫ్-రోడర్ ఎస్‌యూవీ మాత్రమే అనే ముద్రను కంపెనీ ఈ కొత్త తరం మోడల్‌తో చెరిపి వేసింది. అటు ఆఫ్-రోడింగ్ ప్రయోజనాలతో పాటుగా ఇటు రోజూవారీ సిటీ ప్రయాణాలను లక్ష్యంగా చేసుకొని మహీంద్రా ఈ కొత్త తరం థార్ ఎస్‌యూవీని ప్రవేశపెట్టింది. థార్‌లోని అన్ని వేరియంట్లు కూడా షిఫ్ట్-ఆన్-ఫ్లై ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌తో పాటుగా మెకానికల్ లాకింగ్ డిఫరెన్షియల్స్‌ను స్టాండర్డ్‌గా పొందుతాయి.

మా డిజైన్ కాపీ కొట్టి మహీంద్రా థార్ ఎస్‌యూవీని తయారు చేశారు: జీప్!

మహీంద్రా థార్‌లోని 2.0-లీటర్ ఎమ్-స్టాలియన్ టర్బో-పెట్రోల్ ఇంజన్ 150 బిహెచ్‌పి పవర్‌ను మరియు 300 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అలాగే, ఇందులోని 2.2-లీటర్ ఎమ్‌హాక్ డీజిల్ ఇంజన్ 130 బిహెచ్‌పి పవర్‌ను మరియు 320 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇందులోని ఏఎక్స్ వేరియంట్లు స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తాయి. ఎల్ఎక్స్ వేరియంట్లలో ఆప్షనల్ సిక్స్-స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ ఉంటుంది.

Most Read Articles

English summary
Mahindra Clarifies Thar Design Issue In Australia With Jeep, Releases Official Statement. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X