Mahindra XUV300 W6 వేరియంట్‌లో మరికొన్ని ఫీచర్లు కట్: ఈ సారి ఏం తొలగించారంటే..?

ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా నుండి లభిస్తున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ మహీంద్రా ఎక్స్‌యూవీ300 (Mahindra XUV300), ఈ విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన మరియు ఫీచర్ లోడెడ్ ఎస్‌యూవీ. ప్రస్తుతం, మార్కెట్లో మహీంద్రా ఎక్స్‌యూవీ300 W4, W6, W8 మరియు W8 (O) అనే నాలుగు వేరియంట్లలో లభిస్తోంది. అయితే, ఇప్పుడు ఇందులోని టాప్-ఎండ్ వేరియంట్ నుండి కంపెనీ కొన్ని భద్రతా ఫీచర్లను తొలగించింది.

Mahindra XUV300 W6 వేరియంట్‌లో మరికొన్ని ఫీచర్లు కట్: ఈసారి ఏం తొలగించారంటే..?

మహీంద్రా ఎక్స్‌యూవీ300 సేఫ్టీకి పెట్టింది పేరు, ఈ కారు కోసం గ్లోబల్ ఎన్‌క్యాప్ నిర్వహించిన క్రాష్ టెస్టులో ఇది 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ ను కూడా దక్కించుకుంది. అలాంటిది, ఇప్పుడు ఈ మోడల్ కంపెనీ కొన్ని ఫీచర్లను తొలగించడం ఆందోళన కలిగిస్తోంది. మహీంద్రా ఎక్స్‌యూవీ300 W6 వేరియంట్ లో కంపెనీ రియర్ స్పాయిలర్ మరియు బ్లాక్ ప్లాస్టిక్ క్లాడింగ్ లను తొలగించింది. ఇవేకాకుండా, ఇంటీరియర్స్ లో కూడా కొన్ని ఫీచర్లను తొలగించారు.

Mahindra XUV300 W6 వేరియంట్‌లో మరికొన్ని ఫీచర్లు కట్: ఈసారి ఏం తొలగించారంటే..?

మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఇంటీరియర్స్ లో రియర్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్, రియర్ అడ్జస్టబుల్ హెడ్‌రెస్ట్ మరియు 60:40 స్ప్లిట్-ఫోల్డింగ్ రియర్ సీట్ వంటి ఫీచర్లను కూడా తొలగించింది. అంతేకాకుండా, ఎక్స్‌యూవీ300 యొక్క W6 డీజిల్ AMT వేరియంట్ నుండి టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కూడా తొలగించారు. ఈ సంవత్సరం ప్రారంభంలో కూడా మహీంద్రా తమ ఎక్స్‌యూవీ300 యొక్క టాప్-స్పెక్ W8 (O) వేరియంట్ నుండి కొన్ని ఫీచర్లను తొలగించిన సంగతి తెలిసినదే.

Mahindra XUV300 W6 వేరియంట్‌లో మరికొన్ని ఫీచర్లు కట్: ఈసారి ఏం తొలగించారంటే..?

ఈ వేరియంట్ నుండి, కంపెనీ వెనుక వరుస ప్రయాణీకుల కోసం 3-పాయింట్ సీట్‌బెల్ట్‌లు మరియు హీటెడ్ సైడ్ మిర్రర్స్ వంటి ఫీచర్లను తొలగించింది. మహీంద్రా ఇలా తమ కార్లలో కొన్ని కీలకమైన ఫీచర్లను తొలగించడంతో పాటుగా, కొన్ని మోడళ్ల ధరలను కూడా పెంచుతోంది. ఈ సంవత్సరం మే నెలలో, మహీంద్రా ఎక్స్‌యూవీ300 W6 డీజిల్ వేరియంట్ ఆన్-రోడ్ ధరను సుమారు రూ. 90,000 మేర పెంచింది.

Mahindra XUV300 W6 వేరియంట్‌లో మరికొన్ని ఫీచర్లు కట్: ఈసారి ఏం తొలగించారంటే..?

ఇటీవల కంపెనీ ఎక్స్‌యూవీ300 W8(O) వేరియంట్ నుండి ఏడవ ఎయిర్‌బ్యాగ్‌ను కూడా తొలగించింది. డ్రైవర్ మోకాలికి రక్షణగా ఈ ఎయిర్‌బ్యాగ్ అందించబడింది. దీంతో ఇప్పుడు సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ 7 ఎయిర్‌బ్యాగ్ లకు బదులుగా 6 ఎయిర్‌బ్యాగ్‌ లతో లభిస్తుంది. ఇందులో ముందు, వైపు మరియు కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌ లు కూడా లభిస్తాయి. ఈ చిన్నపాటి మార్పుల మినహా మహీంద్రా యాంత్రికంగా ఎక్స్‌యూవీ300 లో ఎలాంటి మార్పులు చేయలేదు.

Mahindra XUV300 W6 వేరియంట్‌లో మరికొన్ని ఫీచర్లు కట్: ఈసారి ఏం తొలగించారంటే..?

మహీంద్రా ఎక్స్‌యూవీ300 కాంపాక్ట్ ఎస్‌యూవీని 2019లో ప్రారంభించబడినప్పుడు, ఈ చిన్న ఎస్‌యూవీ 5-స్టార్ గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్ రేటింగ్‌తో వచ్చింది. ఈ కారులో ఈబిడి (ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్) తో కూడిన ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్, ఇంపాక్ట్ సెన్సిటివ్ డోర్ లాక్ మరియు డిస్క్ బ్రేక్‌లు వంటి సేఫ్టీ ఫీచర్లతో వచ్చింది. ఈ విభాగంలో లభిస్తున్న అత్యంత సురక్షితమైన కార్లలో మహీంద్రా ఎక్స్‌యూవీ300 కూడా ఒకటి.

Mahindra XUV300 W6 వేరియంట్‌లో మరికొన్ని ఫీచర్లు కట్: ఈసారి ఏం తొలగించారంటే..?

గ్లోబల్ ఎన్‌క్యాప్ (Global NCAP) క్రాష్ టెస్టులో మహీంద్రా ఎక్స్‌యూవీ300 పెద్దల భద్రత విషయంలో 17 పాయింట్లకు గాను 16.42 పాయింట్లను సాధించింది. అలాగే, పిల్లల భద్రత విషయంలో ఈ మోడల్ 49 పాయింట్లకు గాను 37.44 పాయింట్లను దక్కించుకుంది. ఫలితంగా, దీనికి పెద్దల భద్రత విషయంలో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ మరియు పిల్లల భద్రత విషయంలో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది.

Mahindra XUV300 W6 వేరియంట్‌లో మరికొన్ని ఫీచర్లు కట్: ఈసారి ఏం తొలగించారంటే..?

ఎక్స్‌యూవీ300 ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే, కంపెనీ ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీని రెండు రకాల ఇంజన్లతో విక్రయిస్తోంది. వీటిలో మొదటిది 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్. ఈ ఇంజన్ గరిష్టంగా 109 బిహెచ్‌పి పవర్ ను మరియు 200 ఎన్ఎమ్ టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు ఏఎమ్‌టి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది.

Mahindra XUV300 W6 వేరియంట్‌లో మరికొన్ని ఫీచర్లు కట్: ఈసారి ఏం తొలగించారంటే..?

ఇక ఇందులోని రెండవ ఇంజన్ ఆప్షన్ 1.5 లీటర్ డీజిల్ ఇంజన్. ఈ ఇంజన్ గరిష్టంగా 115 బిహెచ్‌పి పవర్ ను మరియు 300 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ ఇంజన్ మాదిరిగానే ఇది కూడా 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు 6 స్పీడ్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (AMT) ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది.

Mahindra XUV300 W6 వేరియంట్‌లో మరికొన్ని ఫీచర్లు కట్: ఈసారి ఏం తొలగించారంటే..?

మహీంద్రా ఎక్స్‌యూవీ300 డీజిల్ కార్లు రీకాల్..

ఇదిలా ఉంటే, గడచిన అక్టోబర్ 2021 నెలలో మహీంద్రా ఎక్స్‌యూవీ300 కాంపాక్ట్ ఎస్‌యూవీలోని డీజిల్ వెర్షన్లలో తలెత్తిన ఇంటర్‌కూలర్ పైప్ (Intercooler Hose) సమస్య కారణంగా, కంపెనీ వీటిని రీకాల్ చేసింది. బిఎస్6 కంప్లైంట్ డీజిల్ కలిగిన వేరియంట్లు మాత్రమే ఈ రీకాల్ కు వర్తిస్తాయని కంపెనీ పేర్కొంది. అయితే, ఈ సమస్య వలన ఎన్ని కార్లు ప్రభావితమయ్యాయనే విషయాన్ని మాత్రం మహీంద్రా వెల్లడించలేదు. రీకాల్ కు వర్తించే మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఎస్‌యూవీలలో లోపపూరితమైన భాగాన్ని కంపెనీ ఉచితంగా భర్తీ చేయనుంది.

Mahindra XUV300 W6 వేరియంట్‌లో మరికొన్ని ఫీచర్లు కట్: ఈసారి ఏం తొలగించారంటే..?

ఈ ఎస్‌యూవీలోని డీజిల్ వెర్షన్లలో ఇంటర్‌కూలర్ హోస్ సమస్య కారణంగా, డీజిల్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ వేరియంట్లు కాలక్రమేణా పగుళ్లను అభివృద్ధి చేశాయని కంపెనీ నివేదించింది. అయితే, ఈ సమస్య వలన ఇప్పటి వరకూ ఎలాంటి ప్రమాదాలు నమోదు కాలేదని, క్వాలిటీ చెక్ లో భాగంగా ఈ సమస్యను గుర్తించామని కంపెనీ పేర్కొంది. ప్రభావిత వాహనాల సంఖ్యను మహీంద్రా అధికారికంగా వెల్లడించలేదు కానీ, సమీప డీలర్‌షిప్‌లో ఒకసారి తమ ఎక్స్‌యూవీ300 ని తనిఖీ చేసుకోవాలని కంపెనీ వినియోగదారులకు తెలియజేస్తోంది.

Most Read Articles

English summary
Mahindra drops few features in xuv300 w6 variant details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X