Bolero Neo N10 వేరియంట్‌లో 7-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ ఫీచర్ కట్!
ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra and Mahindra) ఇటీవల మార్కెట్లో విడుదల చేసిన తమ సరికొత్త బొలెరియో నియో (Bolero Neo) ఎస్‌యూవీలోని ఎన్10 (N10) వేరియంట్ లోని టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కంపెనీ మార్పులు చేసింది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

భారత మార్కెట్లో లభిస్తున్న ప్రీమియం మహీంద్రా బొలెరో (Mahindra Bolero) ఎస్‌యూవీకి ప్రత్యామ్నాయంగా కంపెనీ ఈ బడ్జెట్ 7-సీటర్ ఎస్‌యూవీని కేవలం రూ. 8.48 లక్షల ప్రారంభ ధరకే విడుదల చేసింది. గతంలో మహీంద్రా ఆఫర్ చేసిన టియూవీ300 స్థానాన్ని రీప్లేస్ చేస్తూ, కంపెనీ ఈ కొత్త బొలెరో నియో (Bolero Neo) ఎస్‌యూవీని ప్రవేశపెట్టింది.

కాగా, కంపెనీ ఇప్పుడు ఇందులోని టాప్-ఎండ్ వేరియంట్ అయిన N10 లో కంపెనీ ఓ చిన్న మార్పు చేసింది. మొదట్లో మహీంద్రా బొలెరో నియో ఎన్10 వేరియంట్ 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ తో లభించేంది. కానీ, కంపెనీ ఇప్పుడు ఇందులో కెన్‌వుడ్ నుండి గ్రహించిన 6.8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ఉపయోగించబోతోంది.

ఈ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ ను డౌన్‌గ్రేడ్ చేసే విషయంలో మహీంద్రా అకస్మాత్తుగా ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుందనే ప్రశ్న తలెత్తుతుంది? అయితే, గ్లోబల్ చిప్ (సెమీకండక్టర్ చిప్ షార్టేజ్) కొరత కారణంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చని భావిస్తున్నారు. కాగా, మహీంద్రా బొలెరో నియో లో టాప్-ఆఫ్ ది లైన్ వేరియంట్ అయిన N10 (O) లో మాత్రం కంపెనీ పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ నే అందిస్తోంది.

డౌన్‌గ్రేడ్ చేయబడి కెన్‌వుడ్ 6.8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ బ్లూటూత్, రేడియో మరియు ఆగ్జలరీ పోర్ట్ మరియు యూఎస్‌బి కనెక్టివిటీ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ సిస్టమ్ ద్వారా ఫోన్ కాల్స్ స్వీకరించడానికి, తిరస్కరించడానికి మరియు మ్యూజిక్ ట్రాక్‌లను మార్చడానికి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ కూడా ఉంటాయి.

అయితే, ఇంధన మీటర్, కారు సమాచారం, డోర్ / బోనెట్ ఓపెన్ అలెర్ట్ మరియు డిఆర్ఎల్ ఆన్ / ఆఫ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఈ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ లో అందుబాటులో ఉండవు. అంతేకాకుండా, Bolero Neo N10 (O) వేరియంట్ లో కనిపించే బ్లూసెన్స్ (BlueSense) యాప్ సపోర్ట్ ఫీచర్ కూడా మహీంద్రా బొలెరో నియో ఎన్10 వేరియంట్ నుండి తీసివేయబడుతుంది.

అయితే, ఇప్పటికే, కొత్త మహీంద్రా బొలెరో నియో ఎన్10 వేరియంట్ ను ప్రీ-బుకింగ్ చేసుకున్న కస్టమర్లు మాత్రం పాత 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌నే పొందుతారు. కాగా, ఇకపై కొత్తగా ఈ వేరియంట్ ను బుక్ చేసుకునే కస్టమర్లు మాత్రం, ఈ కారులో కొత్త 6.8 ఇంచ్ కెన్‌వుడ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ పొందుతారు.

ఈ ఒక్క మార్పు మినహా కొత్త మహీంద్రా బొలెరో నియో ఎన్10 (Mahindra Bolero Neo N10) వేరియంట్ లో కంపెనీ ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రస్తుతం, మార్కెట్లో ఈ ఎస్‌యూవీ ప్రారంభ ధర (ఎన్4 వేరియంట్) రూ. 8.77 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, ఇందులో టాప్-ఎండ్ ఎన్10 (ఆ) వేరియంట్ ధర రూ. 10.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) గా ఉంది.

ఇంజన్ విషయానికి వస్తే, బొలెరో నియో ఎస్‌యూవీలో 1.5 లీటర్ ఎమ్‌హాక్100 డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 3750 ఆర్‌పిఎమ్ వద్ద 100 బిహెచ్‌పి పవర్‌ను మరియు 1750 ఆర్‌పిఎమ్ వద్ద 260 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇందులో 50 లీటర్ల సామర్థ్యం కలిగిన ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది.

ఈ వేరియంట్ లో లభించే ఇతర ఫీచర్లను గమనిస్తే, ఎత్తు-సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు (మాన్యువల్), కీలెస్ ఎంట్రీ, పవర్-అడ్జస్టబుల్ సైడ్ మిర్రర్స్, ఏసి, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్‌లు, EBD తో కూడిన ABS, సీట్‌బెల్ట్ రిమైండర్ (ముందు వరుస కోసం), డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్ మరియు క్రూయిజ్ కంట్రోల్ మొదలైనవి ఉన్నాయి.

బొలెరో నియో కొలతలను గమనిస్తే, దీని మొత్తం పొడవు 3995 మిమీ పొడవును, 1795 మిమీ వెడల్పును మరియు 1817 ఎత్తును కలిగి ఉంటుంది. దీని వీల్‌బేస్ 2680 మిమీ మరియు బూట్ స్పేస్ 384 లీటర్లుగా ఉంటుంది. ఇది 2+3+2 సీటింగ్ కాన్ఫిగరేషన్‌ను కలిగి ఉంటుంది. అంటే, ముందు వరుసలో ఇద్దరు, మధ్య వరుసలో ముగ్గురు మరియు వెనుక వరుసలో 2 ఇద్దరు ప్రయాణించేందుకు అనువుగా ఉంటుంది.

బొలెరో నియో ఎన్4 బేస్ వేరియంట్లో లభించే ఫీచర్లు...
ఒకవేళ మీరు మహీంద్రా బొలెరో నియో ఎన్4 బేస్ వేరియంట్ ను కొనాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, ప్రస్తుతం మార్కెట్లో ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ. 8.77 లక్షలుగా ఉంది. - ఈ వేరియంట్ లో లభించే అన్ని ఫీచర్ల వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications