మహీంద్రా ప్లాట్‌ఫామ్‌పై తయారైన శాంగ్‌యాంగ్ కొరాండో ఇ-మోషన్ ఎస్‌యూవీ

ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా స్వాధీనం చేసుకున్న కొరియన్ కార్ బ్రాండ్ 'శాంగ్‌యాంగ్' గుర్తుందా? భారతదేశంలో ఆశించిన రీతిలో విజయం సాధించలేని ఈ కొరియన్ బ్రాండ్, ఇప్పుడు మహీంద్రా సహకారంతో అంతర్జాతీయ మార్కెట్లో తమ సత్తా చాటుకోవాలని ప్రయత్నిస్తోంది.

ఇందులో భాగంగానే, శాంగ్‌యాంగ్ ఇప్పుడు మహీంద్రా ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించి ఓ కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని తయారు చేసింది. ఈ బ్రాండ్ యొక్క మొట్టమొదటి బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్ (బిఈవి) అయిన శాంగ్‌యాంగ్ కొరాండో ఇ-మోషన్ ఎస్‌యూవీని కంపెనీ ఆవిష్కరించింది.

మహీంద్రా ప్లాట్‌ఫామ్‌పై శాంగ్‌యాంగ్ కార్

శాంగ్‌యాంగ్ కొరాండో ఇ-మోషన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఈ ఏడాది చివరి నాటికి అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకం కానుంది. ఈ ఎస్‌యూవీ ఎలక్ట్రిక్ వాహనాల కోసం మహీంద్రా రూపొందించిన కొత్త మెస్మా ఆర్కిటెక్చర్ ఆధారంగా రూపొందించారు.

మహీంద్రా అభివృద్ధి చేస్తున్న స్వంత ఎలక్ట్రిక్ వాహనం ఈ-ఎక్స్‌యూవి300 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఇదే ప్లాట్‌ఫామ్‌పై నిర్మించనున్నారు. ఈ నేపథ్యంలో, శాంగ్‌యాంగ్ కొరాండో ఇ-మోషన్ మరియు మహీంద్రా ఇ-ఎక్స్‌యూవి300 ఎస్‌యూవీల మధ్య అనేక సారూప్యతలను మనం గమనించవచ్చు.

శాంగ్‌యాంగ్ కొరాండో ఇ-మోషన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో 61.5 కిలోవాట్ల లిథియం అయాన్ బ్యాటరీ ఉంది. ఈ బ్యాటరీ ప్యాక్‌ను ఎల్‌జి కెమ్ సంస్థ సరఫరా చేస్తోంది. ఈ బ్యాటరీ పూర్తి ఛార్జిపై స్టాండర్డ్ కండిషన్స్‌లో 420 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని కంపెనీ చెబుతోంది. రియల్ వరల్డ్‌లో ఇది 300 కిలోమీటర్లకు పైగా రేంజ్‌ను ఆఫర్ చేయవచ్చు.

ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో ఉపయోగించిన ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 190 హెచ్‌పిల శక్తిని జనరేట్ చేస్తుంది. దీని గరిష్ట వేగం సుమారుగా గంటరు 152 కిలోమీటర్లుగా ఉంటుంది. శాంగ్‌యాంగ్ కొరాండో ఇ-మోషన్ ఎస్‌యూవీని మహీంద్రా ఎలక్ట్రిక్ స్కేలబుల్ అండ్ మాడ్యులర్ ఆర్కిటెక్చర్ (మెస్మా) ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడింది.

ఈ మాడ్యులర్ ఆర్కిటెక్చర్ లో-సెట్, లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంటుంది మరియు బహుళ-మోటారు కాన్ఫిగరేషన్లకు మద్దతు ఇస్తుంది. ఇదే మెస్మా ప్లాట్‌ఫామ్‌పై శాంగ్‌యాంగ్ యొక్క టివోలి ఎలక్ట్రిక్ వెహికల్‌ని కూడా అభివృద్ధి చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇది టెస్టింగ్ దశలో ఉంది.

ఇక శాంగ్‌యాంగ్ కొరాండో ఇ-మోషన్ డిజైన్ మరియు స్టైలింగ్ విషయానికి వస్తే, గడచిన 2020 ఆటో ఎక్స్‌పోలో మహీంద్రా ప్రదర్శించిన ఎలక్ట్రిక్ వెర్షన్ ఎక్స్‌యూవి300 మాదిరిగానే ఉంటుంది. స్టాండర్డ్ కొరాండో ఎస్‌యూవీ నుండి ఈ ఎలక్ట్రిక్ వెర్షన్ కొరాండో ఇ-మోషన్ ఈవీ వేరుగా ఉంచడానికి అనేక స్టైలింగ్ ట్వీక్‌లను చేశారు.

ఈ కారు ఏరోడైనమిక్స్‌కు సహాయపడటానికి ఇందులో సున్నితమైన ఫ్రంట్ బంపర్ డిజైన్ మరియు ఖాళీగా ఉన్న ఫ్రంట్ గ్రిల్ ఉంటుంది. ఈ ఎస్‌యూవీ ఉత్పత్తి 14వ తేదీ నుంచి ప్రారంభమైంది. ఇది ఈ ఏడాది చివర్లో యూరోపియన్ దేశాలలో అమ్మకాల వెళ్లనుంది. ఇది ఈ విభాగంలో హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ మరియు ఎమ్‌జి జెడ్ఎస్ ఎలక్ట్రిక్ వంటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలతో పోటీ పడుతుంది.

మహీంద్రా యాజమాన్యంలో ఉన్న కొరియన్ బ్రాండ్ శాంగ్‌యాంగ్ గడచిన కొంత కాలంగా భారీ నష్టాలను చవిచూస్తోంది. ఈ నేపథ్యంలో, మహీంద్రా ఈ బ్రాండ్ విషయంలో తమ తదుపరి పెట్టుబడులను నిలిపివేసి, గత ఏడాది జూన్‌లో శాంగ్‌యాంగ్‌లో పెట్టుబడి పెట్టేందుకు కొత్త పెట్టుబడిదారుల కోసం వెతకడం ప్రారంభించింది.

Most Read Articles

English summary
Mahindra e-XUV300 Based Ssangyong Korando e-Motion Electric SUV Unveiled, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X