Just In
- 1 hr ago
కారు దొంగలించిన తర్వాత ఓనర్‌కే SMS చేసిన దొంగ.. చివరికి ఏమైందంటే?
- 2 hrs ago
కొత్త తరం మెర్సిడెస్ జిఎల్ఏ బుకింగ్స్ ఓపెన్; త్వరలోనే ఇండియా లాంచ్!
- 3 hrs ago
కరోనా వేళ అందరికోసం 'ఆక్సిజన్ మ్యాన్‌గా' మారిన వ్యక్తి.. ఎక్కడంటే?
- 17 hrs ago
పూర్తి చార్జ్‌పై 350 కిలోమీటర్లు ప్రయాణించిన మహీంద్రా ఈ2ఓ ప్లస్!
Don't Miss
- News
ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి కరోనా పాజిటివ్ .. వదలని మహమ్మారి
- Lifestyle
చికెన్ చాప్స్
- Finance
భారీ నష్టాలతో ప్రారంభమై, లాభాల్లోకి స్టాక్ మార్కెట్లు: బ్యాంక్, మెటల్ జంప్
- Sports
అతినితో అతనికే సమస్య: గవాస్కర్ ఆగ్రహానికి గురైన సంజు శాంసన్: టీమిండియాలో చోటు దక్కదంటూ ఫైర్
- Movies
త్రివిక్రమ్ - మహేష్ కాంబో.. అభిమానులకు చిరాకు తెప్పిస్తున్న మరో సెలక్షన్?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మీ పాత కారును చెత్త చేస్తే, కొత్త కారులో డిస్కౌంట్ ఇస్తాం: మహీంద్రా
భారతదేశంలో 15 ఏళ్లు పైబడిన పాత వాహనాల కోసం కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛంద వాహన స్క్రాపేజ్ పాలసీని ప్రవేశపెట్టిన సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా తమ వినియోగదారుల కోసం కొత్తగా వాహన స్క్రాపేజ్ పరిష్కారాలను పరిచయం చేసింది.

ఇందులో భాగంగా, మహీంద్రా అండ్ మహీంద్రా మహీంద్రా ఎమ్‌ఎస్‌టిసి రీసైక్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (సెరో)తో ఓ భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యంలో భాగంగా, మహీంద్రా వాహన స్క్రాపేజ్ పరిష్కారాల కోసం ఒక ప్రణాళికను రూపొందించారు. ఇది మహీంద్రా యొక్క కొత్త వినియోగదారులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది.

కొత్త మహీంద్రా కారు కోసం తమ పాత వాహనాన్ని స్క్రాప్ చేయాలనుకునే వారికి ఈ ఒప్పందం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎవరైనా కస్టమర్ తమ పాత కారును కొత్త మహీంద్రా కారు కోసం అమ్మాలని యోచిస్తున్నట్లయితే, సదరు కస్టమర్ తమ సమీపంలోని మహీంద్రా డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చు.
MOST READ:రష్మిక మందన్న కార్స్ ఎప్పుడైనా చూసారా.. అయితే ఇది చూడండి

మహీంద్రా ప్రవేశపెట్టిన ఈ వెహికల్ స్క్రాపేజ్ ప్రణాళిక ద్వారా వినియోగదారులు తమ పాత వాహనాలను స్క్రాప్ చేయటం కోసం స్థానిక ఆర్టీఓ లేదా వెహికల్ స్క్రాపింగ్ ఏజెన్సీని సందర్శించాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ తిరిగి విజృంభిస్తున్న నేపథ్యంలో, ఎవరైనా కస్టమర్ తమ పాత వాహనపు వెల తెలుసుకోవాలంటే, మహీంద్రా నేరుగా కస్టమర్ ఇంటికే వెళ్లి సేవలను అందిస్తోంది.

ఈ విధంగా, మహీంద్రా డీలర్‌షిప్ సదరు పాత వాహనాన్ని అంచనా వేసి దాని ఎక్స్ఛేంజ్ / స్క్రాప్ ధరను కస్టమర్‌కు తెలియజేస్తుంది. ఆ ధర కస్టమర్‌కు నచ్చినట్లయితే, ఆ తర్వాతి ప్రక్రియను మొత్తం పూర్తిగా మహీంద్రా చూసుకుంటుంది. వాహన పికప్, రవాణా మరియు సెరో స్క్రాప్ యార్డ్ వద్ద స్క్రాపింగ్ వంటి పనులను కంపెనీ నిర్వహిస్తుంది.
MOST READ:కొత్త లగ్జరీ కార్ కొన్న కార్తీక్ ఆర్యన్.. దీని రేటు అక్షరాలా..

అంతేకాకుండా, పాత వాహనాలను స్క్రాప్ చేసిన కస్టమర్లకు సెరో డిపాజిట్ / స్క్రాపేజ్ యొక్క ధృవీకరణ పత్రాన్ని కూడా జారీ చేస్తుంది. స్క్రాప్ చేసిన కారు విలువ మరియు కస్టమర్ కొనుగోలు చేయబోయే కొత్త మహీంద్రా వాహనం విలువ ఆధారంగా ఆ కారు ధరను తగ్గించడానికి ఈ సర్టిఫికేట్ ఉపయోగపడుతుంది.

భారతదేశంలో వెహికల్ స్క్రాప్ పాలసీని పూర్తిస్థాయిలో అధికారికంగా అమలు చేయటానికి ముందే మహీంద్రా ఈ సేవలను ప్రారంభించింది. దేశంలో ప్రైవేటు వాహనాల కోసం కొత్త వాహన స్క్రాప్ విధానం అక్టోబర్ 01, 2021వ తేదీ నుండి దేశవ్యాప్తంగా అమలు చేయబడుతుంది.

ఈ విధానం ప్రకారం, వ్యక్తిగత యాజమాన్యంలో ఉన్న 20 ఏళ్లకు పైబడిన పాత ప్రైవేట్ వాహనాలను మరియు 15 ఏళ్లకు పైబడిన వాణిజ్య వాహనాలను స్వచ్ఛందంగా స్క్రాప్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాహనాలకు పైన వయస్సు ముగిసిన తరువాత, వాటిని కస్టమర్లు వినియోగించాలనుకుంటే, వాటికి నిత్యం ఫిట్‌నెస్ పరీక్షలు చేయిస్తూ, అవసరమైన టాక్సులు కట్టాల్సి ఉంటుంది.

ఒకవేళ ఫిట్‌నెస్ పరీక్షలో సదరు వాహనాలు విఫలమైనట్లయితే, వాటిని నిషేధించడం జరుగుతుంది. ప్రజలు స్వచ్ఛందంగా తమ పాత వాహనాలను స్క్రాప్ చేసేందుకు ప్రోత్సహించేలా ప్రభుత్వంతో పాటు వాహన తయారీదారులు కూడా కొన్ని కస్టమర్ ప్రయోజన పథకాలను కూడా ప్రవేశపెడుతున్నాయి. ఇందులో భాగంగా, పాత వాహనాలను స్క్రాప్ చేసిన కస్టమర్లు కొత్త కారు కొనుగోలుపై తగ్గింపును పొందవచ్చు.
MOST READ:కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ కొన్న పంజాబీ సింగర్, ఎవరో తెలుసా?

కొత్త వాహనాల కొనుగోలుపై ప్రభుత్వం నుండి 4-6 శాతం తగ్గింపును ఆఫర్ చేస్తుండగా, దీనికి అదనంగా వాహన తయారీదారులు 5 శాతం తగ్గింపును అందించనున్నారు. పాత వాహనాన్ని స్క్రాప్ చేసి, కొత్త కారును కొనుగోలు చేసినప్పుడు మాత్రమే కస్టమర్లకు ఈ ప్రయోజనాలు లభ్యం కానున్నాయి.