మహీంద్రా బొలెరో నియో ఎస్‌యూవీలో 9 సీటర్ వేరియంట్ వస్తోందా..?

ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా ఇటీవల తమ సరికొత్త ఎస్‌యూవీ 'మహీంద్రా బొలెరో నియో'ను మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. ఈ ఎస్‌యూవీని కంపెనీ గతంలో విక్రయించిన టియువి300 ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని రూపొందించింది.

మహీంద్రా బొలెరో నియో ఎస్‌యూవీలో 9 సీటర్ వేరియంట్ వస్తోందా..?

మహీంద్రా టియువి300తో పోల్చుకుంటే ఈ కొత్త మహీంద్రా బొలెరో నియో డిజైన్ మరియు ఫీచర్ల చాలా అద్భుతంగా ఉంటుంది. మునుపటితో పోల్చుకుంటే, దీని ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్లలో అనేక మార్పులు ఉన్నాయి.

మహీంద్రా బొలెరో నియో ఎస్‌యూవీలో 9 సీటర్ వేరియంట్ వస్తోందా..?

ప్రస్తుతం మహీంద్రా బొలెరో నియో 7 సీట్ల (2+3+2) కాన్ఫిగరేషన్‌తో లభిస్తోంది. ఇందులో ముందు వరుసలో రెండు, మధ్య వరుసలో మూడు మరియు చివరి వరుసలో రెండు సీట్ల చొప్పున మొత్తం ఏడు సీట్లు ఉంటాయి. తాజా సమాచారం ప్రకారం, కంపెనీ ఇందులో ఓ 9-సీటర్ వెర్షన్‌ను విడుదల చేసేందుకు కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

మహీంద్రా బొలెరో నియో ఎస్‌యూవీలో 9 సీటర్ వేరియంట్ వస్తోందా..?

ఈ కొత్త 9-సీటర్ ఎస్‌యూవీని మహీంద్రా బొలెరో నియో ప్లస్ పేరుతో పిలిచే అవకాశం ఉంది. ఇది కూడా కంపెనీ గతంలో విక్రయించిన 9-సీటర్ మహీంద్రా టియువి300 ప్లస్ మోడల్ ఆధారంగానే ఉండే అవకాశం ఉంది. మహీంద్రా బొలెరో నియో మాదిరిగా, బొలెరో నియో ప్లస్‌లో కూడా కంపెనీ అనేక అప్‌డేట్‌లను చేయనుంది.

మహీంద్రా బొలెరో నియో ఎస్‌యూవీలో 9 సీటర్ వేరియంట్ వస్తోందా..?

మహీంద్రా టియువి300 ప్లస్ విషయానికి వస్తే, ఇది టియువి300 యొక్క విస్తరించిన మోడల్‌గా ఉంటుంది మరియు టియువి300 కన్నా కాస్తంత పొడవుగా ఉంటుంది. ఇందులో వెనుక (మూడవ వరుసలో) రెండు సైడ్ ఫేసింగ్ సీట్లు ఉంటాయి. ఈ సీట్లలో నలుగురు ప్రయాణీకులు ఎదురెదురుగా కూర్చోవచ్చు. ఇలా మొత్తం 9 మంది (2+3+4) ఈ కారులో ప్రయాణించవచ్చు.

మహీంద్రా బొలెరో నియో ఎస్‌యూవీలో 9 సీటర్ వేరియంట్ వస్తోందా..?

భారతదేశంలో కఠినమైన బిఎస్ 6 ఉద్గార నిబంధనలు అమల్లోకి వచ్చిన తరువాత మహీంద్రా అండ్ మహీంద్రా ఏప్రిల్ 2020లో తమ టియువి300 మరియు టియువి300 ప్లస్ అమ్మకాలను నిలిపివేసింది. ఈ నేపథ్యంలో, కంపెనీ అదే మోడల్ తిరిగి మహీంద్రా బొలెరో నియో పేరుతో మార్కెట్లోకి తీసుకువస్తోంది.

మహీంద్రా బొలెరో నియో ఎస్‌యూవీలో 9 సీటర్ వేరియంట్ వస్తోందా..?

బొలెరో నియోకి మరియు నియో ప్లస్‌కి మధ్య వ్యత్యాసాన్ని తెలియజేసేందుకు కంపెనీ ఇందులో కొన్ని కీలకమైన మార్పులు చేసే అవకాశం ఉంది. బొలెరో నియో ప్లస్‌లో కొత్త ఫ్రంట్ గ్రిల్, సరికొత్త బంపర్లు, కొత్త డిఆర్‌ఎల్‌లతో కూడిన హెడ్‌ల్యాంప్‌లు మరియు రియర్ స్పాయిలర్ వంటి మార్పులు ఉండే అవకాశం ఉంది. ఇంటీరియర్‌లో కూడా కొన్ని ప్రధానమైన మార్పులను ఇందులో ఆశించవచ్చు.

మహీంద్రా బొలెరో నియో ఎస్‌యూవీలో 9 సీటర్ వేరియంట్ వస్తోందా..?

ఇంజన్ విషయానికి వస్తే, మహీంద్రా బొలెరో నియో ప్లస్ ఎస్‌యూవీలో 2.2-లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించవచ్చని సమాచారం. టియువి300 ప్లస్‌లో కూడా ఇదే తరహా ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 120 బిహెచ్‌పి పవర్‌ను మరియు 280 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

మహీంద్రా బొలెరో నియో ఎస్‌యూవీలో 9 సీటర్ వేరియంట్ వస్తోందా..?

ఇక ఇటీవలే మార్కెట్లో విడుదలైన మహీంద్రా బొలెరో నియో విషయానికి వస్తే, కంపెనీ ఈ ఎస్‌యూవీలో 1.5 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించింది. ఈ ఇంజన్ గరిష్టంగా 100 బిహెచ్‌పి పవర్‌ను మరియు 240 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

మహీంద్రా బొలెరో నియో ఎస్‌యూవీలో 9 సీటర్ వేరియంట్ వస్తోందా..?

మహీంద్రా బొలెరో నియో మొత్తం మూడు వేరియంట్లలో (ఎన్4, ఎన్8 మరియు ఎన్10) విడుదల చేశారు. మార్కెట్లో ఈ కారు ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ.8.48 లక్షలుగా ఉంది. మహీంద్రా బొలెరో నియో ప్లస్ ధర విషయానికి వస్తే, ఈ 9-సీటర్ ఎస్‌యూవీని రూ.9.92 లక్షల నుండి రూ.11.42 లక్షల మధ్యలో (ఎక్స్-షోరూమ్) విడుదల చేయవచ్చని అంచనా.

Most Read Articles

English summary
Mahindra Might Launch 9 Seater Bolero Neo Plus Based On TUV300 Plus, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X