14,000 యూనిట్ల XUV700 డెలివరీలకు Mahindra పక్కా ప్లాన్: మొదట ఎవరికంటే?

Mahindra & Mahindra కంపెనీ యొక్క ఆధునిక SUV 'Mahindra XUV700'. ఈ SUV దేశీయ మార్కెట్లో విడుదలైన సంగతి తెలిసిందే. అయితే కంపెనీ దీనికోసం బుకింగ్‌లను కూడా ప్రారంభించింది. కంపెనీ ఈ కొత్త SUV కోసం బుకింగ్స్ ప్రారంభించిన మొదటి రోజు కేవలం 57 నిముషాల్లో ఏకంగా 25,000 యూనిట్ల బుకింగ్స్ పొందగలిగింది. మరుసటి రోజు కంపెనీ రెండు గంటల్లో మరో 25,000 బుకింగ్స్ పొందగలిగింది. ఇప్పటివరకు కంపెనీ ఈ కొత్త SUV కోసం 65,000 యూనిట్ల బుకింగ్స్ పొందింది.

14,000 యూనిట్ల XUV700 డెలివరీలకు సిద్దమవుతున్న Mahindra: మొదట ఎవరికంటే?

కంపెనీ ఈ కొత్త SUV యొక్క డెలివరీలను ఇంకా ప్రారంభించలేదు, కానీ డెలివరీలు ప్రారంభానికి ముందే మొదటి బ్యాచ్ కస్టమర్ కార్లు భారతదేశం అంతటా ఉన్న డీలర్‌షిప్‌లకు చేరుకోవడం ప్రారంభించాయి. Mahindra కంపెనీ ఇప్పటికే అందించిన సమాచారం ప్రకారం, 2022 జనవరి 14 మహీంద్రా XUV700 ని 14,000 యూనిట్లు డెలివరీ చేయాలని యోచిస్తోంది.

14,000 యూనిట్ల XUV700 డెలివరీలకు సిద్దమవుతున్న Mahindra: మొదట ఎవరికంటే?

కంపెనీ ఈ కొత్త SUV యొక్క డెలివరీలను 2021 అక్టోబర్ 30 నుంచి ప్రారంభించనుంది. కంపెనీ డెలివరీలను ప్రారంభించే ప్రారంభంలో పెట్రోల్ వేరియంట్ లను డెలివరీ చేయనుంది, తరువాత డీజిల్ మోడల్ ని డెలివరీ 2021 నవంబర్ నెల చివరి నుండి ప్రారంభించనున్నట్లు కంపెనీ తెలిపింది.

14,000 యూనిట్ల XUV700 డెలివరీలకు సిద్దమవుతున్న Mahindra: మొదట ఎవరికంటే?

Mahindra కంపెనీ డెలివరీలను ప్రారభించినప్పటి నుంచి ప్రతిరోజూ దాదాపు 187 మహీంద్రా XUV7000 SUVలను డెలివరీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మహీంద్రా XUV700ని ఇప్పటికే బుక్ చేసుకున్న కొనుగోలుదారులు ఈ రోజు నుండి తమ డెలివరీ తేదీలకు సంబంధించిన అప్‌డేట్‌లను పొందడం ప్రారంభిస్తారు. డెలివరీ ప్రక్రియను సులభతరం చేయడానికి అల్గారిథమ్ ఆధారిత ప్రక్రియను నిర్వహించడానికి మహీంద్రా ఒక కన్సల్టెన్సీ కంపెనీతో కలిసి పని చేస్తోంది.

14,000 యూనిట్ల XUV700 డెలివరీలకు సిద్దమవుతున్న Mahindra: మొదట ఎవరికంటే?

డెలివరీ ప్రక్రియ నగరం మరియు డీలర్ స్థాయికి బుకింగ్‌ల సంఖ్య, ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ బుకింగ్‌ల నిష్పత్తి మరియు వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది. డెలివరీ టైమ్‌లైన్‌లు కస్టమర్‌లకు వారి సంబంధిత డీలర్‌షిప్‌ల ద్వారా తెలియజేయబడతాయి. కావున ఆ సమయంలో కస్టమర్లు డెలివరీలను పొందవచ్చు.

14,000 యూనిట్ల XUV700 డెలివరీలకు సిద్దమవుతున్న Mahindra: మొదట ఎవరికంటే?

కొత్త మహీంద్రా XUV700 ప్రారంభ ధర ఇప్పుడు రూ. 12.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే దాని టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ. 22.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. కంపెనీ ఈ కారును మొత్తం నాలుగు వేరియంట్లలో విక్రయిస్తోంది, ఇందులో MX, AX3, AX5 మరియు AX7 వేరియంట్‌లు ఉన్నాయి.

14,000 యూనిట్ల XUV700 డెలివరీలకు సిద్దమవుతున్న Mahindra: మొదట ఎవరికంటే?

కొత్త మహీంద్రా XUV700 SUV డ్యూయల్-డిస్ప్లే సెటప్‌ను కలిగి ఉన్న దాని విభాగంలో మొదటి SUV. ఈ డిస్‌ప్లే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌గా పనిచేస్తుంది. ఇందులో వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, కీలెస్ ఎంట్రీ, పుష్ స్టార్ట్/స్టాప్ బటన్ వంటి ఫీచర్లు ఈ ఎస్‌యూవీలో అందించబడ్డాయి.

14,000 యూనిట్ల XUV700 డెలివరీలకు సిద్దమవుతున్న Mahindra: మొదట ఎవరికంటే?

అంతే కాకుండా ఈ ఆధునిక SUV లో సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఇందులో ఆటో బూస్టర్ హెడ్‌ల్యాంప్‌లు, స్మార్ట్ డోర్ హ్యాండిల్స్, పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్, పర్సనల్ అలర్ట్ మరియు డ్రైవర్ అలర్ట్ సిస్టమ్ వంటికి ఉన్నాయి. ఈ SUV గరిష్టంగా 80 కిమీ/గం వేగాన్ని చేరుకున్నప్పుడు ఆటోబూస్టర్ హెడ్‌ల్యాంప్‌లు స్వయంచాలకంగా ఆన్ చేయబడతాయి. ఇది చీకటి రోడ్లపై మరింత వెలుతురును అందించడం ద్వారా రాత్రిపూట డ్రైవింగ్‌ను మరింత సౌకర్యవంతంగా చేస్తుంది.

14,000 యూనిట్ల XUV700 డెలివరీలకు సిద్దమవుతున్న Mahindra: మొదట ఎవరికంటే?

మహీంద్రా XUV700 స్మార్ట్ డోర్ హ్యాండిల్‌ను కలిగి ఉన్న ఈ విభాగంలో మొదటి SUV. హ్యాండిల్ బయట తెరుచుకుంటుంది మరియు కేవలం ఒక టచ్ తో లోపల మూసివేయబడుతుంది. ఇవన్నీ నిజంగా చాలా అద్భుతంగా ఉంటాయి. వాహన వినియోగదారులకు అద్భుతమైన అనుభవాన్ని అందిస్తాయి.

14,000 యూనిట్ల XUV700 డెలివరీలకు సిద్దమవుతున్న Mahindra: మొదట ఎవరికంటే?

Mahindra XUV700 లోని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 7 ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్ విత్ ఇబిడి, ఎలక్ట్రానిక్ లాకింగ్ డిఫరెన్షియల్, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్ మరియు ఆటో హెడ్‌లైట్ బూస్టర్ వంటివి ఉన్నాయి.

14,000 యూనిట్ల XUV700 డెలివరీలకు సిద్దమవుతున్న Mahindra: మొదట ఎవరికంటే?

Mahindra XUV700 రెండు ఇంజన్ ఆప్షన్‌లలో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో మొదటిది 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు రెండవది 2.2-లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్‌. పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 200 బిహెచ్‌పి పవర్‌ను మరియు 380 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

14,000 యూనిట్ల XUV700 డెలివరీలకు సిద్దమవుతున్న Mahindra: మొదట ఎవరికంటే?

ఇక రెండవ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 2.2-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్, ఇది 183 బిహెచ్‌పి పవర్ మరియు 420 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది కూడా 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలను కలిగి ఉంటుంది. Mahindra XUV700 నాలుగు డ్రైవింగ్ మోడ్స్ కలిగి ఉంటుంది. అవి జిప్, జామ్, జూమ్ మరియు కస్టమ్ డ్రైవింగ్ మోడ్స్.

More from DriveSpark

Article Published On: Thursday, October 28, 2021, 11:10 [IST]
English summary
Mahindra plans to deliver 14000 units of xuv700 in next 75 days details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+