Mahindra Thar 5-డోర్ వెర్షన్ వస్తోంది.. కానీ వచ్చే ఏడాది వరకూ ఆగాల్సిందే..!

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra and Mahindra) గతేడాది చివర్లో తమ కొత్త తరం 2020 మహీంద్రా థార్ (Mahindra Thar) ఎస్‌యూవీని మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. ప్రస్తుతం, ఈ ఎస్‌యూవీ 3-డోర్ (2 సైడ్ డోర్లు, 1 వెనుక బూట్ డోర్), 4-సీటర్ కాన్ఫిగరేషన్ తో లభిస్తుంది.

Mahindra Thar 5-డోర్ వెర్షన్ వస్తోంది.. కానీ వచ్చే ఏడాది వరకూ ఆగాల్సిందే..!

కాగా, తాజా సమాచారం ప్రకారం, కంపెనీ ఇందులో ఓ 5-డోర్ (4 సైడ్ డోర్లు, 1 వెనుక బూట్ డోర్) వెర్షన్ ను తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది లో కొత్త 5-డోర్ మహీంద్రా థార్ ఎస్‌యూవీ మార్కెట్లోకి రావచ్చని భావిస్తున్నారు. అయితే, ఈ కొత్త మోడల్ యొక్క ఓవరాల్ డిజైన్ సిల్హౌట్ దాని 3-డోర్ వెర్షన్ మాదిరిగానే ఉంటుందని సమాచారం.

Mahindra Thar 5-డోర్ వెర్షన్ వస్తోంది.. కానీ వచ్చే ఏడాది వరకూ ఆగాల్సిందే..!

కొత్త మహీంద్రా థార్ 5-డోర్ వెర్షన్ ఎస్‌యూవీ గురించి కొంత తాజా సమాచారం వెల్లడైంది. ఈ సమాచారం ప్రకారం, మహీంద్రా తమ కొత్త 5-డోర్ వెర్షన్ థార్ ఎస్‌యూవీని మెరుగైన సస్పెన్షన్ సెటప్‌ తో ప్రవేశపెట్టనుంది. కొత్త 5-డోర్ థార్‌పై సస్పెన్షన్ 3-డోర్ థార్ కంటే మెరుగైన రైడ్ క్వాలిటీని అందిస్తుంది. అంతేకాకుండా, 5-డోర్ల మహీంద్రా థార్‌ లో స్టీరింగ్ వీల్ కూడా చాలా తేలికగా ఉంటుందని సమాచారం.

Mahindra Thar 5-డోర్ వెర్షన్ వస్తోంది.. కానీ వచ్చే ఏడాది వరకూ ఆగాల్సిందే..!

కొత్త థార్ లోని తేలికపాటి స్టీరింగ్ వీల్, ఓవరాల్ వెహికల్ కంట్రోల్ ను మెరుగుపరుస్తుంది, ఎందుకంటే 5-డోర్ వెర్షన్ థార్ ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లో ఉపయోగించబడుతుంది. మహీంద్రా థార్ యొక్క 5-డోర్ల వెర్షన్‌ దాని 3-డోర్ల వెర్షన్ కంటే చాలా ప్రాక్టికాలిటీని కలిగి ఉంటుంది మరియు ఇది ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షించే అవకాశం ఉంది.

Mahindra Thar 5-డోర్ వెర్షన్ వస్తోంది.. కానీ వచ్చే ఏడాది వరకూ ఆగాల్సిందే..!

మహీంద్రా థార్ యొక్క 5-డోర్ వెర్షన్ సాఫ్ట్-టాప్ కన్వర్టిబుల్‌ మాదిరిగా అందించబడుతుందని నమ్ముతారు. దాని స్టైలింగ్‌ లో కూడా తీవ్రమైన మార్పులు ఉండకపోవచ్చు. ఈ కొత్త మోడల్ ను కస్టమర్ల ఆఫ్-రోడ్ అవసరాలతో పాటు ఫ్యామిలీ అవసరాలకు కూడా తగినట్లుగా ఉంచాలని కంపెనీ భావిస్తోంది. ఇదే గనుక జరిగితే, ఈ కొత్త 5-డోర్ థార్ అన్ని వర్గాల వినియోగదారులను ఆకర్షించే అవకాశం ఉంది.

Mahindra Thar 5-డోర్ వెర్షన్ వస్తోంది.. కానీ వచ్చే ఏడాది వరకూ ఆగాల్సిందే..!

కొత్త 5-డోర్ మహీంద్రా డిజైన్ విషయానికి వస్తే, ఇది ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న 3-డోర్ మహీంద్రా థార్‌ కి సమానమైన స్క్వేర్ మరియు బాక్సీ టైప్ బాడీ డిజైన్ ను కలిగి ఉంటుంది. అయితే, రెండవ వరుస ప్రయాణీకులో కోసం ఏర్పాటు చేయబోయే డోర్ల కారణంగా, దీని పొడవు 3-డోర్ వెర్షన్ థార్ కన్నా కొద్దిగా పెంచబడుతుందని భావిస్తున్నారు.

Mahindra Thar 5-డోర్ వెర్షన్ వస్తోంది.. కానీ వచ్చే ఏడాది వరకూ ఆగాల్సిందే..!

ప్రస్తుతం తరం మహీంద్రా థార్ ఎస్‌యూవీని లాడర్-ఫ్రేమ్ ఛాస్సిస్ పై నిర్మిస్తున్నారు. అయితే, కొత్త 5-డోర్ మోడల్ లో పెరిగే పొడవు కారణంగా దాని బ్రేక్ఓవర్ యాంగిల్ ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ఇక ఇందులోని మెకానికల్స్ మరియు పరికరాల్లో కూడా ఎలాంటి మార్పులు ఉండబోవని తెలుస్తోంది. ప్రస్తుత 3-డోర్ థార్ లో లభించే ఇంజన్ ఆప్షన్లు, పరికారలను కొత్త 5-డోర్ థార్ లో కూడా ఆశించవచ్చు.

Mahindra Thar 5-డోర్ వెర్షన్ వస్తోంది.. కానీ వచ్చే ఏడాది వరకూ ఆగాల్సిందే..!

ఈ కొత్త మోడల్ ఇంజన్ మరియు గేర్‌బాక్స్ విషయానికి వస్తే, మహీంద్రా థార్ యొక్క 5-డోర్ వెర్షన్ లో, ప్రస్తుతం ఉపయోగిస్తున్న 2.0 లీటర్ టర్బోచార్జ్డ్ mStallion పెట్రోల్ ఇంజన్ మరియు 2.2 లీటర్ mHawk డీజిల్ ఇంజన్‌ లనే కొనసాగించనున్నారు. ఇందులోని పెట్రోల్ ఇంజన్ డైరెక్ట్ ఇంజెక్షన్ టెక్నాలజీతో అందించబడుతుంది.

Mahindra Thar 5-డోర్ వెర్షన్ వస్తోంది.. కానీ వచ్చే ఏడాది వరకూ ఆగాల్సిందే..!

ఇకపోతే, ఇందులోని పెట్రోల్ ఇంజన్ 150 బిహెచ్‌పి పవర్ ను మరియు 300/320 న్యూటన్ మీటర్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, డీజిల్ ఇంజన్ గరిష్టంగా 130 బిహెచ్‌పి పవర్ ను మరియు 300 ఎన్ఎమ్ టార్క్ ను జనరేట్ చేస్తుంది. ఈ రెండు ఇంజన్‌లు కూడా 6 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉన్నాయి.

Mahindra Thar 5-డోర్ వెర్షన్ వస్తోంది.. కానీ వచ్చే ఏడాది వరకూ ఆగాల్సిందే..!

ఇక చివరిగా ధర విషయానికి వస్తే, కొత్త 5-డోర్ మహీంద్రా థార్ ఎస్యూవీ ధర ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న 3-డోర్ వెర్షన్ ధర కంటే కాస్తంత ఎక్కువగా ఉండొచ్చు. అంచనా ప్రకారం, ఈ కొత్త మోడల్ ధర, ప్రస్తుత మోడల్ ధర కన్నా సుమారు రూ. 70,000 నుండి రూ. 80,000 వరకు ఎక్కువగా ఉండొచ్చని అంచనా. ప్రస్తుతం, మార్కెట్లో లభిస్తున్న మహీంద్రా థార్ 3-డోర్ వెర్షన్ ధరలు రూ. 12.78 లక్షల నుండి రూ. 15.08 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి.

Mahindra Thar 5-డోర్ వెర్షన్ వస్తోంది.. కానీ వచ్చే ఏడాది వరకూ ఆగాల్సిందే..!

మహీంద్రా థార్ కోసం 75000 యూనిట్లకు పైగా బుకింగ్స్..

ఇదిలా ఉంటే, కొత్త తరం మహీంద్రా థార్ ఎస్‌యూవీ మార్కెట్లో హాట్ కేకులా అమ్ముడవుతోంది. ఈ ఎస్‌యూవీ కోసం కంపెనీ ఇప్పటి వరకూ 75,000 యూనిట్లకు పైగా బుకింగ్ లను దక్కించుకుంది. కొత్త తరం థార్ కోసం వస్తున్న కస్టమర్లలో దాదాపు 40 శాతం మంది యువ వినియోగదారులే ఉన్నారని, ఇందులో దాదాపు 50 శాతం బుకింగ్స్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వేరియంట్ల కోసం మరియు 25 శాతం బుకింగ్ లు పెట్రోల్ మోడల్ కోసం వస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

Most Read Articles

English summary
Mahindra plans to launch 5 door version thar suv launch expected next year
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X