మహీంద్రా పాత లోగోకి బై.. బై.. కొత్త లోగోకి హాయ్.. హాయ్.. ముందుగా ఆ మోడల్ పైనే!

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా తమ సరికొత్త లోగోను ఆవిష్కరించింది. దశాబ్ధాలుగా ఉన్న ఈ పాత లోగో స్థానంలో ఇకపై కొత్త లోగో కనిపించనుంది. మహీంద్రా నుండి త్వరలో విడుదల కానున్న సరికొత్త ఫ్యూచరిస్టిక్ ఎస్‌యూవీ 'ఎక్స్‌యూవీ700' (సెవన్ డబుల్ ఓ అని పలకాలి)పై తొలిసారిగా ఈ కొత్త లోగోను ఉపయోగించనున్నారు.

మహీంద్రా పాత లోగోకి బై.. బై.. కొత్త లోగోకి హాయ్.. హాయ్.. ముందుగా ఆ మోడల్ పైనే!

మహీంద్రా తమ కొత్త లోగోకి సంబంధించి ఓ టీజర్ వీడియోని కూడా విడుదల చేసింది. ఇందులో సరికొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఫ్రంట్ గ్రిల్ పైభాగంలో మధ్యలో ఈ కొత్త లోగో అమర్చబడి ఉంటుంది. మునుపటి లోగోతో పోల్చి చూస్తే, ఈ కొత్త లోగో చాలా స్టైలిష్‌గా, ఎంతో ప్రీమియంగా కనిపిస్తుంది.

మహీంద్రా పాత లోగోకి బై.. బై.. కొత్త లోగోకి హాయ్.. హాయ్.. ముందుగా ఆ మోడల్ పైనే!

మహీంద్రా పేర్కొన్న సమాచారం ప్రకారం, ఈ లోగోని ప్రత్యేకంగా యుటిలిటీ వాహనాల కోసం తయారు చేశారు. ఈ కొత్త లోగోను 'ఎక్స్‌ప్లోర్ ది ఇంపాజిబుల్' అనే బ్రాండ్ స్టేట్‌మెంట్ ద్వారా స్ఫూర్తి పొంది మహీంద్రా డిజైన్ టీమ్ డిజైన్ చేసింది.

మహీంద్రా పాత లోగోకి బై.. బై.. కొత్త లోగోకి హాయ్.. హాయ్.. ముందుగా ఆ మోడల్ పైనే!

వచ్చే 2022 నాటికి దేశవ్యాప్తంగా 823 నగరాల్లో ఉన్న 1300 కస్టమర్ (సేల్స్) అండ్ సర్వీస్ టచ్ పాయింట్‌లు మరియు ఎస్‌యూవీ ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోలోని మోడళ్లపై ఈ కొత్త లోగోను చూడవచ్చని కంపెనీ పేర్కొంది. ఈ కొత్త లోగోను ప్యాసింజర్ వెహికల్ మహీంద్రా ఆటోమోటివ్ డీలర్‌షిప్‌లు కూడా ఉపయోగించనున్నారు.

కమర్షియల్ వాహనఉత్పత్తులు మరియు వ్యవసాయ సామగ్రి రంగం కోసం 'రోడ్ అహెడ్' అనే పాత లోగోను అలాగే కొనసాగించనున్నారు. మహీంద్రా తమ కొత్త లోగోను ఒక వీడియో రూపంలో ఆవిష్కరించింది. ప్రముఖ విలక్షణ నటుడు నసీరుద్దీన్ షా మరియు సంగీత స్వరకర్తలు ఎహ్సాన్-లాయ్‌ల సహకారంతో ఈ వీడియోని రూపొందించారు.

మహీంద్రా పాత లోగోకి బై.. బై.. కొత్త లోగోకి హాయ్.. హాయ్.. ముందుగా ఆ మోడల్ పైనే!

కొత్త లోగో వెనుక సిద్ధాంతం

మహీంద్రా తమ కొత్త లోగోను వివరిస్తూ, ఇది తమ బ్రాండ్‌కు ఓ కొత్త గుర్తింపును తెస్తుందని మరియు ఎస్‌యూవీ పోర్ట్‌ఫోలియోలో బ్రాండ్ యొక్క వ్యూహాత్మక మార్పును ప్రదర్శిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ లోగో గ్రే అండ్ రెడ్ యాక్సెంట్స్‌తో చార్‌కోల్ కలర్‌లో ఉంటుంది. మహీంద్రా తమ కొత్త లోగోని అడవులు, కొండలు, వాగులు వంకలు మరియు మంచు ప్రదేశాల్లో కంపెనీ ప్రదర్శించింది. ఈ లోగో చూడటానికి శీతాకోకచిలుక రెక్కల మాదిరిగా కనిపిస్తుంది.

మహీంద్రా పాత లోగోకి బై.. బై.. కొత్త లోగోకి హాయ్.. హాయ్.. ముందుగా ఆ మోడల్ పైనే!

ఈ కొత్త లోగో ఆవిష్కరణ సందర్భంగా, మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ ఆటో మరియు ఫార్మ్ సెక్టార్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేష్ జెజూరికర్ మాట్లాడుతూ, తమ బ్రాండ్ యొక్క పరివర్తనను తెలియజేసే ప్రధాన మార్పు యొక్క ముఖ్యమైన ముఖభాగం ఈ కొత్త లోగో అని పేర్కొన్నారు.

మహీంద్రా పాత లోగోకి బై.. బై.. కొత్త లోగోకి హాయ్.. హాయ్.. ముందుగా ఆ మోడల్ పైనే!

మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఆవిష్కరణ

ఇదిలా ఉంటే, మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీని ఆగస్టు 15, 2021వ తేదీన ప్రపంచానికి పరిచయం చేయనున్నారు. అయితే, ఈ కారు యొక్క అధికారిక లాంచ్ మరియు అమ్మకాలు మాత్రం అక్టోబర్ నెలలో జరుగుతాయని భావిస్తున్నారు. కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీ 6-సీటర్ మరియు 7-సీటర్ కాన్ఫిగరేషన్‌లతో లభ్యం కానుంది.

మహీంద్రా పాత లోగోకి బై.. బై.. కొత్త లోగోకి హాయ్.. హాయ్.. ముందుగా ఆ మోడల్ పైనే!

అంతేకాకుండా, ఈ ఫ్యూచరిస్టిక్ ఎస్‌యూవీలో మెరుగైన భద్రత కోసం లెవల్-1 ఏడిఏఎస్ అటానమస్ టెక్నాలజీతో పాటుగా అనేక ఇతర సేఫ్టీ ఫీచర్లను జోడించనున్నారు. కొత్త తరం మహీంద్రా థార్ మాదిరిగానే, ఈ సరికొత్త ఎక్స్‌యూవీ700 కూడా డీజిల్ మరియు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో, ఆప్షనల్ ఫోర్-వీల్ డ్రైవ్‌తో కూడా లభ్యం కానుంది.

మహీంద్రా పాత లోగోకి బై.. బై.. కొత్త లోగోకి హాయ్.. హాయ్.. ముందుగా ఆ మోడల్ పైనే!

కొత్తగా రాబోయే మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీ బ్రాండ్ నుండి కొత్త లోగోతో రానున్న మొట్టమొదటి ఎస్‌యూవీ అవుతుంది. సరికొత్త లోగో, డిజైన్, ఇంజన్ మరియు ఫీచర్లతో వస్తున్న కొత్త ఎక్స్‌యూవీ700 ఖచ్చితంగా బ్రాండ్ యొక్క లేటెస్ట్ టెక్ లోడెడ్ ప్రోడక్ట్ అవుతుంది. ఇది ఈ విభాగంలో టాటా సఫారీ, ఎమ్‌జి హెక్టర్ ప్లస్ మరియు హ్యుందాయ్ అల్కాజార్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.ఏది ఏమైనా ఈ కొత్త మోడల్ యొక్క అమ్మకాలు ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎలా ఉంటాయో విడుదల తర్వాత తెలుస్తుంది.

Most Read Articles

English summary
Mahindra reveals new logo for its upcoming suvs xuv700 will be the first model to feature new logo
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X