మహీంద్రా నుండి కాబోయే తర్వాతి అతిపెద్ద లాంచ్.. 'కొత్త తరం 2022 స్కార్పియో' ఎస్‌యూవీ

అధునాత డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లు, ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్ మరియు అత్యుత్తమ సేఫ్టీ ఫీచర్లతో రూపొందించిన సరికొత్త 'ఎక్స్‌యూవీ700' (XUV700) ఎస్‌యూవీని మార్కెట్లో విడుదల చేసిన యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా (Mahindra) ఇప్పుడు తమ మరో కొత్త మోడల్ పై పనిచేస్తోంది. మహీంద్రా నుండి అత్యంత పాపులర్ అయిన ఎస్‌యూవీ 'స్కార్పియో' (Mahindra Scorpio) లో కంపెనీ ఓ నెక్స్ట్ జనరేషన్ మోడల్ ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది.

మహీంద్రా నుండి కాబోయే తర్వాతి అతిపెద్ద లాంచ్.. 'కొత్త తరం 2022 స్కార్పియో' ఎస్‌యూవీ

కొత్త తరం 2020 థార్ ఎస్‌యూవీ విడుదలైనప్పటి నుండి కొనుగోలుదారుల చూపు ఇప్పుడు మహీంద్రా బ్రాండ్ పైనే ఉంది. గతేడాది మార్కెట్లోకి వచ్చిన థార్ ఎంతటి విజయాన్ని సాధించిందో ఈ ఏడాది విడుదలైన ఎక్స్‌యూవీ700 కూడా అంత కన్నా ఎక్కువ విజయాన్ని సాధించింది. ఆ మధ్యలో వచ్చిన టియూవీ300 మోడల్ ఆధారిత బొలెరో నియో ఎస్‌యూవీ కూడా మధ్యతరగతి కస్టమర్ల ప్రాథమిక ఎంపికగా మారుతోంది. ఈ కొత్త మోడళ్ల రాకతో మహీంద్రా ఇప్పుడు కొత్త కస్టమర్లను తన వైపుకు ఆకర్షిస్తోంది.

మహీంద్రా నుండి కాబోయే తర్వాతి అతిపెద్ద లాంచ్.. 'కొత్త తరం 2022 స్కార్పియో' ఎస్‌యూవీ

ఇదిలా ఉంటే, మహీంద్రా బ్రాండ్ నుండి రాబోయే తర్వాతి మోడల్ కొత్త తరం స్కార్పియో అవుతుందని మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ జెజురికర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ధృవీకరించారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ కొత్త తరం స్కార్పియో మార్కెట్లోకి రావచ్చని భావిస్తున్నారు. గతకొన్నేళ్లుగా మహీంద్రా స్కార్పియోలో పెద్దగా ఎలాంటి అప్‌డేట్స్ చేయలేదు. ఈ నేపథ్యంలో, కొత్తగా రాబోయే నెక్స్ట్ జనరేషన్ స్కార్పియోలో డిజైన్ మరియు ఫీచర్ల పరంగా గణనీయమైన మార్పులు ఉండొచ్చని అంచనా.

మహీంద్రా నుండి కాబోయే తర్వాతి అతిపెద్ద లాంచ్.. 'కొత్త తరం 2022 స్కార్పియో' ఎస్‌యూవీ

మహీంద్రా స్కార్పియో ఎస్‌యూవీకి భారత మార్కెట్లో ఓ ప్రత్యేకమైన డిమాండ్ ఉండి. మంచి రోడ్ ప్రజెన్స్ కలిగి ఉన్న ఈ ఎస్‌యూవీకి భారత్‌లో లభిస్తున్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సాధారణంగా, ప్రస్తుత పోటీ వాతావరణంలో కారు మోడల్ పాతదవగానే కస్టమర్లు కొత్త మోడళ్ల పట్ల ఆకర్షితులు అవుతుంటారు. కానీ, స్కార్పియో విషయంలో అలా జరగలేదు. దాదాపు పదేళ్లుగా ఇందులో ఎలాంటి మేజర్ అప్‌డేట్స్ లేకపోయినప్పటికీ, ఈ మోడల్ అమ్మకాలు మాత్రం తగ్గలేదు.

మహీంద్రా నుండి కాబోయే తర్వాతి అతిపెద్ద లాంచ్.. 'కొత్త తరం 2022 స్కార్పియో' ఎస్‌యూవీ

ప్రస్తుతం అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీ కార్ల పేర్లను పరిశీలిస్తే, వాటిలో స్కార్పియో పేరు ఖచ్చితంగా ఉంటుంది. మన మార్కెట్లో ఎలాంటి అప్‌డేట్స్ పొందకుండానే వాహనం బాగా అమ్ముడవుతూ ఉండటం నిజంగానే అరుదు. కానీ స్కార్పియో ఎస్‌యూవీ దీనిని సాధ్యం చేసింది. అయితే, మార్కెట్లోకి కొత్తగా వచ్చిన ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీతోనే స్కార్పియో ఇంటి పోటీని ఎదుర్కుంటోంది. కస్టమర్లు ఇప్పుడు కాస్తంత ఆలస్యమైన ఎక్స్‌యూవీ700 కారునే కావాలని కోరుకుంటున్నారు.

మహీంద్రా నుండి కాబోయే తర్వాతి అతిపెద్ద లాంచ్.. 'కొత్త తరం 2022 స్కార్పియో' ఎస్‌యూవీ

ఈ పరిస్థితుల్లో మహీంద్రా ఇక ఆలస్యం చేయకుండా ఎప్పటి నుండో ప్లాన్ చేస్తున్న కొత్త తరం స్కార్పియోని కొత్త సంవత్సరంలో విడుదల చేయాలని నిర్ణయించుకుంది. అయితే, ఇతర ఆటోమొబైల్ కంపెనీల మాదిరిగానే మహీంద్రా కూడా సెమీ కండక్టర్ చిప్ కొరతతో సతమతమవుతోంది. ఫలితంగా, ఇప్పటికే మహీంద్రా థార్ మరియు ఎక్స్‌యూవీ700 కోసం భారీ ఆర్డర్లు పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం, కంపెనీ డిమాండ్ కి తగినట్లుగా సప్లయ్ చేయలేకపోతోంది.

మహీంద్రా నుండి కాబోయే తర్వాతి అతిపెద్ద లాంచ్.. 'కొత్త తరం 2022 స్కార్పియో' ఎస్‌యూవీ

వాస్తవానికి కొత్త తరం మహీంద్రా స్కార్పియో విడుదల ఆలస్యం కావడానికి కూడా ఇదొక ప్రధాన కారణం. అయితే, మహీంద్రా ఈ సమస్యను సమర్థవంతంగా ఎదుర్కునేందుకు ప్రయత్నిస్తోంది. కాగా, కొత్త తరం మహీంద్రా స్కార్పియో పూర్తిగా సరికొత్త ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ డిజైన్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ విషయాన్ని గతంలో వెల్లడైన స్పై చిత్రాలు అస్పష్టంగా వెల్లడించేలా ఉన్నాయి. మహీంద్రా ఇప్పటికే ఈ కారును భారత రోడ్లపై విస్తృతంగా పరీక్షిస్తోంది.

మహీంద్రా నుండి కాబోయే తర్వాతి అతిపెద్ద లాంచ్.. 'కొత్త తరం 2022 స్కార్పియో' ఎస్‌యూవీ

కొత్త తరం స్కార్పియోలా భారీ డిజైన్ మార్పులు ఉన్నప్పటికీ దాని ఓవరాల్ బాక్సీ సిల్హౌట్ మాత్రం అలానే ఉండొచ్చని తెలుస్తోంది. ఈ కొత్త తరం స్కార్పియో ను అప్‌డేట్ చేయబడిన ల్యాడర్-ఫ్రేమ్ ఛాస్సిస్‌పై నిర్మించనున్నారు. ఫలితంగా, ఈ కొత్త 2022 స్కార్పియో మునుపటి కన్నా విశాలమైనదిగా మరియు పొడవైనదిగా ఉండే అవకాశం ఉంది. ఇంజన్ విషయానికి వస్తే, కొత్త స్కార్పియోలో 2.2-లీటర్ టర్బో-డీజిల్ మరియు కొత్త 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌లను ఆఫర్ చేయవచ్చని అంచనా.

మహీంద్రా నుండి కాబోయే తర్వాతి అతిపెద్ద లాంచ్.. 'కొత్త తరం 2022 స్కార్పియో' ఎస్‌యూవీ

ఫేస్‌లిఫ్ట్ Mahindra XUV300 వస్తోంది..

కొత్త సంవత్సరంలో మహీంద్రా కొత్త తరం స్కార్పియోని ప్రవేశపెట్టడంతో పాటుగా ప్రస్తుతం విక్రయిస్తున్న పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ మహీంద్రా ఎక్స్‌యూవీ300 లో కూడా కంపెనీ ఓ ఫేస్‌లిఫ్ట్ మోడల్ ను విడుదల చేయాలని చూస్తోంది. ఎక్స్‌యూవీ300 లో ఇది మిడ్-సైకిల్ ఫేస్‌లిఫ్ట్ కాబట్టి దాని డిజైన్ లేదా ఫీచర్లలో పెద్ద మార్పులేమీ ఉండకపోవచ్చు. కానీ కొన్ని రకాల కాస్మెటిక్ అప్‌గ్రేడ్ లను మాత్రం ఇందులో ఆశించవచ్చు.

మహీంద్రా నుండి కాబోయే తర్వాతి అతిపెద్ద లాంచ్.. 'కొత్త తరం 2022 స్కార్పియో' ఎస్‌యూవీ

ఈ కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్ ఉండబోయే ప్రధానమైన మార్పు దాని ముందు మరియు వెనుక వైపున మహీంద్రా యొక్క కొత్త ట్విన్ పీక్స్ లోగో ఉండే అవకాశం ఉంటుంది. మహీంద్రా ఈ కొత్త లోగో ను తొలిసారిగా తమ ఎక్స్‌యూవీ700 మోడల్ పై ఉపయోగించింది. ఆ తర్వాత ఇది ఎక్స్‌యూవీ300 పై కనిపించే అవకాశం ఉంది. కొత్త ఎక్స్‌యూవీ300 ఫేస్‌లిఫ్ట్ మోడల్ లో అత్యంత ముఖ్యమైన అప్‌డేట్ దాని ఇంజన్ రూపంలో ఉండవచ్చని భావిస్తున్నారు. ఇందులో మరింత శక్తివంతమైన 1.2-లీటర్ త్రీ సిలిండర్ ఎమ్‌స్టాలియన్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ను ఉపయోగించే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Mahindra s next biggest launch could be the next generation scorpio details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X