భారత మార్కెట్లో కొత్త ట్రక్కును విడుదల చేసిన మహీంద్రా; ధర & వివరాలు

దేశీయ మార్కెట్లో ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా ఇటవల తన కమర్షియల్ విభాగంలో ఒక కొత్త వెహికల్ లాంచ్ చేసింది. మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ లాంచ్ చేసిన ఈ వెహికల్ సుప్రో ప్రాఫిట్ మినీ ట్రక్. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

భారత మార్కెట్లో కొత్త ట్రక్కును విడుదల చేసిన మహీంద్రా; ధర & వివరాలు

మహీంద్రా అండ్ మహీంద్రా కొత్త మినీ ట్రక్కును సుప్రో ప్రాఫిట్ మినీ మరియు సుప్రో ప్రాఫిట్ మ్యాక్సీ అనే రెండు వేరియంట్లలో విక్రయించనుంది. ఈ మినీ ప్రారంభ ధర రూ. 5.40 లక్షలు కాగా, మాక్సి మోడల్ యొక్క హై-ఎండ్ వేరియంట్ ధర రూ. 6.22 లక్షల వరకు ఉంటుంది.

భారత మార్కెట్లో కొత్త ట్రక్కును విడుదల చేసిన మహీంద్రా; ధర & వివరాలు

ఈ కొత్త కమర్షియల్ వెహికల్, సుప్రో మినీ ట్రక్ ఆధారంగా రూపొందించబడింది. సుప్రో ప్రాఫిట్ ట్రక్ హై లోడింగ్, అధిక మైలేజ్, అధిక సామర్థ్యం మరియు వివిధ లక్షణాలతో అభివృద్ధి చేయబడింది. ఇది చూడటానికి సింపుల్ గా ఉన్నప్పటికీ వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

భారత మార్కెట్లో కొత్త ట్రక్కును విడుదల చేసిన మహీంద్రా; ధర & వివరాలు

మహీంద్రా యొక్క పవర్‌ఫుల్ డైరెక్ట్ ఇంజెక్షన్ బిఎస్ 6 డీజిల్ ఇంజిన్‌కు సుప్రో ప్రాఫిట్ మినీ ట్రక్ లో అమర్చారు. ఈ ఇంజన్ 3,600 ఆర్‌పిఎమ్ వద్ద 19.4 కిలోవాట్ల సామర్థ్యం కలిగి ఉంది. సుప్రో ప్రాఫిట్ మాక్సిలో 4 స్ట్రోక్, 2 సిలిండర్ 909 సిసి ఇంజన్ అమర్చారు. ఇది 26 బిహెచ్‌పి పవర్ మరియు 55 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

భారత మార్కెట్లో కొత్త ట్రక్కును విడుదల చేసిన మహీంద్రా; ధర & వివరాలు

ఈ ఇంజిన్ 4 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌లో గరిష్ట సామర్థ్యాన్ని ఇస్తుంది. ఈ కొత్త ట్రక్కుకు పవర్ మరియు ఎకో అనే రెండు మోడ్‌లు లభిస్తాయి. ఈ వెహికల్ లీటరుకు 23.30 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. సుప్రో ప్రాఫిట్ ట్రక్ మినీని సిఎన్‌జితో కూడా విక్రయిస్తారు.

భారత మార్కెట్లో కొత్త ట్రక్కును విడుదల చేసిన మహీంద్రా; ధర & వివరాలు

ఈ కొత్త కమర్షియల్ వెహికల్ ఎక్కువమంది వినియోగదారులను ఆకర్షించడానికి మహీంద్రా ప్రత్యేక ఆఫర్లను కూడా ప్రకటించింది. ఇందులో భాగంగా 12.99% వడ్డీ రేటుతో ఐదేళ్ల లోన్ స్కీమ్ వంటివి అందించింది. అంతే కాకుండా ఈఎమ్ఐ స్కీమ్ కింద, వాహన కొనుగోలు వినియోగదారులకు అదనపు ప్రత్యేక ఆఫర్‌గా 100% క్రెడిట్‌ను అందించాలని కంపెనీ యోచిస్తోంది

భారత మార్కెట్లో కొత్త ట్రక్కును విడుదల చేసిన మహీంద్రా; ధర & వివరాలు

సుప్రో ప్రాఫిట్ ట్రక్కులో 13 అంగుళాల టైర్ ఉంది. ఈ టైర్‌ను సమీకరించిన తరువాత, ట్రక్ యొక్క ఎత్తు 170 మిమీ వరకు ఉంటుంది. ఈ మినీ ట్రక్ ఏ రకమైన రహదారిలో అయినా ప్రయాణించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. అంతే కాకుండా ఇది 1,050 కిలోల బరువును మోయగల సామర్త్యాన్ని కలిగి ఉంటుంది, కావున చాలామంది కమర్షియల్ వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Friday, July 9, 2021, 15:06 [IST]
English summary
Mahindra Supro Profit Truck Range Launched In India. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+