మహీంద్రా ఎస్‌యూవీ టెస్ట్ ట్రాక్ ప్రారంభం; దీని విశిష్టలేంటో తెలుసా..?

ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యూచరిస్టిక్ ఎస్‌యూవీ ఎక్స్‌యూవీ700ను కంపెనీ ఆవిష్కరించడంతో పాటుగా, తమ వాహనాల పరీక్షల నిమిత్తం రూపొందించిన కొత్త వాహన టెస్ట్ ట్రాక్‌ను కూడా మహీంద్రా ప్రారంభించింది.

మహీంద్రా ఎస్‌యూవీ టెస్ట్ ట్రాక్ ప్రారంభం; దీని విశిష్టలేంటో తెలుసా..?

తమిళనాడులోని కాంచీపురంలో మహీంద్రా ఓ అధునాతన ఎస్‌యూవీ టెస్ట్ ట్రాక్‌ను నిర్మించింది. దీనిని 'మహీంద్రా ఎస్‌యూవీ ప్రూవింగ్ ట్రాక్' (ఎమ్ఎస్‌పిటి)గా పిలువనున్నారు. కంపెనీ తయారు చేయబోయే అన్ని వాహనాలను ఇదే ట్రాక్‌పై పరీక్షించనుంది. మహీంద్రా సంస్థ నిర్మించిన ఈ ఎస్‌యూవీ టెస్ట్ ట్రాక్ సుమారు 2 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది.

మహీంద్రా ఎస్‌యూవీ టెస్ట్ ట్రాక్ ప్రారంభం; దీని విశిష్టలేంటో తెలుసా..?

మహీంద్రా తయారు చేసే ఎస్‌యూవీల యొక్క వివిధ రకాల పరీక్షల అవసరాలను తీర్చడానికి కంపెనీ 20 రకాల బహుళ ప్రయోజన ట్రాక్‌లను సృష్టించింది. ఈ టెస్టింగ్ ట్రాక్ చెన్నైలోని మహీంద్రా రీసెర్చ్ వ్యాలీకి 55 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ట్రాక్ ద్వారా ఇకపై మహీంద్రా తయారు చేసే తమ కార్లను పరీక్షించడం సులభతరం కానుంది.

మహీంద్రా ఎస్‌యూవీ టెస్ట్ ట్రాక్ ప్రారంభం; దీని విశిష్టలేంటో తెలుసా..?

సుమారు 454 ఎకరాల్లో ఏర్పాటు చేసిన మహీంద్రా ఎస్‌యూవీ ప్రూవింగ్ టెస్ట్ ట్రాక్‌లో ఓ స్వంత ఫ్యూయెల్ స్టేషన్ కూడా ఉంటుంది. ఈ టెస్ట్ ట్రాక్ కేవలం వాహనాల అభివృద్ధికి మాత్రమే కాకుండా, ఆటోమొబైల్ వేడుకలు లేదా ఇతర కార్యక్రమాల కోసం కూడా ఉపయోగపడుతుందని మహీంద్రా తెలిపింది. వచ్చే ఏడాది నుండి సాధారణ ఉపయోగం కోసం కంపెనీ ఈ టెస్ట్ ట్రాక్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.

మహీంద్రా ఎస్‌యూవీ టెస్ట్ ట్రాక్ ప్రారంభం; దీని విశిష్టలేంటో తెలుసా..?

ఈ టెస్ట్ ట్రాక్‌ను లార్సెన్ మరియు ట్యూబ్రో (ఎల్ అండ్ టి) సంస్థ రూపొందించింది మరియు దీనిని ఐడిఐఏడిఏ (ఇన్‌స్టిట్యూట్ ఫర్ అప్లైడ్ ఆటోమోటివ్ రీసెర్చ్) డిజైన్ చేసింది. ఇందులో వాహనం యొక్క ఆఫ్-రోడింగ్ సామర్థ్యాలను పరీక్షించేందుకు 4X4 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా ఉంది. ఇది కేవలం వాహనాల అభివృద్ధికి మాత్రమే కాకుండా వచ్చే ఏడాది నుండి ఆఫ్-రోడింగ్ ఔత్సాహికుల కోసం కూడా అందుబాటులోకి వస్తుంది.

మహీంద్రా ఎస్‌యూవీ టెస్ట్ ట్రాక్ ప్రారంభం; దీని విశిష్టలేంటో తెలుసా..?

మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఆవిష్కరణ

ఎస్‌యూవీ ప్రియులను ఎంతగానో ఊరిస్తూ వచ్చిన మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీని కంపెనీ అధికారికంగా ఆవిష్కరించింది. ఈ ఎస్‌యూవీకి సంబంధించిన ధర, వేరియంట్లు, ఫీచర్లు మరియు అనేక ఇతర వివరాలను కూడా కంపెనీ వెల్లడి చేసింది.

మహీంద్రా ఎస్‌యూవీ టెస్ట్ ట్రాక్ ప్రారంభం; దీని విశిష్టలేంటో తెలుసా..?

మహీంద్రా ఎక్స్‌యూవీ700ని ఈ విభాగంలో అత్యంత శక్తివంతమైన ఇంజన్ ఆప్షన్లతో, అత్యాధునిక సేఫ్టీ మరియు కంఫర్ట్ ఫీచర్లతో రూపొందించినట్లు కంపెనీ పేర్కొంది. ఈ ఎస్‌యూవీ భారతీయ ఎస్‌యూవీ విభాగంలోనే కేవలం 5 సెకన్లలో గంటకు 0 నుండి 60 కిలోమీటర్ల వేగాన్ని చేరుకునే మొదటి కారు అని కంపెనీ తెలిపింది.

మహీంద్రా ఎస్‌యూవీ టెస్ట్ ట్రాక్ ప్రారంభం; దీని విశిష్టలేంటో తెలుసా..?

ప్రస్తుతానికి మహీంద్రా మహీంద్రా ఎక్స్‌యూవీ700ని పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో మొత్తం నాలుగు వేరియంట్‌లలో అందిస్తున్నామని, అయితే త్వరలోనే ఇందులో మరిన్ని కొత్త వేరియంట్లను విడుదల చేస్తామని మహీంద్రా వివరించింది.

మహీంద్రా ఎస్‌యూవీ టెస్ట్ ట్రాక్ ప్రారంభం; దీని విశిష్టలేంటో తెలుసా..?

మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎమ్ఎక్స్ పెట్రోల్, ఎమ్ఎక్స్ డీజిల్, ఏఎక్స్3 పెట్రోల్ మరియు ఏఎక్స్5 పెట్రోల్ అనే నాలుగు వేరియంట్లలో ఈ ఎస్‌యూవీని కంపెనీ పరిచయం చేసింది. ఈ నాలుగు వేరియంట్లు కూడా 5-సీటింగ్ కాన్ఫిగరేషన్‌తో లభిస్తాయి. కంపెనీ ఇందులో కొత్తగా 7-సీటర్ వేరియంట్లను కూడా విడుదల చేయవచ్చని సమాచారం. ఎక్స్‌యూవీ700 వేరియంట్ల వారీగా ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

ఎక్స్‌యూవీ700 ఎమ్ఎక్స్ పెట్రోల్ - రూ.11.99 లక్షలు

ఎక్స్‌యూవీ700 ఎమ్ఎక్స్ డీజిల్ - రూ.12.49 లక్షలు

ఎక్స్‌యూవీ700 ఏఎక్స్3 పెట్రోల్ - రూ.13.99 లక్షలు

ఎక్స్‌యూవీ700 ఏఎక్స్5 పెట్రోల్ - రూ.14.99 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్)

మహీంద్రా ఎస్‌యూవీ టెస్ట్ ట్రాక్ ప్రారంభం; దీని విశిష్టలేంటో తెలుసా..?

మహీంద్రా ఎక్స్‌యూవీ700 పెట్రోల్ వెర్షన్‌లో 2.0 లీటర్ టర్బో పెట్రోల్ విత్ డైరెక్ట్ ఇంజెక్షన్ (టిజిడిఐ) ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 5000 ఆర్‌పిఎమ్ వద్ద 200 బిహెచ్‌పి శక్తిని మరియు 1750-3000 ఆర్‌పిఎమ్ వద్ద 380 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభ్యం కానుంది.

మహీంద్రా ఎస్‌యూవీ టెస్ట్ ట్రాక్ ప్రారంభం; దీని విశిష్టలేంటో తెలుసా..?

మహీంద్రా ఎక్స్‌యూవీ700 డీజిల్ వెర్షన్‌లో 2.2 లీటర్ టర్బో డీజిల్ విత్ సిఆర్‌డిఐ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ రెండు వేర్వేరు పవర్ కాన్ఫిగరేషన్లలో లభ్యం కానుంది. ఇందులో మొదటిది 3750 ఆర్‌పిఎమ్ వద్ద 155 బిహెచ్‌పి శక్తిని మరియు 1500-2800 ఆర్‌పిఎమ్ వద్ద 360 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే, రెండవది 3500 ఆర్‌పిఎమ్ వద్ద 185 బిహెచ్‌పి శక్తిని మరియు 1600-2800 ఆర్‌పిఎమ్ వద్ద 420 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇవి రెండూ కూడా 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభ్యం కానున్నాయి.

మహీంద్రా ఎస్‌యూవీ టెస్ట్ ట్రాక్ ప్రారంభం; దీని విశిష్టలేంటో తెలుసా..?

ఎక్స్‌యూవీ700 బేస్ ట్రిమ్ అయిన ఎమ్ఎక్స్ వేరియంట్లో లభించే ఫీచర్లను గమనిస్తే, ఈ కారులో 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7 ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆండ్రాయిడ్ ఆటో, స్మార్ట్ డోర్ హ్యాండిల్స్, ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్, స్టీరింగ్ మౌంటెడ్ స్విచ్‌లు, టర్న్ ఇండికేటర్‌లతో కూడిన పవర్ సైడ్ మిర్రర్స్, డే నైట్ ఇన్-సైడ్ రియర్ వ్యూ మిర్రర్, ఆర్17 అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

మహీంద్రా ఎస్‌యూవీ టెస్ట్ ట్రాక్ ప్రారంభం; దీని విశిష్టలేంటో తెలుసా..?

అలాగే, టాప్ ట్రిమ్ అయిన ఏఎక్స్‌లో అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్, డ్రైవర్ ఫెటిగ్ అలర్ట్, స్మార్ట్ క్లీన్ జోన్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఆర్18 డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, లెదర్ సీట్లు, లెదర్ స్టీరింగ్ మరియు గేర్ లివర్, మెమరీ మరియు వెల్కమ్ ఎంట్రన్స్‌తో కూడిన 6-వే పవర్ అడ్జస్టబల్ సీట్, ఎయిర్ బ్యాగ్స్ మరియు ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ వంటి ఫీచర్లు ఇందులో లభ్యం కానున్నాయి.

Most Read Articles

English summary
Mahindra suv proving track opened in tamilnadu details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X