2021 ఏప్రిల్ నెలలో భారీగా తగ్గిన మహీంద్రా ట్రాక్టర్ సేల్స్.. కారణం ఇదే
ఇటీవల దేశీయ మార్కెట్లో దాదాపు అన్ని వాహన తయారీదారులు తమ అమ్మకాల నివేదికలను విడుదల చేశారు. ఇందులో భాగంగానే దేశీయ వాహన తయారీ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా 2021 ఏప్రిల్ నెలలో జరిగిన ట్రాక్టర్ అమ్మకాల నివేదికను విడుదల చేసింది.

మహీంద్రా అండ్ మహీంద్రా విడుదల చేసిన నివేదికల ప్రకారం 2021 ఏప్రిల్ నెలలో దాదాపు 27,523 యూనిట్ల ట్రాక్టర్లను స్టాక్ మార్కెట్లో విక్రయించినట్లు కంపెనీ తెలిపింది. అదే మార్చి నెలలో కంపెనీ 30,970 యూనిట్లను విక్రయించినట్లు నివేదికలు చెబుతున్నాయి.

మహీంద్రా కంపెనీ యొక్క ట్రాక్టర్ల అమ్మకాలు గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 2021 ఏప్రిల్‌లో 11.13% తక్కువగా నమోదయ్యాయి. ఏప్రిల్ 2020 లో కోవిడ్ 19 మహమ్మారి అధికంగా వ్యాపించిన నేపథ్యంలో, దేశవ్యాప్తంగా కరోనా లాక్ డౌన్ అమలు చేసినందువల్ల మార్కెట్లో ఒక్క ట్రాక్టర్ కూడా అమ్మబడలేదు.

మహీంద్రా అండ్ మహీంద్రా ఏప్రిల్‌లో దేశీయ మార్కెట్లో 26,130 యూనిట్లను విక్రయించింది. మార్చిలో కంపెనీ 29,817 యూనిట్లను దేశీయ మార్కెట్లో విక్రయించింది. మార్చి అమ్మకాలతో పోలిస్తే దేశీయ మార్కెట్లో మహీంద్రా ట్రాక్టర్ అమ్మకాలు ఏప్రిల్‌లో 12.36% తగ్గాయి. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ట్రాక్టర్ల అమ్మకాలు భారీగా తగ్గినట్లు తెలుస్తోంది.

నివేదికల ప్రకారం భారతదేశంలో మహీంద్రా ట్రాక్టర్ల అమ్మకాలు చాలా తగ్గాయి. అయితే ఇతర దేశాల్లో కంపెనీ యొక్క అమ్మకాలు బాగా పెరిగాయి. ఎందుకంటే అక్కడ కూడా ట్రాక్టర్లకు మంచి డిమాండ్ ఉంది. ఈ కారణంగానే 2021 ఏప్రిల్‌లో కంపెనీ 1,393 యూనిట్ల ట్రాక్టర్లను ఎగుమతి చేసింది.

అయితే మార్చిలో కంపెనీ 1,153 యూనిట్ల ట్రాక్టర్లను ఎగుమతి చేసింది. అంటే మార్చితో పోలిస్తే ఏప్రిల్‌లో కంపెనీ ఎగుమతులు 20.81% పెరిగాయి. ఏప్రిల్‌లో సోనలికా 9,130 యూనిట్ల ట్రాక్టర్లను విక్రయించింది. అదేవిధంగా మార్చిలో కంపెనీ మొత్తం 13,093 యూనిట్లను విక్రయించింది.

మార్చితో పోలిస్తే ఏప్రిల్‌లో సోనలికా ట్రాక్టర్ల అమ్మకాలు 30.26% పడిపోయాయి. సోనాలిక 2020 ఏప్రిల్ నుండి అమలులో ఉన్న లాక్ డౌన్ కారణంగా ఆ సమయంలో ఒక్క ట్రాక్టర్ కూడా అమ్మలేదు. కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ కారణంగానే 2021 ఏప్రిల్ నాటికి సోనాలికా ట్రాక్టర్ అమ్మకాలు భారీ స్థాయిలో పడిపోయాయి.

నేటి వ్యవసాయ రంగంలో ట్రాక్టర్ల ప్రాధాన్యత ఎంతవరకు ఉందొ అందరికి తెలుసు, కావున దేశీయ మార్కెట్లో మాత్రమే కాకూండా విదేశీ మార్కెట్లో కూడా ట్రాక్టర్లకు మంచి డిమాండ్ ఉంది. అయితే కరోనా మహమ్మరి వీటి అమ్మకాలపై కూడా చాలా ప్రభావాన్ని చూపించింది.


Click it and Unblock the Notifications








