2021 ఫిబ్రవరిలో పుంజుకున్న మహీంద్రా ట్రాక్టర్ అమ్మకాలు.. కారణం ఇదేనా!!

భారతదేశంలోని దాదాపు అన్ని వాహన తయారీదారులు ఫిబ్రవరిలో జరిపిన అమ్మకాల గణాంకాలను విడుదల చేశారు. ఇందులో భాగంగానే మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ కూడా తమ అమ్మకాల నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికల ప్రకారం మహీంద్రా యొక్క ద్విచక్ర వాహనాలు మరియు నాలుగు చక్రాల వాహనాల యొక్క అమ్మకాలు గత నెలలో స్వల్పంగా కోలుకున్నాయి.

2021 ఫిబ్రవరిలో పుంజుకున్న ట్రాక్టర్ అమ్మకాలు.. కారణం ఇదేనా!!

ఈ వాహనాలతో పాటు మరోవైపు మహీంద్రా యొక్క వ్యవసాయ వాహనాల అమ్మకాలు కూడా పెరిగాయి. భారతదేశానికి చెందిన ట్రాక్టర్ తయారీ సంస్థ మహీంద్రా ట్రాక్టర్స్ తన ఫిబ్రవరి అమ్మకాల గణాంకాల విషయానికి వస్తే, కంపెనీ గత నెలలో దేశీయ మార్కెట్లో పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లను విక్రయించింది. మహీంద్రా అండ్ మహీంద్రా గత నెలలో వ్యవసాయ పరికరాల యొక్క దేశీయ అమ్మకాలలో 24% పెరిగింది.

2021 ఫిబ్రవరిలో పుంజుకున్న ట్రాక్టర్ అమ్మకాలు.. కారణం ఇదేనా!!

ఫిబ్రవరి 2021 లో కంపెనీ దేశీయ మార్కెట్లో మొత్తం 27,170 యూనిట్ ట్రాక్టర్లను విక్రయించింది. ఫిబ్రవరి 2020 లో కంపెనీ మొత్తం 21,877 యూనిట్ల ట్రాక్టర్లను దేశీయ మార్కెట్లో విక్రయించినట్లు తెలిసింది.

MOST READ:డ్రైవింగ్ లైసెన్స్‌లోని ఈ చిత్రం భలే విచిత్రం..చూసారా..!

2021 ఫిబ్రవరిలో పుంజుకున్న ట్రాక్టర్ అమ్మకాలు.. కారణం ఇదేనా!!

కంపెనీ అమ్మకాలపై వ్యాఖ్యానిస్తూ మహీంద్రా అండ్ మహీంద్రా ఎఫ్‌ఇఎస్ చైర్మన్ హేమంత్ సిక్కా, సకాలంలో పంటలు వేస్తున్న కారణంగా మార్కెట్లో ట్రాక్టర్ల డిమాండ్ పెరిగిందన్నారు. అంతే కాకుండా పంట ఉత్పత్తి మరియు పెరుగుతున్న గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కారణంగా ట్రాక్టర్ పరిశ్రమ సానుకూలంగా వృద్ధి చెందుతోందని ఆయన అన్నారు.

2021 ఫిబ్రవరిలో పుంజుకున్న ట్రాక్టర్ అమ్మకాలు.. కారణం ఇదేనా!!

ట్రాక్టర్ల ఎగుమతిలో కూడా కంపెనీ మంచి పనితీరు కనబరిచింది. మహీంద్రా & మహీంద్రా గత నెలలో మొత్తం 976 ట్రాక్టర్లను ఎగుమతి చేసింది. గత ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే ఇది దాదాపు 43% పెరుగుదల కనపరిచింది.

MOST READ:మంత్రి కాన్వాయ్ ఓవర్‌టేక్ చేయడంతో చిక్కులో పడ్డ పర్యాటకులు

2021 ఫిబ్రవరిలో పుంజుకున్న ట్రాక్టర్ అమ్మకాలు.. కారణం ఇదేనా!!

ఫిబ్రవరి 2021 లో కంపెనీ దేశీయ అమ్మకాలు మరియు ఎగుమతుల ద్వారా మొత్తం 28,146 యూనిట్ ట్రాక్టర్లను విక్రయించింది. మహీంద్రా అండ్ మహీంద్రా గత ఏడాది ఫిబ్రవరి నెలలో 22,561 యూనిట్ల ట్రాక్టర్లను విక్రయించింది.

2021 ఫిబ్రవరిలో పుంజుకున్న ట్రాక్టర్ అమ్మకాలు.. కారణం ఇదేనా!!

ఈ ఏడాది కంపెనీ అమ్మకాలు 25% పెరిగాయి. మరో ట్రాక్టర్ సంస్థ ఎస్కార్ట్స్ లిమిటెడ్ 10,690 యూనిట్ల ట్రాక్టర్లను విక్రయించింది. ఇది దేశీయ మార్కెట్లో కంపెనీ అమ్మకాల పరిమాణాన్ని 33% కి పెంచింది. మహీంద్రా అండ్ మహీంద్రా ప్రయాణీకుల వాహనాల అమ్మకాలలో 41% పెరుగుదల నివేదించింది.

MOST READ:ఇదేం సిత్రం.. ట్రక్కులో కట్టేసి తీసుకెళ్తున్న జావా 42 బైక్‌కి ఓవర్‌స్పీడింగ్ ఛలాన్!?

2021 ఫిబ్రవరిలో పుంజుకున్న ట్రాక్టర్ అమ్మకాలు.. కారణం ఇదేనా!!

మహీంద్రా అండ్ మహీంద్రా గత నెలలో 15,391 యూనిట్ల ప్యాసింజర్ కార్లను విక్రయించింది. ఫిబ్రవరి 2020 లో కంపెనీ 10,938 యూనిట్ల ప్యాసింజర్ కార్లను విక్రయించింది. ఏది ఏమైనా కంపెనీ యొక్క అమ్మకాలు గత ఫిబ్రవరి నెలలో సానుకూలంగానే ఉన్నాయి.

Most Read Articles

English summary
Mahindra Tractor Sales Increases In February 2021. Read in Telugu.
Story first published: Tuesday, March 2, 2021, 19:26 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X