మహీంద్రా నుండి ఎక్స్‌యూవీ900, ఎక్స్‌యూవీ400, ఎక్స్‌యూవీ100 కార్లు!

ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా 'XUV' (ఎక్స్‌యూవీ) బ్రాండ్ పేరుతో ప్రస్తుతం రెండు మోడళ్లు (ఎక్స్‌యూవీ300 మరియు ఎక్స్‌యూవీ500) విక్రయిస్తున్న సంగతి తెలిసినదే.

మహీంద్రా నుండి ఎక్స్‌యూవీ900, ఎక్స్‌యూవీ400, ఎక్స్‌యూవీ100 కార్లు!

తాజాగా ఈ బ్యాడ్జ్ క్రింద కంపెనీ ఎక్స్‌యూవీ700 పేరిట ఓ కొత్త ఎస్‌యూవీని కూడా ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, కంపెనీ ఈ బ్యాడ్జ్ (ఎక్స్‌యూవీ) క్రింద పైన తెలిపిన మోడళ్లే కాకుండా అదనంగా మరో మూడు కొత్త మోడళ్లను కూడా ప్రవేశపెట్టేందుకు ప్లాన్ చేస్తోంది.

మహీంద్రా నుండి ఎక్స్‌యూవీ900, ఎక్స్‌యూవీ400, ఎక్స్‌యూవీ100 కార్లు!

ఇటీవల కంపెనీ ఇందుకు సంబంధించిన పేర్లను కూడా ట్రేడ్‌మార్క్ చేసింది. మహీంద్రా అండ్ మహీంద్రా తాజాగా ఎక్స్‌యూవీ900, ఎక్స్‌యూవీ400 మరియు ఎక్స్‌యూవీ100 పేర్లను ట్రేడ్‌మార్క్ కోసం రిజిస్టర్ చేసుకుంది.

MOST READ:బ్రేకింగ్ న్యూస్; బెంగళూరులో తిరగాలంటే మీ బైక్‌కి ఇది తప్పని సరి.. లేకుంటే?

మహీంద్రా నుండి ఎక్స్‌యూవీ900, ఎక్స్‌యూవీ400, ఎక్స్‌యూవీ100 కార్లు!

వీటిలో మహీంద్రా ఎక్స్‌యూవీ900 ఓ ఫుల్ సైజ్ ఎస్‌యూవీ కావచ్చని, పరిమాణంలో ఇది రాబోయే ఎక్స్‌యూవీ700 మోడల్ కన్నా పెద్దదిగా ఉంటుందని సమాచారం. మహీంద్రా ఎక్స్‌యూవీ900 ఈ విభాగంలో ఫోర్డ్ ఎండీవర్, టొయోటా ఫార్చ్యూనర్, ఎమ్‌జి గ్లోస్టర్, ఇసుజు ఎమ్‌యు-ఎక్స్ వంటి ఎస్‌యూవీలకు పోటీగా నిలిచే ఆస్కారం ఉంది.

మహీంద్రా నుండి ఎక్స్‌యూవీ900, ఎక్స్‌యూవీ400, ఎక్స్‌యూవీ100 కార్లు!

కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ900 డిజైన్ పరంగా ఇది ప్రస్తుతం కంపెనీ విక్రయిస్తున్న ఆల్ట్యూరాస్ జి4 ను ప్రతిబింబిస్తుందని సమాచారం. అంతేకాకుండా, ఇది మహీంద్రా ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలో టాప్-ఆఫ్ ది లైన్ మోడల్‌గా కూడా నిలిచే అవకాశం ఉంది. ఇందులో లగ్జరీ ఇంటీరియర్లను మరియు లేటెస్ట్ టెక్ ఫీచర్లను ఆశించవచ్చు.

MOST READ:సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలని పోలీసులచే అరెస్ట్ అయ్యాడు.. ఎందుకంటే?

మహీంద్రా నుండి ఎక్స్‌యూవీ900, ఎక్స్‌యూవీ400, ఎక్స్‌యూవీ100 కార్లు!

కాగా, కొత్తగా విడుదల కాబోయే మహీంద్రా ఎక్స్‌యూవీ700 మోడల్‌ను తర్వాతి తరం ఎక్స్‌యూవీ900 మరియు ఎక్స్‌యూవీ500 మోడళ్ల మధ్యలో ఆఫర్ చేసే అవకాశం ఉంది. ఈ కారును కంపెనీ యొక్క కొత్త డబ్ల్యూ601 ప్లాట్‌ఫామ్‌పై నిర్మించనున్నారు. మహీంద్రా అండ్ మహీంద్రా ఈ ప్లాట్‌ఫామ్‌ను గ్లోబల్ మార్కెట్ కోసం సిద్ధం చేస్తోంది.

మహీంద్రా నుండి ఎక్స్‌యూవీ900, ఎక్స్‌యూవీ400, ఎక్స్‌యూవీ100 కార్లు!

మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, అధ్భుతమైన పనితీరు మరియు ఫస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్లతో విడుదల చేయనున్నారు. ఇందులో వరల్డ్ క్లాస్ సేఫ్టీ ఫీచర్లు ఉంటాయని కంపెనీ పేర్కొంది. ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్లతో, మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులోకి రానుంది.

MOST READ:మొబైల్ చూస్తూ వెళ్తున్నందుకు మొహం పచ్చడైంది.. ఎలా అనుకుంటున్నారా?

మహీంద్రా నుండి ఎక్స్‌యూవీ900, ఎక్స్‌యూవీ400, ఎక్స్‌యూవీ100 కార్లు!

తాజాగా లీకైన వివరాల ప్రకారం, మహీంద్రా ఎక్స్‌యూవీ900 పేరుతో పాటుగా ఎక్స్‌యూవీ400 మరియు ఎక్స్‌యూవీ100 పేర్లను కూడా ట్రేడ్‌మార్క్ కోసం ధరఖాస్తు చేసుకుంది.

మహీంద్రా నుండి ఎక్స్‌యూవీ900, ఎక్స్‌యూవీ400, ఎక్స్‌యూవీ100 కార్లు!

ఇందులో ఎక్స్‌యూవీ400 కొత్తగా రాబోయే నెక్స్ట్ జనరేషన్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ ఎక్స్‌యూవీ500 కన్నా చిన్నదిగా ఉండే అవకాశం ఉంది. ఇది ఈ విభాగంలో టాటా నెక్సాన్, కియా సెల్టోస్, ఎమ్‌జి హెక్టర్, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ వంటి కార్లకు పోటీగా నిలిచే అవకాశం ఉంది.

MOST READ:బెంట్లీ కార్స్ మాత్రమే కాదు, ఇక బెంట్లీ లగ్జరీ అపార్ట్మెంట్స్ కూడా..

మహీంద్రా నుండి ఎక్స్‌యూవీ900, ఎక్స్‌యూవీ400, ఎక్స్‌యూవీ100 కార్లు!

ఇకపోతే, చివరిగా మహీంద్రా ఎక్స్‌యూవీ100 కంపెనీ యొక్క ఎక్స్‌యూవీ లైనప్‌లో ఎంట్రీ లెవల్ మోడల్‌గా ఆఫర్ చేసే అవకాశం ఉంది. ఇది ఓ హ్యాచ్‌బ్యాక్ పరిమాణంలో ఉండే ఎస్‌యూవీ స్టైల్ కారు కావచ్చని అంచనా.

మహీంద్రా నుండి ఎక్స్‌యూవీ900, ఎక్స్‌యూవీ400, ఎక్స్‌యూవీ100 కార్లు!

ప్రస్తుతానికి, మహీంద్రా ఈ మూడు కొత్త కార్ల గురించి ఇంకా అధికారింగా ధృవీకరించలేదు. కానీ, రాబోయే రోజుల్లో కంపెనీ టీజర్ల రూపంలో కొత్త సమాచారాన్ని పంచుకునే అవకాశం ఉంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Mahindra Trademarks XUV900, XUV400 And XUV100 Names, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X