మహీంద్రా నుండి ఎస్‌యూవీ-కూప్ స్టైల్ మోడల్, పేరు: ఎక్స్‌యూవీ900!?

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా భారత మార్కెట్ కోసం అనేక కొత్త మోడళ్లను ప్లాన్ చేసింది. ఈ కంపెనీ త్వరలోనే ఓ సరికొత్త ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీని విడుదల చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసినదే. కాగా, మహీంద్రా ఇప్పుడు ఎక్స్‌యూవీ900 అనే కూప్ స్టైల్ క్రాసోవర్‌పై పనిచేస్తున్నట్లు సమాచారం.

మహీంద్రా నుండి ఎస్‌యూవీ-కూప్ స్టైల్ మోడల్, పేరు: ఎక్స్‌యూవీ900!?

గతంలో మహీంద్రా ప్రవేశపెట్టిన ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీ బ్రాండ్ మంచి సక్సెస్‌ను సాధించడంతో కంపెనీ ఇదే బ్రాండ్ నేమ్‌తో ఎక్స్‌యూవీ300 అనే కాంపాక్ట్ ఎస్‌యూవీని తయారు చేసింది. కాగా, ఇప్పుడు అదే లైనప్‌లో ఎక్స్‌యూవీ700 పేరుతో ఓ ఫుల్ సైజ్ 7-సీటర్ ఎస్‌యూవీని లాంచ్ చేసేందుకు మహీంద్రా సిద్ధమైంది.

మహీంద్రా నుండి ఎస్‌యూవీ-కూప్ స్టైల్ మోడల్, పేరు: ఎక్స్‌యూవీ900!?

తాజాగా, మహీంద్రా తమ మొట్టమొదటి ఎస్‌యూవీ-కూప్‌పై పనిచేస్తోంది. ఈ మోడల్‌ని ఎక్స్‌యూవీ900 అని పిలువనున్నట్లు సమాచారం. కంపెనీ ఇప్పటికే ఈ పేరును కూడా ట్రేడ్‌మార్క్ చేసినట్లు తెలుస్తోంది.

MOST READ:వరుసగా 5 వ రోజు పెరిగిన పెట్రోల్ & డీజిల్ ధరలు; వివరాలు

మహీంద్రా నుండి ఎస్‌యూవీ-కూప్ స్టైల్ మోడల్, పేరు: ఎక్స్‌యూవీ900!?

మహీంద్రా ఎక్స్‌యూవీ900 కూప్ కంపెనీ యొక్క ఎక్స్‌యూవీ ఏరో కాన్సెప్ట్ ప్రొడక్షన్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. అలాగే, ఎక్స్‌యూవీ700లో ఉపయోగించిన అనేక విడిభాగాలను, ఇంజన్ ఆప్షన్లను ఈ కూప్ మోడల్‌ను కొనసాగించే అవకాశం ఉంది.

మహీంద్రా నుండి ఎస్‌యూవీ-కూప్ స్టైల్ మోడల్, పేరు: ఎక్స్‌యూవీ900!?

రానున్న రోజుల్లో మహీంద్రా అండ్ మహీంద్రా నుండి సరికొత్త ఎక్స్‌యూవీ700, కొత్త తరం స్కార్పియో, ఎక్స్‌యూవీ300 ఫేస్‌లిఫ్ట్ మరియు కెయువి100 ఎలక్ట్రిక్ వెర్షన్ వంటి అనేక మోడళ్లు భారత మార్కెట్లో సందడి చేయనున్నాయి. ఇవి ఇప్పటికే తుది దశలో ఉండగా, కంపెనీ వీటితో పాటుగా మరిన్ని కొత్త మోడళ్లను తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తోంది.

MOST READ:ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఈ-పాస్ పొందాలంటే ఇలా చేయండి

మహీంద్రా నుండి ఎస్‌యూవీ-కూప్ స్టైల్ మోడల్, పేరు: ఎక్స్‌యూవీ900!?

ఇందులో భాగంగానే, మహీంద్రా ఎక్స్‌యూవీ900తో కొన్ని ఇతర పేర్లను కూడా ట్రేడ్‌మార్క్ కోసం ధరఖాస్తు చేసుకుంది. మహీంద్రా ఎక్స్‌యూవీ900 మోడల్‌ను ఎస్‌యూవీ-కూప్ స్టైల్ బాడీతో డిజైన్ చేయవచ్చని తెలుస్తోంది. ఎస్‌యూవీ-కూప్ సెగ్మెంట్ కోసం మహీంద్రా చాలా కాలంగా వేచి చూస్తోంది.

మహీంద్రా నుండి ఎస్‌యూవీ-కూప్ స్టైల్ మోడల్, పేరు: ఎక్స్‌యూవీ900!?

ఎస్‌యూవీ-కూప్ విభాగంలో బిఎమ్‌డబ్ల్యూ వంటి లగ్జరీ కార్ కంపెనీలు ఇప్పటికే కొన్ని రకాల మోడళ్లను విక్రయిస్తున్నాయి. ఉదాహరణకు బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 మోడల్ కూడా ఎస్‌యూవీ-కూప్ మాదిరిగా ఉంటుంది. కొత్తగా రాబోయే హీంద్రా ఎక్స్‌యూవీ900 భారత మార్కెట్లో ఈ బ్రాండ్‌ను మరింత బలోపేతం చేస్తుందని కంపెనీ భావిస్తోంది.

MOST READ:ఆనంద్ మహీంద్రా ట్వీట్; బహుశా.. ఇదోరకమైన సామజిక దూరమేమో

మహీంద్రా నుండి ఎస్‌యూవీ-కూప్ స్టైల్ మోడల్, పేరు: ఎక్స్‌యూవీ900!?

ప్రీమియం విభాగంలో మహీంద్రా ఈ కొత్త ఎస్‌యూవీ-కూప్ స్టైల్ ఎక్స్‌యూవీ900 మోడల్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది మరియు ఇది త్వరలో రానున్న ఎక్స్‌యూవీ700 మోడల్‌కి ఎగువన ఆఫర్ చేసే అవకాశం ఉంది. గత 2020 ఆటో ఎక్స్‌పోలో మహీంద్రా ఎస్‌యూవీ ఏరో కాన్సెప్ట్‌కు కస్టమర్ల నుండి మంచి స్పందన లభించింది. అయితే, కంపెనీ దాని ఉత్పత్తిని ఆమోదించలేదు.

మహీంద్రా నుండి ఎస్‌యూవీ-కూప్ స్టైల్ మోడల్, పేరు: ఎక్స్‌యూవీ900!?

ఇటీవలి కాలంలో భారత ఆటోమొబైల్ మార్కెట్లో ప్రీమియం ఎస్‌యూవీలు మరియు క్రాసోవర్‌లు బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ నేపథ్యంలో, ఇలాంటి సరికొత్త ఎస్‌యూవీ-కూప్ స్టైల్ వాహనాలు కూడా వినియోగదారుల దృష్టిని ఆకర్షించగలవని కంపెనీ ధీమాగా ఉంది.

MOST READ:తోటి వ్యక్తి అంత్యక్రియలకు నిరాకరించిన గ్రామస్థులు.. పిఎఫ్‌ఐ టీమ్ రాకతో కథ సుఖాంతం

మహీంద్రా నుండి ఎస్‌యూవీ-కూప్ స్టైల్ మోడల్, పేరు: ఎక్స్‌యూవీ900!?

మహీంద్రా కేవలం యుటిలిటీ వాహనాలను మాత్రమే తయారు చేస్తామని, హ్యాచ్‌బ్యాక్‌లు, సెడాన్లు మరియు చిన్న కార్లను తయారు చేయబోదని గతంలో స్పష్టం చేసింది. అయితే అదే సమయంలో కంపెనీ కొత్త వాహన విభాగాలను సృష్టించేందుకు అవకాశాలను కూడా అన్వేషిస్తోంది.

మహీంద్రా నుండి ఎస్‌యూవీ-కూప్ స్టైల్ మోడల్, పేరు: ఎక్స్‌యూవీ900!?

గతంలో మహీంద్రా ఆవిష్కరించిన ఎక్స్‌యూవీ ఏరో కాన్సెప్ట్‌ను ప్రస్తుతం కంపెనీ మార్కెట్లో విక్రయిస్తున్న ఎక్స్‌యూవీ500 నుండి ప్రేరణ పొంది డిజైన్ చేసింది. అయితే, కాన్సెప్ట్‌కి ప్రొడక్షన్ వెర్షన్‌కి మధ్య కొన్ని మార్పులు ఉండే అవకాశం ఉంది. ప్రొడక్షన్ వెర్షన్‌లో పిల్లర్స్ లేని డిజైన్ మరియు సూసైడ్ డోర్స్ ఉండకపోవచ్చు.

మహీంద్రా నుండి ఎస్‌యూవీ-కూప్ స్టైల్ మోడల్, పేరు: ఎక్స్‌యూవీ900!?

మహీంద్రా ఎక్స్‌యూవీ900 ఎస్‌యూవీ-కూప్ మోడల్‌ను కూడా కొత్తగా రానున్న ఎక్స్‌యూవీ700 మోనోకోక్ ఆర్కిటెక్చర్ మీదనే తయారు చేసే అవకాశం ఉంది. ఈ మోడల్ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించేందుకు కంపెనీ ఎక్స్‌యూవీ700లో ఉపయోగించిన బాడీ ప్యానెల్లు మరియు అంతర్గత భాగాలను ఈ కొత్త మోడల్‌ను ఉపయోగించే అవకాశం ఉంది.

మహీంద్రా నుండి ఎస్‌యూవీ-కూప్ స్టైల్ మోడల్, పేరు: ఎక్స్‌యూవీ900!?

ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే, ఎక్స్‌యూవీ900లో కూడా 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ మరియు 2.2-లీటర్ డీజిల్ ఇంజన్లను ఉపయోగించే అవకాశం ఉంది. ఈ ఇంజన్లు 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో రావచ్చని తెలుస్తోంది.

మహీంద్రా నుండి ఎస్‌యూవీ-కూప్ స్టైల్ మోడల్, పేరు: ఎక్స్‌యూవీ900!?

ప్రస్తుతానికి మహీంద్రా ఎక్స్‌యూవీ900 ప్రాజెక్ట్ ఇంకా డ్రాయింగ్ స్టేజ్‌లోనే ఉంది. ఇది అభివృద్ధి దశకు చేరుకొని, ఉత్పత్తి దశకు చేరుకునేందుకు మరి కొన్నేళ్ల సమయం పట్టవచ్చు. అంచనా ప్రకారం, ఇది 2024 నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.

Source: Autocar India

Most Read Articles

English summary
Mahindra Working On New SUV-Coupe Model, To Be Named As XUV900. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X