అద్భుతాలు సృష్టిస్తున్న మహీంద్రా ఎక్స్‌యూవీ300; బుకింగ్స్‌లో 90 శాతం పెరుగుదల!

భారత కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో హ్యుందాయ్ వెన్యూ, మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, కియా సోనెట్, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ మరియు టాటా నెక్సాన్ మొదలైన మోడళ్లకు పోటీగా, ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహన బ్రాండ్ మహీంద్రా అండ్ మహీంద్రా ప్రవేశపెట్టిన తమ లేటెస్ట్ ఎక్స్‌యూవీ300 బుకింగ్స్ పరంగా అద్భుతాలు సృష్టిస్తోంది.

అద్భుతాలు సృష్టిస్తున్న మహీంద్రా ఎక్స్‌యూవీ300; బుకింగ్స్‌లో 90 శాతం పెరుగుదల!

మహీంద్రా ఇటీవల తమ సంస్థ వార్షిక సమావేశాన్ని ముగించిన సందర్భంగా, కొన్ని కీలక ప్రకటనలు చేసింది. 2021 ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో మహీంద్రా ఎక్స్‌యూవీ300 కాంపాక్ట్ ఎస్‌యూవీ బుకింగ్‌లు 90 శాతం పెరిగాయని కంపెనీ ప్రకటించింది.

అద్భుతాలు సృష్టిస్తున్న మహీంద్రా ఎక్స్‌యూవీ300; బుకింగ్స్‌లో 90 శాతం పెరుగుదల!

గత 2021 ఆర్థిక సంవత్సరంలో క్యూ1 మరియు క్యూ2 లలో మహీంద్రా ఎక్స్‌యూవీ300 కాంపాక్ట్ ఎస్‌యూవీ కోసం నెలకు సగటున 6,000 బుకింగ్‌లు వచ్చాయని, మొత్తం బుకింగ్‌లలో 48 శాతం పెట్రోల్ వేరియంట్‌లకు చెందినవేనని కంపెనీ తెలిపింది.

అద్భుతాలు సృష్టిస్తున్న మహీంద్రా ఎక్స్‌యూవీ300; బుకింగ్స్‌లో 90 శాతం పెరుగుదల!

మహీంద్రా ఎక్స్‌యూవీ300 కాంపాక్ట్ ఎస్‌యూవీ కోసం పెరుగుతున్న ప్రజాదరణ కారణంగా, ఈ మోడల్ కోసం ఇప్పుడు వెయిటింగ్ పీరియడ్ కూడా సుమారు 12 వారాలకు పైగా ఉంటోంది. మహీంద్రా ఎక్స్‌యూవీ300 మోడల్‌ని కంపెనీ భారత మార్కెట్లో అత్యంత పోటీతో కూడుకున్న కాంపాక్ట్-ఎస్‌యూవీ విభాగంలో ప్రవేశపెట్టింది.

అద్భుతాలు సృష్టిస్తున్న మహీంద్రా ఎక్స్‌యూవీ300; బుకింగ్స్‌లో 90 శాతం పెరుగుదల!

ఈ విభాగంలోని ప్రత్యర్థులతో పోటీని సమర్థవంతంగా ఎదుర్కునేందుకు, కంపెనీ ఈ ఏడాది ప్రారంభంలో కొత్తగా ఓ పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్‌ను విడుదల చేసింది. ఇప్పుడు ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో పాటుగా రెండు ఇంజన్లలో ఆటోమేటిక్ మరియు మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లను కూడా కలిగి ఉంటుంది.

అద్భుతాలు సృష్టిస్తున్న మహీంద్రా ఎక్స్‌యూవీ300; బుకింగ్స్‌లో 90 శాతం పెరుగుదల!

మహీంద్రా ఎక్స్‌యూవీ300 పెట్రోల్ వెర్షన్‌లో 1.2 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ఉంటుంది, ఇది గరిష్టంగా 109 బిహెచ్‌పి శక్తిని మరియు 200 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, డీజిల్ వెర్షన్ ఎక్స్‌యూవీ300లో 1.5-లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్ ఉంటుంది, ఇది 117 బిహెచ్‌పి శక్తిని మరియు 300 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇవి రెండూ కూడా సిక్స్-స్పీడ్ మాన్యువల్ లేదా సిక్స్-స్పీడ్ ఏఎమ్‌టి ట్రాన్సిమిషన్‌తో లభిస్తాయి.

అద్భుతాలు సృష్టిస్తున్న మహీంద్రా ఎక్స్‌యూవీ300; బుకింగ్స్‌లో 90 శాతం పెరుగుదల!

మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఎస్‌యూవీలో కంపెనీ సైలెంట్‌గా కొన్ని ఫీచర్లను తొలగించింది. ఇందులో ఇప్పుడు రెండవ వరుసలోని మధ్యలో కూర్చునే ప్యాసింజర్ కోసం 3-పాయింట్ సీట్ బెల్ట్‌ను తొలగించి, కేవలం ల్యాప్‌బెల్ట్ మాత్రమే ఆఫర్ చేసింది. అలాగే, ఇప్పటి వరకూ ఈ కారులో ఆఫర్ చేసిన హీటెడ్ సైడ్ మిర్రర్స్ ఫీచర్‌ను కూడా కంపెనీ తొలగించింది.

అద్భుతాలు సృష్టిస్తున్న మహీంద్రా ఎక్స్‌యూవీ300; బుకింగ్స్‌లో 90 శాతం పెరుగుదల!

అంతేకాకుండా, కంపెనీ ఇటీవలే మహీంద్రా ఎక్స్‌యూవీ300 ధరలను కూడా వేరియంట్‌ను బట్టి రూ.1,000 నుండి రూ.39,000 వరకూ ధరలను పెంచింది. పెరిగిన ధరలను ఎక్స్-షోరూమ్ నుండి ఆన్-రోడ్‌కు పోల్చి చూస్తే అవి సుమారు రూ.90,000 వరకు ప్రభావితం చేస్తాయి. ధరల పెరుగుదల తర్వాత ఈ ఎస్‌యూవీ ఇప్పుడు రూ.7.96 లక్షల నుండి రూ.12.94 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) మధ్యలో లభిస్తుంది.

అద్భుతాలు సృష్టిస్తున్న మహీంద్రా ఎక్స్‌యూవీ300; బుకింగ్స్‌లో 90 శాతం పెరుగుదల!

ఈ కారులో లభించే కొన్ని కీలకమైన ఫీచర్లను గమనిస్తే, ఇందులో డ్యూయల్ టోన్ డాష్‌బోర్డ్, బాడీ కలర్ డోర్ హ్యాండిల్ మరియు సైడ్ మిర్రర్స్, స్టీరింగ్‌పై ఆడియో కంట్రోల్, సెంట్రల్ లాకింగ్, పవర్ విండోస్, 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మొదలైనవి ఉన్నాయి.

అద్భుతాలు సృష్టిస్తున్న మహీంద్రా ఎక్స్‌యూవీ300; బుకింగ్స్‌లో 90 శాతం పెరుగుదల!

సేఫ్టీ ఫీచర్ల విషయానికొస్తే, ఇందులో ఏబిఎస్ విత్ ఇబిడి, 2 ఎయిర్‌బ్యాగులు, నాలుగు చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు, సీట్ బెల్ట్ రిమైండర్, స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్ మొదలైనవి ఉన్నాయి. అంతేకాకుండా, ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ గ్లోబల్ ఎన్‌సిఎపి నిర్వహించిన క్రాష్ టెస్టులో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను కూడా దక్కించుకొని, భారతదేశంలో లభిస్తున్న కార్లలో అత్యంత సురక్షితమైన కారుగా నిలిచింది.

అద్భుతాలు సృష్టిస్తున్న మహీంద్రా ఎక్స్‌యూవీ300; బుకింగ్స్‌లో 90 శాతం పెరుగుదల!

పైన తెలిపినట్లుగా, మహీంద్రా ఎక్స్‌యూవీ300 భారత మార్కెట్లోని అత్యంత పోటీతో కూడుకున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, టాటా నెక్సాన్ ఫోర్డ్ ఎకోస్పోర్ట్, నిస్సాన్ మాగ్నైట్, రెనో కైగర్, టొయోటా అర్బన్ క్రూయిజర్ మరియు హోండా డబ్ల్యూఆర్-వి వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

More from DriveSpark

Article Published On: Saturday, May 29, 2021, 17:11 [IST]
English summary
Mahindra XUV300 Compact SUV Bookings Registers 90 Percent Growth In H1 FY2021, Details. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+