Mahindra XUV300 ఫేస్‌లిఫ్ట్ వస్తోంది.. ఇందులో కొత్తగా ఏమి ఉంటుందంటే..?

భారత ప్యాసింజర్ కార్ మార్కెట్లో సబ్ 4 మీటర్ ఎస్‌యూవీ విభాగం వేగంగా అభివృద్ధి చెందుతున్న సంగతి మనందరికీ తెలిసినదే. ఈ సెగ్మెంట్లోకి అనేక కొత్త ఎస్‌యూవీలు రావడంతో, కాంపాక్ట్ ఎస్‌యూవీల మధ్య పోటీ అధికమైంది. ప్రస్తుతం, భారతదేశంలో మొత్తం ప్యాసింజర్ వాహన మార్కెట్ వాటాలో ఈ (కాంపాక్ట్ ఎస్‌యూవీ) విభాగం ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని గణాంకాలు చెబుతున్నాయి.

Mahindra XUV300 ఫేస్‌లిఫ్ట్ వస్తోంది.. ఇందులో కొత్తగా ఏమి ఉంటుందంటే..?

ప్రస్తుతం ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న మోడళ్లలో మారుతి సుజుకి విటారా బ్రెజ్జా మరియు టాటా నెక్సాన్ మోడళ్లు సగటున ప్రతినెలా 10,000 అమ్మకాలను నమోదు చేస్తూ అగ్రస్థానాల్లో ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో కియా సొనెట్ మరియు హ్యుందాయ్ వెన్యూ వంటి మోడళ్లు ఉన్నాయి. ఇవి రెండూ కలిపి ప్రతినెలా సగటున 12,000-15,000 విక్రయాలను నమోదు చేస్తున్నాయి.

Mahindra XUV300 ఫేస్‌లిఫ్ట్ వస్తోంది.. ఇందులో కొత్తగా ఏమి ఉంటుందంటే..?

ఇక ఈ విభాగంలో అత్యుత్తమ (5-స్టార్) సేఫ్టీ రేటింగ్ పొందిన మహీంద్రా ఎక్స్‌యూవీ300 (Mahindra XUV300) ధరకు తగిన మంచి ప్యాకేజీని అందిస్తున్నప్పటికీ, ఈ మోడల్ అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఎక్స్‌యూవీ300 సగటున ప్రతినెలా 4,000 యూనిట్ల నుండి 5,000 యూనిట్ల మధ్య అమ్మకాలను నమోదు చేస్తోంది. ఈ సెగ్మెంట్లో మహీంద్రా ఎక్స్‌యూవీ300 అమ్మకాల పరంగా వెనుకబడి ఉన్నప్పటికీ, బ్రాండ్ లైనప్‌లో అమ్మకాల గణాంకాల పరంగా ఇది అద్భుతమైన పనితీరును కనబరుస్తోందని కంపెనీ పేర్కొంది.

Mahindra XUV300 ఫేస్‌లిఫ్ట్ వస్తోంది.. ఇందులో కొత్తగా ఏమి ఉంటుందంటే..?

ఎక్స్‌యూవీ300 మహీంద్రా ప్రోడక్ట్ లైనప్ లో ప్రస్తుతం అత్యంత ప్రాచుర్యం పొందిన మోడళ్లలో ప్రధానమైనది కాబట్టి, కంపెనీ ఇందులో కొత్త వెర్షన్‌లను విడుదల చేయాలని యోచిస్తోంది. వీటిలో ఒకటి ఎక్స్‌యూవీ300 స్పోర్టీ వెర్షన్. మహీంద్రా దీనిని గతేడాది ఆటో ఎక్స్‌పోలో కూడా ప్రదర్శించింది. అంతేకాకుండా, ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఆధారంగా కంపెనీ ఓ ఎలక్ట్రిక్ వెర్షన్‌ను కూడా లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. ఎక్స్‌యూవీ300 ఆధారిత స్పోర్ట్స్ వెర్షన్ త్వరలో లాంచ్ అవుతుందని భావించినప్పటికీ, కోవిడ్ మరియు సెమీకండక్టర్ చిప్‌ల కొరత వంటి పలు సమస్యల కారణంగా ఇది వాయిదా పడింది.

Mahindra XUV300 ఫేస్‌లిఫ్ట్ వస్తోంది.. ఇందులో కొత్తగా ఏమి ఉంటుందంటే..?

ఇదిలా ఉంటే, తాజా నివేదిక ప్రకారం, మహీంద్రా తమ పాపులర్ ఎక్స్‌యూవీ300 మోడల్ లో ఇప్పుడు ఓ కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విభాగంలోకి కొత్తగా ప్రవేశించిన మోడళ్ల కారణంగా పెరుగుతున్న పోటీని సమర్థవంతంగా ఎదుర్కునేందుకు కంపెనీ ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్ ను ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ కి అనుగుణంగా అప్‌గ్రేడ్ చేయనుంది. ఈ అప్‌గ్రేడ్స్ బ్రాండ్ అమ్మకాలను నిలబెట్టుకోవడానికి సహాయపడుతుందని కంపెనీ భావిస్తోంది.

Mahindra XUV300 ఫేస్‌లిఫ్ట్ వస్తోంది.. ఇందులో కొత్తగా ఏమి ఉంటుందంటే..?

మహీంద్రా ఎక్స్‌యూవీ300 మోడల్ లో ఇది మిడ్-సైకిల్ ఫేస్‌లిఫ్ట్ కాబట్టి దాని డిజైన్ లేదా ఫీచర్లలో పెద్ద మార్పులేమీ ఉండకపోవచ్చు. అయితే, కొన్ని రకాల కాస్మెటిక్ అప్‌గ్రేడ్ లను మాత్రం ఇందులో ఆశించవచ్చు. ఈ కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్ ఉండబోయే ప్రధానమైన మార్పు దాని ముందు మరియు వెనుక వైపున మహీంద్రా యొక్క కొత్త ట్విన్ పీక్స్ లోగో ఉండే అవకాశం ఉంటుంది. మహీంద్రా ఈ కొత్త లోగో ను తొలిసారిగా తమ ఎక్స్‌యూవీ700 మోడల్ పై ఉపయోగించింది. ఆ తర్వాత ఇది ఎక్స్‌యూవీ300 పై కనిపించే అవకాశం ఉంది.

Mahindra XUV300 ఫేస్‌లిఫ్ట్ వస్తోంది.. ఇందులో కొత్తగా ఏమి ఉంటుందంటే..?

కొత్త 2022 మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఫేస్‌లిఫ్ట్‌లో చూడబోయే ఇతర అప్‌గ్రేడ్‌లలో రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ గ్రిల్ మరియు రీడిజైన్ చేసిన కొత్త ఫ్రంట్ అండ్ రియర్ బంపర్‌లు, కొత్త 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్ డిజైన్‌, సవరించిన హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్ ల్యాంప్‌లు మరియు కొత్త ఎక్స్టీరియర్ కలర్ ఆప్షన్లు ఉండొచ్చని అంచనా. అలాగే, ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్ యొక్క క్యాబిన్ లోపల కొత్త డాష్‌బోర్డ్ లేఅవుట్ మరియు కొత్త ఫ్యాబ్రిక్ అప్‌హోలెస్ట్రీని ఇందులో చూసే అవకాశం ఉంది. అలాగే, సెంటర్ కన్సోల్ లో కూడా మరింత ప్రీమియం మెటీరియల్స్ ను ఉపయోగించే అవకాశం ఉంది.

Mahindra XUV300 ఫేస్‌లిఫ్ట్ వస్తోంది.. ఇందులో కొత్తగా ఏమి ఉంటుందంటే..?

ఇతర అప్‌డేట్స్‌లో భాగంగా సింగిల్-లేయర్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేతో కూడిన 7.0 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, లేటెస్ట్ కార్ కనెక్టింగ్ టెక్నాలజీ మరియు రెయిన్ సెన్సింగ్ వైపర్‌లు మొదలైనవి ఉండనున్నాయి. ఇక సేఫ్టీ విషయానికి వస్తే, ప్రస్తుత మోడల్ లో లభిస్తున్న మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు, కార్నర్ బ్రేకింగ్ కంట్రోల్ ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు మొదలైనవి యధావిధిగా లభ్యం కానున్నాయి.

Mahindra XUV300 ఫేస్‌లిఫ్ట్ వస్తోంది.. ఇందులో కొత్తగా ఏమి ఉంటుందంటే..?

కొత్త ఎక్స్‌యూవీ300 ఫేస్‌లిఫ్ట్ మోడల్ లో అత్యంత ముఖ్యమైన అప్‌డేట్ దాని ఇంజన్ రూపంలో ఉండవచ్చని భావిస్తున్నారు. ఇందులో మరింత శక్తివంతమైన 1.2-లీటర్ త్రీ సిలిండర్ ఎమ్‌స్టాలియన్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ను ఉపయోగించే అవకాశం ఉంది. ఈ ఇంజన్ గరిష్టంగా 130 బిహెచ్‌పి పవర్ ను మరియు 230 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది స్టాండర్డ్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఈ కొత్త మోడల్ వచ్చే ఏడాది మధ్య భాగం నాటికి విడుదల కావచ్చని అంచనా. లేటెస్ట్ ఆటోమొబైల్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ వెబ్‌సైట్‌ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Mahindra xuv300 facelift under works launch expected next year details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X