Mahindra XUV500 డిస్‌కంటిన్యూ, ఉత్పత్తి బంద్; దాని స్థానాన్ని రీప్లేస్ చేయనున్న XUV700!

మహీంద్రా అభిమానులకు ఓ గుడ్ న్యూస్ మరొక బ్యాడ్ న్యూస్. ముందుగా బ్యాడ్ న్యూస్ ఏంటంటే, ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra And Mahindra) భారత మార్కెట్లో విక్రయిస్తున్న పాపులర్ 7-సీటర్ ఎస్‌యూవీ 'ఎక్స్‌యూవీ500' (XUV500) ని డిస్‌కంటిన్యూ చేసింది. ప్రస్తుతం, కంపెనీ ఈ ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ 7-సీటర్ ఎస్‌యూవీ స్థానాన్ని ఇటీవలే ప్రవేశపెట్టిన ఎక్స్‌యూవీ700 (XUV700) భర్తీ చేస్తుంది.

Mahindra XUV500 డిస్‌కంటిన్యూ, ఉత్పత్తి బంద్; దాని స్థానాన్ని రీప్లేస్ చేయనున్న XUV700!

ఇక గుడ్ న్యూస్ ఏంటంటే, మహీంద్రా తమ ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీని శాస్వతంగా డిస్‌కంటిన్యూ చేయడం లేదు. ప్రస్తుతం, మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో కంపెనీ ఈ పాపులర్ ఎస్‌యూవీని తిరిగి 5-సీటర్ రూపంలో ఈ విభాగంలో ప్రవేశపెట్టనుంది. అయితే, దానికి అనుగుణంగా ఈ ఎస్‌యూవీ డిజైన్, ఫీచర్లు మరియు ఇంటీరియర్లలో మార్పులు చేసే అవకాశం ఉంది. ఇంజన్ మరియు గేర్‌బాక్స్ ఆప్షన్లలో కూడా మార్పులు ఉండొచ్చని అంచనా.

Mahindra XUV500 డిస్‌కంటిన్యూ, ఉత్పత్తి బంద్; దాని స్థానాన్ని రీప్లేస్ చేయనున్న XUV700!

మహీంద్రా ఇటీవలే విడుదల చేసిన ఎక్స్‌యూవీ700 మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడుపోతోంది. అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ఏడిఏఎస్) ఫీచర్లతో ప్రవేశపెట్టబడిన ఈ కారుకు కస్టమర్ల నుండి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ ఎస్‌యూవీ కోసం బుకింగ్స్ ఓపెన్ చేసిన మొదటి రెండు రోజుల్లో 50,000 యూనిట్లకు పైగా ఆర్డర్లు వచ్చినట్లు కంపెనీ తెలిపింది. ఇప్పుడు ఈ ఎస్‌యూవీ కోసం సుమారు 70,000 యూనిట్లకు పైగా పెండింగ్ బుకింగ్‌లు ఉన్నట్లు సమాచారం.

Mahindra XUV500 డిస్‌కంటిన్యూ, ఉత్పత్తి బంద్; దాని స్థానాన్ని రీప్లేస్ చేయనున్న XUV700!

మహీంద్రా ఎక్స్‌యూవీ700 కి పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో, ఎక్స్‌యూవీ500 మోడల్ పాతబడిపోయింది. దీంతో కంపెనీ ఈ ప్రీమియం ఎస్‌యూవీ గుడ్‌బై చెప్పి, సరసమైన ధరకే దీనిని తిరిగి 5-సీటర్ మోడల్ మాదిరిగా రిఫ్రెష్డ్ డిజైన్ మరియు ఫీచర్లతో ప్రవేశపెట్టాలని నిర్ణయించుకుంది. ఇది ఈ విభాగంలో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, ఎమ్‌జి హెక్టర్ మరియు టాటా హారియర్ వంటి మిడ్-సైజ్ ఎస్‌యూవీలకు పోటీగా నిలుస్తుంది.

Mahindra XUV500 డిస్‌కంటిన్యూ, ఉత్పత్తి బంద్; దాని స్థానాన్ని రీప్లేస్ చేయనున్న XUV700!

వచ్చే ఐదేళ్లలో (2026 నాటికి) మహీంద్రా భారత మార్కెట్లో 9 కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టాలని ప్లాన్ చేస్తోంది. ఈ ప్లాన్ లో భాగంగానే కొత్త మిడ్-సైజ్ ఎక్స్‌యూవీ500 కూడా ఉంటుందని భావిస్తున్నారు. మహీంద్రా ఎక్స్‌యూవీ700 తో ప్రస్తుత ఎక్స్‌యూవీ500 ని పోల్చి చూసినప్పుడు పరిమాణంలో ఇది చిన్నదిగా అనిపిస్తుంది. దీని డిజైన్ కూడా ప్రస్తుత ఎక్స్‌యూవీ500 డిజైన్‌కి అప్‌గ్రేడ్‌ వెర్షన్ లా ఉంటుంది. అయితే, ఈ రెండు మోడళ్ల బాహ్య స్టైలింగ్ కొంతవరకు సమానంగా ఉన్నట్లు అనిపిస్తుంది.

Mahindra XUV500 డిస్‌కంటిన్యూ, ఉత్పత్తి బంద్; దాని స్థానాన్ని రీప్లేస్ చేయనున్న XUV700!

డిస్‌కంటిన్యూ అయిన మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఇంటీరియర్ కూడా డిజైన్ పరంగా ఖచ్చితంగా పాతదిగానే అనిపిస్తుంది. ఇది సాంప్రదాయ డాష్‌బోర్డ్ లేఅవుట్‌ను కలిగి ఉంటుంది. ఇందులోని సెంటర్ కన్సోల్‌లో 7-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు స్టీరింగ్ వెనుక సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లు ఉన్నాయి. ఎక్స్‌యూవీ500 లో లభించే ఫీచర్లను ఎక్స్‌యూవీ700 తో పోల్చినప్పుడు ఇది చాలా వెనుకబడి ఉన్నట్లుగా అనిపిస్తుంది.

Mahindra XUV500 డిస్‌కంటిన్యూ, ఉత్పత్తి బంద్; దాని స్థానాన్ని రీప్లేస్ చేయనున్న XUV700!

ఎక్స్‌యూవీ500 లో మహీంద్రా బ్లూ సెన్స్ కనెక్టింగ్ టెక్నాలజీ, స్మార్ట్ వాచ్ కనెక్టివిటీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఆల్-పవర్ విండోస్, పవర్-ఆపరేటెడ్ సైడ్ మిర్రర్‌లు, సరౌండ్ డిస్క్ బ్రేకులు మరియు ఆరు ఎయిర్ బ్యాగ్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. మహీంద్రా ఎక్స్‌యూవీ500లో ఒకే ఒక ఇంజన్ ఆప్షన్ ఉంటుంది. ఇందులోని 2.2-లీటర్ ఎమ్‌హాక్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 153 బిహెచ్‌పి పవర్‌ను మరియు 360 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది.

Mahindra XUV500 డిస్‌కంటిన్యూ, ఉత్పత్తి బంద్; దాని స్థానాన్ని రీప్లేస్ చేయనున్న XUV700!

ధర పరంగా పోల్చి చూస్తే, మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీని ప్రస్తుతం రూ. 15.56 లక్షల నుంచి రూ. 20.07 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో విక్రయిస్తున్నారు. కాగా, మహీంద్రా తమ ఎక్స్‌యూవీ700 ని కేవలం రూ. 11.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకే విడుదల చేసింది. దీంతో కస్టమర్లు ఇప్పుడు ఎక్స్‌యూవీ500 ని వదలి ఎక్స్‌యూవీ700 వైపు పరుగులు తీస్తున్నారు. కాగా, భవిష్యత్తులో మహీంద్రా నుండి కొత్తగా రాబోయే 5-సీటర్ వెర్షన్ మహీంద్రా ఎక్స్‌యూవీ500 మిడ్-సైజ్ ఎస్‌యూవీ ఈ విభాగంలోని ఇతర మోడళ్లకు పోటీగా రూ. 10.50 లక్షల నుండి రూ. 17.50 లక్షల మధ్యలో ధరను కలిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

Mahindra XUV500 డిస్‌కంటిన్యూ, ఉత్పత్తి బంద్; దాని స్థానాన్ని రీప్లేస్ చేయనున్న XUV700!

Mahindra XUV700 కీలక ఫీచర్లు..

మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీ విషయానికి వస్తే, కంపెనీ ఈ ఎస్‌యూవీని అనేక ఆధునిక ఫీచర్లు మరియు అధునాతన డిజైన్‌తో అందిస్తోంది. ఈ ఎస్‌యూవీలోని డ్యాష్‌బోర్డుపై మెర్సిడెస్ బెంజ్ నుండి స్పూర్తి పొంది రూపొందించిన డ్యూయల్-డిస్‌ప్లే సెటప్ ఉంటుంది. ఇందులో ఒక డిస్‌ప్లే స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కోసం మరియు మరొక డిస్‌ప్లే స్క్రీన్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ కోసం ఉపయోగించబడుతుంది.

Mahindra XUV500 డిస్‌కంటిన్యూ, ఉత్పత్తి బంద్; దాని స్థానాన్ని రీప్లేస్ చేయనున్న XUV700!

ఇంకా ఇందులో వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, కీలెస్ ఎంట్రీ, పుష్ స్టార్ట్ / స్టాప్ బటన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుంటా, ఇందులో కొన్ని సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లు లభిస్తున్నాయి. వీటిలో ఆటో బూస్టర్ హెడ్‌ల్యాంప్‌లు, స్మార్ట్ డోర్ హ్యాండిల్స్, పెద్ద పానోరమిక్ సన్‌రూఫ్ (స్కైరూఫ్), పర్సనల్ అలర్ట్స్ మరియు డ్రైవర్ డ్రౌజీనెస్ అలర్ట్ సిస్టమ్ మొదలైనవి ఉన్నాయి.

Mahindra XUV500 డిస్‌కంటిన్యూ, ఉత్పత్తి బంద్; దాని స్థానాన్ని రీప్లేస్ చేయనున్న XUV700!

ఈ కారులో ఆఫర్ చేస్తున్న అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ఏడిఏఎస్) ఫీచర్లలో భాగంగా, ఈ కారులో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, అటానమస్ బ్రేకింగ్ మరియు లేన్-లీప్ అసిస్ట్ వంటి మరెన్నో ఫీచర్లు ఉన్నాయి. ఇంకా ఇందులో బ్లైండ్ వ్యూ మానిటర్, కంటిన్యూస్ డిజిటల్ వీడియో రికార్డింగ్,, 360 డిగ్రీ కెమెరా, మోకాలి ఎయిర్‌బ్యాగ్, పాసివ్ కీలెస్ ఎంట్రీ, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ మరియు టెలిస్కోపిక్ అడ్జస్టబల్ స్టీరింగ్ మొదలైనవి ఉన్నాయి.

Most Read Articles

English summary
Mahindra xuv500 discontinued in india production stopped details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X