మహీంద్రా ఎక్స్‌యూవీ700 విడుదల తర్వాత ఎక్స్‌యూవీ500 డిస్‌కంటిన్యూ

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా 'XUV700' (ఎక్స్‌యూవీ సెవన్ డబుల్ ఓ) అనే ఓ సరికొత్త మోడల్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసినదే. ఈ సరికొత్త ఎస్‌యూవీ సెప్టెంబర్ 2021 నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ700 విడుదల తర్వాత ఎక్స్‌యూవీ500 డిస్‌కంటిన్యూ

మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీని మార్కెట్లో విడుదల చేసిన కొంతకాలం తర్వాత కంపెనీ తమ ఎక్స్‌యూవీ500 మోడల్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తామని తెలిసింది. ఇటీవల, ట్విట్టర్‌లో ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కంపెనీ ఈ సమాచారం ఇచ్చింది.

మహీంద్రా ఎక్స్‌యూవీ700 విడుదల తర్వాత ఎక్స్‌యూవీ500 డిస్‌కంటిన్యూ

మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీని కంపెనీ తమ ప్రోడక్ట్ లైనప్‌లో ఎక్స్‌యూవీ500 మోడల్‌కి ఎగువన ఉంచనుంది. ఇది మహీంద్రా నుండి కొత్త ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా రానుంది. మహీంద్రా ఎక్స్‌యూవీ700 మోడల్‌ని మార్కెట్లో విడుదల చేసిన తర్వాత, కంపెనీ తమ ఎక్స్‌యూవీ500ను తాత్కాలికంగా నిలిపివేసి, ఆ తర్వాతి కాలంలో ఇందులో సరికొత్త తరం మోడల్‌ను ప్రవేశపెట్టవచ్చని అంచనా.

MOST READ:ఫేస్ మాస్క్ లేనందుకు గవర్నమెంట్ బస్ డ్రైవర్‌కు జరిమానా; పూర్తి వివరాలు

మహీంద్రా ఎక్స్‌యూవీ700 విడుదల తర్వాత ఎక్స్‌యూవీ500 డిస్‌కంటిన్యూ

మహీంద్రా ఎక్స్‌యూవీ700 మోడల్‌ను ఏడు సీట్లతో ఆఫర్ చేయనున్నారు. ఇందులో మధ్య వరుసలో కెప్టెన్ సీట్లతో 6-సీట్ల మోడల్‌ను మరియు మధ్య వరుసలో బెంచ్ సీట్‌తో 7-సీట్ల మోడల్‌ను ప్రవేశపెట్టనున్నారు. కొత్త తరం ఎక్స్‌యూవీ500 మోడల్‌ను ఎక్స్‌యూవీ700 ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని 5-సీటర్ వెర్షన్‌గా విడుదల చేసే అవకాశం ఉంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ700 విడుదల తర్వాత ఎక్స్‌యూవీ500 డిస్‌కంటిన్యూ

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఎక్స్‌యూవీ500తో పోల్చితే, కొత్తగా రానున్న కొత్త తరం 2022 మహీంద్రా ఎక్స్‌యూవీ500 మోడల్ ధర మరింత చౌకగా ఉంటుందని భావిస్తున్నారు. కొత్త తరం మహీంద్రా ఎక్స్‌యూవీ500 మోడల్‌ను కొత్తగా వస్తున్న ఎక్స్‌యూవీ700 ప్లాట్‌ఫామ్ ఆధారంగానే తయారు చేయనున్నప్పటికీ, కంపెనీ ఈ రెండు మోడళ్లను ఒకేసారి మార్కెట్లో విడుదల చేసే అవకాశం లేదు.

MOST READ:మొబైల్ చూస్తూ వెళ్తున్నందుకు మొహం పచ్చడైంది.. ఎలా అనుకుంటున్నారా?

మహీంద్రా ఎక్స్‌యూవీ700 విడుదల తర్వాత ఎక్స్‌యూవీ500 డిస్‌కంటిన్యూ

ఇందుకు ప్రధాన కారణం, కోవిడ్-19 పరిస్థితుల కారణంగా ఇతర ఆటోమొబైల్ కంపెనీల మాదిరిగానే మహీంద్రా కూడా విడిభాగాల కొరతను ఎదుర్కోవడమే. ఈ సమస్యతో మహీంద్రా ఇప్పటికే తమ కొత్త తరం థార్ ఎస్‌యూవీ ఉత్పత్తిలో తీవ్ర అంతరాయాన్ని చూస్తోంది. ఇప్పుడు ఈ మోడల్ కోసం సుమారు 10 నెలల వరకూ వెయిటింగ్ పీరియడ్ ఉంటోంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ700 విడుదల తర్వాత ఎక్స్‌యూవీ500 డిస్‌కంటిన్యూ

ఈ పరిస్థితుల నేపథ్యంలో, మహీంద్రా ఈ రెండు మోడళ్లను (ఎక్స్‌యూవీ700 మరియు ఎక్స్‌యూవీ500) కలిపి ఒకేసారి విడుదల చేసే అవకాశం లేదు. ఇక మహీంద్రా ఎక్స్‌యూవీ700 విషయానికి వస్తే, కంపెనీ ఈ మోడల్‌ను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సాటిలేని పనితీరు మరియు ఫస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్లతో మార్కెట్లో ప్రవేశపెట్టనుంది.

MOST READ:సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న వీడియో.. ఇంతకీ ఇందులో ఏముంది

మహీంద్రా ఎక్స్‌యూవీ700 విడుదల తర్వాత ఎక్స్‌యూవీ500 డిస్‌కంటిన్యూ

కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ700 మోడల్‌ను ప్రపంచ స్థాయి సేఫ్టీ ఫీచర్లతో విడుదల చేస్తామని కంపెనీ ప్రకటించింది. ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్లతో, మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా, కంపెనీ ఇందులో ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్‌ను కూడా ప్రవేశపెట్టనుంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ700 విడుదల తర్వాత ఎక్స్‌యూవీ500 డిస్‌కంటిన్యూ

ఈ కొత్త ఎస్‌యూవీని మహారాష్ట్రలోని చాకన్‌లో ఉన్న మహీంద్రా ప్లాంట్‌లో ఉత్పత్తి చేయనున్నారు. ఈ మోడల్‌ను పూర్తిగా కొత్త ప్లాట్‌ఫామ్ అయిన 'డబ్ల్యూ601'పై నిర్మించనున్నారు. లేటేస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

MOST READ:సైకిల్ దొంగిలించిన బాలుడికి షాకింగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన పోలీసులు!

Most Read Articles

English summary
Mahindra XUV500 To Be Discontinued Temporarily After Launching XUV700. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X