XUV700 యాక్ససరీస్ వెల్లడించిన Mahindra: వివరాలు

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రసిద్ధిచెందిన వాహన తయారీ సంస్థ Mahindra & Mahindra దేశీయ మార్కెట్లో త్వరలో తన కొత్త SUV అయిన XUV700 విడుదల చేయనుంది. కొత్త Mahindra XUV700 యొక్క ఉత్పత్తి ఇప్పటికే ప్రారంభమయ్యింది. అంతే కాకుండా ఈ కొత్త SUV కి సంబంధించిన చాలా సమాచారాన్ని కంపెనీ ఇప్పటికే వెల్లడించింది. ఇందులో భాగంగానే కంపెనీ XUV700 యొక్క కలర్ ఆప్సన్స్ కూడా వెల్లడించింది. Mahindra కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, కొత్త XUV700 రెడ్, సిల్వర్, బ్లాక్, బ్లూ మరియు వైట్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉండనుంది.

అయితే ఇప్పుడు కంపెనీ ఈ కొత్త SUV యొక్క యాక్ససరీస్ వెల్లడించింది. XUV700 యాక్ససరీస్ గురించి పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.. రండి.

XUV700 యాక్ససరీస్ వెల్లడించిన Mahindra: వివరాలు

XUV700 యొక్క యాక్ససరీస్ దీనిని మరింత స్పోర్టీగా మరియు చాలా ఆకర్షణీయంగా చేస్తాయి. కంపెనీ వెల్లడించిన ఈ యాక్ససరీస్ ఇంటీరియర్ మరియు ఎక్స్టీరియర్ అని రెండు అందుబాటులో ఉంటాయి.

XUV700 యాక్ససరీస్ వెల్లడించిన Mahindra: వివరాలు

XUV700 ఎక్స్టీరియర్ యాక్ససరీస్:

కొత్త Mahindra XUV700 కొనుగోలు చేసిన తరువాత మీరు క్రోమ్ ఎలిమెంట్‌లను మరింత అద్భుతంగా పోనాలనుకుంటే, 'శాటిన్ క్రోమ్ కిట్' పొందవచ్చు. ఈ కిట్ లో గ్రిల్ అప్పర్ అప్లిక్, ఫ్రంట్ బంపర్ లోయర్ మరియు అప్పర్ అప్లిక్, ORVM అప్లిక్, బాడీసైడ్ మౌల్డింగ్, వీల్ ఆర్చ్ క్రోమ్ మరియు రియర్ బంపర్ ఆప్లిక్ వంటివి ఉన్నాయి.

XUV700 యాక్ససరీస్ వెల్లడించిన Mahindra: వివరాలు

దీనితో పాటు మీరు రూప్ బార్ సెట్ కూడా ఎంచుకోవచ్చు. ఇందులో సైడ్‌స్టెప్ సెట్, ఇంటిగ్రేటెడ్ రూఫ్ క్యారియర్, ఇంటిగ్రేటెడ్ రూఫ్ క్యారియర్, రూఫ్ బార్ సెట్ మరియు రియర్ బంపర్ ప్రొటెక్టర్ ఉన్నాయి. వీటితో పాటు దీనికి 17 ఇంచెస్ గ్రే, 17 ఇంచెస్ బ్లాక్ మరియు 18 ఇంచెస్ గ్రే అనే మూడు అల్లాయ్ వీల్ డిజైన్‌ఆప్సన్స్ కూడా అందుబాటులో ఉంటాయి.

XUV700 యాక్ససరీస్ వెల్లడించిన Mahindra: వివరాలు

ఇవన్నీ కూడా మహీంద్రా XUV700 యొక్క ఆకర్షణను మరింత పెంచడంలో తోడ్పడతాయి. వాహన వినియోగారులు మరింత ఆకర్షణీయమైన Mahindra XUV700 పొందాలనుకుంటే ఈ XUV700 ఎక్స్టీరియర్ యాక్ససరీస్ ఎంచుకోవచ్చు. వీటి ధరలు ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు, త్వరలో కంపెనీ వెల్లడిస్తుంది.

XUV700 యాక్ససరీస్ వెల్లడించిన Mahindra: వివరాలు

XUV700 ఇంటీరియర్ యాక్ససరీస్:

ఇక Mahindra XUV700 యొక్క ఇంటీరియర్ యాక్ససరీస్ విషయానికి వస్తే, ఇందులో యాంటీ-థెఫ్ట్ బోల్ట్ మరియు బోల్ట్-కీ అనేవి ఉన్నాయి. బేస్ వేరియంట్ యాక్సెసరీస్ ప్యాకేజీలో వీల్ కవర్‌లను ఎంచుకోవచ్చు. ఇవి వాహనం యొక్క ఆకర్షణను మరింత పెంచడంలో తోడ్పడతాయి.

XUV700 యాక్ససరీస్ వెల్లడించిన Mahindra: వివరాలు

వినియోగదారులు XUV700 కోసం సిల్వర్, స్పోర్టీ మరియు ప్రీమియం అనే మూడు రకాల బాడీ కవర్లను ఎంచుకోవచ్చు. అంతే కాకుండా దీని కోసం వివిధ రకాల సీట్ కవర్లను ఈ ఇంటీరియర్ యాక్ససరీస్ ప్యాకేజీలో పొందవచ్చు. కంపెనీ దీని కోసం మూడు సీట్ కవర్ డిజైన్లను అందిస్తుంది. ఇందులో పెర్ఫొరేటెడ్, డెకో స్టిచ్ మరియు ఎంబోస్డ్ వంటివి వున్నాయి.

XUV700 యాక్ససరీస్ వెల్లడించిన Mahindra: వివరాలు

XUV700 యొక్క ప్రతి సీట్ కవర్ ఎంపికతో పాటు అడిషినల్ కంఫర్ట్ కిట్ ఎంచుకోవచ్చు. ఇందులో నెక్ పిల్లో, సీట్ కుషన్, స్టీరింగ్ వీల్ కవర్ మరియు గేర్ లివర్ కవర్ ఉన్నాయి. అంతే కాకుండా ఇందులో ఫ్లోర్ మ్యాట్స్, కార్పెట్ మ్యాట్స్ మరియు బూట్ మ్యాట్స్ కూడా ఉన్నాయి.

XUV700 యాక్ససరీస్ వెల్లడించిన Mahindra: వివరాలు

కస్టమర్లు ఇల్యూమినేటెడ్ స్కఫ్ ప్లేట్స్ మరియు స్క్ఫ్ ప్లేట్ గార్డ్స్ నుండి కూడా ఎంచుకోవచ్చు. కంపెనీ దీని కోసం రెండు సెట్ల పెడల్ కవర్లను కూడా అందిస్తోంది. XUV700 యొక్క బేస్ వేరియంట్ మిడ్-స్పెక్ వేరియంట్‌లో అందుబాటులో ఉన్న ఆప్సనల్ ఫాగ్ ల్యాంప్‌లతో అందించబడుతుంది.

XUV700 యాక్ససరీస్ వెల్లడించిన Mahindra: వివరాలు

వీటితో పాటు కంపెనీ రివర్స్ పార్కింగ్ కెమెరా, షార్క్ ఫిన్ యాంటెన్నా, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్ కిట్, లోగో ప్రొజెక్టర్ లాంప్ సెట్, వైర్‌లెస్ ఛార్జర్ మరియు సన్‌షేడ్ వంటి మరిన్ని ఎంపికలను అందిస్తుంది.

XUV700 యాక్ససరీస్ వెల్లడించిన Mahindra: వివరాలు

కంపెనీ అందించే ఈ యాక్ససరీస్ Mahindra XUV700 మరింత అధునాతనంగా కనిపిస్తుంది. కావున ఆసక్తిగల కొనుగోలుదారులు ఈ యాక్ససరీస్ ప్యాకేజీలను ఎంచుకోవచ్చు.

XUV700 యాక్ససరీస్ వెల్లడించిన Mahindra: వివరాలు

XUV700 ఫీచర్స్:

Mahindra XUV700 SUV లోని ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంది. సౌండ్ కోసం సోనీ సౌండ్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేయబడింది. దీనితో పాటు, ఆండ్రాయిడ్ మరియు ఆపిల్ కార్‌ప్లే, ఇ-సిమ్ ఆధారిత కనెక్ట్ చేయబడిన టెక్నాలజీ, వాయిస్ అసిస్టెంట్, యాంబియంట్ లైటింగ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఎయిర్ ప్యూరిఫయర్ వంటివి ఉన్నాయి. ఐతే కాకూండా Mahindra XUV700 లో ఈ అడ్వాన్స్ డ్రైవర్ అసిస్టెడ్ సిస్టమ్ కూడా అందుబాటులో ఉంటుంది.

XUV700 యాక్ససరీస్ వెల్లడించిన Mahindra: వివరాలు

XUV700 సేఫ్టీ ఫీచర్స్:

Mahindra XUV700 లోఐ సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 7 ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్ విత్ ఇబిడి, ఎలక్ట్రానిక్ లాకింగ్ డిఫరెన్షియల్, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్ మరియు ఆటో హెడ్‌లైట్ బూస్టర్ వంటివి ఉన్నాయి.

XUV700 యాక్ససరీస్ వెల్లడించిన Mahindra: వివరాలు

XUV700 ఇంజిన్:

Mahindra XUV700 లో మల్టిఫుల్ ఇంజిన్ మరియు గేర్‌బాక్స్ ఆప్సన్స్ కలిగి ఉంటాయి. ఇందులో ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ కూడా ఇవ్వబడింది. ఇందులో 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ మరియు 2.2-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ ఆప్సన్స్ కలిగి ఉంటుంది.

XUV700 యాక్ససరీస్ వెల్లడించిన Mahindra: వివరాలు

ఇందులోని 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ విషయానికి వస్తే 198 బిహెచ్‌పి పవర్ మరియు 300 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలను కలిగి ఉంటుంది. ఇది కేవలం 5 సెకన్లలో గంటకు 0 నుంచి 60 కిమీ వరకు వేగవంతమవుతుంది.

XUV700 యాక్ససరీస్ వెల్లడించిన Mahindra: వివరాలు

ఇక రెండవ ఇంజిన్ 2.2-లీటర్ టర్బో డీజిల్ విషయానికి వస్తే, ఇది 183 బిహెచ్‌పి పవర్ మరియు 420 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది కూడా 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలను కలిగి ఉంటుంది. Mahindra XUV700 నాలుగు డ్రైవింగ్ మోడ్స్ కలిగి ఉంటుంది. అవి జిప్, జామ్, జూమ్ మరియు కస్టమ్ డ్రైవింగ్ మోడ్స్.

More from DriveSpark

Article Published On: Monday, September 27, 2021, 11:48 [IST]
English summary
Mahindra xuv700 accessories details revealed ahead of launch details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+