XUV700 లో వేరియంట్ల వారీగా లభించే ఫీచర్లు

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra and Mahindra) గడచిన ఆగస్ట్ నెలలో ఆవిష్కరించిన తమ సరికొత్త ఎస్‌యూవీ మహీంద్రా ఎక్స్‌యూవీ700 (Mahindra XUV700) కోసం కంపెనీ ఇప్పుడు బుకింగ్ లను స్వీకరించడం ప్రారంభించింది. ఆరంభంలో కంపెనీ ఇందులో నాలుగు వేరియంట్ల వివరాలను మాత్రమే వెల్లడి చేసింది. కాగా, ఇప్పుడు మరిన్ని ఇతర వేరియంట్ల వివరాలు, వాటి ధరలు మరియు అందులో లభించే లభించే ఫీచర్లను వెల్లడి చేసింది.

XUV700 లో వేరియంట్ల వారీగా లభించే ఫీచర్లు

మహీంద్రా ఎక్స్‌యూవీ700 కోసం అక్టోబర్ 7, 2021వ తేదీ నుండి బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ కారు యొక్క వేరియంట్లు మరియు ధరలను కంపెనీ గత వారం వెల్లడించింది. కస్టమర్ల డిమాండ్ ఆధారంగా కంపెనీ ఇందులో రెండు కొత్త వేరియంట్‌లను కూడా ప్రవేశపెట్టింది. ఈ ఎస్‌యూవీ రెడ్ రేజ్, మిడ్‌నైట్ బ్లాక్, ఎవరెస్ట్ వైట్, డాజిలింగ్ సిల్వర్ మరియు ఎలక్ట్రిక్ బ్లూ అనే ఐదు కలర్ ఆప్షన్లలో లభ్యం కానుంది.

XUV700 లో వేరియంట్ల వారీగా లభించే ఫీచర్లు

ఎక్స్‌యూవీ700 (సెవన్ డబుల్ ఓ అని పలకాలి) ఎస్‌యూవీ మొత్తం నాలుగు ట్రిమ్ ఆప్షన్లలో ప్రవేశపెట్టబడింది. ఇందులో MX, AX3, AX5 మరియు AX7 ట్రిమ్‌లు ఉన్నాయి. వీటితో పాటుగా, టాప్-ఎండ్ వెర్షన్ కోసం ఆప్షనల్ లగ్జరీ ప్యాక్ లను కూడా కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. మరి ఈ ఎస్‌యూవీ యొక్క ఏయే వేరియంట్‌లో ఏయే ఫీచర్లు అందుబాటులో ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

XUV700 లో వేరియంట్ల వారీగా లభించే ఫీచర్లు

Mahindra XUV700 MX

ఈ ట్రిమ్ 5-సీటర్ డీజిల్ మాన్యువల్ మరియు 5-సీటర్ పెట్రోల్ మాన్యువల్ వేరియంట్లలో మాత్రమే లభిస్తుంది. వీటిలో లభించే ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి:

 • 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
 • 7 ఇంచ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్
 • ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ
 • స్మార్ట్ డోర్ హ్యాండిల్
 • మొదటి మరియు రెండవ వరుస సీట్ల వద్ద యూఎస్‌బి టైప్-సి పోర్ట్స్
 • టిల్ట్ అడ్జస్టబల్ స్టీరింగ్ వీల్
 • స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్
 • స్టోరేజ్‌తో కూడిన ఫ్రంట్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్
 • ఫాలో-మీ-హోమ్ హెడ్‌ల్యాంప్‌లు
 • నాలుగు స్పీకర్లు
 • ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ సైడ్ మిర్రర్స్
 • ఎల్ఈడి టెయిల్ లైట్లు
 • XUV700 లో వేరియంట్ల వారీగా లభించే ఫీచర్లు

  Mahindra XUV700 AX3

  ఈ ట్రిమ్ 5-సీటర్ డీజిల్ మ్యాన్యువల్, 7-సీటర్ డీజిల్ మ్యాన్యువల్, 5-సీటర్ డీజిల్ ఆటోమేటిక్, 5-సీటర్ పెట్రోల్ మ్యాన్యువల్ మరియు 5-సీటర్ పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్లలో లభిస్తుంది. వీటిలో లభించే ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి:

  • రెండు పెద్ద 10.25 ఇంచ్ స్క్రీన్‌లు (ఒకటి ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కోసం, మరొకటి ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ కోసం)
  • వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో
  • AdrenoX ఒక సంవత్సరం కాంప్లిమెంటరీ ఉచిత సబ్‌స్క్రిప్షన్ మరియు అలెక్సా కనెక్టివిటీతో పాటుగా
  • ఆరు స్పీకర్లు
  • మూడవ వరుసలోని ప్రయాణీకుల కోసం ఏసి వెంట్స్
  • వ్యక్తిగతీకరించిన భద్రతా హెచ్చరికలు (పర్సనలైజ్డ్ సేఫ్టీ అలెర్ట్స్)
  • ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు
  • ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్
  • రెండవ వరుసలో ఆర్మ్ రెస్ట్‌ విత్ కప్ హోల్డర్స్
  • XUV700 లో వేరియంట్ల వారీగా లభించే ఫీచర్లు

   Mahindra XUV700 AX5

   ఈ ట్రిమ్ 5-సీటర్ డీజిల్ మ్యాన్యువల్, 7-సీటర్ డీజిల్ మ్యాన్యువల్, 5-సీటర్ డీజిల్ ఆటోమేటిక్, 7-సీటర్ డీజిల్ ఆటోమేటిక్, 5-సీటర్ పెట్రోల్ మ్యాన్యువల్, 7-సీటర్ పెట్రోల్ మ్యాన్యులల్ మరియు 5-సీటర్ పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్లలో లభిస్తుంది. వీటిలో లభించే ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి:

   • 17 ఇంచ్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్
   • పానోరమిక్ సన్‌రూఫ్/స్కై రూఫ్
   • ఆటో-బూస్టర్ ఫంక్షన్‌తో ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు
   • ESP (ఎలక్ట్రానికి స్టెబిలిటీ ప్రోగ్రామ్)
   • మూడు వరుసలోని ప్రయాణీకుల కోసం కర్టెన్ ఎయిర్‌బ్యాగులు
   • ఎల్ఈడి సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్

    కార్నర్ లైట్

   • డ్రైవ్ మోడ్స్ (డీజిల్ వేరియంట్లలో మాత్రమే)
   • XUV700 లో వేరియంట్ల వారీగా లభించే ఫీచర్లు

    Mahindra XUV700 AX7

    ఈ ట్రిమ్ 7-సీటర్ డీజిల్ మ్యాన్యువల్, 7-సీటర్ డీజిల్ ఆటోమేటిక్, 7-సీటర్ డీజిల్ మ్యాన్యువల్, 7-సీటర్ డీజిల్ ఆటోమేటిక్ 4x4, 7-సీటర్ పెట్రోల్ మ్యాన్యువల్ మరియు 7-సీటర్ పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్లలో లభిస్తుంది. వీటిలో లభించే ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి:

    • ADAS (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్
    • సైడ్ ఎయిర్‌బ్యాగ్స్
    • TPMS (టైర్ ప్రెజర్ మోనిటరింగ్ సిస్టమ్)
    • పుష్-బటన్ స్టార్ట్ / స్టాప్ ఫీచర్
    • 18 ఇంచ్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్
    • లీథెరెట్ సీట్, స్టీరింగ్ వీల్ మరియు గేర్ లివర్ అప్‌హోలెస్ట్రీ
    • మెమరీ మరియు వెల్‌కమ్ రిట్రాక్ట్ ఫంక్షన్‌తో కూడిన 6-వే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్స్
    • ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్
    • రెయిన్ సెన్సింగ్ వైపర్స్
    • రివర్స్ కెమెరా
    • ఎయిర్ ప్యూరిఫయర్
    • డ్రైవర్ డ్రౌజీనెస్ డిటెక్షన్
    • ఎలక్ట్రికల్లీ ఫోల్డబుల్ సైడ్ మిర్రర్స్
    • డ్యూయెల్ జోన్ టెంపరేచర్ కంట్రోల్
    • AdrenoX రెండు సంవత్సరాల కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్‌
    • XUV700 లో వేరియంట్ల వారీగా లభించే ఫీచర్లు

     Mahindra XUV700 AX7 Luxury Pack

     ఈ లగ్జరీ ప్యాక్ AX7 ట్రిమ్ యొక్క 7-సీటర్ డీజిల్ మ్యాన్యువల్, 7-సీటర్ డీజిల్ ఆటోమేటిక్ 4x4 (ఆల్-వీల్ డ్రైవ్) మరియు 7-సీటర్ పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్ల కోసం మాత్రమే అందుబాటులో ఉంది. ఈ లగ్జరీ ప్యాక్‌లో అదనంగా లభించే ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి:

     • బ్లైండ్ వ్యూ మానిటర్
     • కంటిన్యూస్ డిజిటల్ వీడియో రికార్డింగ్
     • 12 స్పీకర్లతో కూడిన 3డి ఆడియో సిస్టమ్
     • 360 డిగ్రీ కెమెరా
     • మోకాలి ఎయిర్‌బ్యాగ్
     • పాసివ్ కీలెస్ ఎంట్రీ
     • ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్
     • అనుకూల క్రూయిజ్ కంట్రోల్ కోసం స్టాప్ అండ్ గో ఫంక్షన్
     • టెలిస్కోపిక్ అడ్జస్టబల్ స్టీరింగ్
     • ఎలక్ట్రిక్ స్మార్ట్ డోర్ హ్యాండిల్
     • వైర్‌లెస్ ఛార్జింగ్
     • XUV700 లో వేరియంట్ల వారీగా లభించే ఫీచర్లు

      ఇవీ మహీంద్రా ఎక్స్‌యూవీ700 లో వేరియంట్ల వారీగా లభించే ఫీచర్లు. ఇక దీని ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే, ఇది 2.0 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ మరియు 2.2 లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులోని పెట్రోల్ ఇంజన్ 200 బిహెచ్‌పి పవర్ మరియు 300 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, డీజిల్ ఇంజన్ 185 బిహెచ్‌పి పవర్ మరియు 420 న్యూటన్ మీటర్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది.

Most Read Articles

English summary
Mahindra xuv700 bookings open variant wise features explained in detail
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X