Mahindra XUV700 క్రాష్ అయితే ఎలా ఉంటుందో చూశారా..?

ప్రముఖ దేశీయ యుటిలిటి వాహన దిగ్గజం Mahindra and Mahindra ఇటీవల తమ ప్రపంచ స్థాయి ఎస్‌యూవీ సరికొత్త Mahindra XUV700 (మహీంద్రా ఎక్స్‌యూవీ సెవన్ డబుల్ ఓ) ని భారత మార్కెట్లో ఆవిష్కరించిన సంగతి తెలిసినదే. తాజాగా ఈ ఎస్‌యూవీని తయారు చేసిన ఫ్రేమ్ యొక్క సేఫ్టీని మరియు ప్రమాద సమయాల్లో అది అందించే రక్షణను తెలిపే వీడియో ఒకటి వెల్లడైంది.

Mahindra XUV700 క్రాష్ అయితే ఎలా ఉంటుందో చూశారా..?

కొత్త Mahindra XUV700 ఎస్‌యూవీని కంపెనీ ఈ సెగ్మెంట్లో కెల్లా అత్యుత్తమ సేఫ్టీ ఫీచర్లతో తయారు చేసింది. ఈ కారుకు కంపెనీ ఇటీవలే అంతర్గతంగా క్రాష్ టెస్ట్ నిర్వహించినట్లు ఈ వీడియో ద్వారా తెలుస్తోంది. ఈ క్రాష్ టెస్టులో కొత్త XUV700 మంచి సేఫ్టీ ఫలితాలను కనబరించినట్లు సమాచారం.

Mahindra XUV700 క్రాష్ అయితే ఎలా ఉంటుందో చూశారా..?

గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో కూడా ఈ కారు అత్యుత్తమ సేఫ్టీ ఫలితాలను కనబరుస్తుందని కంపెనీ భావిస్తోంది. ప్రస్తుతం, Mahindra విక్రయిస్తున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ XUV300 కూడా దేశంలోనే నంబర్-1 సురక్షిత కారుగా నిలిచిందని మరియు ఇది గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో అత్యధిక సేఫ్టీ రేటింగ్ ను కలిగి ఉందని కంపెనీ పేర్కొంది.

Mahindra XUV700 క్రాష్ అయితే ఎలా ఉంటుందో చూశారా..?

గ్లోబల్ ఎన్‌క్యాప్ ద్వారా కొత్త XUV700 ఎస్‌యూవీ ఇంకా క్రాష్-టెస్ట్ చేయాల్సి ఉండగా, Mahindra తమ స్వంత సదుపాయంలో నిర్వహించిన దాని అంతర్గత క్రాష్ టెస్ట్ యొక్క వీడియో తాజాగా బయటకు వచ్చింది. ఈ వీడియోని Motor Vikatan అనే యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేశారు.

Mahindra XUV700 క్రాష్ అయితే ఎలా ఉంటుందో చూశారా..?

ఈ వీడియోలో XUV700 ఎస్‌యూవీ యొక్క నిర్మాణ నాణ్యత (బిల్డ్ క్వాలిటీ) ని మరియు దాని భద్రతా దశలను సవవిరంగా తెలియజేశారు. ఈ కారు ముందు వైపు నుండి లేదా సైడ్స్ నుండి క్రాష్ అయినప్పుడు, ఆ క్రాష్ ఇంపాక్ట్‌ను కారు బాడీ ఎలా గ్రహిస్తుందనే విషయాన్ని కూడా ఈ వీడియోలో తెలియజేశారు.

వీడియో ప్రారంభంలో ఆఫ్‌సెట్ ఫ్రంట్ ఇంపాక్ట్ కూడా చూపబడింది, ఇది క్రాష్ ప్రభావాన్ని ఫ్రంట్ ఎండ్ ఎలా గ్రహిస్తుందో వివరిస్తుంది. కొత్త Mahindra XUV700 ఎస్‌యూవీని మోనోకోక్ ఫ్రేమ్ ఆధారంగా తయారు చేశారు. అంటే, ఈ ఫ్రేమ్ ముందు నుండి వెనుక వరకు ఒకే పీస్ మాదిరిగా ఉంటుంది. ఇందులో జాయింట్లు, అతుకులు ఉండవు.

Mahindra XUV700 క్రాష్ అయితే ఎలా ఉంటుందో చూశారా..?

ప్రస్తుతం మహీంద్రా విక్రయించిన XUV500 ని కూడా ఇదే తరహా ఫ్రేమ్‌పై నిర్మిస్తున్నారు. నిజానికి మోనోకోక్ ఫ్రేమ్ పై తయారయ్యే వాహనాలు చాలా ధృడంగా ఉండటమే కాకుండా, క్యాబిన్ లోపల చాలా తక్కువ ఎన్‌విహెచ్ లెవల్స్ (నాయిస్, వైబ్రేషన్ మరియు హార్ష్‌నెస్ స్థాయలు) ను కలిగి ఉంటాయి.

Mahindra XUV700 క్రాష్ అయితే ఎలా ఉంటుందో చూశారా..?

Mahindra XUV700 యొక్క ఫ్రంట్ ఎండ్‌ని అధునాతన హై-స్ట్రెంత్ స్టీల్ (హెచ్ఎస్ఎస్) తో తయారు చేశారు. దీని కారణంగా, ఈ కారు ముందు వైపు క్రాష్‌కు గురైనప్పుడు ఆ ప్రమాదపు ఇంపాక్ట్ వలన ఇంజన్-బే పూర్తిగా పాడైనప్పటికీ, ఆ ప్రభావం కారు లోపల క్యాబిన్‌కు విస్తరించకుండా ఉండేలా రూపొందించారు.

Mahindra XUV700 క్రాష్ అయితే ఎలా ఉంటుందో చూశారా..?

ఈ నిర్మాణం వలన కారులోని ఇంపాక్ట్ లోడ్ ఒక క్రమపద్ధతిలో పైకి, క్రిందకు మరియు సైడ్స్‌కి పంపిణీ చేయబడుతుంది. ఫలితంగా క్యాబిన్ లోపల ప్రమాద తీవ్రత చాలా తక్కువగా ఉంటుందని, ఫలితంగా డ్రైవర్ మరియు కో-డ్రైవర్‌కు పెద్దగా గాయాలను కలిగించదని కంపెనీ అధికారి ఒకరు ఈ వీడియోలో వెల్లడించారు.

Mahindra XUV700 క్రాష్ అయితే ఎలా ఉంటుందో చూశారా..?

ఈ వీడియోలో XUV700 యొక్క ఆఫ్‌సెట్ సైడ్ ఎఫెక్ట్ సిమ్యులేషన్ కూడా వివరించారు. ఈ కారు సైడ్ నుండి ప్రమాదానికి గురైనప్పుడు సైడ్ బాడీ ప్యానెల్లు మరియు సైడ్ పార్ట్స్ నుండి ప్రభావాన్ని నివారించడానికి ఇందులో చొరబాటు-నిరోధక పదార్థాన్ని ఉపయోగించారు. అదే సమయంలో, ఇందులో ఇన్‌స్టాల్ చేయబడిన సైడ్ మరియు కర్టెన్ ఎయిర్‌బ్యాగులు కూడా భద్రతను మరింత పెంచడంలో సహకరిస్తాయి.

Mahindra XUV700 క్రాష్ అయితే ఎలా ఉంటుందో చూశారా..?

ఇక వెనుక వైపు నుండి జరిగే ప్రమాద తీవ్రతను తగ్గించడంలో లాంగ్ మెంబ్రాన్స్ మరియు క్రాస్ మెంబ్రాన్స్ లు ఈ ఇంపాక్ట్ ఎనర్జీని గ్రహిస్తాయి. మొత్తమ్మీద, ఈ సరికొత్త Mahindra XUV700 కారును అన్ని రకాల ప్రమాదాలను సమర్థవంతంగా తట్టుకునేలా డిజైన్ చేసినట్లు కంపెనీ చెబుతోంది.

Mahindra XUV700 క్రాష్ అయితే ఎలా ఉంటుందో చూశారా..?

Mahindra XUV700 విషయానికి వస్తే, కంపెనీ ఈ కారును కేవలం రూ.11.99 లక్షల ప్రారంభ ధరకే మార్కెట్లో విడుదల చేసింది. కంపెనీ డీలర్లు ఇప్పటికే ఈ మోడల్ కోసం బుకింగ్‌లను తీసుకోవడం ప్రారంభినట్లు కూడా తెలుస్తోంది. సెప్టెంబర్ నెలలో ఈ కారు టెస్ట్ డ్రైవ్ లు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Mahindra XUV700 క్రాష్ అయితే ఎలా ఉంటుందో చూశారా..?

ఈ ఎస్‌యూవీలో లభించే ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఇందులో ఒకే డ్యాష్‌బోర్డులో అమర్చిన రెండు 10.25 ఇంచ్ డిజిటల్ స్క్రీన్లు (ఒకటి ఇన్ఫోటైన్‌మెంట్ కోసం మరొకటి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం), సరికొత్త సోనీ సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ మరియు ఆపిల్ కార్‌ప్లే, ఈ-సిమ్ ఆధారిత కనెక్టింగ్ టెక్నాలజీ, వాయిస్ అసిస్టెంట్, యాంబియంట్ లైటింగ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఎయిర్ ప్యూరిఫయర్ వంటి మరెన్నో ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

Mahindra XUV700 క్రాష్ అయితే ఎలా ఉంటుందో చూశారా..?

అంతేకాకుండా, ఇందులో అడ్వాన్స్ డ్రైవర్ అసిస్టెడ్ సిస్టమ్ (ఏడిఏఎస్) కూడా కంపెనీ అందిస్తోంది. ఇది అనేక రకాల సేఫ్టీ మరియు కంఫర్ట్ ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇందులో 7 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబిడితో కూడిన ఏబిఎస్, రియర్ పార్కింగ్ సెన్సార్స్, 360 డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ లాకింగ్ డిఫరెన్షియల్, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్ మరియు ఆటో హెడ్‌లైట్ బూస్టర్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

Most Read Articles

English summary
Mahindra xuv700 build quality explained in internal crash test video details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X