24 గంటల్లో 4000 కిలోమీటర్లు చుట్టిన Mahindra XUV700; నేషనల్ రికార్డ్!

ప్రముఖ దేశీయ యుటిలిటి వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా, లేటెస్ట్ గా మార్కెట్లోకి ప్రవేశపెట్టిన సరికొత్త ఎస్‌యూవీ మహీంద్రా ఎక్స్‌యూవీ700 (Mahindra XUV700) తాజాగా ఓ కొత్త జాతీయ రికార్డును సృష్టించింది. ఆ నేషనల్ రికార్డ్ డీటేల్స్ ఏంటో తెలుసుకుందాం రండి.

24 గంటల్లో 4000 కిలోమీటర్లు చుట్టిన Mahindra XUV700; నేషనల్ రికార్డ్!

చెన్నై సమీపంలోని మహీంద్రా కొత్తగా ఏర్పాటు చేసిన ఎస్‌యూవీ ప్రూవింగ్ ట్రాక్ (MSPT) లో 24 గంటల స్పీడ్ ఎండ్యూరెన్స్ ఛాలెంజ్‌ లో మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఈ కొత్త జాతీయ రికార్డును నెలకొల్పింది. ఈ ఛాలెంజ్‌ లోకి ప్రవేశించిన నాలుగు మహీంద్రా ఎక్స్‌యూవీ700 వాహనాలు ఈవెంట్‌లో ఒక్కొక్కటి 4000 కి.మీ దూరాన్ని నిరంతరాయంగా కవర్ చేశాయి.

24 గంటల్లో 4000 కిలోమీటర్లు చుట్టిన Mahindra XUV700; నేషనల్ రికార్డ్!

ఈ ఈవెంట్‌లో మునుపటి రికార్డు 2016 సంవత్సరంలో స్థాపించబడింది, ఆ సమయంలో 24 గంటల్లో 3161 కి.మీ దూరాన్ని కవర్ చేశారు. ఇందులో పాల్గొన్న నాలుగు మహీంద్రా XUV700 లలో, డీజిల్ మాన్యువల్ వేరియంట్ గరిష్ట దూరం 4384.73 కి.మీ లను కవర్ చేయగా, ఆ తర్వాత డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్ 4256.12 కి.మీ, పెట్రోల్ మాన్యువల్ 4232.01 కి.మీ మరియు పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్ 4155.65 కి.మీ దూరాన్ని కవర్ చేశాయి.

24 గంటల్లో 4000 కిలోమీటర్లు చుట్టిన Mahindra XUV700; నేషనల్ రికార్డ్!

ఈ జాతీయ రికార్డ్ కాకుండా, MSPT వద్ద ఈ పోటీ సమయంలో మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీ 80 అదనపు రికార్డులను కూడా బద్దలుకొట్టింది. ఇందులో పాల్గొన్న కార్లు సగటున గంటకు 170 కి.మీ నుండి 180 కి.మీ వేగంతో ప్రయాణించడం మరొక రికార్డ్. మోటార్ స్పోర్ట్స్ క్లబ్స్ ఆఫ్ ఇండియా ఫెడరేషన్ యొక్క కఠినమైన నియమాలు మరియు పరిశీలనలో ఈ ఛాలెంజ్ జరిగింది.

24 గంటల్లో 4000 కిలోమీటర్లు చుట్టిన Mahindra XUV700; నేషనల్ రికార్డ్!

ఈవెంట్‌ని ఈవో ఇండియా నిర్వహించింది, అయితే ఈ రికార్డ్‌లను మాత్రం ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ద్వారా ధృవీకరించబడ్డాయి. అన్ని మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీ వేరియంట్‌లు ఇప్పటివరకు నిర్వహించిన అత్యంత కఠినమైన పరీక్షలలో కూడా మెప్పించాయి.

24 గంటల్లో 4000 కిలోమీటర్లు చుట్టిన Mahindra XUV700; నేషనల్ రికార్డ్!

ఈ పోటీలో పాల్గొన్న నాలుగు మహీంద్రా ఎక్స్‌యూవీ700 వాహనాలను డ్రైవర్లు 24 గంటల పాటు అధిక వేగంతో నడపవలసి ఉంటుంది. ఎందుకంటే, డ్రైవర్లకు ఇంధనం నింపడానికి లేదా మార్చడానికి మాత్రమే శీఘ్ర స్టాప్‌ఓవర్‌లు ఉంటాయి. ఈ మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీలను ఆటోమోటివ్ రంగంలో మంచి నైపుణ్యం కలిగిన వారు నడిపారు.

24 గంటల్లో 4000 కిలోమీటర్లు చుట్టిన Mahindra XUV700; నేషనల్ రికార్డ్!

ఈ పరీక్షలో మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీలు తమ సత్తాను నిరూపించుకున్నాయి మరియు వాటి స్టామినా మరియు డ్రైవింగ్ సామర్ధ్యాలను ప్రదర్శించాయి. మహీంద్రాలో గ్లోబల్ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ హెడ్ వేలుసామి ఆర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ.. "మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీని చాలా అత్యున్నత ప్రమాణాలకు లోబడి అభివృద్ధి చేయబడింది మరియు నిర్మించబడింది" అని చెప్పారు.

24 గంటల్లో 4000 కిలోమీటర్లు చుట్టిన Mahindra XUV700; నేషనల్ రికార్డ్!

"ఈ కఠినమైన ఛాలెంజ్‌లో ఈ మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఊహించిన విధంగానే బాగా పనిచేసింది. కొత్త జాతీయ రికార్డులతో ఓర్పు కోసం కొత్త బెంచ్‌మార్క్‌లను నెలకొల్పిన ఈ ఉత్పత్తి పట్ల కంపెనీ గర్వపడుతోంది. మా స్వంత ప్రపంచ స్థాయి MSPT (ఎస్‌యూవీ ప్రూవింగ్ ట్రాక్) పై ఈ ఘనత సాధించడం చాలా ఆసక్తికరంగా ఉంది" అని ఆయన అన్నారు.

24 గంటల్లో 4000 కిలోమీటర్లు చుట్టిన Mahindra XUV700; నేషనల్ రికార్డ్!

మహీంద్రా అండ్ మహీంద్రా తయారు చేసిన వాహనాలను పరీక్షించడం కోసం కంపెనీ గత ఆగస్ట్ నెలలో ఈ కొత్త వాహన టెస్ట్ ట్రాక్‌ను ప్రారంభించింది. తమిళనాడులోని కాంచీపురంలో మహీంద్రా ఈ అధునాతన ఎస్‌యూవీ టెస్ట్ ట్రాక్‌ను నిర్మించింది. దీనిని 'మహీంద్రా ఎస్‌యూవీ ప్రూవింగ్ ట్రాక్' (MSPT)గా పిలుస్తారు. కంపెనీ తయారు చేయబోయే అన్ని వాహనాలను ఇదే ట్రాక్‌పై పరీక్షిస్తారు.

24 గంటల్లో 4000 కిలోమీటర్లు చుట్టిన Mahindra XUV700; నేషనల్ రికార్డ్!

మహీంద్రా సంస్థ నిర్మించిన ఈ ఎస్‌యూవీ టెస్ట్ ట్రాక్ సుమారు 2 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇందులో మహీంద్రా సంస్థ తయారు చేసే ఎస్‌యూవీల యొక్క వివిధ రకాల పరీక్షల అవసరాలను తీర్చడానికి కంపెనీ 20 రకాల బహుళ ప్రయోజన ట్రాక్‌లను సృష్టించింది. ఈ టెస్టింగ్ ట్రాక్ చెన్నైలోని మహీంద్రా రీసెర్చ్ వ్యాలీకి 55 కిలోమీటర్ల దూరంలో సుమారు 454 ఎకరాల్లో ఏర్పాటు చేయబడి ఉంది.

24 గంటల్లో 4000 కిలోమీటర్లు చుట్టిన Mahindra XUV700; నేషనల్ రికార్డ్!

ఇక ఈ సరికొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ700 విషయానికి వస్తే, కంపెనీ ప్రస్తుతం ఈ ఎస్‌యూవీని రూ. 12.49 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తోంది. ఇది మొత్తం నాలుగు ట్రిమ్‌లలో విక్రయించబడుతోంది. వీటిలో MX, AX3, AX5 మరియు AX7 లు ఉన్నాయి. ఈ ఎస్‌యూవీలో రెండు ఇంజన్ ఆప్షన్‌లు ఉన్నాయి, వీటిలో 2.0 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ మరియు 2.2 లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి.

24 గంటల్లో 4000 కిలోమీటర్లు చుట్టిన Mahindra XUV700; నేషనల్ రికార్డ్!

మహీంద్రా ఎక్స్‌యూవీ700 కోసం బుకింగ్స్ ఓపెన్ చేసిన మొదటి రెండు రోజుల్లోనే ఈ మోడల్ కోసం 50,000 యూనిట్లకు పైగా బుకింగ్స్ వచ్చాయి. మొదటి రోజు 1 గంటలోనే 25,000 యూనిట్లు బుకింగ్స్ రాగా, రెండవ రోజు 2 గంటల్లో 25,000 బుకింగ్స్ వచ్చాయి. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ700 పెట్రోల్ మోడల్ డెలివరీలు అక్టోబర్ చివరి వారం నుండి ప్రారంభం కానున్నాయి. అయితే, ఇందులో డీజిల్ మోడళ్ల డెలివరీలు మాత్రం వచ్చే నెల (నవంబర్) చివరి వారం నుండి ప్రారంభం కానున్నాయి.

Most Read Articles

English summary
Mahindra xuv700 covers 4000 km in 24 hours sets national record details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X