XUV700 డెలివరీల గురించి వెల్లడించిన Mahindra

ఇటీవల కాలంలో భారతీయ మార్కెట్లో Mahindra & Mahindra (మహీంద్రా అండ్ మహీంద్రా) కంపెనీ యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన SUV 'Mahindra XUV700' (మహీంద్రా ఎక్స్‌యూవీ700). ఈ కొత్త SUV కి మార్కెట్లో డిమాండ్ అంతా.. ఇంతా కాదు. బుకింగ్స్ ప్రారంభించిన మొదటి రోజు కేవలం ఒక గంట సమయంలోనే దాదాపు 25,000 బుకింగ్స్ పొందింది. మరుసటి రోజు కేవలం రెండు గంటల సమయంలో మరో 25,000 స్వీకరించింది. అంటే కేవలం 3 గంటల సమయంలోనే 50,000 బుకింగ్స్ స్వీకరించింది అంటే, ఈ SUV కి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

XUV700 డెలివరీల గురించి వెల్లడించిన Mahindra

ఇదిలా ఉండగా కంపెనీ ఇప్పుడు కొత్త Mahindra XUV700 యొక్క డెలివరీ సమయాన్ని ప్రకటించింది. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, Mahindra XUV700 యొక్క పెట్రోల్ మోడల్ డెలివరీలు అక్టోబర్ చివరి వారం నుండి ప్రారంభమవుతాయి, అదే విధంగా XUV700 యొక్క డీజిల్ మోడల్ డెలివరీలు వచ్చే నెల (నవంబర్) చివరి వారం నుండి ప్రారంభమవుతాయి.

XUV700 డెలివరీల గురించి వెల్లడించిన Mahindra

ఇప్పుడు ప్రపంచ ఆటో పరిశ్రమలు చిప్స్ కొరతను ఎదుర్కొంటున్నాయి. ఇందులో Mahindra కంపెనీ కూడా ఉంది. కావున ఇప్పుడు కంపెనీ ఈ చిప్ కొరత కారణంగా XUV700 ఉత్పత్తి కూడా కొంత ఆలస్యం కానుంది. కావున కంపెనీ యొక్క డీజిల్ మోడల్ డెలివరీ ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. ఈ కారణంగానే కంపెనీ తేదీని వెల్లడించలేదు.

XUV700 డెలివరీల గురించి వెల్లడించిన Mahindra

Mahindra కంపెనీ దీని కోసం కంపెనీ మరొక కంపెనీతో భాగస్వామ్యం చేసింది, ఇది ఒక అల్గోరిథంను అభివృద్ధి చేసింది మరియు తదనుగుణంగా కస్టమర్లకు వారి వాహనం యొక్క డెలివరీ తేదీ గురించి త్వరలో తెలియజేయబడుతుంది. కావున కొనుగోలు దారులు ఎలాంటి అసంతృప్తి చెందవలసిన అవసరం లేదు.

XUV700 డెలివరీల గురించి వెల్లడించిన Mahindra

XUV700 ఇప్పుడు ధర 25,000 బుకింగ్‌ల తర్వాత పెరిగింది, అంతే కాకుండా 50,000 బుకింగ్‌ల తర్వాత పెరిగిన ధరలు ఇంకా కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. కానీ ఈ ధరలు కూడా త్వరలో వెల్లడవుతాయి. కానీ కంపెనీ ఈ కొత్త SUV బుకింగ్స్ విషయంలో మాత్రం కేవలం 3 గంటల సమయంలో అత్యంత ఎక్కువ బుకింగ్స్ స్వీకరించి ఒక కొత్త రికార్డును కైవసం చేసుకుంది.

XUV700 డెలివరీల గురించి వెల్లడించిన Mahindra

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం ఇప్పుడు Mahindra XUV700 ప్రారంభ ధర (పెట్రోల్ బేస్ వేరియంట్) రూ .12.49 లక్షలకు పెరిగింది (ఎక్స్-షోరూమ్). అదేవిధంగా డీజిల్ బేస్ వేరియంట్ ధర రూ .12.99 లక్షలకు పెరిగింది (ఎక్స్-షోరూమ్). దీని టాప్ వేరియంట్ AX7 లగ్జరీ డీజిల్ ఆటోమేటిక్ ధర రూ. 22.99 లక్షలు (ఎక్స్-షోరూమ్).

XUV700 డెలివరీల గురించి వెల్లడించిన Mahindra

Mahindra కంపెనీ తన కొత్త XUV700 SUV ని అక్టోబర్ 1 నుండి డీలర్‌షిప్‌లలో వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆసక్తి గల కస్టమర్లు డీలర్‌షిప్‌లను సందర్శించి దీనిని చూడవచ్చు. అంతే కాకుండా XUV700 యొక్క మొదటి దశ టెస్ట్ డ్రైవ్ అక్టోబర్ 2 నుండి ప్రారంభించబడింది. మీరు బుకింగ్‌కు ముందు టెస్ట్ డ్రైవ్ చేయాలనుకుంటే, మీరు నేరుగా డీలర్‌షిప్‌ను సందర్శించవచ్చు లేదా వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా టెస్ట్ డ్రైవ్‌ అవకాశాన్ని ఎంచుకోవచ్చు.

XUV700 డెలివరీల గురించి వెల్లడించిన Mahindra

కొత్త Mahindra XUV700 అధునాతన ఎక్స్టీరియర్ ఫీచర్స్ మరియు ఇంటీరియర్ ఫీచర్స్ మరియు మంచి ఇంధన సామర్థ్యం కలిగిన ఇంజిన్ కలిగి ఉండటమే కాకుండా, అత్యంత సురక్షితమైన సేఫ్టీ ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. కావున ఎక్కువమంది వినియోగదారులను ఆకర్షిస్తోంది.

XUV700 డెలివరీల గురించి వెల్లడించిన Mahindra

Mahindra XUV700 రెండు ఇంజన్ ఆప్షన్‌లలో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో మొదటిది 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు రెండవది 2.2-లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్‌. పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 200 బిహెచ్‌పి పవర్‌ను మరియు 380 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

XUV700 డెలివరీల గురించి వెల్లడించిన Mahindra

ఇక రెండవ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 2.2-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్, ఇది 183 బిహెచ్‌పి పవర్ మరియు 420 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది కూడా 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలను కలిగి ఉంటుంది. Mahindra XUV700 నాలుగు డ్రైవింగ్ మోడ్స్ కలిగి ఉంటుంది. అవి జిప్, జామ్, జూమ్ మరియు కస్టమ్ డ్రైవింగ్ మోడ్స్.

XUV700 డెలివరీల గురించి వెల్లడించిన Mahindra

Mahindra XUV700 లోని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 7 ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్ విత్ ఇబిడి, ఎలక్ట్రానిక్ లాకింగ్ డిఫరెన్షియల్, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్ మరియు ఆటో హెడ్‌లైట్ బూస్టర్ వంటివి ఉన్నాయి. ఏది ఏమైనా కంపెనీ యొక్క అన్ని మోడల్స్ దేశీయ మార్కెట్లో మంచి ఆదరణ పొందుతున్నాయి. ఇందులో ఇప్పుడు పండుగ సీజన్లో మహీంద్రా కొత్త SUV మరింత ఎక్కువ అమ్మకాలు చేపట్టడానికి దోహదపడుతుంది.

More from DriveSpark

Article Published On: Monday, October 11, 2021, 17:29 [IST]
English summary
Mahindra xuv700 delivery timeline revealed waiting period details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+