'ఏయ్ డ్రైవర్ నిద్రపోతున్నావా.. లెయ్.. లెయ్..' ఎక్స్‌యూవీ700లో కొత్త ఫీచర్!

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్లాగ్‌షిప్ అండ్ ఫ్యూచరిస్టిక్ ఎస్‌యూవీ 'మహీంద్రా ఎక్స్‌యూవీ700' త్వరలోనే మార్కెట్లోకి రానుంది. ఈ నేపథ్యంలో, మహీంద్రా ఈ అధునాత ఎస్‌యూవీకి సంబంధించిన లేటెస్ట్ టెక్నాలజీ ఫీచర్లను టీజర్ల రూపంలో వెల్లడి చేస్తూ వస్తోంది.

'ఏయ్ డ్రైవర్ నిద్రపోతున్నావా.. లెయ్.. లెయ్..' ఎక్స్‌యూవీ700లో కొత్త ఫీచర్!

తాజాగా, మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీలో ఆఫర్ చేయబోయే "డ్రైవర్ డ్రౌజీనెస్ డిటెక్షన్" అలెర్ట్ ఫీచర్ గురించి కంపెనీ ఓ టీజర్ వీడియోని విడుదల చేసింది. ఇదొక సేఫ్టీ ఫీచర్, ఇది డ్రైవర్ అలసటగా ఉండటాన్ని లేదా నిద్రమత్తులోకి జారుకోవటాన్ని గుర్తించి, వారిని ఆటోమేటిక్‌గా అలెర్ట్ చేస్తుంది.

దూరప్రయాణాలు చేస్తున్నప్పుడు లేదా రాత్రి సమయాల్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు ఈ డ్రైవర్ డ్రౌజీనెస్ డిటెక్షన్ అలెర్ట్ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ టెక్నాలజీలో డ్రైవర్ యొక్క అసాధారణమైన డ్రైవింగ్ తీరును గుర్తించడానికి సెన్సార్లు ఉంటాయి. ఇవి స్టీరింగ్ మరియు పెడల్స్‌పై డ్రైవర్ వ్యవహరించే తీరును పరిగణలోకి తీసుకొని, వారిని అలెర్ట్ చేస్తాయి.

'ఏయ్ డ్రైవర్ నిద్రపోతున్నావా.. లెయ్.. లెయ్..' ఎక్స్‌యూవీ700లో కొత్త ఫీచర్!

ఈ తరహా టెక్నాలజీ ఇప్పటికే కొన్ని రకాల హై-ఎండ్ కార్లలో అందుబాటులో ఉంటుంది. ఈ అలెర్ట్‌లో భాగంగా డ్యాష్‌బోర్డుపై వార్నింగ్ సైన్ ప్రకాశిస్తుంది. కొన్ని కార్లలో అయితే, ఇది వాయిస్ ఆధారిత వార్నింగ్ అలెర్ట్స్ రూపంలో కూడా ఉంటుంది. ఎక్స్‌యూవీ700లో కంపెనీ ఇప్పటికే వాయిస్ ఆధారిత హై-స్పీడ్ అలెర్ట్‌ను అందిస్తోంది.

'ఏయ్ డ్రైవర్ నిద్రపోతున్నావా.. లెయ్.. లెయ్..' ఎక్స్‌యూవీ700లో కొత్త ఫీచర్!

మహీంద్రా ఎక్స్‌యూవీ700లో కంపెనీ ఇప్పటి వరకూ వెల్లడి చేసిన ఫీచర్లలో కారు వేగాన్ని బట్టి ఎక్కువ దూరం ప్రకాశించే 'ఆటో బూస్టర్ హెడ్‌ల్యాంప్', సెగ్మెంట్లో కెల్లా అతిపెద్ద 'స్కైరూఫ్', కారు హై-స్పీడులో వెళ్తుంటే వేగాన్ని తగ్గించమని చెప్పే 'పర్సనలైజ్డ్ సేఫ్టీ అలెర్ట్స్', టెస్లా వంటి కార్లలో కనిపంచే ఫ్లష్ టైప్ 'స్మార్ట్ డోర్ హ్యాండిల్స్' మొదలైనవి ఉన్నాయి.

'ఏయ్ డ్రైవర్ నిద్రపోతున్నావా.. లెయ్.. లెయ్..' ఎక్స్‌యూవీ700లో కొత్త ఫీచర్!

ప్రధానంగా, మహీంద్రా తమ సరికొత్త ఎక్స్‌యూవీ700లో ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) సేఫ్టీ ఫీచర్‌ను జోడించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఎమ్‌జి గ్లోస్టర్ ఎస్‌యూవీలో కూడా ఈ తరహా సేఫ్టీ ఫీచర్ అందుబాటులో ఉంది. దీనిని లెవల్ 1 అటానమస్ ఫీచర్‌గా కూడా పిలుస్తారు.

'ఏయ్ డ్రైవర్ నిద్రపోతున్నావా.. లెయ్.. లెయ్..' ఎక్స్‌యూవీ700లో కొత్త ఫీచర్!

ఈ ఏడిఏఎస్ ఫీచర్‌లో భాగంగా, కారులోని వివిధ రకాల సెన్సార్లు మరియు ఆన్-బోర్డ్ కంప్యూటర్ సాయంతో అనేక ఫంక్షన్లను కారే ఆటోమేటిక్‌గా కంట్రోల్ చేస్తుంది. లేన్-కీప్ అసిస్ట్, క్రాస్ ట్రాఫిక్ అలర్ట్ మరియు బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ల సాయంతో ఇది డ్రైవర్ డ్రౌజీనెస్‌ను గుర్తించి, అలెర్ట్ చేస్తుంది. ఇది ఈ సెగ్మెంట్‌లో మొట్టమొదటి ఫీచర్ అయ్యే అవకాశం ఉంది.

'ఏయ్ డ్రైవర్ నిద్రపోతున్నావా.. లెయ్.. లెయ్..' ఎక్స్‌యూవీ700లో కొత్త ఫీచర్!

ఇవే కాకుండా, కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ700లో ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం 360-డిగ్రీ కెమెరా, టచ్‌స్క్రీన్ మరియు ట్విన్ డిజిటల్ స్క్రీన్ డిస్‌ప్లే సెటప్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఫుల్ ఎల్‌ఈడి లైటింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ మరియు డైనమిక్ టర్న్ ఇండికేటర్స్ వంటి అనేక ఫీచర్లు కూడా అందుబాటులో ఉండనున్నాయి.

'ఏయ్ డ్రైవర్ నిద్రపోతున్నావా.. లెయ్.. లెయ్..' ఎక్స్‌యూవీ700లో కొత్త ఫీచర్!

మహీంద్రాకు ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీని ఈ ఏడాది చివరి నాటికి మార్కెట్లో విడుదల కావచ్చని అంచనా. దీనిని సరికొత్త డబ్ల్యూ601 మోనోకోక్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించనున్నారు. ఇది 2.2-లీటర్ ఎమ్-హాక్ డీజిల్ ఇంజన్ మరియు 2.0-లీటర్ ఎమ్-స్టాలియన్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో మరియు ఆప్షనల్ ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో లభ్యం కావచ్చని సమాచారం.

'ఏయ్ డ్రైవర్ నిద్రపోతున్నావా.. లెయ్.. లెయ్..' ఎక్స్‌యూవీ700లో కొత్త ఫీచర్!

మహీంద్రా ఎక్స్‌యూవీ700 మార్కెట్లోకి విడుదలైన తర్వాత ఇది కంపెనీ యొక్క ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా మారనుంది. ఇది ఈ విభాగంలో హ్యుందాయ్ అల్కాజార్, టాటా సఫారి మరియు ఎంజి హెక్టర్ ప్లస్‌లతో వంటి మోడళ్లతో పోటీ పడే అవకాశం ఉంటుంది.

Most Read Articles

English summary
Mahindra XUV700 Driver Drowsiness Detection Feature Revealed In Teaser Video. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X