65,000 యూనిట్లకు పైగా బుకింగ్స్ దక్కించుకున్న Mahindra XUV700

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra and Mahindra) దేశీయ విపణిలో విడుదల చేసిన తమ సరికొత్త ఎస్‌యూవీ మహీంద్రా ఎక్స్‌యూవీ700 (Mahindra XUV700) బుకింగ్స్ పరంగా దూసుకుపోతోంది. ఈ మోడల్ కోసం ఇప్పటి వరకూ 65,000 యూనిట్లకు పైగా బుకింగ్‌లు వచ్చినట్లు కంపెనీ తెలిపింది.

65,000 యూనిట్లకు పైగా బుకింగ్స్ దక్కించుకున్న Mahindra XUV700

ఈ ఎస్‌యూవీ కోసం కంపెనీ అక్టోబర్ 7, 2021 వ తేదీన అధికారికంగా బుకింగ్స్ ప్రారంభించింన సంగతి తెలిసినదే. బుకింగ్స్ ప్రారంభించిన మొదటి రోజు ఒక గంట వ్యవధిలోనే ఈ మోడల్ కోసం 25,000 బుకింగ్స్ వచ్చాయి. ఆ తర్వాత రెండవ రోజు బుకింగ్‌లు ప్రారంభించిన 2 గంటల 8 నిమిషాల వ్యవధిలో మరో 25,000 యూనిట్ల బుకింగ్‌లు వచ్చాయి.

65,000 యూనిట్లకు పైగా బుకింగ్స్ దక్కించుకున్న Mahindra XUV700

కాగా, ఇప్పుడు మోడల్ కోసం ఇప్పటి వరకూ అదనంగా మరో 15,000 యూనిట్ల బుకింగ్‌లు వచ్చినట్లు కంపెనీ తెలిపింది. అంటే, మొత్తంగా చూసుకుంటే, మహీంద్రా ఎక్స్‌యూవీ700 కోసం బుకింగ్ లను ప్రారంభించిన సరిగ్గా రెండు వారాలకు గానూ మొత్తం 65,000 యూనిట్ల బుకింగ్‌లు వచ్చాయి. కాగా, పెట్రోల్ వెర్షన్ మహీంద్రా ఎక్స్‌యూవీ700 డెలివరీలు అక్టోబర్ 30 వ తేదీ నుండి ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది.

65,000 యూనిట్లకు పైగా బుకింగ్స్ దక్కించుకున్న Mahindra XUV700

డీజిల్ వెర్షన్ మహీంద్రా ఎక్స్‌యూవీ700 డెలివరీల విషయానికి వస్తే, ఇవి నవంబర్ చివరి వారం నుండి ప్రారంభం కానున్నాయి. మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎమ్ఎక్స్ 5 సీటర్ వేరియంట్ ను కంపెనీ రూ. 11.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విడుదల చేసింది. అయితే, ఈ ప్రారంభ ధర కేవలం మొదటి 25,000 యూనిట్ల బుకింగ్ లకు మాత్రమే వర్తిస్తుందని కంపెనీ తెలిపింది.

65,000 యూనిట్లకు పైగా బుకింగ్స్ దక్కించుకున్న Mahindra XUV700

మహీంద్రా వెబ్‌సైట్‌లో పేర్కొన్న సమాచారం ప్రకారం, ఇకపై కొత్తగా ఎక్స్‌యూవీ700 బుక్ చేసుకునే కస్టమర్లకు ఈ మోడల్ యొక్క పెట్రోల్ వెర్షన్ (ఎమ్ఎక్స్ మ్యాన్యువల్) ను రూ. 12.49 లక్షలు మరియు డీజిల్ వెర్షన్ (ఎమ్ఎక్స్ మ్యాన్యువల్) ను రూ. 12.99 లక్షల ప్రారంభ ధర (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్) తో లభిస్తుంది. అంటే, ఈ రెండు వెర్షన్లపై గరిష్టంగా రూ. 50,000 వరకూ ధరలు పెరిగాయి.

65,000 యూనిట్లకు పైగా బుకింగ్స్ దక్కించుకున్న Mahindra XUV700

ఈ ధరల పెంపు కేవలం బేస్ (ఎమ్ఎక్స్) వేరియంట్లపై మాత్రమే కాకుండా, ఇతర వేరియంట్లపై కూడా వర్తిస్తుంది. మహీంద్రా ఎక్స్‌యూవీ700 లో కస్టమర్ ఎంచుకునే వేరియంట్‌ను బట్టి వాటి ధరలు కనిష్టంగా రూ. 10,000 నుండి గరిష్టంగా రూ. 50,000 వరకూ పెరిగాయి. ఈ ధరల పెంపు తర్వాత, ప్రస్తుతం మార్కెట్లో మహీంద్రా ఎక్స్‌యూవీ700 ధరలు రూ. 12.49 లక్షల నుండి రూ. 22.99 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి.

65,000 యూనిట్లకు పైగా బుకింగ్స్ దక్కించుకున్న Mahindra XUV700

మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీని కంపెనీ అనేక ఆధునిక ఫీచర్లు మరియు అధునాతన డిజైన్‌తో అందిస్తోంది. ఈ ఎస్‌యూవీలోని డ్యాష్‌బోర్డుపై మెర్సిడెస్ బెంజ్ నుండి స్పూర్తి పొంది రూపొందించిన డ్యూయల్-డిస్‌ప్లే సెటప్ ఉంటుంది. ఇందులో ఒక డిస్‌ప్లే స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కోసం మరియు మరొక డిస్‌ప్లే స్క్రీన్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ కోసం ఉపయోగించబడుతుంది.

65,000 యూనిట్లకు పైగా బుకింగ్స్ దక్కించుకున్న Mahindra XUV700

ఈ కారులో ప్రధానంగా లభించే ఫీచర్లను గమనిస్తే, ఇందులో వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, కీలెస్ ఎంట్రీ, పుష్ స్టార్ట్ / స్టాప్ బటన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుంటా, ఇందులో కొన్ని సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లు లభిస్తున్నాయి. వీటిలో ఆటో బూస్టర్ హెడ్‌ల్యాంప్‌లు, స్మార్ట్ డోర్ హ్యాండిల్స్, పెద్ద పానోరమిక్ సన్‌రూఫ్ (స్కైరూఫ్), పర్సనల్ అలర్ట్స్ మరియు డ్రైవర్ డ్రౌజీనెస్ అలర్ట్ సిస్టమ్ మొదలైనవి ఉన్నాయి.

65,000 యూనిట్లకు పైగా బుకింగ్స్ దక్కించుకున్న Mahindra XUV700

మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీని రాత్రివేళల్లో సుమారు గంటకు 80 కిలోమీటర్ల వేగంతో నడుపుతున్నప్పుడు, ఇందులోని ఆటోబూస్టర్ హెడ్‌ల్యాంప్‌లు రోడ్డుపై పడే కాంతిని మరింత దూరం విస్తరించేలా చేస్తాయి. అంతేకాకుండా, ఈ విభాగంలో స్మార్ట్ డోర్ హ్యాండిల్ కలిగి ఉన్న మొట్టమొదటి ఎస్‌యూవీ కూడా మహీంద్రా ఎక్స్‌యూవీ700 కావటం విశేషం. ఈ డోర్ హ్యాండిల్ టెస్లా కార్ల మాదిరిగా, కారు డోరులోనే అమరి ఉండి, వెలుపలి వైపుకు తెరుచుకుంటాయి.

65,000 యూనిట్లకు పైగా బుకింగ్స్ దక్కించుకున్న Mahindra XUV700

అంతేకాకుండా, ఈ కారులో పర్సనలైజ్డ్ వాయిస్ అలెర్ట్స్ కూడా ఉంటాయి. ఈ ఫీచర్ సాయంతో మీకు నచ్చిన వారి వాయిస్‌తో పర్సనల్ అలెర్ట్స్ ను స్టోర్ చేసుకోవచ్చు. సాధారణ అలెర్ట్ సిస్టమ్స్ కంటే పర్సనలైజ్డ్ అలెర్ట్ సిస్టమ్స్ అత్యంత ప్రభావవంతమైనవిగా పరిగణించబడతాయి. ఇందులో కారు ఒక నిర్దిష్ట వేగానికి మించి వెళితే, డ్రైవర్ తన ప్రియమైనవారి వాయిస్‌లో స్పీడ్ అలెర్ట్ హెచ్చరికను వినొచ్చు. ఈ ఫీచర్ డ్రైవర్లను ప్రమాదాల నుండి కాపాడటంలో సహాయపడుతుంది.

65,000 యూనిట్లకు పైగా బుకింగ్స్ దక్కించుకున్న Mahindra XUV700

ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీలో డ్రైవర్ డ్రౌజీనెస్ అలెర్ట్ సిస్టమ్ కూడా ఉంది. కారు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు డ్రైవర్ కి నిద్రగా అనిపించినా లేదా అతడు అసాధారణంగా కారు నడుపుతున్నట్లు భావించినా, ఇందులోని సెన్సార్లు ఆ విషయాన్ని గుర్తించి డ్రైవర్ ను అలెర్ట్ చేస్తాయి. ఈ విభాగంలో మరియు ఇంత సరసమైన ధరకే లెవల్-1 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ఫీచర్లు కలిగిన మొట్టమొదటి ఎస్‌యూవీ మహీంద్రా ఎక్స్‌యూవీ700.

65,000 యూనిట్లకు పైగా బుకింగ్స్ దక్కించుకున్న Mahindra XUV700

ఇందులోని అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ ఫీచర్లలో భాగంగా, ఈ కారులో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, అటానమస్ బ్రేకింగ్ మరియు లేన్-లీప్ అసిస్ట్ వంటి మరెన్నో ఫీచర్లు ఉన్నాయి. ఇంకా ఇందులో బ్లైండ్ వ్యూ మానిటర్, కంటిన్యూస్ డిజిటల్ వీడియో రికార్డింగ్,, 360 డిగ్రీ కెమెరా, మోకాలి ఎయిర్‌బ్యాగ్, పాసివ్ కీలెస్ ఎంట్రీ, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ మరియు టెలిస్కోపిక్ అడ్జస్టబల్ స్టీరింగ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

65,000 యూనిట్లకు పైగా బుకింగ్స్ దక్కించుకున్న Mahindra XUV700

ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే, మహీంద్రా ఎక్స్‌యూవీ700 రెండు ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. ఇందులో మొదటి 2.0 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ మరియు రెండవది 2.2 లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్. పెట్రోల్ ఇంజన్ 200 బిహెచ్‌పి పవర్ మరియు 300 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, డీజిల్ ఇంజన్ 185 బిహెచ్‌పి పవర్ మరియు 420 న్యూటన్ మీటర్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇందులో మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు అలాగే, ఆల్-వీల్ (4x4) డ్రైవ్ సిస్టమ్ కూడా ఉన్నాయి.

Most Read Articles

English summary
Mahindra xuv700 gets 65000 bookings deliveries to start from october 30 details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X