షాకింగ్ న్యూస్.. XUV700 లో ఫీచర్స్ తగ్గించనున్న మహీంద్రా.. కారణం అదే..!!

ఆటో మొబైల్ పరిశ్రమ చాలా రోజుల నుంచి సెమీ కండక్టర్ చిప్ కొరతలతో పోరాడుతోంది. చిప్ కొరత కారణంగా ఉత్పత్తి మరియు డెలివరీ వాటికి కూడా చాలా ఆలస్యం అవుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ లగ్జరీ కార్ తయారీ సంస్థ బిఎండబ్ల్యు ఇటీవల తన బ్రాండ్ యొక్క కొన్ని కార్లలో టచ్‌స్క్రీన్ ఫంక్షన్‌ను తాత్కాలికంగా తీసివేస్తున్నట్లు తెలిపింది.

అయితే ఇప్పుడు భారతీయ మార్కెట్లో ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra) చిప్ కొరత కారణంగా తన కొత్త SUV అయిన XUV700 లో కూడా కొన్ని ఫీచర్స్ తీసివేయనున్నట్లు తెలిపింది. ఈని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

షాకింగ్ న్యూస్.. XUV700 లో ఫీచర్స్ తగ్గించనున్న మహీంద్రా.. కారణం అదే..!!

నివేదికల ప్రకారం కొత్త మహీంద్రా XUV700 నుండి కొన్ని ఫీచర్లు తీసివేసే అవకాశం కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం చిప్ కొరత. ఈ నేపథ్యంలో భాగంగానే కంపెనీ ఇప్పుడు మహీంద్రా XUV700 SUV ని కొన్ని తక్కువ ఫీచర్స్ తో అందిస్తుంది. అయితే దీని ధర కూడా కొంత తక్కువగానే ఉంటుంది.

షాకింగ్ న్యూస్.. XUV700 లో ఫీచర్స్ తగ్గించనున్న మహీంద్రా.. కారణం అదే..!!

దీని గురించి మహీంద్రా అండ్ మహీంద్రా, ఆటోమోటివ్ మరియు ఫార్మ్ ఎక్విప్‌మెంట్ సెక్టార్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేష్ జెజురికర్ మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రపంచ ఆటో మొబైల్ మార్కెట్ మొత్తం లేటెస్ట్ ఉత్పత్తులలో ఉపయోగించే సెమీకండక్టర్ల కొరతను ఎదుర్కొంటోంది. కావున కొత్త XUV700 యొక్క కొన్ని వేరియంట్‌లను కొంత తక్కువ ధరకు మా కస్టమర్‌లకు అందించడానికి ప్రయత్నిస్తున్నాము, అన్నారు. అయితే వీటి కొనుగోలు అనేది కస్టమర్ల ఆసక్తిని బట్టి ఉంటుంది.

షాకింగ్ న్యూస్.. XUV700 లో ఫీచర్స్ తగ్గించనున్న మహీంద్రా.. కారణం అదే..!!

ఇటీవల మహీంద్రా తన XUV700 లో వైర్‌లెస్ ఛార్జర్ ను తీసివేసింది. ఇందులో హై వేరియంట్‌లో ఎక్కువ ఫీచర్లు మరియు పరికరాలను అందించడానికి ఎక్కువ సెమీకండక్టర్స్ ఉపయోగించాల్సి ఉంది. అయితే లో వేరియంట్ లో మాత్రం కొన్ని తక్కువ ఫీచర్స్ ఉన్న కారణంగా ఇంహులో తక్కువ సంఖ్యలో సెమికండక్టర్స్ ఉపయోగిస్తారు. మొత్తానికి ఈ SUV యొక్క టాప్ ఎండ్ వేరియంట్‌లో 170 చిప్స్ ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇది అధునాతన ఫీచర్స్ కలిగి ఉంటుంది.

షాకింగ్ న్యూస్.. XUV700 లో ఫీచర్స్ తగ్గించనున్న మహీంద్రా.. కారణం అదే..!!

మహీంద్రా కంపెనీ ప్రస్తుతం మొత్తం 1.60 లక్షల యూనిట్ల పెండింగ్ ఆర్డర్‌లను కలిగి ఉంది, చిప్ కొరత కారణంగా సెప్టెంబర్ త్రైమాసికంలో 32,000 యూనిట్లు తక్కువ వాహనాలను ఉత్పత్తి చేసింది. కొన్ని నెలల క్రితం, కంపెనీ తన థార్ SUV ని ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ లేకుండా డీలర్‌షిప్‌లకు పంపింది. ఈ కారణంగా చాలా డెలివరీలు ఆలస్యమయ్యాయి.

షాకింగ్ న్యూస్.. XUV700 లో ఫీచర్స్ తగ్గించనున్న మహీంద్రా.. కారణం అదే..!!

ఇటీవల విడుదలైన నివేదికల ప్రకారం, కంపెనీ సగటున 3,500 యూనిట్లను డెలివరీ చేయనున్నట్లు తెలిసింది. అంటే దీని ప్రకారం, ఇటీవల బుక్ చేసుకున్న వినియోగదారులు ఈ కొత్త SUV పొందటానికి కనీసం ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం వేచి ఉండవలసి ఉంటుంది.

షాకింగ్ న్యూస్.. XUV700 లో ఫీచర్స్ తగ్గించనున్న మహీంద్రా.. కారణం అదే..!!

మహీంద్రా కంపెనీ తన డెలివరీ ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి అల్గారిథమిక్ ఆధారిత ప్రక్రియను అమలు చేయడానికి మహీంద్రా ఒక కన్సల్టెన్సీ కంపెనీతో కలిసి పని చేస్తోంది. ప్రస్తుతం, చిప్ కొరత ఉండటం వల్ల, డెలివరీ టైమ్‌లైన్‌ను గురించి తమ కస్టమర్‌లకు ఖచ్చితమైన తేదీని చెప్పలేకపోతోంది. కావున కస్టమర్లను ఎక్కువా రోజులు వేచి ఉండకుండా చేయడానికి కంపెనీ అహర్నిశలు శ్రమిస్తోంది.

షాకింగ్ న్యూస్.. XUV700 లో ఫీచర్స్ తగ్గించనున్న మహీంద్రా.. కారణం అదే..!!

ప్రస్తుతం ఈ ఆలస్యం కేవలం మహీంద్రా XUV700 కి మాత్రమే కాదు, కంపెనీకి చెందిన వేలాది మంది థార్ కస్టమర్‌లు కూడా చాలా కాలం వేచి ఉండాల్సి వస్తోంది. కంపెనీకి చెందిన దాదాపు 50,000 మంది థార్ కస్టమర్లు దీని డెలివరీ కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం.

షాకింగ్ న్యూస్.. XUV700 లో ఫీచర్స్ తగ్గించనున్న మహీంద్రా.. కారణం అదే..!!

అటువంటి పరిస్థితిలో, మహీంద్రా తన కస్టమర్‌ను వెయిట్ చేయించడానికి ఇష్టపడదు, కావున ఈ పరిస్థితిలో నిరంతరం కస్టమర్లకు అప్‌డేట్‌లు ఇస్తూనే ఉంది. ఇందులో భాగంగానే కంపెనీ టైమ్‌లైన్ దాదాపు నెల రోజులు ఉన్నప్పటికీ, వినియోగదారులకు కొత్త తేదీ 2021 నవంబర్ 25 అని తెలిపింది.

షాకింగ్ న్యూస్.. XUV700 లో ఫీచర్స్ తగ్గించనున్న మహీంద్రా.. కారణం అదే..!!

మహీంద్రా XUV700 SUV ఇప్పటికే 70,000 కంటే ఎక్కువ బుకింగ్‌లను స్వీకరించింది. కంపెనీ 2021 అక్టోబర్ 30 నుండి పెట్రోల్ మోడల్ డెలివరీలను ప్రారంభించింది, అయితే ఈ నెలాఖరులో డీజిల్ మోడల్ డెలివరీలు ప్రారంభం కానున్నాయి అని కంపెనీ ఇప్పటికే తెలిపింది

షాకింగ్ న్యూస్.. XUV700 లో ఫీచర్స్ తగ్గించనున్న మహీంద్రా.. కారణం అదే..!!

మహీంద్రా XUV700 ప్రారంభ ధర ఇప్పుడు రూ. 12.49 లక్షలు (ఎక్స్-షోరూమ్), టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ. 22.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). మహీంద్రా XUV700 మొత్తం నాలుగు వేరియంట్లలో విక్రయిస్తోంది. అవి MX3, AX3, AX5 మరియు AX7 వేరియంట్స్. ఇవి పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్‌ ల ఎంపికలో అందుబాటులో ఉంటుంది. కానీ, MX5 ట్రిమ్ కేవలం 3 వేరియంట్‌లకు పరిమితం చేయబడింది. ఇందులో పెట్రోల్ మాన్యువల్, పెట్రోల్ ఆటోమేటిక్ మరియు డీజిల్ మాన్యువల్ వేరియంట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా 5 సీటర్ ఆప్షన్‌తో లభిస్తాయి.

షాకింగ్ న్యూస్.. XUV700 లో ఫీచర్స్ తగ్గించనున్న మహీంద్రా.. కారణం అదే..!!

Mahindra XUV700 రెండు ఇంజన్ ఆప్షన్‌లలో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో మొదటిది 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు రెండవది 2.2-లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్‌. పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 153 బిహెచ్‌పి పవర్‌ను మరియు 360 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక రెండవ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 2.2-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్, ఇది 188 బిహెచ్‌పి పవర్ మరియు 380 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది కూడా 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలను కలిగి ఉంటుంది.

షాకింగ్ న్యూస్.. XUV700 లో ఫీచర్స్ తగ్గించనున్న మహీంద్రా.. కారణం అదే..!!

మహీంద్రా XUV700 బుక్ చేసుకున్న కస్టమర్లు అన్ని ఫీచర్స్ కలిగి ఉన్న SUV ని పొందటానికి ఆసక్తి చూపుతారు, అయితే ఈ చిప్ కొరత కారణంగా కొన్ని ఫీచర్స్ లేకపోతే కస్టమర్లు కొంత నిరాశ చెందే అవకాశం ఉంటుంది. కావున దీనిపై కస్టమర్లు ఎలా స్పందిస్తారో, మరియు ఎలాంటి అమ్మకాలను చవి చూస్తుంది అనే విషయం తెలియరావాలి.

Most Read Articles

English summary
Mahindra xuv700 may lose some features reason details
Story first published: Saturday, November 13, 2021, 9:41 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X