బ్రేకింగ్స్ న్యూస్.. 6 సీట్ల వేరియంట్లో రానున్న Mahindra XUV700: వివరాలు

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన 'మహీంద్రా అండ్ మహీంద్రా' (Mahindra & Mahindra) ఇటీవల కాలంలో మహీంద్రా ఎక్స్‌యువి700 (Mahindra XUV700) SUV ని విడుదల చేసింది. ఇది ప్రస్తుతం 5 మరియు 7 సీట్ల ఎంపికలలో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే కంపెనీ ఇప్పుడు ఈ లేటెస్ట్ SUV ని 6 సీట్ల వేరియంట్లో కూడా తీసుకురావడానికి సన్నాహాలు సిద్ధం చేసింది. ఇది కెప్టెన్ సీటుతో అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. కానీ దీనికి సంబంధించిన అధికారిక సమాచారం ఇంకా అందుబటులోకి రాలేదు. త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంటుంది.

బ్రేకింగ్స్ న్యూస్.. 6 సీట్ల వేరియంట్లో రానున్న Mahindra XUV700: వివరాలు

ఇప్పటికి వెలువడిన సమాచారం ప్రకారం, మహీంద్రా XUV700 ఇప్పటి వరకు ఏ మోడల్‌లోనూ కనిపించని కెప్టెన్ సీట్ ఆప్షన్‌తో వస్తుంది. దీనికి సంబంధించిన ఫోటో కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. దీన్ని బట్టి చూస్తే కంపెనీ దీనిని త్వరలో మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.

బ్రేకింగ్స్ న్యూస్.. 6 సీట్ల వేరియంట్లో రానున్న Mahindra XUV700: వివరాలు

మహీంద్రా కంపెనీ తన XUV700 SUV ని ప్రస్తుతం రూ. 12.49 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధర వద్ద విక్రయిస్తోంది. ఇందులో టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ. 22.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). కంపెనీ ఈ కారును మొత్తం నాలుగు వేరియంట్లలో విక్రయిస్తోంది. అవి MX, AX3, AX5 మరియు AX7 వేరియంట్‌లు.

బ్రేకింగ్స్ న్యూస్.. 6 సీట్ల వేరియంట్లో రానున్న Mahindra XUV700: వివరాలు

Mahindra XUV700 రెండు ఇంజన్ ఆప్షన్‌లలో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో మొదటిది 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు రెండవది 2.2-లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్‌. పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 153 బిహెచ్‌పి పవర్‌ను మరియు 360 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక రెండవ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 2.2-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్, ఇది 188 బిహెచ్‌పి పవర్ మరియు 380 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది కూడా 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలను కలిగి ఉంటుంది.

బ్రేకింగ్స్ న్యూస్.. 6 సీట్ల వేరియంట్లో రానున్న Mahindra XUV700: వివరాలు

కొత్త మహీంద్రా XUV700 SUV అద్భుతమైన ఫీచర్స్ కలిగి ఉంటుంది. డ్యూయల్-డిస్ప్లే సెటప్‌ను కలిగి ఉన్న దాని విభాగంలో మొదటి SUV. ఈ డిస్‌ప్లే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌గా పనిచేస్తుంది. ఇందులో వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, కీలెస్ ఎంట్రీ, పుష్ స్టార్ట్/స్టాప్ బటన్ వంటి ఫీచర్లు ఈ ఎస్‌యూవీలో అందించబడ్డాయి.

బ్రేకింగ్స్ న్యూస్.. 6 సీట్ల వేరియంట్లో రానున్న Mahindra XUV700: వివరాలు

అంతే కాకుండా ఈ ఆధునిక SUV లో సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఇందులో ఆటో బూస్టర్ హెడ్‌ల్యాంప్‌లు, స్మార్ట్ డోర్ హ్యాండిల్స్, పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్, పర్సనల్ అలర్ట్ మరియు డ్రైవర్ అలర్ట్ సిస్టమ్ వంటికి ఉన్నాయి. ఈ SUV గరిష్టంగా 80 కిమీ/గం వేగాన్ని చేరుకున్నప్పుడు ఆటోబూస్టర్ హెడ్‌ల్యాంప్‌లు స్వయంచాలకంగా ఆన్ చేయబడతాయి. ఇది చీకటి రోడ్లపై మరింత వెలుతురును అందించడం ద్వారా రాత్రిపూట డ్రైవింగ్‌ను మరింత సౌకర్యవంతంగా చేస్తుంది.

బ్రేకింగ్స్ న్యూస్.. 6 సీట్ల వేరియంట్లో రానున్న Mahindra XUV700: వివరాలు

ఇటీవల మహీంద్రా XUV700 కోసం గ్లోబల్ NCAP నిర్వహించిన క్రాష్ టెస్టులో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకుంది. అడల్ట్ సేఫ్టీ విషయంలో ఈ కారు 17 పాయింట్లకు గాను 16.03 పాయింట్లను స్కోర్ చేసింది. అలాగే, పిల్లల భద్రతలో ఇది 49 పాయింట్లకు గాను 41.66 పాయింట్లను స్కోర్ చేసి మొత్తానికి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ కైవసం చేసుకుంది.

దేశీయ మార్కెట్లో మహీంద్రా XUV700 SUV మొత్తం 5 కలర్ ఆప్సన్స్ లో అందుబటులో ఉంటుంది. అవి రెడ్, సిల్వర్, బ్లాక్, బ్లూ మరియు వైట్ కలర్ ఆప్షన్స్. ఇవన్నీ కూడా చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా, ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటాయి.

బ్రేకింగ్స్ న్యూస్.. 6 సీట్ల వేరియంట్లో రానున్న Mahindra XUV700: వివరాలు

కంపెనీ ఈ కొత్త SUV ని 2022 వ సంవత్సరంలో మరిన్ని అప్డేట్స్ తో తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో ఆటో డిమ్మింగ్ IRVMలు, పవర్డ్ టెయిల్‌గేట్, వెంటిలేటెడ్ సీట్లు మొదలైన కొత్త ఫీచర్స్ అందుబటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. మహీంద్రా కంపెనీ తన కొత్త XUV700 SUV ని విడుదల చేసినప్పటి నుంచి కూడా మంచి అమ్మకాలతో మంచి ఆదరణ పొందుతూ ముందుకు సాగుతోంది. కావున ఇప్పుడు 6 సీట్ల వేరియంట్ అందుబాటులోకి వస్తే మరిన్ని అమ్మకాలను పొందే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాము.

Source: Team BHP

More from DriveSpark

Article Published On: Wednesday, December 22, 2021, 14:36 [IST]
English summary
Mahindra xuv700 new 6 seater variant could be launched soon details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+