స్పాట్ టెస్ట్‌లో కనిపించిన Mahindra XUV700 కొత్త వేరియంట్: వివరాలు

దేశీయ వాహన తయారీ సంస్థ అయిన 'మహీంద్రా అండ్ మహీంద్రా' (Mahindra & Mahindra) ఇటీవల దేశీయ మార్కెట్లో విడుదల చేసిన కొత్త XUV700 కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ కారణంగానే అతి తక్కువ కాలంలోనే ఎక్కువ బుకింగ్స్ కూడా పొందింది. ప్రస్తుతం ఈ SUV యొక్క డెలివరీలు కూడా జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు కంపెనీ XUV700 యొక్క 6 సీటర్ వేరియంట్‌పై పనిచేస్తోంది. ఇటీవల ఇది స్పాట్ టెస్ట్ లో గుర్తించబడింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన Mahindra XUV700 కొత్త వేరియంట్: వివరాలు

స్పాట్ టెస్ట్ లో కనిపించిన మహీంద్రా XUV700 యొక్క చిత్రాలు బయటపడ్డాయి. అయితే ఈ ఫోటోలలో ఈ కొత్త వేరియంట్ యొక్క డిజైన్ కనిపించదు. కానీ ఇది అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఇందులో అల్లాయ్ వీల్స్‌ వంటివాటితో పాటు లైటింగ్, రూఫ్ రైల్ వంటి వాటిని కూడా చూడవచ్చు. దీన్ని బట్టి చూస్తే ఇది మహీంద్రా XUV700 యొక్క 6 సీటర్ వేరియంట్ అని తెలుస్తోంది.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన Mahindra XUV700 కొత్త వేరియంట్: వివరాలు

అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు, కావున ఈ కొత్త వేరియంట్ యొక్క డిజైన్ మాత్రమే కాకుండా ఇంటీరియర్ డిజైన్ మరియు ఫీచర్స్ కూడా అధికారికంగా వెల్లడి కాలేదు. కానీ కంపెనీ త్వరలో వీటిని గురించి అధికారిక సమాచారం వెల్లడించే అవకాశం ఉంటుంది.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన Mahindra XUV700 కొత్త వేరియంట్: వివరాలు

ఇటీవల వెల్లడైన ఒక నివేదిక ప్రకారం, మహీంద్రా XUV700 ను ఇప్పటివరకు ఏ మోడల్ లో లేని కెప్టెన్ సీట్ ఆప్షన్‌తో చూడవచ్చు, కావున కంపెనీ త్వరలో తన 6 సీటర్ వేరియంట్ విడుదల చేసే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాము. ప్రస్తుతం, 5 సీట్లలో బెంచ్ సీటు మరియు 7 సీట్లలో మధ్య వరుసలో కూడా ఇవ్వబడింది. రాబోయే రోజుల్లో కంపెనీ దీని గురించి సమాచారం అందిస్తుంది.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన Mahindra XUV700 కొత్త వేరియంట్: వివరాలు

మహీంద్రా కంపెనీ తన XUV700 SUV ని ప్రస్తుతం రూ. 12.49 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధర వద్ద విక్రయిస్తోంది. ఇందులో టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ. 22.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). కంపెనీ ఈ కారును మొత్తం నాలుగు వేరియంట్లలో విక్రయిస్తోంది. అవి MX, AX3, AX5 మరియు AX7 వేరియంట్‌లు.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన Mahindra XUV700 కొత్త వేరియంట్: వివరాలు

Mahindra XUV700 రెండు ఇంజన్ ఆప్షన్‌లలో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో మొదటిది 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు రెండవది 2.2-లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్‌. పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 153 బిహెచ్‌పి పవర్‌ను మరియు 360 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక రెండవ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 2.2-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్, ఇది 188 బిహెచ్‌పి పవర్ మరియు 380 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది కూడా 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలను కలిగి ఉంటుంది.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన Mahindra XUV700 కొత్త వేరియంట్: వివరాలు

కొత్త మహీంద్రా XUV700 SUV అద్భుతమైన ఫీచర్స్ కలిగి ఉంటుంది. డ్యూయల్-డిస్ప్లే సెటప్‌ను కలిగి ఉన్న దాని విభాగంలో మొదటి SUV. ఈ డిస్‌ప్లే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌గా పనిచేస్తుంది. ఇందులో వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, కీలెస్ ఎంట్రీ, పుష్ స్టార్ట్/స్టాప్ బటన్ వంటి ఫీచర్లు ఈ ఎస్‌యూవీలో అందించబడ్డాయి.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన Mahindra XUV700 కొత్త వేరియంట్: వివరాలు

అంతే కాకుండా ఈ ఆధునిక SUV లో సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఇందులో ఆటో బూస్టర్ హెడ్‌ల్యాంప్‌లు, స్మార్ట్ డోర్ హ్యాండిల్స్, పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్, పర్సనల్ అలర్ట్ మరియు డ్రైవర్ అలర్ట్ సిస్టమ్ వంటికి ఉన్నాయి. ఈ SUV గరిష్టంగా 80 కిమీ/గం వేగాన్ని చేరుకున్నప్పుడు ఆటోబూస్టర్ హెడ్‌ల్యాంప్‌లు స్వయంచాలకంగా ఆన్ చేయబడతాయి. ఇది చీకటి రోడ్లపై మరింత వెలుతురును అందించడం ద్వారా రాత్రిపూట డ్రైవింగ్‌ను మరింత సౌకర్యవంతంగా చేస్తుంది.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన Mahindra XUV700 కొత్త వేరియంట్: వివరాలు

ఇటీవల మహీంద్రా XUV700 కోసం గ్లోబల్ NCAP నిర్వహించిన క్రాష్ టెస్టులో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకుంది. అడల్ట్ సేఫ్టీ విషయంలో ఈ కారు 17 పాయింట్లకు గాను 16.03 పాయింట్లను స్కోర్ చేసింది. అలాగే, పిల్లల భద్రతలో ఇది 49 పాయింట్లకు గాను 41.66 పాయింట్లను స్కోర్ చేసి మొత్తానికి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ కైవసం చేసుకుంది.

దేశీయ మార్కెట్లో మహీంద్రా XUV700 SUV మొత్తం 5 కలర్ ఆప్సన్స్ లో అందుబటులో ఉంటుంది. అవి రెడ్, సిల్వర్, బ్లాక్, బ్లూ మరియు వైట్ కలర్ ఆప్షన్స్. ఇవన్నీ కూడా చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా, ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటాయి. కంపెనీ తన తన XUV700 లో 6 సీట్స్ వేరియంట్ ని త్వరలో తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. ఇది దేశీయ మార్కెట్లో విడుదలైతే తప్పకుండా మంచి ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాము.

More from DriveSpark

Article Published On: Friday, December 24, 2021, 14:36 [IST]
English summary
Mahindra xuv700 new variant spied testing details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+