Mahindra XUV700; ధరలు, బుకింగ్స్, డెలివరీ & మరిన్ని వివరాలు
Mahindra & Mahindra కంపెనీ దేశీయ మార్కెట్ కోసం తయారుచేస్తున్న అధునాతన ఎస్‌యువి Mahindra XUV700. ఈ కొత్త ఎస్‌యువి గురించి కంపెనీ ఇప్పటికే చాలా సమాచారాన్ని అందించింది. అయితే ఇప్పుడు తాజాగా కంపెనీ యొక్క అన్ని వేరియంట్ల ధరలు, బుకింగ్స్, టెస్ట్ డ్రైవ్ మరియు డెలివరీకి సంబంధించిన మరింత సమాచారం అందించింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

Mahindra XUV700 యొక్క 5 సీటర్ మరియు మాన్యువల్ మోడల్ ధర మాత్రమే ఇంతకు ముందు విడుదల చేసింది. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం దీని ధర రూ. 11.99 లక్షలు. అయితే ఇప్పుడు X7 ఆటోమేటిక్ వేరియంట్ పెట్రోల్ మోడల్ ధర రూ. 19.19 లక్షలు. అదే విధంగా MX 5 సీటర్ మ్యాన్యువల్ డీజిల్ వేరియంట్ ధర రూ. 12.49 లక్షలు.

అంతే కాకుండా AX7 ఆటోమేటిక్ డీజిల్ మోడల్ ధర రూ. 19.79 లక్షలు. ఇదే XUV700 యొక్క టాప్ మోడల్. కొత్త Mahindra XUV700 ధరలు వేరియంట్ వారీగా ఇక్కడ గమనించవచ్చు.
| MX Series | |||
| Fuel Type | 5-Seater (MT) | ||
| MX | Petrol | ₹11.99 Lakh | |
| Diesel | ₹12.49 Lakh | ||
| AndrenoX Series | |||
| Fuel Type | MT | AT | |
| AX3 (5-Seater) | Petrol | ₹13.99 Lakh | ₹15.59 Lakh |
| Diesel | ₹14.59 Lakh** | ₹16.19 Lakh | |
| AX5 (5-Seater) | Petrol | ₹14.99 Lakh** | ₹16.59 Lakh |
| Diesel | ₹15.59 Lakh** | ₹17.19 Lakh** | |
| AX7 (7-Seater) | Petrol | ₹17.59 Lakh | ₹19.19 Lakh |
| Diesel | ₹18.19 Lakh | ₹19.79 Lakh | |
| **Also available in 7-Seater at an additional ₹60,000 | |||

Mahindra XUV700 యొక్క AX3 డీజిల్ మరియు AX5 పెట్రోల్ మరియు డీజిల్ మోడల్స్ కూడా 7 సీటర్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంచబడ్డాయి. అయితే వీటిని కొనుగోలు చేయడానికి మీరు అదనంగా 60,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే Mahindra XUV700 యొక్క AX7 వేరియంట్ మాత్రం స్టాండర్డ్ గా 7 సీట్లను పొందుతుంది.

Mahindra XUV700 AX7 వేరియంట్ రెండు ఆప్సనల్ ప్యాక్ లతో కూడా అందుబాటులో ఉంటుంది. ఇందులో AX7 ఆటోమేటిక్‌లో లగ్జరీ ప్యాక్ కోసం రూ .1.8 లక్షలు మరియు AX7 డీజిల్ ఆటోమేటిక్‌లో ఆల్ వీల్ డ్రైవ్ కోసం రూ .1.3 లక్షలు చేల్లించాల్సి ఉంటుంది.

Mahindra XUV700 అక్టోబర్ 1 నుండి డీలర్‌షిప్‌లలో కస్టమర్లకు అందుబాటులో ఉంది. అయితే మొదటి దశ టెస్ట్ డ్రైవ్ 2021 అక్టోబర్ 02 నుండి ప్రారంభమవుతుంది. మొదటి దశలో, ఢిల్లీ ఎన్‌సిఆర్, బెంగళూరు, ముంబై, హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్, పూణే, ఇండోర్, లక్నో, కోయంబత్తూర్ మరియు వడోదర వంటి ప్రాంతాల్లో ప్రారంభమవుతుంది.
తరువాత రెండవ దశ టెస్ట్ డ్రైవ్ 2021 అక్టోబర్ 07 నుంచి ప్రారంభం కానుంది. ఈ దశలో జైపూర్, సూరత్, పాట్నా, కొచ్చిన్, కటక్, కాన్పూర్, కాలికట్ మరియు నాసిక్ ప్రాంతాల్లో టెస్ట్ డ్రైవ్ ప్రారంభమవుతుంది.

Mahindra XUV700 యొక్క డెలివరీ విషయానికి వస్తే, XUV700 డెలివరీలు అక్టోబర్ 10 లోపు ప్రకటించబడుతుంది. అయితే కంపెనీ ఇందులో ముందుగా పెట్రోల్ మోడల్‌ను డెలివరీ చేస్తుంది. ఆ తర్వాత డీజిల్ మోడల్ డెలివరీ చేయనుంది.

Mahindra XUV700 యొక్క విక్రయాలు త్వరలో ప్రారంభం కానున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ కొత్త SUV 5 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇందులో రెడ్, సిల్వర్, బ్లాక్, బ్లూ మరియు వైట్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి.

XUV700 యొక్క బేస్ వేరియంట్‌కు MX లేదా MX సిరీస్ అని పేరు పెట్టబడింది. ఇది ఒకే ట్రిమ్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది, అయితే అడ్రోనాక్స్ సిరీస్ మూడు ట్రిమ్‌లలో అందుబాటులో ఉంది. అవి AX3, AX5 మరియు AX7 ట్రిమ్స్.

Mahindra XUV700 రెండు ఇంజన్ ఆప్షన్‌లలో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో మొదటిది 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు రెండవది 2.2-లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్. పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 200 బిహెచ్‌పి పవర్‌ను మరియు 380 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఇక రెండవ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 2.2-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్, ఇది 183 బిహెచ్‌పి పవర్ మరియు 420 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది కూడా 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలను కలిగి ఉంటుంది. Mahindra XUV700 నాలుగు డ్రైవింగ్ మోడ్స్ కలిగి ఉంటుంది. అవి జిప్, జామ్, జూమ్ మరియు కస్టమ్ డ్రైవింగ్ మోడ్స్.

Mahindra XUV700 లోని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 7 ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్ విత్ ఇబిడి, ఎలక్ట్రానిక్ లాకింగ్ డిఫరెన్షియల్, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్ మరియు ఆటో హెడ్‌లైట్ బూస్టర్ వంటివి ఉన్నాయి.


Click it and Unblock the Notifications








