టెస్టింగ్‌లో కెమెరాకు చిక్కిన మహీంద్రా ఎక్స్‌యూవీ700: లేటెస్ట్ స్పై చిత్రాలు, వివరాలు

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా, భారత మార్కెట్ కోసం ఎక్స్‌యూవీ700 ('సెవన్ డబల్ ఓ' అని పలకాలి) పేరుతో ఓ సరికొత్త ఎస్‌యూవీని అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసినదే. తాజాగా ఈ ఎస్‌యూవీ టెస్టింగ్‌లో ఉండగా కెమెరాకు చిక్కింది. ఈ లేటెస్ట్ స్పై చిత్రాలలో ఎక్స్‌యూవీ700 యొక్క ఫ్రంట్ మరియు రియర్ డిజైన్ డీటేల్స్ లీక్ అయ్యాయి.

టెస్టింగ్‌లో కెమెరాకు చిక్కిన మహీంద్రా ఎక్స్‌యూవీ700: లేటెస్ట్ స్పై చిత్రాలు, వివరాలు

తాజాగా వెల్లడైన చిత్రాలను గమనిస్తే, మహీంద్రా తమ ఎక్స్‌యూవీ300 కాంపాక్ట్ ఎస్‌యూవీలో ఉపయోగించినట్లుగా డ్రాప్ డౌన్ ఎల్‌ఈడి డిఆర్‌ఎల్ లైటింగ్ థీమ్‌ను ఈ కొత్త ఎక్స్‌యూవీ700లో కూడా కొనసాగించినట్లుగా తెలుస్తోంది మరియు ఇవి సి-ఆకారంలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇందులోని రేడియేటర్ గ్రిల్ మునుపటి మోడళ్ల కంటే పెద్దదిగా అనిపిస్తుంది మరియు ఇది మహీంద్రా యొక్క సిగ్నేచర్ 7 స్లాట్ గ్రిల్ స్టైల్‌లో ఉంటుంది.

టెస్టింగ్‌లో కెమెరాకు చిక్కిన మహీంద్రా ఎక్స్‌యూవీ700: లేటెస్ట్ స్పై చిత్రాలు, వివరాలు

మహీంద్రా తమ ఎక్స్‌యూవీ500 మోడల్ ఫ్రంట్ డిజైన్‌ను చిరుత పులి నుండి ప్రేరణ పొంది డిజైన్ చేసినట్లు గతంలో వెల్లడించిన సంగతి తెలిసినదే. కాగా, ఈ కొత్త ఎక్స్‌యూవీ700 కూడా అదే విధంగా చిరుత ప్రేరేపిత భుజం రేఖను (షోల్డర్ లైన్)ను కలిగి ఉంటుంది. ఈ ఎస్‌యూవీలో కంపెనీ ఫ్లష్ టైప్ డోర్ హ్యాండిల్స్‌ను ఆఫర్ చేయనుంది. రగ్గడ్ లుక్ కోసం ఎస్‌యూవీ చుట్టూ బాడీ క్లాడింగ్ ఉంటుంది.

MOST READ:మాడిఫైడ్ మహీంద్రా థార్.. ఇప్పుడు 22 ఇంచెస్ అల్లాయ్ వీల్‌తో

టెస్టింగ్‌లో కెమెరాకు చిక్కిన మహీంద్రా ఎక్స్‌యూవీ700: లేటెస్ట్ స్పై చిత్రాలు, వివరాలు

ఇక దీని వెనుక డిజైన్‌ను గమనిస్తే, ఇందులో హై-మౌంట్ స్టాప్ లైట్‌తో కూడిన రియర్ రూఫ్ స్పాయిలర్ ఉంటుంది. ఇది ఆప్షనల్‌గా కాకుండా, స్టాండర్డ్ డిజైన్ ఫీచర్‌గా లభించే అవకాశం ఉంది. ఈ టెస్టింగ్ వాహనంలో స్టీల్ వీల్స్‌ని ఉపయోగించారు అయితే, ప్రొడక్షన్ వెర్షన్‌లో ఇందులో మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. ఇంకా ఇందులో ఫంక్షనల్ రూఫ్ రైల్స్ ఉన్నట్లు కనిపిస్తోంది.

టెస్టింగ్‌లో కెమెరాకు చిక్కిన మహీంద్రా ఎక్స్‌యూవీ700: లేటెస్ట్ స్పై చిత్రాలు, వివరాలు

మహీంద్రా ఎక్స్‌యూవీ700 పూర్తిగా సరికొత్త డిజైన్ మరియు ప్లాట్‌ఫామ్‌పై తయారవుతోంది. ఇది ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న మహీంద్రా మోడళ్ల నుండి ఇది పూర్తిగా భిన్నమైనది ఉంటుంది. కంపెనీ ఈ ఎస్‌యూవీని డబ్ల్యూ 601 ప్లాట్‌ఫామ్‌పై తయారు చేయనుంది. మహీంద్రాకు ఇది పూర్తిగా కొత్త ప్లాట్‌ఫామ్ అవుతుంది. లేటెస్ట్ టెక్నాలజీ, స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్‌తో కూడిన ఇంజన్ మరియు ఫస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్లతో ఇది మార్కెట్లోకి రాబోతోంది.

MOST READ:2021 ఏప్రిల్ నెలలో భారీగా తగ్గిన మహీంద్రా ట్రాక్టర్ సేల్స్.. కారణం ఇదే

టెస్టింగ్‌లో కెమెరాకు చిక్కిన మహీంద్రా ఎక్స్‌యూవీ700: లేటెస్ట్ స్పై చిత్రాలు, వివరాలు

ప్రస్తుతానికి మహీంద్రా ఎక్స్‌యూవీ700లో ఆఫర్ చేయబోయే ఇంటీరియర్స్ గురించి పూర్తి సమాచారం లేకపోయినప్పటికీ, ఇందులో అత్యాధునిక కంఫర్ట్, కన్వీనెన్స్ మరియు సేఫ్టీ ఫీచర్లను కంపెనీ అందించనుంది. ఇందులో హై-ఎండ్ లగ్జరీ కార్లలో కనిపించినట్లుగా, డ్యాష్‌బోర్డుపై డ్యూయల్ స్క్రీన్ లేఅవుట్ ఉంటుందని సమాచారం. ఇందులో ఒక స్క్రీన్‌ను ఇన్ఫోటైన్‌మెంట్ కోసం ఉపయోగించనుండగా మరొక స్క్రీన్‌ను ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం ఉపయోగించనున్నారు.

టెస్టింగ్‌లో కెమెరాకు చిక్కిన మహీంద్రా ఎక్స్‌యూవీ700: లేటెస్ట్ స్పై చిత్రాలు, వివరాలు

ఈ కారులోని ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ బ్రాండ్ యొక్క స్వంత కనెక్టింగ్ యాప్‌తో పాటుగా ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే వంటి ఇతర కనెక్టింగ్ యాప్‌లను కూడా సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా, ఇందులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఆటోమేటిక్ వేరియంట్ కోసం హిల్ హోల్డ్ అసిస్ట్, వివిధ డ్రైవ్ మోడ్‌లు మరియు పానోరమిక్ సన్‌రూఫ్, రెండు రకాల సీటింగ్ కాన్ఫిగరేషన్‌లు మొదలైనవి లభ్యం కావచ్చని సమాచారం.

MOST READ:కర్ఫ్యూ సమయంలో పట్టుబడ్డారో.. ఇక అంబులెన్స్‌లోకే, ఎందుకంటే?

టెస్టింగ్‌లో కెమెరాకు చిక్కిన మహీంద్రా ఎక్స్‌యూవీ700: లేటెస్ట్ స్పై చిత్రాలు, వివరాలు

పరిమాణంలో మహీంద్రా ఎక్స్‌యూవీ700 ప్రస్తుతం కంపెనీ విక్రయిస్తున్న ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీ కన్నా పెద్దదిగా మరియు విశాలంగా ఉండనుంది. ఇది కూడా రెండు ఇంజన్ ఆప్షన్లతో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇందులో మొదటిది 2.2-లీటర్ ఎమ్‌హాక్ డీజిల్ ఇంజిన్ మరియు రెండవది 2.0 లీటర్ ఎమ్‌స్టాలియన్ టర్బో పెట్రోల్ ఇంజన్. ప్రస్తు కంపెనీ ఇవే ఇంజన్లను తమ లేటెస్ట్ ఆఫ్-రోడర్ మహీంద్రా థార్‌లోనూ ఉపయోగిస్తోంది.

టెస్టింగ్‌లో కెమెరాకు చిక్కిన మహీంద్రా ఎక్స్‌యూవీ700: లేటెస్ట్ స్పై చిత్రాలు, వివరాలు

అయితే, ఈ ఇంజన్లను మహీంద్రా ఎక్‌యూవీ700 పరిమాణం మరియు బరువుకు తగినట్లుగా రీట్యూన్ చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా, ఇందులో హై-ఎండ్ వేరియంట్లలో కంపెనీ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను కూడా ఆఫర్ చేయవచ్చని సమాచారం. ఈ ఎస్‌యూవీలో లెవల్ - 1 అటానమస్ డ్రైవింగ్ టెక్నాలజీ ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ టెక్నాలజీ సాయంతో డ్రైవర్ అవసరం లేకుండానే కారును కంట్రోల్ చేయవచ్చు మరియు ఆటోమేటిక్‌గా పార్క్ చేయవచ్చు.

MOST READ:కరోనా రోగుల కోసం కార్లనే మొబైల్ హాస్పిటల్స్‌గా మార్చిన యువకులు

టెస్టింగ్‌లో కెమెరాకు చిక్కిన మహీంద్రా ఎక్స్‌యూవీ700: లేటెస్ట్ స్పై చిత్రాలు, వివరాలు

మహీంద్రా ఇప్పటికే ఈ మోడల్‌ను తమ అధికారిక వెబ్‌సైట్‌లో లిస్ట్ చేసింది. ఇందుకోసం కంపెనీ ఓ మైక్రో వెబ్‌సైట్‌ను సృష్టించింది. ఆసక్తి గల కస్టమర్లు అందులో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇలా రిజిస్టర్ చేసుకున్న కస్టమర్లకు కంపెనీ తమ సరికొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీకి సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు తమ రిజిస్టర్డ్ కస్టమర్లకు తెలియజేస్తూ ఉంటుంది.

Image Courtesy: xuv_700_2021_official/Instagram

Most Read Articles

English summary
Mahindra XUV700 Spied Again; New Design Details Revealed. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X