మహీంద్రా ఎక్స్‌యూవీ700 లేటెస్ట్ స్పై పిక్స్ మరియు డిజైన్ డీటేల్స్!

మహీంద్రా అండ్ మహీంద్రా ఎక్స్‌యూవీ700 పేరుతో ఓ సరికొత్త ప్రీమియం ఎస్‌యూవీని విడుదల చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసినదే. కంపెనీ ఇటీవలే ఈ మోడల్ బ్యాడ్జ్‌ని కూడా ఆవిష్కరించింది. అంతేకాకుండా, ఎక్స్‌యూవీ700 కోసం మహీంద్రా ఓ వెబ్‌సైట్‌ను కూడా క్రియేట్ చేసింది.

మహీంద్రా ఎక్స్‌యూవీ700 లేటెస్ట్ స్పై పిక్స్ మరియు డిజైన్ డీటేల్స్!

అయితే, ఇప్పటి వరకూ ఈ మోడల్ ఎలా ఉంటుందనే దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. ప్రస్తుతం కంపెనీ ఈ మోడల్‌ను భారత రోడ్లపై విస్తృతంగా పరీక్షిస్తోంది. ఈ టెస్టింగ్ వాహనం యొక్క డిజైన్ వివరాలు తెలియకుండా కంపెనీ దీనిని పూర్తిగా క్యామోఫ్లేజ్ చేసింది. తాజాగా, పూనే రోడ్లపై ఈ టెస్టింగ్ వాహనం కనిపించింది.

మహీంద్రా ఎక్స్‌యూవీ700 లేటెస్ట్ స్పై పిక్స్ మరియు డిజైన్ డీటేల్స్!

పూనేలో టెస్టింగ్ చేస్తున్న మహీంద్రా ఎక్స్‌యూవీ700ని ఓ నెటిజెన్ తన కెమెరాలో బంధించాడు. ఇందులో ఈ ఎస్‌యూవీ యొక్క రియర్ డిజైన్ వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఎస్‌యూవీ విషయంలో ఇప్పటి వరకూ లభించిన స్పై చిత్రాలలో ఇవే హై-డెఫినిషన్ చిత్రాలు. ఇందులో దాని సైడ్ మరియు రియర్ డిజైన్‌ను చూడొచ్చు.

మహీంద్రా ఎక్స్‌యూవీ700 లేటెస్ట్ స్పై పిక్స్ మరియు డిజైన్ డీటేల్స్!

మహీంద్రా ఎక్స్‌యూవీ700ని కంపెనీ యొక్క డబ్ల్యూ601 మోనోకోక్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించనున్నారు. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఇది పూర్తిగా కొత్త ప్లాట్‌ఫామ్ మరియు ఇది ప్రస్తుత ఎక్స్‌యూవీ500 కన్నా పొడవుగా మరియు వెడల్పుగా ఉంటుంది. కొత్త థార్ మాదిరిగానే ఇది కూడా పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో రానుంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ700 లేటెస్ట్ స్పై పిక్స్ మరియు డిజైన్ డీటేల్స్!

కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ700లో 2.2-లీటర్ ఎమ్-హాక్ డీజిల్ ఇంజన్ మరియు 2.0-లీటర్ ఎమ్-స్టాలియన్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఇంజన్లను ఉపయోగించవచ్చని సమాచారం. మహీంద్రా థార్‌లో కూడా ఇవే ఇంజన్లను ఉపయోగిస్తున్నారు. అయితే, ఎక్స్‌యూవీ700 డిజైన్ మరియు లోడ్ వెయిట్ ప్రకారం, ఈ ఇంజన్లను రీట్యూన్ చేసే అవకాం ఉంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ700 లేటెస్ట్ స్పై పిక్స్ మరియు డిజైన్ డీటేల్స్!

ఈ ఎస్‌యూవీలోని హై-ఎండ్ వేరియంట్లలో కంపెనీ ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌ (4x4)ను అందించవచ్చని సమాచారం. ఈ ఎస్‌యూవీలో లెవల్ - 1 అటానమస్ డ్రైవింగ్ టెక్నాలజీ ఉంటుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ టెక్నాలజీ సాయంతో డ్రైవర్ అవసరం లేకుండానే కారును కంట్రోల్ చేయవచ్చు మరియు ఆటోమేటిక్‌గా పార్క్ చేయవచ్చు.

మహీంద్రా ఎక్స్‌యూవీ700 లేటెస్ట్ స్పై పిక్స్ మరియు డిజైన్ డీటేల్స్!

ఎల్‌ఈడీ టెయిల్ లైట్లు, రూఫ్ మౌంటెడ్ స్టాప్ ల్యాంప్, షార్ప్ ఫిన్ యాంటెన్నా, రూఫ్ రైల్స్ మొదలైన వివరాలను ఈ మహీంద్రా ఎక్స్‌యూవీ700లో స్పై చిత్రాలలో చూడొచ్చు. ఇందులో ఫ్లష్ టైప్ డోర్ హ్యాండిల్స్‌ని ఉపయోగించారు. ఈ ఎస్‌యూవీ చుట్టూ బాడీ క్లాడింగ్ కూడా ఉంటుంది. అలాగే, ఇందులో పెద్ద మల్టీ స్పోక్ అల్లాయ్ వీల్స్‌ను కూడా గమనించవచ్చు.

మహీంద్రా ఎక్స్‌యూవీ700 లేటెస్ట్ స్పై పిక్స్ మరియు డిజైన్ డీటేల్స్!

మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీని కంపెనీ ఈ ఏడాది తృతీయ త్రైమాసికం (అక్టోబర్ 2021) నాటికి భారత మార్కెట్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది. టెస్టింగ్ సమయంలో ఈ వాహనంలో ఈ వాహనంలో కనిపించే అన్ని ఇంటీరియర్ ఫీచర్లను ప్రొడక్షన్ వెర్షన్‌లో కూడా కొనసాగించే అవకాశం ఉంది. సరికొత్త ఫ్రంట్ డిజైన్‌తో రానున్న ఈ మోడల్ మంచి రోడ్ ప్రజెన్స్‌ను కలిగి ఉంటుందని సమాచారం.

మహీంద్రా ఎక్స్‌యూవీ700 లేటెస్ట్ స్పై పిక్స్ మరియు డిజైన్ డీటేల్స్!

ఈ ఎస్‌యూవీ లోపలి ఇంటీరియర్స్ విషయానికి వస్తే, ఇందులని డాష్‌బోర్డ్‌లో డ్యూయల్ ఎల్‌సిడి స్క్రీన్ సెటప్ ఉంటుందని తెలుస్తోంది. ఇందులో ఒక టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ కోసం ఉపయోగించనుండగా మరొక స్క్రీన్‌ను డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం ఉపయోగించనున్నారు. ఇలాంటి వ్యవస్థను మనం మెర్సిడెస్ బెంజ్ వంటి కార్లలో చూడొచ్చు.

మహీంద్రా ఎక్స్‌యూవీ700 లేటెస్ట్ స్పై పిక్స్ మరియు డిజైన్ డీటేల్స్!

ఇంకా ఇందులో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, లేటెస్ట్ కార్ కనెక్ట్ ఫీచర్స్, పవర్డ్ డ్రైవర్ సీట్ మరియు పుష్-బటన్ స్టార్ట్ / స్టాప్ ఫంక్షన్ మొదలైన ఫీచర్లు కూడా లభ్యం కావచ్చు. అంతేకాకుండా, ఇందులో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఎమర్జెన్సీ బ్రేకింగ్ మరియు అటానమస్ పార్కింగ్ అసిస్ట్ వంటి అధునాతన డ్రైవర్ అసిస్ట్ ఫీచర్లను కూడా ఇందులో ఆఫర్ చేసే అవకాశం ఉంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ700 లేటెస్ట్ స్పై పిక్స్ మరియు డిజైన్ డీటేల్స్!

మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీని మార్కెట్లో విడుదల చేసిన తర్వాత, కంపెనీకి ఇది తమ ప్రోడక్ట్ లైనప్‌లో ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా మారనుంది. అలాగే, ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీని కూడా కంపెనీ రీడిజైన్ చేసి 2024 నాటికి విడుదల చేసే అవకాశం ఉంది. ఇది మార్కెట్లోని హ్యుందాయ్ క్రెటా మరియు కియా సెల్టోస్ వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇస్తుందని అంచనా.

Image Courtesy: Abhimanyu Komawar

Most Read Articles

English summary
Mahindra XUV700 Spied Testing In Pune; Latest Spy Pics And Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X