మహీంద్రా ఎక్స్‌యూవీ700లో 12 స్పీకర్లు, 445 వాట్స్ ఆడియో, సోనీ 3డి సౌండ్ సిస్టమ్..

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అధునాతన ఎస్‌యూవీ 'ఎక్స్‌యూవీ700'లో అందించబోయే ఫీచర్ల గురించి కంపెనీ ఒక్కొక్కటిగా వెల్లడి చేస్తూ వస్తోంది. తాజాగా, ఈ కారు లోపల అందించబోయే లెటెస్ట్ మ్యూజిక్ సిస్టమ్ గురించి కంపెనీ వెల్లడించింది.

మహీంద్రా ఎక్స్‌యూవీ700లో 12 స్పీకర్లు, 445 వాట్స్ ఆడియో, సోనీ 3డి సౌండ్ సిస్టమ్..

మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీలో అధునాతన సోనీ ప్రీమియం 3డి ఆడియో సిస్టమ్ ఉంటుందని కంపెనీ తెలిపింది. భారతదేశంలో సౌండ్ బిల్డింగ్ బ్లాక్‌లను ఉపయోగించి, సోనీ యొక్క అంతర్నిర్మిత సౌండ్ సిస్టమ్‌తో తయారు చేసిన మొట్టమొదటి వాహనం ఇదని కంపెనీ పేర్కొంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ700లో 12 స్పీకర్లు, 445 వాట్స్ ఆడియో, సోనీ 3డి సౌండ్ సిస్టమ్..

మహీంద్రా తమ ఎక్స్‌యూవీ700 వాహనాన్ని ఆగస్ట్ 14వ తేదీన సాయంత్రం 4:00 గంటలకు ఆవిష్కరించనున్నట్లు ప్రకటించింది. సోనీ యొక్క సౌండ్ బిల్డింగ్ బ్లాక్స్ అనేది సరికొత్త 360 స్పాటియల్ సౌండ్ టెక్నాలజీ, ఇది మొత్తం ఆడియో అనుభవాన్ని మెరుగుపరుస్తుందని కంపెనీ తెలిపింది. సోనీలోని సౌండ్ ఇంజనీర్లు ఎక్స్‌యూవీ700 క్యాబిన్‌తో సరిపోయేలా ఈ ఆడియో సిస్టమ్‌ను ప్రత్యేకంగా ట్యూన్ చేసి రూపొందించారు.

మహీంద్రా ఎక్స్‌యూవీ700లో 12 స్పీకర్లు, 445 వాట్స్ ఆడియో, సోనీ 3డి సౌండ్ సిస్టమ్..

ఈ సోనీ సౌండ్ సిస్టమ్‌లో 13 ఛానల్ డిఎస్‌పి యాంప్లిఫైయర్, సబ్-వూఫర్‌తో కూడిన 12 కస్టమ్-డిజైన్ స్పీకర్లు, 445 వాట్ ఆడియో అవుట్‌పుట్ మరియు సోనీ యొక్క సౌండ్ బిల్డింగ్ బ్లాక్స్ టెక్నాలజీ ఉంటుంది. ఈ ఆడియో సిస్టమ్‌లోని ప్రత్యేకమైన సౌండ్ బిల్డింగ్ బ్లాక్స్ టెక్నాలజీ వాస్తవిక 3డి ఆడియో అనుభూతిని అందిస్తుందని కంపెనీ తెలిపింది.

మహీంద్రా ఎక్స్‌యూవీ700లో 12 స్పీకర్లు, 445 వాట్స్ ఆడియో, సోనీ 3డి సౌండ్ సిస్టమ్..

రేడియో, ఆన్‌లైన్ స్ట్రీమింగ్, యూఎస్‌బి లేదా మొబైల్ ఫోన్ వంటి అన్ని స్టీరియో సోర్స్‌ల ద్వారా ఇది 3డి సౌండ్‌ను అందిస్తుంది. ప్రయాణీకుల ప్రాధాన్యత ప్రకారం, కస్టమైజ్ చేసుకోగలిగిన ప్రత్యేకమైన సౌండ్ సెట్టింగ్‌లను కూడా ఈ టెక్నాలజీ అందిస్తుంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ700లో 12 స్పీకర్లు, 445 వాట్స్ ఆడియో, సోనీ 3డి సౌండ్ సిస్టమ్..

సోనీ యొక్క 3డి సౌండ్ సిస్టమ్ డిఎస్ఈఈ (డిజిటల్ సౌండ్ ఎన్‌హాన్స్‌మెంట్ ఇంజన్) టెక్నాలజీని కలిగి ఉంటుంది మరియు ఇది కంప్రెస్డ్ ఆడియో ఫైల్స్ యొక్క సౌండ్ క్వాలిటీని కూడా మెరుగుపరచడంలో సహాయపడుతుంది. వాహనం ఎంతటి వేగంలో వెళ్తున్నా సరే, బయటి శబ్దం యొక్క ప్రభావాన్ని తగ్గించడానికి, వాల్యూమ్ మరియు టోనల్ బ్యాలెన్స్‌ని నిర్వహించడానికి ఇందులోని ఎస్‌డివిసి (స్పీడ్ డిపెండెంట్ వాల్యూమ్/ఈక్వలైజర్ కంట్రోల్) టెక్నాలజీ సహాయపడుతుంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ700లో 12 స్పీకర్లు, 445 వాట్స్ ఆడియో, సోనీ 3డి సౌండ్ సిస్టమ్..

ఈ సందర్భంగా సోనీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ నయ్యర్ మాట్లాడుతూ, భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆటోమొబైల్ రంగంలో భాగస్వామ్యంలోకి ప్రవేశిస్తున్నందున సోనీ ఇండియాకు ఇది గర్వించదగ్గ క్షణమని, ప్రతిష్టాత్మకమైన మరియు స్వదేశంలో పెరిగిన మహీంద్రాతో భాగస్వామ్యం కుదుర్చుకోవటం సంతోషంగా ఉందని అన్నారు.

మహీంద్రా ఎక్స్‌యూవీ700లో 12 స్పీకర్లు, 445 వాట్స్ ఆడియో, సోనీ 3డి సౌండ్ సిస్టమ్..

టెక్నాలజీ రంగంలో కొత్త ఆవిష్కరణలు చేయటంలో సోనీ బలమైన పునాదిని కలిగి ఉందని మరియు ఈ సహకారంతో సోనీ తమ నెక్స్ట్ జనరేషన్ ఆడియో అనుభవాన్ని 3డి స్పాటియల్ సౌండ్ ద్వారా వినియోగదారుల ముందుకు తీసుకువస్తుందని ఆన అన్నారు.

మహీంద్రా ఎక్స్‌యూవీ700లో 12 స్పీకర్లు, 445 వాట్స్ ఆడియో, సోనీ 3డి సౌండ్ సిస్టమ్..

అలాగే, మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ ఆటోమోటివ్ డివిజన్ సిఇఒ వీజయ్ నక్రా మాట్లాడుతూ, మహీంద్రాలో, ఎప్పటికప్పుడు అత్యాధునిక సాంకేతికతలు తమ కస్టమర్లకు అందుబాటులో ఉండేలా చూసుకోవడమే తమ ప్రయత్నమని, ఇలాంటి అధునాతన సాంకేతికలతు కలిగిన భారతదేశపు మొట్టమొదటి వాహనంగా ఎక్స్‌యూవీ700ను అందించడానికి తాము సంతోషిస్తున్నామని అన్నారు.

మహీంద్రా ఎక్స్‌యూవీ700లో 12 స్పీకర్లు, 445 వాట్స్ ఆడియో, సోనీ 3డి సౌండ్ సిస్టమ్..

ఈ లేటెస్ట్ సోనీ ఇన్‌బిల్ట్ 3డి సౌండ్ సిస్టమ్, క్యాబిన్ ఎకౌస్టిక్స్‌లో కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేస్తుందని, తమ కస్టమర్లు రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు నిజంగా లీనమయ్యే ఆడియో అనుభవం కోసం రిచ్ మరియు విశాలమైన క్యాబిన్ ఎకౌస్టిక్స్‌ను ఈ ఆడియో సిస్టమ్ ద్వారా ఆస్వాదించవచ్చని ఆయన తెలిపారు.

మహీంద్రా ఎక్స్‌యూవీ700లో 12 స్పీకర్లు, 445 వాట్స్ ఆడియో, సోనీ 3డి సౌండ్ సిస్టమ్..

కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ700లో ఈ లేటెస్ట్ సోనీ ఆడియో సిస్టమ్‌తో పాటుగా కంపెనీ పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు బ్రాండ్ యొక్క లేటెస్ట్ ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేలను కూడా డాష్‌బోర్డ్‌లో ఒకే స్లాబ్ గ్లాస్‌లో అందిస్తోంది. ఈ తరహా డిస్‌ప్లే సెటప్‌ను మనం మెర్సిడెస్ బెంజ్ వంటి హై-ఎండ్ లగ్జరీ కార్లలో మాత్రమే చూస్తుంటాం. రెండు డిస్‌ప్లేలు కూడా అడ్రినాక్స్ టెక్నాలజీని ఉపయోగిస్తాయి.

మహీంద్రా ఎక్స్‌యూవీ700లో 12 స్పీకర్లు, 445 వాట్స్ ఆడియో, సోనీ 3డి సౌండ్ సిస్టమ్..

ఈ కారులో ఆఫర్ చేయబోయే ఇతర ఫీచర్లలో.. ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, ఈ-సిమ్ ఆధారిత ఇంటర్నెట్ కనెక్ట్ టెక్నాలజీ, వాయిస్ అసిస్టెంట్, 6 మరియు 7 సీట్ల కాన్ఫిగరేషన్, పవర్డ్ అండ్ వెంటిలేటెడ్ సీట్లు, యాంబియెంట్ లైటింగ్, డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ మొదలైనవి ఉన్నాయి.

మహీంద్రా ఎక్స్‌యూవీ700లో 12 స్పీకర్లు, 445 వాట్స్ ఆడియో, సోనీ 3డి సౌండ్ సిస్టమ్..

మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీలో కంపెనీ లెవల్ 1 ఏడిఏఎస్ (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) వంటి అత్యుత్తమ శ్రేణి భద్రతా ఫీచర్‌లు కూడా ఉంటాయి, ఇందులో రాడార్-గైడెడ్ క్రూయిజ్ కంట్రోల్, పార్క్ అసిస్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

మహీంద్రా ఎక్స్‌యూవీ700లో 12 స్పీకర్లు, 445 వాట్స్ ఆడియో, సోనీ 3డి సౌండ్ సిస్టమ్..

ఈ ఎస్‌యూవీని 2.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ (200 బిహెచ్‌పి) మరియు 2.2-లీటర్ టర్బో డీజిల్ ఇంజన్ (185 బిహెచ్‌పి) ఇంజన్లతో ఆఫర్ చేయనున్నారు. ఇవి రెండూ కూడా మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లతో మరియు బహుశా ప్యాడిల్ షిఫ్టర్‌లతో కూడా అందుబాటులోకి రావచ్చని భావిస్తున్నారు.

Most Read Articles

English summary
Mahindra xuv700 suv gets sony 3d audio system details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X