కొత్త XUV700లో వెళ్తుంటే కన్వర్టిబిల్ కార్ లాంటి ఫీల్; సెగ్మెంట్లో కెల్లా అతిపెద్ద సన్‌రూఫ్!

ఎస్‌యూవీల తయారీలో ప్రసిద్ధి చెందిన ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా, ఎక్స్‌యూవీ700 ('సెవన్ డబల్ ఓ' అని పలకాలి) పేరుతో ఓ సరికొత్త ఎస్‌యూవీని ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసినదే. తాజాగా ఈ ఎస్‌యూవీకి సంబంధించిన మరో కొత్త ఫీచర్ గురించి కంపెనీ ఓ టీజర్ వీడియోని విడుదల చేసింది.

కొత్త XUV700లో వెళ్తుంటే కన్వర్టిబిల్ కార్ లాంటి ఫీల్; సెగ్మెంట్లో కెల్లా అతిపెద్ద సన్‌రూఫ్!

కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ700 సెగ్మెంట్లో కెల్లా అతిపెద్ద సన్‌రూఫ్ ఫీచర్‌తో రాబోతోందని కంపెనీ ప్రకటించింది. ఈ ఫీచర్ వలన ఎక్స్‌యూవీ700 కారులో ప్రయాణిస్తుంటే, ఓ కన్వర్టిబల్ కారులో ప్రయాణిస్తున్న అనుభూతి కలుగుతుందని మహీంద్రా తమ టీజర్‌లో పేర్కొంది. ఈ సన్‌రూఫ్ ఫీచర్‌ను స్కైరూఫ్ ఫీచర్‌గా మహీంద్రా అభివర్ణిస్తోంది.

కొత్త XUV700లో వెళ్తుంటే కన్వర్టిబిల్ కార్ లాంటి ఫీల్; సెగ్మెంట్లో కెల్లా అతిపెద్ద సన్‌రూఫ్!

అంతర్జాతీయ మార్కెట్లలో లభిస్తున్న టెస్లా వంటి కొన్ని కార్లలో పైకప్పు (రూఫ్) భాగాన్ని మెటల్‌తో కాకుండా పారదర్శక గ్లాస్‌తో డిజైన్ చేయబడి ఉంటుంది. ఇలాంటి డిజైన్ ఇన్ఫైనేట్ స్కైరూఫ్ అని కూడా పిలుస్తుంటారు. అంటే కారులో నుండి తలపైకెత్తి చూస్తే, ఆకాశం మొత్తం మన కళ్ల ముందు అపరిమితంగా ప్రత్యక్షమవుతుందన్నమాట. మహీంద్రా కూడా ఈ తరహా ఫీచర్‌నే తమ కొత్త ఎక్స్‌యూవీ700 కారులో ఆఫర్ చేయబోతోంది.

కొత్త XUV700లో వెళ్తుంటే కన్వర్టిబిల్ కార్ లాంటి ఫీల్; సెగ్మెంట్లో కెల్లా అతిపెద్ద సన్‌రూఫ్!

మహీంద్రా అండ్ మహీంద్రా తమ కొత్త ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీని 2021లోనే మార్కెట్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. టీజర్ వీడియోలో కూడా కంపెనీ ఇదే విషయాన్ని ధృవీకరించింది. మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీని కంపెనీ భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేయడానికి ముందే, దాని ఫీచర్లను ఒక్కక్కటిగా హైలైట్ చేస్తూ వస్తోంది.

ఇటీవల, కంపెనీ మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీకి సంబంధించి ఆటో బూస్టర్ హెడ్‌ల్యాంప్ ఫీచర్ వివరాలను కూడా వెల్లడి చేసింది. ఎక్స్‌యూవీ700లో రాత్రి సమయంలో గంటకు 80 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు, కారు దానిని ఆటోమేటిక్‌గా గుర్తించి, అదనపు భద్రత కోసం హెడ్‌లైట్ రోడ్డుపై వెదజల్లే కాంతి దూరాన్ని ఆటోమేటిక్‌గా పెంచుతుంది.

కొత్త XUV700లో వెళ్తుంటే కన్వర్టిబిల్ కార్ లాంటి ఫీల్; సెగ్మెంట్లో కెల్లా అతిపెద్ద సన్‌రూఫ్!

మహీంద్రా ఇప్పుడు తమ ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీ యొక్క స్కైరూఫ్ ఫీచర్ గురించి చెబుతోంది. సమాచారం ప్రకారం, కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ700 యొక్క స్కైరూఫ్ పొడవు 1,360 మిమీ మరియు వెడల్పు 870 మిమీగా ఉంటుంది. ప్రస్తుతం, భారత మార్కెట్లో లభిస్తున్న ఎమ్‌జి హెక్టర్, జీప్ కంపాస్, టాటా హారియర్, ఎమ్‌జి జెడ్‌ఎస్ ఇవి మరియు టాటా సఫారి వంటి కొన్ని ఎస్‌యూవీలు పెద్ద పానోరమిక్ సన్‌రూఫ్ ఫీచర్లతో లభిస్తున్నాయి.

కొత్త XUV700లో వెళ్తుంటే కన్వర్టిబిల్ కార్ లాంటి ఫీల్; సెగ్మెంట్లో కెల్లా అతిపెద్ద సన్‌రూఫ్!

త్వరలోనే ఈ జాబితాలో కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ700 పేరు కూడా చేర్చబడుతుంది. వాస్తవానకి ఈ ఫ్యూచరిస్టిక్ ఎస్‌యూవీ ఇప్పటికే భారత మార్కెట్లో విడుదల కావల్సి ఉంది. కానీ, దేశంలో కొనసాగుతున్న కరోనా మహమ్మారి కారణంగా ఈ కారు విడుదల ఆలస్యమైంది. మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీని సరికొత్త డబ్ల్యూ601 మోనోకోక్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించనున్నారు. ఇది ప్రస్తుత ఎక్స్‌యూవీ500 కన్నా ఎక్కువ పొడవు, వెడల్పులను కలిగి ఉంటుంది.

కొత్త XUV700లో వెళ్తుంటే కన్వర్టిబిల్ కార్ లాంటి ఫీల్; సెగ్మెంట్లో కెల్లా అతిపెద్ద సన్‌రూఫ్!

కొత్త 2021 మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీని పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. డీజిల్ వెర్షన్‌లో 2.2-లీటర్ ఎమ్-హాక్ డీజిల్ ఇంజన్‌ను మరియు పెట్రోల్ వెర్షన్‌లో 2.0-లీటర్ ఎమ్-స్టాలియన్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించవచ్చని సమాచారం. కొత్త తరం మహీంద్రా థార్‌లో కూడా ఇవే ఇంజన్లను ఉపయోగిస్తున్నారు. అయితే, ఎక్స్‌యూవీ700 డిజైన్ మరియు లోడ్ వెయిట్ ప్రకారం, ఈ ఇంజన్లను రీట్యూన్ చేసే అవకాం ఉంది.

కొత్త XUV700లో వెళ్తుంటే కన్వర్టిబిల్ కార్ లాంటి ఫీల్; సెగ్మెంట్లో కెల్లా అతిపెద్ద సన్‌రూఫ్!

మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీలో మరింత నిటారుగా ఉండే ఫ్రంట్ గ్రిల్, ప్రత్యేకమైన ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్‌లతో కూడిన కొత్త సి-ఆకారపు హెడ్‌లైట్స్, కొత్త టెయిల్‌ లైట్స్, కొత్త అల్లాయ్ వీల్స్ డిజైన్, మజిక్యులర్ బోనెట్ వంటి డిజైన్ ఎలిమెంట్స్ ఉండన్నాయి. ఇందులోని డోర్ హ్యాండిల్స్ ఫ్లష్-మౌంటెడ్ లివర్లుగా ఉంటాయి. ఇవి ఎస్‌యూవీకి మరింత ఆధునిక రూపాన్ని జోడిస్తాయి.

కొత్త XUV700లో వెళ్తుంటే కన్వర్టిబిల్ కార్ లాంటి ఫీల్; సెగ్మెంట్లో కెల్లా అతిపెద్ద సన్‌రూఫ్!

ఇంటీరియర్స్ విషయానికి వస్తే, ఈ విభాగంలో కెల్లా అత్యాధునిక కంఫర్ట్ మరియు సేఫ్టీ ఫీచర్లతో కొత్త ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీని అందించనున్నారు. మెర్సిడెస్ బెంజ్ వంటి హై-ఎండ్ లగ్జరీ కార్లలో కనిపించినట్లుగా, డ్యాష్‌బోర్డుపై డ్యూయల్ స్క్రీన్ లేఅవుట్ ఉంటుందని సమాచారం. ఇందులో ఒకటి ఇన్ఫోటైన్‌మెంట్ కోసం, మరొకటి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం ఉపయోగించే అవకాశం ఉంది.

కొత్త XUV700లో వెళ్తుంటే కన్వర్టిబిల్ కార్ లాంటి ఫీల్; సెగ్మెంట్లో కెల్లా అతిపెద్ద సన్‌రూఫ్!

ఈ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ బ్రాండ్ యొక్క స్వంత కనెక్టింగ్ యాప్‌తో పాటుగా ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే వంటి ఇతర యాప్‌లను కూడా సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా, ఇందులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఆటోమేటిక్ వేరియంట్ కోసం హిల్ హోల్డ్ అసిస్ట్, వివిధ డ్రైవ్ మోడ్‌లు మరియు రెండు రకాల (6/7) సీటింగ్ కాన్ఫిగరేషన్‌లు మొదలైన ఫీచర్లు ఉండొచ్చని సమాచారం.

Most Read Articles

English summary
Mahindra XUV700 To Get Largest Skyroof In The Segment: Teaser Video Out, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X