XUV700 డెలివరీల జాప్యం.. సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న అసహనం.. ఒక కస్టమర్ అయితే ఏకంగా..

మహీంద్రా కంపెనీ దేశీయ మార్కెట్లో తన XUV700 లాంచ్ చేసినప్పటినుంచి కూడా మంచి ఆదరణ పొందుతోంది. ఈ కారణంగానే కంపెనీ మంచి బుకింగ్స్ స్వీకరించింది. కంపెనీ ఇప్పటివరకు దాదాపు 70,000 కంటే ఎక్కువ బుకింగ్స్ పొందింది. అయితే డెలివరీలలో మాత్రం జాప్యం జరుగుతూనే ఉంది. దీనిపై చాలామంది అసహనం వ్యక్తం చేస్తున్నారు.

XUV700 డెలివరీల జాప్యం.. సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న అసహనం.. ఒక కస్టమర్ అయితే ఏకంగా..

ఇటీవల, మహీంద్రా XUV700 డెలివరీపై కంపెనీ అందించిన సందేశంపై మంది పడ్డాడు. ఆ కస్టమర్ కి కంపెనీ 2023 మే నెలలో డెలివరీ చేయనున్నట్లు డెలివరీ టైమ్‌లైన్‌ను అందించింది. ఇది చూసిన కస్టమర్.. టీమ్ మహీంద్రా, మీరు డెలివరీ చేయలేనప్పుడు మీరు ఎందుకు తయారు చేస్తారు? ఆనంద్ మహీంద్రా జీ, బుకింగ్ మొత్తం వడ్డీ లాభం ఎంత? న్యూ ఇండియా?' అని రాసాడు.

XUV700 డెలివరీల జాప్యం.. సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న అసహనం.. ఒక కస్టమర్ అయితే ఏకంగా..

దీన్ని బట్టి చూస్తే బుక్ చేసుకున్న కస్టమర్లు ఎంత అసహనం వ్యక్తం చేస్తున్నారో అర్థమవుతుంది. మహీంద్రా కంపెనీ అందించిన సమాచారం ప్రకారం ఇప్పుడు బుక్ చేసుకున్న కస్టమర్లకు 2023 లో డెలివెరీ చేయనున్నట్లు తెలిపింది. దీన్ని బట్టి చూస్తే కొత్త మహీంద్రా XUV700 డెలివరీ పొందటానికి కనీసం ఒక సంవత్సరం కంటే ఎక్కువ సమయం వేచి ఉండాల్సి ఉంటుంది.

XUV700 డెలివరీల జాప్యం.. సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న అసహనం.. ఒక కస్టమర్ అయితే ఏకంగా..

ప్రస్తుతం దేశంలో సెమీకండక్టర్ చిప్ కొరత కారణంగా, డెలివరీ చాలా ఆలస్యం అవుతోంది. కావున చాలా మంది బుక్ చేసుకున్న కస్టమర్లు క్యాన్సిల్ చేసుకోవడానికి చూస్తున్నారు. అదే సమయంలో మహీంద్రా XUV700 యొక్క ప్రత్యర్థులను బుక్ చేసుకోవడానికి కూడా చూస్తున్నారు. ఇదే జరిగితే కంపెనీ యొక్క ఈ కారుకి కొంత డిమాండ్ తగ్గే అవకాశం ఉంటుంది.

XUV700 డెలివరీల జాప్యం.. సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న అసహనం.. ఒక కస్టమర్ అయితే ఏకంగా..

ప్రస్తుతం మార్కెట్లో మహీంద్రా కంపెనీ మాత్రమే కాకుండా, చిప్ కొరత కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అయితే డిసెంబర్ నెలలో ఈ పరిస్థితి కొంత మెరుగుపడే అవకాశం ఉంటుంది అని నిపుణులు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం కరోనా మహమ్మారి యొక్క కొత్త వేరియంట్ వల్ల అది కాస్త మళ్ళీ పొడిగింపుకు గురయ్యే అవకాశం ఉంటుంది.

XUV700 డెలివరీల జాప్యం.. సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న అసహనం.. ఒక కస్టమర్ అయితే ఏకంగా..

సెమీకండక్టర్ చిప్ కొరతలను నివారించడానికి, చాలా కంపెనీలు కొత్త సెమీకండక్టర్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయడానికి పూనుకుంటున్నాయి. ఇందులో భాగంగా టాటా కంపెనీ ముందడుగు వేస్తోంది. అయితే ఇది భవిష్యత్ లో అందుబాటులో ఉంటుంది.

మహీంద్రా XUV700 యొక్క పెట్రోల్ వేరియంట్ డెలివరీలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అయితే ఈ మధ్యకాలంలోనే కంపెనీ తన డీజిల్ మోడల్ డెలివరీలను కూడా ప్రారంభించింది. పెట్రోల్ మోడల్ డెలివరీలు కొంత వేగవంతంగా జరుగుతున్నాయి. అయితే డీజిల్ మోడల్స్ ఆశించినంత వేగంగా డెలివరీలు జరగటం లేదు.

XUV700 డెలివరీల జాప్యం.. సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న అసహనం.. ఒక కస్టమర్ అయితే ఏకంగా..

మహీంద్రా కంపెనీ దీపావళి సమయంలో 700 కంటే ఎక్కువ XUV700 యూనిట్లను డెలివరీ చేసింది. అయితే కంపెనీ ప్రణాళిక ప్రకారం 2022 జనవరి 14 లోపు దాదాపు 14,000 యూనిట్లను డెలివరీ చేయవలసి ఉంది. ప్రస్తుతం కంపెనీ ఈ లక్ష్యం దిశగా అడుగులు వేస్తోంది.

XUV700 డెలివరీల జాప్యం.. సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న అసహనం.. ఒక కస్టమర్ అయితే ఏకంగా..

2021 నవంబర్ నెలలో కంపెనీ 3,207 యూనిట్ల వాహనాలను డెలివరీ చేసింది, కావున 2021 డిసెంబర్ నెలలో కూడా అదే వేగంతో వాహనాలను డెలివరీ చేయాల్సి ఉంటుంది. కంపెనీ సగటున 3200 నుంచి 3300 యూనిట్లను డెలివరీ చేయబోతోంది. దీన్ని బట్టి చూస్తే 70,000 యూనిట్ల డెలివరీకి ఎక్కువ సమయం వేచి ఉండాల్సి ఉంటుంది.

XUV700 డెలివరీల జాప్యం.. సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న అసహనం.. ఒక కస్టమర్ అయితే ఏకంగా..

మహీంద్రా కంపెనీ తన XUV700 SUV ని రూ. 12.49 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధర వద్ద విక్రయిస్తోంది. ఇందులో టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ. 22.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). కంపెనీ ఈ కారును మొత్తం నాలుగు వేరియంట్లలో విక్రయిస్తోంది. అవి MX, AX3, AX5 మరియు AX7 వేరియంట్‌లు.

XUV700 డెలివరీల జాప్యం.. సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న అసహనం.. ఒక కస్టమర్ అయితే ఏకంగా..

కొత్త మహీంద్రా XUV700 SUV అద్భుతమైన ఫీచర్స్ కలిగి ఉంటుంది. డ్యూయల్-డిస్ప్లే సెటప్‌ను కలిగి ఉన్న దాని విభాగంలో మొదటి SUV. ఈ డిస్‌ప్లే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌గా పనిచేస్తుంది. ఇందులో వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, కీలెస్ ఎంట్రీ, పుష్ స్టార్ట్/స్టాప్ బటన్ వంటి ఫీచర్లు ఈ ఎస్‌యూవీలో అందించబడ్డాయి.

XUV700 డెలివరీల జాప్యం.. సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న అసహనం.. ఒక కస్టమర్ అయితే ఏకంగా..

అంతే కాకుండా ఈ ఆధునిక SUV లో సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఇందులో ఆటో బూస్టర్ హెడ్‌ల్యాంప్‌లు, స్మార్ట్ డోర్ హ్యాండిల్స్, పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్, పర్సనల్ అలర్ట్ మరియు డ్రైవర్ అలర్ట్ సిస్టమ్ వంటికి ఉన్నాయి. ఈ SUV గరిష్టంగా 80 కిమీ/గం వేగాన్ని చేరుకున్నప్పుడు ఆటోబూస్టర్ హెడ్‌ల్యాంప్‌లు స్వయంచాలకంగా ఆన్ చేయబడతాయి. ఇది చీకటి రోడ్లపై మరింత వెలుతురును అందించడం ద్వారా రాత్రిపూట డ్రైవింగ్‌ను మరింత సౌకర్యవంతంగా చేస్తుంది.

XUV700 డెలివరీల జాప్యం.. సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న అసహనం.. ఒక కస్టమర్ అయితే ఏకంగా..

Mahindra XUV700 రెండు ఇంజన్ ఆప్షన్‌లలో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో మొదటిది 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు రెండవది 2.2-లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్‌. పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 153 బిహెచ్‌పి పవర్‌ను మరియు 360 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక రెండవ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 2.2-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్, ఇది 188 బిహెచ్‌పి పవర్ మరియు 380 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది కూడా 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలను కలిగి ఉంటుంది.

XUV700 డెలివరీల జాప్యం.. సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న అసహనం.. ఒక కస్టమర్ అయితే ఏకంగా..

ఇటీవల మహీంద్రా XUV700 కోసం గ్లోబల్ NCAP నిర్వహించిన క్రాష్ టెస్టులో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకుంది. అడల్ట్ సేఫ్టీ విషయంలో ఈ కారు 17 పాయింట్లకు గాను 16.03 పాయింట్లను స్కోర్ చేసింది. అలాగే, పిల్లల భద్రతలో ఇది 49 పాయింట్లకు గాను 41.66 పాయింట్లను స్కోర్ చేసి మొత్తానికి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ కైవసం చేసుకుంది.

More from DriveSpark

Article Published On: Saturday, December 11, 2021, 14:39 [IST]
English summary
Mahindra xuv700 waiting period more than one year details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+