కొత్త Hyundai i20 N-Line మరియు స్టాండర్డ్ i20 మోడళ్ల మధ్య తేడా ఏంటి?

దక్షిణ కొరియాకి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ Hyundai Motor India, దేశీయ విపణిలో తమ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోను విస్తరించే దిశలో భాగంగా, భారత మార్కెట్లో తమ మొట్టమొదటి N-Line సిరీస్ ఉత్పత్తిని విడుదల చేసింది. భారత మార్కెట్లో Hyundai i20 N-Line పేరుతో కంపెనీ తమ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ను ఓ సరికొత్త అవతార్ లో ప్రవేశపెట్టింది.

కొత్త Hyundai i20 N-Line మరియు స్టాండర్డ్ i20 మోడళ్ల మధ్య తేడా ఏంటి?

ఈ కొత్త Hyundai i20 N-Line తో పాటుగా కంపెనీ తమ ప్రస్తుత స్టాండర్డ్ Hyundai i20 కారుని కూడా విక్రయిస్తోంది. స్టాండర్డ్ i20 మోడల్‌లో అనేక కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ చేసి కంపెనీ ఈ స్పోర్టీ అండ్ స్టైలిష్ వెర్షన్ i20 N-Line ను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది.

కొత్త Hyundai i20 N-Line మరియు స్టాండర్డ్ i20 మోడళ్ల మధ్య తేడా ఏంటి?

భారత మార్కెట్లో ఈ కొత్త Hyundai i20 N-Line ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ N6 మరియు N8 అనే రెండు వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. మరి ఈ కొత్త i20 N-Line హ్యాచ్‌బ్యాక్ కు మరియు స్టాండర్డ్ i20 హ్యాచ్‌బ్యాక్ మధ్య ఉన్న తేడాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

కొత్త Hyundai i20 N-Line మరియు స్టాండర్డ్ i20 మోడళ్ల మధ్య తేడా ఏంటి?

i20 N-Line వర్సెస్ స్టాండర్డ్ i20: ధర

ఈ రెండు మోడళ్ల ధరల విషయానికి వస్తే, మార్కెట్లోకి కొత్తగా వచ్చిన Hyundai i20 N-Line రెండు వేరియంట్లలో విడుదల చేయబడింది. అయితే, కంపెనీ ఇంకా వీటి ధరలను అధికారికంగా వెల్లడించలేదు. మార్కెట్ అంచనా ప్రకారం, ఇవి సుమారు రూ. 11 లక్షల నుండి రూ. 13 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో అందుబాటులో ఉండొచ్చని తెలుస్తోంది.

కొత్త Hyundai i20 N-Line మరియు స్టాండర్డ్ i20 మోడళ్ల మధ్య తేడా ఏంటి?

ఇక, స్టాండర్డ్ Hyundai i20 విషయానికి వస్తే, కంపెనీ ఈ కారును మొత్తం మూడు ట్రిమ్‌లలో (మాగ్నా, స్పోర్ట్జ్ మరియు ఆస్టాలో) విక్రయిస్తోంది. ఈ ట్రిమ్‌లలో వివిధ రకాల ఇంజన్ ఆప్షన్‌లతో లభిస్తున్నాయి. ఈ ఇంజన్లు మాన్యువల్, ఐఎమ్‌టి మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లలతో అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం, దేశీయ విపణిలో స్టాండర్డ్ i20 ధరలు రూ. 6.91 లక్షల నుండి రూ. 10.77 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో అమ్ముడవుతున్నాయి.

కొత్త Hyundai i20 N-Line మరియు స్టాండర్డ్ i20 మోడళ్ల మధ్య తేడా ఏంటి?

i20 N-Line వర్సెస్ స్టాండర్డ్ i20: ఇంజన్

కొత్త Hyundai i20 N-Line ఇంజన్ విషయానికి వస్తే, ఇది కేవలం 1.0 లీటర్, 3-సిలిండర్, టర్బో-పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ తో మాత్రమే లభిస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 118 బిహెచ్‌పి పవర్ ను మరియు 172 న్యూటన్ మీటర్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ ఐఎమ్‌టి మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది.

కొత్త Hyundai i20 N-Line మరియు స్టాండర్డ్ i20 మోడళ్ల మధ్య తేడా ఏంటి?

అలాగే, స్టాండర్డ్ Hyundai i20 ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే, ఇందులో మూడు రకాల ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. వీటిలో రెండు పెట్రోల్ ఇంజన్లు మరియు ఒక డీజిల్ ఇంజన్ ఉంటుంది. స్టాండర్డ్ Hyundai i20 లోని 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ నే కొత్త i20 N-Line లోనూ ఉపయోగించారు. రెండు మోడళ్లలో దీని పవర్, టార్క్ గణాంకాలు ఒకేలా ఉంటాయి.

కొత్త Hyundai i20 N-Line మరియు స్టాండర్డ్ i20 మోడళ్ల మధ్య తేడా ఏంటి?

ఇకపోతే, స్టాండర్డ్ i20 లోని రెండవ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ 1.2 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్. ఈ ఇంజన్ గరిష్టంగా 83 బిహెచ్‌పి పవర్ ను మరియు 240 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ మరియు సివిటి గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

కొత్త Hyundai i20 N-Line మరియు స్టాండర్డ్ i20 మోడళ్ల మధ్య తేడా ఏంటి?

ఇవి రెండూ కాకుండా స్టాండర్డ్ Hyundai i20 డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో కూడా లభిస్తుంది. ఇందులోని 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 100 బిహెచ్‌పి పవర్ ను మరియు 240 న్యూటన్ మీటర్ టార్క్ ను జనరేట్ చేస్తుంది. ఈ ఇంజన్ కేవలం 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తుంది.

కొత్త Hyundai i20 N-Line మరియు స్టాండర్డ్ i20 మోడళ్ల మధ్య తేడా ఏంటి?

i20 N-Line వర్సెస్ స్టాండర్డ్ i20: పరిమాణం

పరిమాణం పరంగా, కొత్త Hyundai i20 N-Line మరియు స్టాండర్డ్ Hyundai i20 రెండూ ఒకేలా ఉంటాయి. ఈ రెండు మోడళ్ల పొడవు 3,995 మిమీ, వెడల్పు 1,775 మిమీ మరియు ఎత్తు 1,505 మిమీగా ఉంటుంది. వీటి వీల్‌బేస్ 2,580 మిమీ మరియు గ్రౌండ్ క్లియరెన్స్ 170 మిమీగా ఉంటుంది. కాబట్టి, ఈ రెండు మోడళ్ల క్యాబిన్ స్పేస్ మరియు బూట్ స్పేస్‌లు కూడా ఒకేలా ఉంటాయి.

కొత్త Hyundai i20 N-Line మరియు స్టాండర్డ్ i20 మోడళ్ల మధ్య తేడా ఏంటి?

i20 N-Line వర్సెస్ స్టాండర్డ్ i20: ఎక్స్‌టీరియర్

కొత్త Hyundai i20 N-Line ప్రధానమైన మార్పులన్నీ దాని ఎక్స్టీరియర్‌లో చేయబడ్డాయి. ఇందులో హాలోజన్ హెడ్‌లైట్, హాలోజన్ ప్రొజెక్టర్ ఫాగ్ ల్యాంప్స్, ఎల్‌ఈడి టెయిల్ లైట్, బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్, ఎలక్ట్రిక్ టెయిల్‌గేట్ ఓపెనింగ్, బ్లాక్ కలర్ సైడ్ మిర్రర్స్, సైడ్ మిర్రర్లపై టర్న్ ఇండికేటర్స్, సన్‌రూఫ్, స్పోర్టీ గ్రిల్ మరియు చాలా చోట్ల స్పోర్టీ రెడ్ ఎలిమెంట్స్ ఇది స్పోర్టీగా మరియు స్టైలిష్‌గా కనిపిస్తుంది.

కొత్త Hyundai i20 N-Line మరియు స్టాండర్డ్ i20 మోడళ్ల మధ్య తేడా ఏంటి?

ఇక స్టాండర్డ్ Hyundai i20 విషయానికి వస్తే, ఈ కారులో ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్స్, హాలోజన్ ప్రొజెక్టర్ ఫాగ్‌ల్యాంప్‌లు, ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు, రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ గ్రిల్, ఎల్ఈడి టెయిల్ లైట్, రూఫ్ యాంటెన్నా, బాడీ కలర్ బంపర్స్, క్రోమ్ డోర్ హ్యాండిల్స్, బాడీ కలర్ సైడ్ మిర్రర్లు మొదలైనవి ఉన్నాయి.

కొత్త Hyundai i20 N-Line మరియు స్టాండర్డ్ i20 మోడళ్ల మధ్య తేడా ఏంటి?

i20 N-Line వర్సెస్ స్టాండర్డ్ i20: ఇంటీరియర్

కొత్త Hyundai i20 N-Line ఇంటీరియర్స్‌లో కూడా బయటి వైపు మాదిరిగానే స్పోర్టీ క్యారెక్టర్‌ను ముందుకు తీసుకువెళ్లడం కోసం ఇందులో ఫ్రంట్ బకెట్ స్టైల్ సీట్లు, N బ్రాండ్ అప్‌హోలెస్ట్రీ, స్పోర్టీ స్టీరింగ్ వీల్ మరియు క్యాబిన్ లోపల చాలా చోట్ల రెడ్ కలర్ హైలైట్‌లు ఇవ్వబడ్డాయి. దీని వలన ఇది చాలా స్పోర్టీగా కనిపిస్తుంది. ఓవరాల్ క్యాబిన్ లేఅవుట్ బ్లాక్ కలర్‌లో ఉంటుంది.

కొత్త Hyundai i20 N-Line మరియు స్టాండర్డ్ i20 మోడళ్ల మధ్య తేడా ఏంటి?

స్టాండర్డ్ Hyundai i20 ఇంటీరియర్స్ విషయానికి వస్తే, ఇందులో మౌంటెడ్ కంట్రోల్స్‌తో కూడిన కొత్త స్టీరింగ్ వీల్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సాఫ్ట్ టచ్ మెటీరియల్స్, ప్రీమియం అప్‌హోలెస్ట్రీ, యాంబియంట్ లైటింగ్ మరియు వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి అంశాలు ఉన్నాయి.

కొత్త Hyundai i20 N-Line మరియు స్టాండర్డ్ i20 మోడళ్ల మధ్య తేడా ఏంటి?

i20 N-Line వర్సెస్ స్టాండర్డ్ i20: ఫీచర్లు

ఇక ఫీచర్ల పరంగా చూసుకుంటే, Hyundai i20 N-Line లో 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, సన్‌రూఫ్, 7-స్పీకర్లతో కూడిన బోస్ సౌండ్ సిస్టమ్ మరియు వాయిస్ రికగ్నిషన్ ఫీచర్స్ వంటివి లభిస్తాయి.

కొత్త Hyundai i20 N-Line మరియు స్టాండర్డ్ i20 మోడళ్ల మధ్య తేడా ఏంటి?

అలాగే, స్టాండర్డ్ Hyundai i20 కారులో కూడా 7 స్పీకర్స్ బోస్ సౌండ్ సిస్టమ్, సబ్‌వూఫర్ ఇన్ బూట్, డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్టర్, మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబిఎస్ విత్ ఈబిడి, రివర్స్ పార్కింగ్ కెమెరా వంటి ఫీచర్లు లభిస్తాయి.

Most Read Articles

English summary
Major differences between hyundai i20 n line vs standard i20
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X