టాటా కార్లపై మార్చి 2021 ఆఫర్లు, రూ.65,000 వరకూ డిస్కౌంట్లు!

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్, మార్చి 2021 నెలలో భాగంగా తమ కార్లపై వివిధ రకాల ఆఫర్లు మరియు డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ నెలలో ఎంపిక చేసిన మోడళ్లపై కంపెనీ రూ.65,000 వరకూ డిస్కౌంట్లను అందిస్తోంది. టాటా టియాగో, టిగోర్, నెక్సాన్ మరియు హారియర్ వాహనాల కొనుగోలుపై కస్టమర్లు ఈ డిస్కౌంట్లను పొందవచ్చు.

టాటా కార్లపై మార్చి 2021 ఆఫర్లు, రూ.65,000 వరకూ డిస్కౌంట్లు!

టాటా కార్లపై అందిస్తున్న ఈ ఆఫర్లు మార్చి 31, 2021వ తేదీ వరకు చెల్లుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. టాటా ఆల్ట్రోస్ మరియు కొత్తగా విడుదల చేసిన సఫారీ మోడళ్లపై ప్రస్తుతం కంపెనీ ఎలాంటి ఆఫర్లు లేవు. వివిధ టాటా కార్లపై కంపెనీ అందిస్తున్న డిస్కౌంట్ల వివరాలు ఇలా ఉన్నాయి:

టాటా కార్లపై మార్చి 2021 ఆఫర్లు, రూ.65,000 వరకూ డిస్కౌంట్లు!

టాటా మోటార్స్ యొక్క ఎంట్రీ లెవల్ కార్ టాటా టియాగోపై కంపెనీ మార్చి 2021 నెల ఆఫర్లలో భాగంగా, రూ.25,000 వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ నెలలో టాటా టియాగో కొనుగోలుపై కస్టమర్లు రూ.15,000 నగదు డిస్కౌంట్ మరియు రూ.10,000 ఎక్సేంజ్ బోనస్‌లను పొందవచ్చు.

టాటా కార్లపై మార్చి 2021 ఆఫర్లు, రూ.65,000 వరకూ డిస్కౌంట్లు!

అలాగే, కంపెనీ విక్రయిస్తున్న ఎంట్రీ లెవల్ కాంపాక్ట్ సెడాన్ టాటా టిగోర్‌పై కూడా కంపెనీ ఈ నెలలో గరిష్టంగా రూ.30,000 విలువైన ప్రయోజనాలను అందిస్తోంది. ఈ నెలలో టాటా టిగోర్‌ను కొనుగోలుపై కస్టమర్లు రూ.15,000 నగదు డిస్కౌంట్ మరియు రూ.15,000 ఎక్సేంజ్ బోనస్‌లను పొందవచ్చు.

టాటా కార్లపై మార్చి 2021 ఆఫర్లు, రూ.65,000 వరకూ డిస్కౌంట్లు!

కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో టాటా మోటార్స్ విక్రయిస్తున్న పాపులర్ మోడల్ నెక్సాన్‌లో డీజిల్ వేరియంట్లపై కంపెనీ రూ.15 వేల తగ్గింపును అందిస్తోంది. కాగా, టాటా నెక్సాన్ పెట్రోల్ వేరియంట్లపై కంపెనీ ఎలాంటి ఆఫర్లను అందించడం లేదు.

టాటా కార్లపై మార్చి 2021 ఆఫర్లు, రూ.65,000 వరకూ డిస్కౌంట్లు!

మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో టాటా మోటార్స్ విక్రయిస్తున్న 5-సీటర్ హారియర్ ఎస్‌యూవీపై కంపెనీ రూ.65,000 తగ్గింపులను అందిస్తోంది. ఈ నెలలో టాటా హారియర్‌ను కొనుగోలు చేసే కస్టమర్లు రూ.25,000 నగదు తగ్గింపును మరియు రూ.40,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను పొందవచ్చు.

టాటా కార్లపై మార్చి 2021 ఆఫర్లు, రూ.65,000 వరకూ డిస్కౌంట్లు!

అయితే, ఈ ఆఫర్ టాటా హారియర్ యొక్క క్యామో మరియు డార్క్ ఎడిషన్ (ఎక్స్‌జెడ్ ప్లస్ మరియు ఎక్స్‌జెడ్ఏ ప్లస్) వేరియంట్లకు వర్తించదు. కాగా, టాటా హారియర్ స్పెషల్ ఎడిషన్ మోడల్‌పై రూ.40,000 తగ్గింపు అందిస్తున్నారు.

టాటా కార్లపై మార్చి 2021 ఆఫర్లు, రూ.65,000 వరకూ డిస్కౌంట్లు!

కార్పొరేట్ వినియోగదారుల కోసం టాటా మోటార్స్ ప్రత్యేక ప్రయోజనాలు మరియు డిస్కౌంట్లను కూడా అందిస్తోంది. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని అధీకృత టాటా మోటార్స్ డీలర్‌షిప్‌ను సందర్శించవచ్చు.

టాటా కార్లపై మార్చి 2021 ఆఫర్లు, రూ.65,000 వరకూ డిస్కౌంట్లు!

అమ్మకాల పరంగా టాటా మోటార్స్ దేశంలోనే మూడవ అతిపెద్ద కంపెనీగా అవతరించింది. గడచిన ఫిబ్రవరి 2021లో టాటా మోటార్స్ మొత్తం 27,225 యూనిట్లను విక్రయించింది.

టాటా కార్లపై మార్చి 2021 ఆఫర్లు, రూ.65,000 వరకూ డిస్కౌంట్లు!

టాటా మోటార్స్ ఇటీవలే తమ హారియర్ ఎస్‌యూవీని ఆధారంగా చేసుకొని తయారు చేసిన సరికొత్త 2021 టాటా సఫారీ ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేసింది. మార్కెట్లో ఈ కారు ప్రారంభ ధర రూ.14.69 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

More from DriveSpark

Article Published On: Thursday, March 18, 2021, 14:19 [IST]
English summary
March 2021 Offers And Discounts On Tata Cars, Details. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+