కొత్త 2021 Celerio విడుదల తేదీ మరియు ఇతర వివరాలను వెల్లడించిన Maruti Suzuki

ప్రముఖ దేశీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki) తమ కొత్త తరం 2021 సెలెరియో (2021 Celerio) హ్యాచ్‌బ్యాక్ యొక్క విడుదల తేదీని మరియు ఇతర వివరాలు వెల్లడి చేసింది. సమాచారం ప్రకారం, మారుతి సుజుకి ఈ కారును కంపెనీ నవంబర్ 10, 2021వ తేదీన భారత మార్కెట్లో విడుదల చేయనుంది. తాజాగా, ఇందుకు సంబంధించి ఓ కొత్త టీజర్ ను కూడా కంపెనీ విడుదల చేసింది. ఈ టీజర్ లో కొత్త సెలెరియో లో చేసిన మార్పులను కంపెనీ హైలైట్ చేసింది.

కొత్త 2021 Celerio విడుదల తేదీ మరియు ఇతర వివరాలను వెల్లడించిన Maruti Suzuki

మారుతి సుజుకి ఇండియా తమ సెలెరియో హ్యాచ్‌బ్యాక్ ను సరికొత్త అవతార్ లో ప్రవేశపెట్టనుంది. భారత మార్కెట్లో ఇప్పటికే ఈ కారు కోసం కంపెనీ అధికారింగా బుకింగ్ లను కూడా ప్రారంభించింది. ఆసక్తిగల కస్టమర్లు మారుతి సుజుకి వెబ్‌సైట్ లో కానీ లేదా అధికారిక డీలర్‌షిప్ ను సంప్రదించి కానీ రూ. 11,000 టోకెన్ అడ్వాన్స్ చెల్లించి ఈ కొత్త తరం 2021 మారుతి సుజుకి సెలెరియో (New Gen 2021 Maruti Suzuki Celerio) కారును బుక్ చేసుకోవచ్చు.

కొత్త 2021 Celerio విడుదల తేదీ మరియు ఇతర వివరాలను వెల్లడించిన Maruti Suzuki

మారుతి సుజుకి సెలెరియో కారు మార్కెట్లోకి వచ్చిన కొత్తల్లో దాని స్టైలిష్ డిజైన్ మరియు సెగ్మెంట్ ఫస్ట్ ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) వంటి ఫీచర్ల కారణంగా మార్కెట్లో మంచి ఆదరణ పొందింది. ఇది ఆల్టో కారుకి మరియు స్విఫ్ట్ కారుకి మధ్య ఉన్న అంతరాన్ని చక్కగా భర్తీ చేసింది. ఆల్టో కన్నా బెటర్ కారు మరియు స్విఫ్ట్ కన్నా తక్కువ ఖరీదైన కారును కోరుకునే వారికి సెలెరియో చక్కటి ఆప్షన్ గా ఉంటుంది.

కొత్త 2021 Celerio విడుదల తేదీ మరియు ఇతర వివరాలను వెల్లడించిన Maruti Suzuki

రిఫ్రెష్డ్ లుక్, కొత్త ఇంటీరియర్స్, అదనపు కంఫర్ట్ ఫీచర్లు, లేటెస్ట్ టెక్నాలజీ మరియు మరిన్ని సేఫ్టీ ఫీచర్లతో కంపెనీ ఈ కొత్త తరం 2021 సెలెరియో కారును రూపొందించింది. కస్టమర్ల సందర్శన కోసం మారుతి సుజుకి ఇప్పటికే ఈ కొత్త కారును తమ అధికారిక డీలర్‌షిప్ కేంద్రాలకు పంపిణీ చేయడం ప్రారంభించింది. కొత్త తరం మారుతి సుజుకి సెలెరియో పూర్తిగా కొత్త సిల్హౌట్‌ను కలిగి ఉంటుందని ఈ టీజర్ ను చూస్తే అర్థమవుతుంది. ఇందులో ఎత్తైన హుడ్ మరియు కొత్త స్టైలింగ్‌తో కూడిన పొడవైన డిజైన్‌ను మనం చూడొచ్చు.

కొత్త 2021 Celerio విడుదల తేదీ మరియు ఇతర వివరాలను వెల్లడించిన Maruti Suzuki

నెక్స్ట్ జనరేషన్ మారుతి సుజుకి సెలెరియో కారును కంపెనీ తమ ఐదవ తరం హార్ట్‌టెక్ ప్లాట్‌ఫామ్‌పై రూపొందిస్తోంది. ఫలితంగా, ఈ కారులో మునుపటి కన్నా మరిన్ని కొత్త ఫీచర్లను మనం ఆశించవచ్చు. ఇందులో ఆకర్షణీయమైన ఫ్రంట్ గ్రిల్, కొత్త అల్లాయ్ వీల్స్, ఫాగ్ లైట్లు, ఇంటీరియర్‌లో కొత్త టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, సింగిల్-పాడ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు వృత్తాకారపు డిజిటల్ స్క్రీన్ మొదలైనవి ఇందులో ఉండనున్నాయి.

కొత్త 2021 Celerio విడుదల తేదీ మరియు ఇతర వివరాలను వెల్లడించిన Maruti Suzuki

కొత్త తరం సెలెరియో ప్రస్తుతం తరం సెలెరియో కన్నా కాస్తతంగా పెద్దదిగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ కారులో కంపెనీ అనేక అప్‌గ్రేడ్స్ చేసింది. వీటిలో రీడిజైన్ చేయబడిన హెడ్‌లైట్స్ మరియు టెయిల్స్ లైట్స్, బాడీపై మజిక్యులర్ క్రీజ్ లైన్స్, కొత్త వీల్ ఆప్షన్స్, డ్యూయెల్ టోన్ సైడ్ మిర్రర్స్ మరియు వాటిపై టర్న్ ఇండికేటర్స్, బాడీ కలర్ బంపర్స్ అండ్ డోర్ హ్యాండిల్స్ మరియు దాని ప్రీమియం లుక్ ని మరించ పెంచేందుకు ఎక్స్టీరియర్ లో క్రోమ్ గార్నిష్ వంటి మార్పులను ఇందులో ఆశించవచ్చు.

ప్రస్తుతానికి ఈ కొత్త తరం సెలెరియో ఇంటీరియర్స్ కి సంబంధించి ఎలాంటి సమాచారం అందుబాటులో లేకపోయినప్పటికీ, ఇది ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ కి అనుగుణంగా అవసరమైన అన్ని రకాల ఫీచర్లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ కారులో Apple CarPlay మరియు Android Autoతో పాటుగా SmartPlay Studio 2.0ని కలిగి ఉన్న కొత్త టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుందని సమాచారం. ఇంకా ఇందులో మెరుగైన సీట్లు, కొత్త అప్‌హోలెస్ట్రీ మరియు ఆటో క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లను కూడా ఆశించవచ్చు.

కొత్త 2021 Celerio విడుదల తేదీ మరియు ఇతర వివరాలను వెల్లడించిన Maruti Suzuki

సేఫ్టీ పరంగా చూస్తే, ఈ చిన్న కారులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబిడితో కూడిన ఏబిఎస్, ISOFIX మౌంట్‌లు, రియర్ పార్కింగ్ కెమెరా, సీట్ బెల్ట్ రిమైండర్ మరియు హై-స్పీడ్ అలర్ట్ వంటి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు లభిస్తాయి. ఈ కొత్త కారులో ప్రధానంగా చెప్పుకోదగినది, ఇందులో రీట్యూన్ చేయబడిన పెట్రోల్ ఇంజన్. కొత్త 2021 సెలెరియో దేశంలోనే అత్యంత ఇంధన సామర్థ్యం కలిగిన పెట్రోల్ కారు అని కంపెనీ పేర్కొంది.

కొత్త 2021 Celerio విడుదల తేదీ మరియు ఇతర వివరాలను వెల్లడించిన Maruti Suzuki

అంతేకాకుండా, ఇప్పటి వరకూ మార్కెట్లోకి వచ్చిన సెలెరియో మోడళ్లతో పోల్చుకుంటే, ఈ కొత్త తరం 2021 సెలెరియో మోడల్ మునుపటి కంటే అనేక రెట్లు మెరుగ్గా ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ కారు యొక్క మైలేజ్ ను మెరుగుపరచేందుకు కంపెనీ ఇందులో ఇంజన్ ఐడిల్ స్టార్ట్ / స్టాప్ అనే ఆప్షన్ కూడా ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ ఫీచర్ వలన కారు నిర్ధిష్ట సమయం కన్నా ఎక్కువ సేపు ఐడిల్ గా ఉంటే, ఇంజన్ ఆటోమేటిక్ గా ఆఫ్ అవుతుంది మరియు తిరిగి క్లచ్ నొక్కగానే ఇంజన్ స్టార్ట్ అవుతుంది.

కొత్త 2021 Celerio విడుదల తేదీ మరియు ఇతర వివరాలను వెల్లడించిన Maruti Suzuki

ఇక కొత్త సెలెరియో ఇంజన్ విషయానికి వస్తే, ఇది కొత్త తరం 1.0 లీటర్ కె10సి, 3-సిలిండర్ డ్యూయల్-జెట్ పెట్రోల్ ఇంజన్‌ తో రానుంది. ఈ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 67 బిహెచ్‌పి పవర్ మరియు 90 న్యూటన్ మీటర్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది మాన్యువల్ గేర్‌బాక్స్‌ తో లీటరుకు 21.63 కిలోమీటర్ల సర్టిఫైడ్ మైలేజీని అందిస్తుంది. ఇందులో ఆటో గేర్ షిఫ్ట్ (ఏజిఎస్) అనే ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది మరియు దీని పెట్రోల్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 60 లీటర్లుగా ఉంటుంది.

కొత్త 2021 Celerio విడుదల తేదీ మరియు ఇతర వివరాలను వెల్లడించిన Maruti Suzuki

కొత్త 2021 సెలెరియో కేవలం పెట్రోల్ ఫ్యూయెల్ ఆప్షన్ తోనే కాకుండా, సిఎన్‌జి కిట్ ఆప్షన్ తో కూడా లభ్యం కానుంది. ఈ ఇంజన్ సిఎన్‌జి మోడ్‌ లో 59 బిహెచ్‌పి పవర్ ను మరియు 78 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సిఎన్‌జి వెర్షన్ సెలెరియో కేవలం 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ తో మాత్రమే లభిస్తుంది. ఇది కేజీకి 30.47 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. సిగ్నేచర్ S-CNG టెక్నాలజీతో రానున్న ఈ కారులో సిఎన్‌జి ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 35 లీటర్లుగా ఉంటుంది.

Most Read Articles

English summary
Maruti announced new gen celerio launch date everything you need to know about it
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X