6 సంవత్సరాల్లో 1 మిలియన్ అమ్మకాలు.. Baleno అమ్మకాల్లో Maruti Suzuki గ్రేట్ రికార్డ్

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందుతున్న వాహన తయారీ సంస్థల్లో ఒకటి మారుతి సుజుకి (Maruti Suzuki). ఈ కంపెనీ దేశీయ మార్కెట్లో తన బాలెనొ విడుదల చేసి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. కంపెనీ యొక్క ఈ ప్రీమియం కారు విదుడైనప్పటి నుంచి దాదాపు 1 మిలియన్ యూనిట్లకు పైగా అమ్మకాలను నమోదు చేసింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

6 సంవత్సరాల్లో 1 మిలియన్ అమ్మకాలు.. Baleno అమ్మకాల్లో Maruti Suzuki గ్రేట్ రికార్డ్

మారుతి సుజుకి తన మారుతి బాలెనొను దేశీయ మార్కెట్లో 2015 లో ప్రారంభించిన మొట్టమొదటి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్. ఇది విడుదలైనప్పటినుంచి దాదాపు 6 సంవత్సరాల్లో 1 మిలియన్ యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. దీన్ని బట్టి చూస్తే కంపెనీ యొక్క ఈ కారుకి మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందనే విషయం తెలుస్తుంది.

6 సంవత్సరాల్లో 1 మిలియన్ అమ్మకాలు.. Baleno అమ్మకాల్లో Maruti Suzuki గ్రేట్ రికార్డ్

భారతదేశ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో బాలెనో 25 శాతం వాటాను కలిగి ఉందని కంపెనీ తెలిపింది. ఈ విభాగంలో, ఇది హ్యుందాయ్ ఐ20, టయోటా గ్లాంజా, టాటా ఆల్ట్రోజ్ మరియు హోండా జాజ్ వంటి కార్లకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. ఇది ఈ విభాగంలో అత్యంత ఎక్కువ అమ్మకాలను కైవసం చేసుకోగలిగింది.

6 సంవత్సరాల్లో 1 మిలియన్ అమ్మకాలు.. Baleno అమ్మకాల్లో Maruti Suzuki గ్రేట్ రికార్డ్

మారుతి బాలెనో విక్రయాల విషయానికి వస్తే, కంపెనీ 2015 అక్టోబర్ నెలలో ప్రారభినప్పుడు, కేవలం ఆ సంవత్సరంలోనే దాదాపు ఒక లక్ష యూనిట్ల అమ్మకాలను పొందింది. అయితే 2018 నవంబర్ నెల నాటికి కంపెనీ ఏకంగా 5 లక్షల బాలెనొ కార్లను విక్రయించగలిగింది. అదే సమయంలో, ఈ ఏడాది మార్చి వరకు, కంపెనీ 9 లక్షల బాలెనో విక్రయాన్ని పూర్తి చేసింది.

6 సంవత్సరాల్లో 1 మిలియన్ అమ్మకాలు.. Baleno అమ్మకాల్లో Maruti Suzuki గ్రేట్ రికార్డ్

భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభణ ఎక్కువైనప్పుడు కంపెనీ యొక్క అమ్మకాలలో కొంత హెచ్చుతగ్గులు ఏర్పడ్డాయి. కానీ కేవలం మరో 9 నెలల్లో 1 లక్ష యూనిట్లను విక్రయించగలిగింది. మొత్తానికి ఇది 1 మిలియన్ అమ్మకాలను పొందగలిగింది. ఇది నిజంగా కంపెనీ సాధించిన గొప్ప విజయం.

6 సంవత్సరాల్లో 1 మిలియన్ అమ్మకాలు.. Baleno అమ్మకాల్లో Maruti Suzuki గ్రేట్ రికార్డ్

మారుతి సుజుకి అనేక నవీకరణలతో బాలెనో యొక్క ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇది ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఇందులోని ప్రొజెక్టర్‌లో LED హెడ్‌ల్యాంప్‌లు, LED డేటైమ్ రన్నింగ్ లైట్లు, LED టైల్‌లైట్లు మరియు స్పోర్టీ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

6 సంవత్సరాల్లో 1 మిలియన్ అమ్మకాలు.. Baleno అమ్మకాల్లో Maruti Suzuki గ్రేట్ రికార్డ్

మారుతి సుజుకి ప్రస్తుతం బాలెనో హ్యాచ్‌బ్యాక్ యొక్క మరొక ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌పై పని చేస్తోంది, ఇది వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల కానుంది. కొత్త మారుతి బాలెనో క్రాప్‌సాఫ్ట్ కొత్త డిజైన్ మరియు అనేక కొత్త ఫీచర్లతో తీసుకురావచ్చు. మారుతి సుజుకి బాలెనో భారతీయ మార్కెట్లో రూ. 5.97 లక్షల నుండి రూ. 9.33 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరలో అందుబాటులో ఉంది.

మారుతి బాలెనొ 9 వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. మారుతి బాలెనో యొక్క అన్ని ట్రిమ్‌లలో రెండు ఎయిర్‌బ్యాగ్‌లు ప్రామాణికంగా అందించబడ్డాయి. కావున ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. కావున ఎక్కువమంది కొనుగోలుదారులు ఈ కారుని కొనుగోలు చేస్తున్నారు.

6 సంవత్సరాల్లో 1 మిలియన్ అమ్మకాలు.. Baleno అమ్మకాల్లో Maruti Suzuki గ్రేట్ రికార్డ్

మారుతి బాలెనో యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో రెండు ఇంజిన్ ఆప్సన్స్ అందుబాటులో ఉంటాయి. మొదటిది 1.2-లీటర్ K12M VVT ఇంజన్ కాగా, మరొకటి 1.3-లీటర్ DDiS 200 డీజిల్ ఇంజన్.

ఇందులోని మొదటి ఇంజిన్ 83 బిహెచ్‌పి పవర్ మరియు 113 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేయగా, రెండవ ఇంజిన్ 74 బిహెచ్‌పి పవర్ మరియు 190 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. వీటిలో మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్స్ అందుబాటులో ఉంటాయి.

6 సంవత్సరాల్లో 1 మిలియన్ అమ్మకాలు.. Baleno అమ్మకాల్లో Maruti Suzuki గ్రేట్ రికార్డ్

మారుతి బాలెనో టాప్ వేరియంట్‌లో ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే, LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, క్రోమ్ సరౌండ్ గ్రిల్, LED DRLలు మరియు LED బ్రేక్ లైట్లతో కూడిన 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పొందుతుంది.

6 సంవత్సరాల్లో 1 మిలియన్ అమ్మకాలు.. Baleno అమ్మకాల్లో Maruti Suzuki గ్రేట్ రికార్డ్

ఇదిలా ఉండగా కంపెనీ తన బాలెనో కొత్త తరం మోడల్‌ను త్వరలో విడుదల చేసే అవకాశం ఉంటుంది. అయితే కంపెనీ యొక్క ఈ బాలెనో కారు క్రాష్ టెస్ట్ లో ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది. ఇందులో ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్‌గా అమర్చారు. మేడ్-ఇన్-ఇండియా మారుతీ బాలెనో క్రాష్ టెస్ట్‌లలో జీరో రేటింగ్ సాధించింది. అంతే కాకుండా కంపెనీ యొక్క స్విఫ్ట్ కారు కూడా క్రాష్ టెస్ట్ లో 0 సేఫ్టీ రేటింగ్ పొందింది.

6 సంవత్సరాల్లో 1 మిలియన్ అమ్మకాలు.. Baleno అమ్మకాల్లో Maruti Suzuki గ్రేట్ రికార్డ్

NCAP క్రాష్ టెస్ట్‌లో, బాలెనో అడల్ట్ సేఫ్టీలో 20.03%, కిడ్స్ సేఫ్టీలో 17.06%, పాదచారుల భద్రత మరియు రోడ్డు వినియోగదారుల భద్రతలో 64.06% మరియు సేఫ్టీ అసిస్ట్ బాక్స్‌లో 6.98% సాధించింది. ఫ్రంటల్ ఇంపాక్ట్ టెస్ట్‌లో బాలెనో స్థిరమైన నిర్మాణ పనితీరును కనబరిచగా, సైడ్ ఇంపాక్ట్ టెస్ట్‌లో బాలెనో విఫలమైంది. బాలెనో యొక్క సైడ్ ఇంపాక్ట్ ప్రొటెక్షన్, మార్జినల్ విప్లాష్ ప్రొటెక్షన్ మరియు స్టాండర్డ్ సైడ్ బాడీ లోపభూయిష్టంగా ఉన్నట్లు లాటిన్ NCAP నివేదించింది. మొత్తానికి కారు మంచి ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉన్నప్పటికీ సేఫ్టీ విషయంలో విఫలమైంది.

Most Read Articles

English summary
Maruti baleno achieves 10 lakh unit sales milestone in 6 years details
Story first published: Thursday, December 9, 2021, 14:28 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X