కొత్త బట్టలు వేసుకున్న మారుతి సియాజ్ (Maruti Ciaz).. ఇప్పుడు దాని పేరు టొయోటా బెల్టా (Toyota Belta)..

జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టొయోటా (Toyota) మరియు భారతీయ ఆటోమొబైల్ కంపెనీ మారుతి సుజుకి (Maruti Suzuki) లు ఓ పరస్పర సహకార ఒప్పందాన్ని కలిగి ఉన్న సంగతి తెలిసినదే. ఈ ఒప్పందంలో భాగంగా, మారుతి సుజుకి తయారు చేసే కొన్ని రకాల కార్లను టొయోటా తమ బ్రాండింగ్ క్రింద్ విక్రయిస్తుంది. ఇలా ఇప్పటికే, మారుతి బాలెనో ఆధారిత టొయోటా గ్లాంజా మరియు మారుతి విటారా బ్రెజ్జా ఆధారిత అర్బన్ క్రూయిజర్ కార్లను టొయోటా విక్రయిస్తోంది.

కొత్త బట్టలు వేసుకున్న మారుతి సియాజ్ (Maruti Ciaz).. ఇప్పుడు దాని పేరు టొయోటా బెల్టా (Toyota Belta)..

తాజాగా, మారుతి సుజుకి నుండి కొనుగోలు చేసిన సియాజ్ మిడ్-సైజ్ సెడాన్ ను టొయోటా తమ బ్యాడ్జ్ అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల చేసింది. ఈ రీబ్యాడ్జ్ వెర్షన్ మారుతి సుజుకి సియాజ్ (Maruti Suzuki Ciaz) కారును కంపెనీ టొయోటా బెల్టా (Toyota Belta) పేరుతో మిడిల్ ఈస్ట్ మార్కెట్లలో ప్రవేశపెట్టింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, టొయోటా బెల్టా భారత మార్కెట్లో కూడా విడుదల కానుంది. టొయోటా డిస్‌కంటిన్యూ చేసిన యారిస్ (Yaris) సెడాన్ స్థానాన్ని బెల్టా (Belta) భర్తీ చేయనుంది.

కొత్త బట్టలు వేసుకున్న మారుతి సియాజ్ (Maruti Ciaz).. ఇప్పుడు దాని పేరు టొయోటా బెల్టా (Toyota Belta)..

ఈ రీబ్యాడ్జ్ వెర్షన్ టొయోటా బెల్టా చూడటానికి అచ్చుగుద్దినట్లు మారుతి సుజుకి సియాజ్ సెడాన్ మాదిరిగానే కనిపిస్తుంది. కేవలం లోగో మార్పు మినహా ఇందులో వేరే ఏ ఇతర మార్పులు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో, ఈ రెండు మోడళ్లలో లభించే ఫీచర్లు, పరికరాలు మరియు ఇంజన్ ఆప్షన్లు కూడా భారతదేశంలో లభించే మారుతి సియాజ్ మాదిరిగానే ఉండనున్నాయి. వచ్చే ఏడాది నాటికి టొయోటా బెల్టా భారతదేశంలో విక్రయించబడుతుంగని భావిస్తున్నారు.

కొత్త బట్టలు వేసుకున్న మారుతి సియాజ్ (Maruti Ciaz).. ఇప్పుడు దాని పేరు టొయోటా బెల్టా (Toyota Belta)..

ఈ కారులో ముందు వైపు సన్నటి లైన్స్ తో కూడిన గ్రిల్, గ్రిల్ కి ఇరువైపులా మరియు ఫాగ్ ల్యాంప్ హౌసింగ్ చుట్టూ క్రోమ్ గార్నిష్, ఫ్రంట్ బంపర్‌లో అమర్చిన గుండ్రటి ఫాగ్‌ల్యాంప్స్, ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్స్ మరియు ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, టర్న్ ఇండికేటర్లతో కూడిన సైడ్ మిర్రర్స్, క్రోమ్ డోర్ హ్యాండిల్స్, సైడ్ విండోలైన్స్ క్రింది భాగంలో క్రోమ్ స్ట్రిప్, అల్లాయ్ వీల్స్, స్ప్లిట్ టెయిల్ ల్యాంప్, వెనుక బంపర్ పై క్రోమ్ యాక్సెంట్స్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

కొత్త బట్టలు వేసుకున్న మారుతి సియాజ్ (Maruti Ciaz).. ఇప్పుడు దాని పేరు టొయోటా బెల్టా (Toyota Belta)..

ఇంటీరియర్స్ విషయానికి వస్తే, క్యాబిన్ లోపల 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్, పవర్ విండోస్, క్రూయిజ్ కంట్రోల్ వంటి పలు ఫీచర్లు ఉన్నాయి. మారుతి సియాజ్ కారులో లభించే అన్ని రకాల ఫీచర్లు టొయోటా బెల్టా కారులో కూడా ఉంటాయి. అయితే, ఇందులోని సుజుకి స్మార్ట్ ప్లే టచ్‌స్క్రీన్ ఇన్పోటైన్‌మెంట్ సిస్టమ్ ను టొయోటా తమ స్వంత బ్రాండింగ్ తో రీప్లేస్ చేస్తుంది.

కొత్త బట్టలు వేసుకున్న మారుతి సియాజ్ (Maruti Ciaz).. ఇప్పుడు దాని పేరు టొయోటా బెల్టా (Toyota Belta)..

టొయోటా బ్రాండింగ్ తో రానున్న రీబాడ్జ్ మారుతి సుజుకి సియాజ్ కేవలం ఒకే ఒక పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ తో లభ్యం కానుంది. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ ను ఉపయోగించారు. ఇదే ఇంజన్ ను సియాజ్, బ్రెజ్జా మరియు ఎర్టిగా వంటి మోడళ్లలో ఉపయోగిస్తున్నారు. ఈ ఇంజన్ 104 బిహెచ్‌పి పవర్ మరియు 138 న్యూటన్ మీటర్ల టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ మరియు 4 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది.

కొత్త బట్టలు వేసుకున్న మారుతి సియాజ్ (Maruti Ciaz).. ఇప్పుడు దాని పేరు టొయోటా బెల్టా (Toyota Belta)..

టొయోటా బెల్టా అనే పేరును కంపెనీ ఇప్పటికే పలు గ్లోబల్ మార్కెట్లలో ఉపయోగిస్తోంది. ఈ పేరుతో కంపెనీ అంతర్జాతీయ మార్కెట్లలో ఓ సెడాన్ బాడీ టైప్ కారును విక్రయిస్తోంది. ఈ నేపథ్యంలో, టొయోటా తమ ఇంటర్నేషనల్ మోడల్‌ను నేరుగా భారతదేశానికి తీసుకువచ్చే బదులుగా, మారుతి సుజుకి నుండి సియాజ్‌ను ఓఈఎమ్ (ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మ్యాన్యుఫాక్చరర్) గా కొనుగోలు చేసి, తమ బ్రాండ్ పేరుతో రీబ్యాడ్జ్ చేసి విక్రయించాలని భావిస్తోంది.

కొత్త బట్టలు వేసుకున్న మారుతి సియాజ్ (Maruti Ciaz).. ఇప్పుడు దాని పేరు టొయోటా బెల్టా (Toyota Belta)..

ఈ నిర్ణయం వలన కంపెనీ తమ టొయోటా బెల్టా సెడాన్ ఉత్పత్తి ఖర్చును చాలా తక్కువగా ఉంచడమే కాకుండా, సరసమైన ధరకే దీనిని అందించడం సాధ్యమవుతుంది. టొయోటా తయారీ ఖర్చు వద్ద మారుతి సుజుకి సియాజ్ ఫ్రేమ్‌ను కొనుగోలు చేసి, తమ బ్రాండ్ ఇంటీరియర్స్ మరియు హంగులతో దానిని తీర్చిదిద్ది టొయోటా బెల్టా అనే బ్యాడ్జ్ అంటించి ఈ కారును విక్రయించనుంది. ఒక్క మాటలో చెప్పాలంటే టొయోటా బెల్టా అనేది కొత్త దుస్తులు ధరించిన మారుతి సుజుకి సియాజ్ మాదిరిగా ఉంటుంది.

కొత్త బట్టలు వేసుకున్న మారుతి సియాజ్ (Maruti Ciaz).. ఇప్పుడు దాని పేరు టొయోటా బెల్టా (Toyota Belta)..

మారుతి సుజుకి ఉత్పత్తిని టొయోటా ఇలా రీబ్రాండ్ చేయడం ఇదేం మొదటిసారి కాదు. ఈ కంపెనీ ఇదివరకే గ్లాంజా పేరుతో మారుతి బాలెనో కార్ మోడల్‌ను మరియు అర్బన్ క్రూయిజర్ పేరుతో మారుతి విటారా బ్రెజ్జాను రీబ్యాడ్జ్ చేసి విక్రయించింది. వీటి తరువాత, కంపెనీ ఇప్పుడు, మారుతి సుజుకి సియాజ్ ఆధారిత టొయోటా బెల్టాను తీసుకువస్తేంది. ఇదే కాకుండా, టొయోటా భవిష్యత్తులో మారుతి సుజుకి ఎర్టిగా ఎమ్‌పివి ఆధారంగా ఓ సరసమైన రీబ్యాడ్జ్ వెర్షన్ ఎమ్‌పివిని భారత మార్కెట్లో విడుదల చేసేందుకు కూడా ప్లాన్ చేస్తోంది.

Most Read Articles

English summary
Maruti ciaz rebadged toyota belta officially unveiled in middle eastern markets
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X