కొత్త నగరాలకు మారుతి సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ విస్తరణ; హైదరాబాద్‌లో కూడా..

మారుతి సుజుకి ఇండియా అందిస్తున్న సబ్‌స్క్రిప్షన్ ఆధారిత కొనుగోలు సేవలను ఇప్పుడు మరిన్ని కొత్త నగరాలకు విస్తరిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం ఈ సేవలు న్యూఢిల్లీ-ఎన్‌సిఆర్, బెంగళూరు, హైదరాబాద్, పూణే, ముంబై, చెన్నై, అహ్మదాబాద్ మరియు గాంధీనగర్ వంటి ప్రధాన నగరాల్లో అందుబాటులో ఉన్నాయి.

కొత్త నగరాలకు మారుతి సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ విస్తరణ; హైదరాబాద్‌లో కూడా..

తాజాగా మారుతి సుజుకి ఈ సేవలను కొచ్చి నగరంలో కూడా ప్రారంభించింది. ఈ ప్లాన్ కోసం కస్టమర్ల నుండి అనూహ్యమైన స్పందన లభిస్తోందని, తాము ఇప్పటికే 15,000కు పైగా ఎంక్వైరీలను అందుకున్నామని కంపెనీ పేర్కొంది. మారుతి సబ్‌స్క్రైబ్ ప్లాన్ కోసం పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకొని కంపెనీ ఈ సేవలను మరిన్ని కొత్త నగరాలు విస్తరించాలని ప్లాన్ చేస్తోంది.

కొత్త నగరాలకు మారుతి సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ విస్తరణ; హైదరాబాద్‌లో కూడా..

మారుతి సుజుకి ఇండియా ఈ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ క్రింద ఎస్-క్రాస్, ఇగ్నిస్ మరియు వ్యాగన్ఆర్ వంటి బడ్జెట్ కార్లతో పాటుగా స్విఫ్ట్, డిజైర్, విటారా బ్రెజ్జా, ఎర్టిగా, బాలెనో, సియాజ్ మరియు ఎక్స్‌ఎల్6 వంటి ప్రీమియం కార్లను కూడా అందిస్తోంది. మారుతి సుజుకి అరేనా షోరూమ్‌లు మరియు నెక్సా డీలర్‌షిప్‌ల ద్వారా కంపెనీ ఈ చందా ఆధారిత స్కీమ్‌ను అందిస్తున్నారు.

కొత్త నగరాలకు మారుతి సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ విస్తరణ; హైదరాబాద్‌లో కూడా..

ధరల విషయానికి వస్తే, హైదరాబాద్‌లో 48 నెలల కాలపరిమితి గాను వ్యాగన్ఆర్ ఎల్ఎక్స్ఐ (1.0 లీటర్ మ్యాన్యువల్) వేరియంట్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకుంటే కస్టమర్లు నెలకు అన్ని పన్నులతో కలిపి రూ.13,374 చెల్లించాల్సి ఉంటుంది. అదే ఇగ్నిస్ సిగ్మా వేరియంట్ అయితే, నెలకు రూ.13,993 చెల్లించాల్సి ఉంటుంది.

కొత్త నగరాలకు మారుతి సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ విస్తరణ; హైదరాబాద్‌లో కూడా..

కొత్త వాహనాల విషయంలో లాంగ్ టెర్మ్ కమిట్‌మెంట్ లేకుండా, కొంత కాలం వరకూ వాటిని ఉపయోగించి ఆ తర్వాత మరో కొత్త కారును నడపాలనుకునే వారి కోసం మారుతి సుజుకి సబ్‌స్క్రైబ్ ప్లాన్ చాలా అనువుగా ఉంటుంది.

కొత్త నగరాలకు మారుతి సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ విస్తరణ; హైదరాబాద్‌లో కూడా..

మారుతి సుజుకి అందిస్తున్న ఈ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లో కారును నేరుగా కంపెనీ నుండి కొనుగోలు చేయకుండా, కారును సొంతం చేసుకోవడం వల్ల కలిగే అన్ని ప్రయోజనాలను పొందవచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే, ఇది కారును దీర్ఘకాలం పాటు లీజుకు తీసుకోవటం లాంటిదే అన్నమాట.

కొత్త నగరాలకు మారుతి సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ విస్తరణ; హైదరాబాద్‌లో కూడా..

ఈ సబ్‌స్క్రిప్షన్ విధానం ద్వారా కారును లీజుకు తీసుకోవటం వలన కస్టమర్లు డౌన్‌పేమెంట్, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ వంటి ముందస్తు చెల్లింపులు చేయాల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా ఇందులో ఫుల్ కార్ మెయింటినెన్స్, కంప్లీట్ ఇన్సూరెన్స్, 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ వంటి సదుపాయాలు కూడా లభిస్తాయి.

కొత్త నగరాలకు మారుతి సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ విస్తరణ; హైదరాబాద్‌లో కూడా..

ఈ నెలవారీ చందా ప్లాన్ ద్వారా కారును లీజుకు తీసుకునే కస్టమర్లు రీసేల్ గురించి చింతించాల్సిన అవసరం కూడా ఉండదు. ఇవన్నీ మారుతి సుజుకి చూసుకుంటుంది. కస్టమర్లు ఎంచుకునే సమయాన్ని బట్టి, 24, 36, మరియు 48 నెలల కాలపరిమితితో ఈ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ లభిస్తుంది.

కొత్త నగరాలకు మారుతి సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ విస్తరణ; హైదరాబాద్‌లో కూడా..

చందా కాలపరిమితి పూర్తయిన తర్వాత, కస్టమర్లు కావాలనుకుంటే దానిని పొడిగించడం లేదాన్ని వాహనాన్ని అప్‌గ్రేడ్ చేసుకొని వేరకొ మారుతి సుజుకి వాహనాన్ని పొందడం చేయవచ్చు. అలాకాకుండా, కస్టమర్లు అదే కారును ఎప్పటికీ సొంతం చేసుకోవాలనుకుంటే మార్కెట్ ధర వద్ద దానిని కొనుగోలు చేయవచ్చని కంపెనీ వివరించింది.

More from DriveSpark

Article Published On: Friday, February 5, 2021, 16:48 [IST]
English summary
Maruti Suzuki Extends Subscription Service To 9 More Cities Include Hyderabad. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+