కమర్షియల్ వెహికల్ సేల్స్‌లోనూ తగ్గని హవా.. లక్ష యూనిట్లు దాటిన Maruti Super Carry అమ్మకాలు

భారతదేశంలో అతి పెద్ద కార్ల తయారీ సంస్థగా ప్రసిద్ధి చెందిన మారుతి సుజుకి (Maruti Suzuki) యొక్క కార్లకు మాత్రమే కాకుండా దేశీయ మార్కెట్లో కంపెనీ యొక్క కమర్షియల్ వాహనాలకు కూడా మంచి ఆదరణ ఉంది. ఈ కారణంగానే కంపెనీ యొక్క మారుతి సూపర్ క్యారీ (Maruti Super Carry) ఇప్పటికి ఏకంగా ఒక లక్ష యూనిట్ల అమ్మకాలను పొందగలిగింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

కమర్షియల్ వెహికల్ సేల్స్‌లోనూ తగ్గని హవా.. లక్ష యూనిట్లు దాటిన Maruti Super Carry అమ్మకాలు

కంపెనీ నివేదికల ప్రకారం మారుతి సూపర్ క్యారీ వెహికల్ 5 సంవత్సరాలలో లక్ష యూనిట్ల విక్రయాలను పొందగలిగింది. ఈ వాహనాన్ని కంపెనీ పెట్రోల్ మరియు సిఎన్‌జి ఎంపికలలో అందుబాటులోకి తీసుకువచ్చింది. మారుతి సూపర్ క్యారీ వెహికల్ 2016 లో భారతీయ మార్కెట్లో విడుదలైంది.

కమర్షియల్ వెహికల్ సేల్స్‌లోనూ తగ్గని హవా.. లక్ష యూనిట్లు దాటిన Maruti Super Carry అమ్మకాలు

కంపెనీ విడుదల చేసిన ఈ వాహనం బహుళ ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు. ఇది దేశవ్యాప్తంగా ఉన్న 335 కమర్షియల్ అవుట్‌లెట్‌ల ద్వారా విక్రయించవచ్చు. కంపెనీ నుండి 4 సిలిండర్ల ఇంజన్‌తో తీసుకువచ్చిన ఏకైక మినీ ట్రక్ మారుతి సూపర్ క్యారీ. కావున దీనికి కస్టమర్ల నుండి మంచి స్పందన వచ్చింది, అంతే కాకుండా మంచి అమ్మకాలను కూడా పొందగలిగింది.

కమర్షియల్ వెహికల్ సేల్స్‌లోనూ తగ్గని హవా.. లక్ష యూనిట్లు దాటిన Maruti Super Carry అమ్మకాలు

మారుతి సూపర్ క్యారీ మారుతి తన విభాగంలో అత్యధిక శక్తి, ఉత్తమ మైలేజీ, సులభమైన నిర్వహణ, సౌకర్యం మరియు మరింత నిల్వ సామర్థ్యంతో వస్తుందని పేర్కొంది. మారుతి సూపర్ క్యారీ మినీ ట్రక్ రివర్స్ పార్కింగ్ సెన్సార్, సీట్ బెల్ట్ రిమైండర్, లాకింగ్ గ్లోవ్‌బాక్స్, మొబైల్ ఛార్జింగ్ సాకెట్, లైట్ వెయిట్ స్టీరింగ్ వీల్ వంటి సేఫ్టీ ఫీచర్లను పొందుతుంది.

కమర్షియల్ వెహికల్ సేల్స్‌లోనూ తగ్గని హవా.. లక్ష యూనిట్లు దాటిన Maruti Super Carry అమ్మకాలు

ఇందులోని ఇంజిన్ 6000 ఆర్‌పిఎమ్ వద్ద 54 కిలోవాట్స్ పవర్ మరియు 3000 ఆర్‌పిఎమ్ వద్ద 98 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సూపర్ క్యారీ S-CNG వేరియంట్, అంతే కాకుండా ఇది 5 లీటర్ ఇంధన ట్యాంక్‌తో వస్తుంది. కావున మంచి ఇంధన సామర్త్యాన్ని అందిస్తుంది.

కమర్షియల్ వెహికల్ సేల్స్‌లోనూ తగ్గని హవా.. లక్ష యూనిట్లు దాటిన Maruti Super Carry అమ్మకాలు

మారుతి సూపర్ క్యారీ తక్కువ బరువు కలిగిన కమర్షియల్ వాహనం. ఈ వాహనం యొక్క డెక్ ప్రాంతం 2,183 మిమీ, వెడల్పు 1,488 మిమీ మరియు 740 కిలోల పేలోడ్ సామర్థ్యంతో వస్తుంది. అయితే ఈ వాహనం యొక్క గ్రౌండ్ క్లియరెన్స్‌ 175 మిమీ వరకు ఉంటుంది. కావున వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

కమర్షియల్ వెహికల్ సేల్స్‌లోనూ తగ్గని హవా.. లక్ష యూనిట్లు దాటిన Maruti Super Carry అమ్మకాలు

మారుతి సూపర్ క్యారీ 2010 లో CNG వాహన విభాగంలోకి ప్రవేశించింది. ఇప్పటి వరకు కంపెనీ CNG మరియు స్మార్ట్ హైబ్రిడ్‌లను కలపడం ద్వారా ఒక మిలియన్ గ్రీన్ వాహనాలను విక్రయించింది. అయితే రాబోయే కొద్ది సంవత్సరాల్లో మరో మిలియన్ గ్రీన్ వాహనాలను విక్రయించాలని యోచిస్తోంది. గతేడాది దేశంలో సీఎన్‌జీ స్టేషన్ల సంఖ్య 56 శాతం పెరిగింది. గత ఐదేళ్లలో, సగటున ప్రతి సంవత్సరం 156 స్టేషన్లు మరియు గత సంవత్సరం 477 స్టేషన్లు జోడించబడ్డాయి.

కమర్షియల్ వెహికల్ సేల్స్‌లోనూ తగ్గని హవా.. లక్ష యూనిట్లు దాటిన Maruti Super Carry అమ్మకాలు

భారతదేశంలోకి చమురు దిగుమతులను తగ్గించే ప్రభుత్వ ప్రణాళికలో ఇది పెద్ద నిజంగా అడుగు. కమర్షియల్ వాహనాలు ఇందులో మంచి విజయాన్ని అందుకుంటున్నాయి, రాబోయే రోజుల్లో కంపెనీ దీనిని మరింత విస్తరించే అవకాశం ఉంటుంది. కావున ఈ విభాగంలో మరింత ఎక్కువ వాహనాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది.

కమర్షియల్ వెహికల్ సేల్స్‌లోనూ తగ్గని హవా.. లక్ష యూనిట్లు దాటిన Maruti Super Carry అమ్మకాలు

ఇదిలా ఉండగా మారుతి సుజుకి ఇండియా రానున్న 2022 జనవరి నుండి తమ వాహనాల ధరలను పెంచనున్నట్లు తెలిపింది. కంపెనీ అందించిన నివేదికల ప్రకారం, గత ఒక సంవత్సరంలో, వివిధ ఇన్‌పుట్ ఖర్చుల పెరుగుదల కారణంగా వాహనాల ధరలు కూడా పెరగటం జరిగింది.

కమర్షియల్ వెహికల్ సేల్స్‌లోనూ తగ్గని హవా.. లక్ష యూనిట్లు దాటిన Maruti Super Carry అమ్మకాలు

మారుతి సుజుకి ఇప్పటికే 2021 సంవత్సరంలో ఏకంగా మూడుసార్లు తమ వాహనాల ధరలను పెంచింది. జనవరిలో 1.4 శాతం, ఏప్రిల్‌లో 1.6 శాతం, సెప్టెంబర్‌లో 1.9 శాతం చొప్పున మొత్తం 4.9 శాతం ధరలను పెంచడం జరిగింది. ఇప్పుడు రానున్న కొత్త సంవత్సరంలో మళ్ళీ ధరలను పెంచినట్లైతే వరుసగా నాలుగవ సారి అవుతుంది.

కమర్షియల్ వెహికల్ సేల్స్‌లోనూ తగ్గని హవా.. లక్ష యూనిట్లు దాటిన Maruti Super Carry అమ్మకాలు

ధరల పెరుగుదల గురించి, మారుతి సుజకి సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ 'శశాంక్‌ శ్రీవాస్తవ' మాట్లాడుతూ.. ఒక సంవత్సర కాలంగా వాహనతయారీకి కావలసిన ముడిసరుకులైన స్టీల్‌, అల్యూమినియం, కాపర్‌ మరియు ప్లాస్టిక్‌ వంటి వాటి ధరలు అమాంతం పెరిగాయి. ఈ కారణంగానే ధరలు పెరిగాయని ఆయన స్పష్టం చేశారు. అయితే కంపెనీ యొక్క కార్ల ధరలు అమాంతం పెరగడం వల్ల అమ్మకాల్లో ఏదైనా ప్రభావం చూపుతుందా అనే విషయాలు త్వరలో వెల్లడవుతాయి.

Most Read Articles

English summary
Maruti super carry sales crosses 1 lakh unit details
Story first published: Wednesday, December 15, 2021, 11:34 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X