మారుతి సుజుకి నుండి రానున్న కొత్త 7-సీటర్ ఎమ్‌పివి; పేరు ఎక్స్ఎల్7

దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా, ఈ ఆర్థిక సంవత్సరంలో అనేక సరికొత్త మోడళ్లను మార్కెట్లో విడుదల చేయనుంది. వీటిలో ఓ 7-సీటర్ ఎమ్‌పివి కూడా ఉంటుందని తెలుస్తోంది.

మారుతి సుజుకి నుండి రానున్న కొత్త 7-సీటర్ ఎమ్‌పివి; పేరు ఎక్స్ఎల్7

తాజా నివేదికల ప్రకారం, మారుతి సుజుకి తమ ప్రీమియం నెక్సా డీలర్‌షిప్ నెట్‌వర్క్‌లో ఓ ఏడు సీట్ల ఎమ్‌పివిని చేర్చాలని కంపెనీ యోచిస్తోంది. ఈ కొత్త మోడల్ ప్రస్తుతం కంపెనీ విక్రయిస్తున్న ఎక్స్‌ఎల్6 యొక్క ఏడు సీట్ల వేరియంట్‌గా ఉంటుందని, దీనిని ఎక్స్‌ఎల్7 అని పిలుస్తారని సమాచారం.

మారుతి సుజుకి నుండి రానున్న కొత్త 7-సీటర్ ఎమ్‌పివి; పేరు ఎక్స్ఎల్7

మారుతి సుజుకి ఇప్పటికే ఈ 7-సీటర్ ఎమ్‌పివి ఎక్స్ఎల్7ను ఇండోనేషియా మార్కెట్లో విక్రయిస్తోంది. అక్కడి మార్కెట్లో ఈ మోడల్‌ను ఫిబ్రవరి 2020లో ప్రవేశపెట్టారు. అయితే, ప్రస్తుతం మారుతి అందిస్తున్న 6-సీట్ల ఎక్స్‌ఎల్6 మోడల్‌తో పోలిస్తే, కొత్తగా ప్రవేశపెట్టబోయే 7-సీట్ల ఎక్స్ఎల్7 మోడల్‌లో కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది.

మారుతి సుజుకి నుండి రానున్న కొత్త 7-సీటర్ ఎమ్‌పివి; పేరు ఎక్స్ఎల్7

వెడల్పాటి టైర్లతో కొత్తగా రూపొందించిన అల్లాయ్ వీల్స్, కాంట్రాస్టింగ్ బ్లాక్ రూఫ్, రియర్ స్పాయిలర్ మరియు మోడల్ బ్యాడ్జింగ్ వంటి వాటిని ఇందులో ఆశించవచ్చు. ఇండోనేషియన్ వెర్షన్ సుజుకి ఎక్స్‌ఎల్7 పెద్ద 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కూడా ఆఫర్ చేస్తున్నారు.

మారుతి సుజుకి నుండి రానున్న కొత్త 7-సీటర్ ఎమ్‌పివి; పేరు ఎక్స్ఎల్7

ఎక్స్ఎల్7 మోడల్‌లో చేయబోయే ఇతర మార్పులలో, ఇందులో ఆండ్రాయి ఆటో మరియ ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, రియర్ కెమెరా డిస్‌ప్లేతో కూడిన ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్, ఫోల్డబుల్ ఆర్మ్‌రెస్ట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ అప్‌డేటెడ్ ఎమ్‌పివిలో ఇతర కాస్మెటిక్ మార్పులు మరియు అప్‌గ్రేడ్ చేయబడిన సీట్ అప్‌హోలెస్ట్రీ వంటి మార్పులను ఆశించవచ్చు.

మారుతి సుజుకి నుండి రానున్న కొత్త 7-సీటర్ ఎమ్‌పివి; పేరు ఎక్స్ఎల్7

ఏడు సీట్ల మారుతి సుజుకి ఎక్స్ఎల్7 ఎమ్‌పివిలో మూడవ మరియు రెండవ వరుసలలోని సీట్లను మడచినట్లయితే, 803-లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది. అలాకాకుండా, కేవలం మూడవ వరుస సీట్లను మాత్రమే మడిచినట్లయితే, 550-లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది. అన్ని 7 సీట్లు ఓపెన్‌లో ఉన్నప్పుడు ఇందులో స్టాండర్డ్‌గా 153-లీటర్ల బూట్ స్పేస్ ఉంటుందని భావిస్తున్నారు. మారుతి ఎక్స్ఎల్6లో కేవలం 111-లీటర్ల బూ్ స్పేస్ మాత్రమే లభిస్తుంది.

మారుతి సుజుకి నుండి రానున్న కొత్త 7-సీటర్ ఎమ్‌పివి; పేరు ఎక్స్ఎల్7

ఎక్స్‌ఎల్7లో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు ఉండబోవని తెలుస్తోంది. ఎక్స్‌ఎల్6 మాదిరిగానే ఇది కూడా ఒకరేకమైన ఇంజన్ మరియు ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్‌లను పొందనుంది. ప్రస్తుతం, ఎక్స్ఎల్6 ఎమ్‌పివిలో 1.5-లీటర్ కె15 పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది ఎస్‌హెచ్‌విఎస్ (స్మార్ట్ హైబ్రిడ్ వెహికల్ బై సుజుకి) మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీతో పనిచేస్తుంది.

మారుతి సుజుకి నుండి రానున్న కొత్త 7-సీటర్ ఎమ్‌పివి; పేరు ఎక్స్ఎల్7

ఈ ఇంజన్ గరిష్టంగా 6000 ఆర్‌పిఎమ్ వద్ద 103 బిహెచ్‌పి శక్తిని మరియు 4400 ఆర్‌పిఎమ్ వద్ద 138 న్యూటన్ మీటర్ల గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 4-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో జతచేయబడి ఉంటుంది.

మారుతి సుజుకి నుండి రానున్న కొత్త 7-సీటర్ ఎమ్‌పివి; పేరు ఎక్స్ఎల్7

ఈ ఎమ్‌పివిలో కంపెనీ కొన్ని స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లను ఆఫర్ చేసే అవకాశం ఉంది. వీటిలో డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్లు, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, హై-స్పీడ్ అలెర్ట్, ప్రీ-టెన్షనర్లు మరియు ఫోర్స్ లిమిటర్లతో ఫ్రంట్ సీట్ బెల్ట్‌లు, ఏబిఎస్ విత్ ఈబిడి, ఈఎస్‌పి, మరియు హిల్ హోల్డ్ అసిస్ట్ మొదలైనవి ఉండవచ్చని భావిస్తున్నారు.

మారుతి సుజుకి నుండి రానున్న కొత్త 7-సీటర్ ఎమ్‌పివి; పేరు ఎక్స్ఎల్7

రాబోయే కొత్త 7-సీటర్ ఎమ్‌పివి అలియాస్ ఎక్స్ఎల్7 మోడల్‌తో పాటుగా మారుతి సుజుకి మరిన్ని కొత్త కార్లను భారత మార్కెట్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. వీటిలో కొత్త తరం సెలెరియో హ్యాచ్‌బ్యాక్, ఫేస్‌లిఫ్టెడ్ విటారా బ్రెజ్జా కాంపాక్ట్ ఎస్‌యూవీ, కొత్త తరం బాలెనో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మరియు అప్‌డేటెడ్ ఎర్టిగా మొదలైనవి ఉన్నాయి.

Source: Autocar India

Most Read Articles

English summary
Maruti Suzuki 7 Seater MPV To Be Named As XL7; India Launch Expected Soon, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X