ఏప్రిల్ నెలలో స్వల్పంగా క్షీణించిన మారుతి సుజుకి సేల్స్

భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఏప్రిల్ 2021 అమ్మకాల గణాంకాలను విడుదల చేసింది. ఈ గణాంకాల ప్రకారం, గత నెలలో మారుతి మొత్తం 1,59,691 యూనిట్ల వాహనాలను విక్రయించింది. ఈ మొత్తం అమ్మకాలలో 1,37,151 యూనిట్లు దేశీయ మార్కెట్లో అమ్ముడు కాగా, 17,237 యూనిట్లను కంపెనీ ఎగుమతి చేసింది.

ఏప్రిల్ నెలలో స్వల్పంగా క్షీణించిన మారుతి సుజుకి సేల్స్

గత శనివారం (మే 1వ తేదీన) మారుతి సుజుకి బిఎస్‌ఇ రెగ్యులేటరీ ఫైల్‌ను దాఖలు చేసే సమయంలో ఈ వివరాలను వెల్లడి చేసింది. ఏప్రిల్ 2020లో పూర్తి లాక్‌డౌన్ కారణంగా మారుతి సుజుకి ఎలాంటి అమ్మకాలను నమోదు చేయలేదు కాబట్టి, ఈ సమయంతో పోల్చితే కంపెనీ అమ్మకాలలో గణనీయమైన మెరుగుదల నమోదు చేసినట్లు చూపిస్తుంది.

ఏప్రిల్ నెలలో స్వల్పంగా క్షీణించిన మారుతి సుజుకి సేల్స్

కాగా, ఏప్రిల్ 2019 నెలలోలో, మారుతి సుజుకి దేశీయ అమ్మకాలు మరియు ఎగుమతులతో కలిపి మొత్తం అమ్మకాలు 1,43,245 యూనిట్లుగా నమోదయ్యాయి. అంటే ఏప్రిల్‌ 2021లో మారుతి సుజుకి మొత్తం అమ్మకాలు ఏప్రిల్ 2019 నెల స్థాయిని దాటినట్లు తెలుస్తోంది.

MOST READ:కరోనా రోగులకు గుడ్ న్యూస్.. ఇప్పుడు ఆక్సిజన్ వెహికల్స్ ఎక్కడ వస్తున్నాయో ఇట్టే తెలుసుకోవచ్చు.. ఎలా అంటే?

ఏప్రిల్ నెలలో స్వల్పంగా క్షీణించిన మారుతి సుజుకి సేల్స్

కరోనా వైరస్ దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం మార్చి 2020 చివరి భాగంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ప్రకటించిన సంగతి తెలిసినదే. లాక్‌డౌన్ ప్రకటించిన తరువాత, మారుతి సుజుకి స్థానికంగా ఎటువంటి కార్లను విక్రయించలేదు. అయితే, గత సంవత్సరం ఇదే నెలలో ఈ కంపెనీ 632 వాహనాలను ఎగుమతి చేసింది.

ఏప్రిల్ నెలలో స్వల్పంగా క్షీణించిన మారుతి సుజుకి సేల్స్

గత ఏడాది ద్వితీయార్ధంలో (మే 2021లో) ప్రభుత్వం లాక్‌డౌన్ ఆంక్షలు సడలించిన తరువాత కంపెనీ అమ్మకాలు క్రమంగా కోలుకోవటం ప్రారంభించాయి. మారుతి సుజుకి విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, ఏప్రిల్ 2021లో ఆల్టో, ఎస్-ప్రెసోతో సహా 25,041 యూనిట్ల మినీ ప్యాసింజర్ వాహనాలు అమ్ముడయ్యాయి.

MOST READ:విడుదలైన మహీంద్రా 2021 ఏప్రిల్ సేల్స్.. స్వల్పంగా పెరిగిన వృద్ధి

ఏప్రిల్ నెలలో స్వల్పంగా క్షీణించిన మారుతి సుజుకి సేల్స్

అదే సమయంలో వ్యాగన్ఆర్, స్విఫ్ట్, సెలెరియో, ఇగ్నిస్, బాలెనో, డిజైర్, టూర్ ఎస్ వంటి మోడళ్ల అమ్మకాలు 72,318 యూనిట్లుగా ఉన్నాయి. ఇక మిడ్-సైజ్ సెడాన్ మారుతి సుజుకి సియాజ్ విషయానికి వస్తే, ఏప్రిల్ 2021లో ఇవి 1,567 యూనిట్లు అమ్ముడయ్యాయి.

ఏప్రిల్ నెలలో స్వల్పంగా క్షీణించిన మారుతి సుజుకి సేల్స్

మారుతి సుజుకి విక్రయిస్తున్న ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు మరియు తేలికపాటి వాణిజ్య వాహనాల అమ్మకాలను రెండూ కలిపి చూస్తే, మొత్తం దేశీయ అమ్మకాలు 1,37,151 యూనిట్లుగా ఉన్నాయి.

MOST READ:డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ లో తప్పకుండా పాటించాల్సిన రూల్స్, ఇవే

ఏప్రిల్ నెలలో స్వల్పంగా క్షీణించిన మారుతి సుజుకి సేల్స్

ఏప్రిల్ 2019 అమ్మకాల గురించి మాట్లాడితే, మారుతి సుజుకి మొత్తం దేశీయ మార్కెట్లో 1,33,704 యూనిట్లను విక్రయించింది. ఈ గణాంకాల ప్రకారం, కంపెనీ యొక్క ఏప్రిల్ 2021 నెల దేశీయ అమ్మకాలు, ఏప్రిల్ 2019 నెల దేశీయ అమ్మకాల కంటే ఎక్కువగా ఉన్నాయని తెలుపుతున్నాయి.

ఏప్రిల్ నెలలో స్వల్పంగా క్షీణించిన మారుతి సుజుకి సేల్స్

ఇదిలా ఉంటే, దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా, మారుతి సుజుకి తమ అన్ని ప్లాంట్లలో ఉత్పత్తిని మే 1వ తేదీ నుండి 9వ తేదీ వరకూ మూసివేయాలని నిర్ణయించిన విషయం తెలిసినదే. ఈ ప్లాంట్ లాక్‌డౌన్ సమయాన్ని కంపెనీ వార్షిక నిర్వహణ కోసం వినియోగించనుంది.

MOST READ:2021 ఏప్రిల్ నెలలో రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాల హవా

ఏప్రిల్ నెలలో స్వల్పంగా క్షీణించిన మారుతి సుజుకి సేల్స్

అలాగే, వైద్య అవసరాల కోసం వినియోగించబడే ఆక్సిజెన్ తయారీని కంపెనీ ప్రారంభించింది. ప్రస్తుతం, దేశంలో కోవిడ్-19 సంక్రమణ గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో, దేశంలోని అనేక ప్రాంతాల్లో ఆక్సిజన్ కొరత ఉంది, ఫలితంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.

Most Read Articles

English summary
Maruti Suzuki April 2021 Sales Register 1,59,691 Units, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X