జిమ్నీ (Jimny) ఎస్‌యూవీని భారతదేశంలో విడుదల చేయాలా వద్దా..? : మారుతి సుజుకి

భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki) నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోడళ్లలో జిమ్నీ (Jimny) ఎస్‌యూవీని కూడా ఒకటి. ఒకప్పుడు మార్కెట్ పాలించి, ఇప్పుడు కనుమరుగైన మారుతి సుజుకి జిప్సీ లోటును భర్తీ చేయడానికి సుజుకి జిమ్నీ ఓ చక్కటి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. జపాన్ మార్కెట్లో ఇప్పటికే అత్యంత పాపులర్ అయిన జిమ్నీ కాంపాక్ట్ ఎస్‌యూవీని భారతదేశంలో విడుదల చేసేందుకు మారుతి సుజుకి సంశయిస్తోంది.

జిమ్నీ (Jimny) ఎస్‌యూవీని భారతదేశంలో విడుదల చేయాలా వద్దా..? : మారుతి సుజుకి

అసలు ఈ చిన్న ఎస్‌యూవీని భారతదేశంలో విడుదలచేయాలా వద్దా అనే అంశంపై కంపెనీ ఇప్పుడు మార్కెట్ అధ్యయనం చేస్తోంది. ఈ నేపథ్యంలో, జిమ్నీ ఇండియా లాంచ్ గురించి కంపెనీ వినియోగదారుల నుండి అభిప్రాయాలను సేకరిస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తున్న సుజుకి జిమ్నీ ఎస్‌యూవీని, మారుతి సుజుకి స్థానికంగా భారతదేశంలోనే ఉత్పత్తి చేస్తోంది. అంతేకాకుండా, సుజుకి జిమ్నీ ఎస్‌యూవీ తయారీ కోసం కంపెనీ భారత్‌ను తమ గ్లోబల్ మ్యాన్యుఫాక్చరింగ్ హబ్‌గా కూడా మార్చుకుంది.

జిమ్నీ (Jimny) ఎస్‌యూవీని భారతదేశంలో విడుదల చేయాలా వద్దా..? : మారుతి సుజుకి

సుజుకి జిమ్నీ (Suzuki Jimny)కి అంతర్జాతీయ మార్కెట్లలో మంచి డిమాండ్ ఉంది. ఇటీవలి కాలంలో మనదేశంలో కూడా కాంపాక్ట్ ఎస్‌యూవీలు మరియు ఆఫ్-రోడ్ వాహనాలకు గిరాకీ భారీగా పెరిగింది. ఇందుకు నిదర్శనమే సరికొత్త మహీంద్రా థార్ మరియు ఇటీవల మార్కెట్లోకి వచ్చిన మరికొన్ని కొత్త ఎస్‌యూవీ మోడళ్లు. ప్రస్తుతం, మారుతి సుజుకి నుండి భారతదేశంలో ఒకే ఒక ఎస్‌యూవీ 'విటారా బ్రెజ్జా' (Vitara Brezza) మాత్రమే అమ్మకానికి అందుబాటులో ఉంది.

జిమ్నీ (Jimny) ఎస్‌యూవీని భారతదేశంలో విడుదల చేయాలా వద్దా..? : మారుతి సుజుకి

ఈ నేపథ్యంలో, మారుతి సుజుకి ఈ లేటెస్ట్ ఆఫ్-రోడ్ జిమ్నీ ఎస్‌‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేసి, సరసమైన ధరకే అందించగలిగినట్లయితే, ఇది ఖచ్చితంగా నూటికి నూరు శాతం విజయం సాధించే అవకాశం ఉంది. జిమ్నీ ఎస్‌యూవీ భారతదేశంలో మారుతి సుజుకి ఇండియాకు అత్యుత్తమ వ్యాపార అవకాశంగా పరిగణించబడుతున్నప్పటికీ, కంపెనీ దానిని నిర్ధారించే ప్రయత్నానికి దిగింది. తాజా నివేదికల ప్రకారం, మారుతి సుజుకి తమ జిమ్నీ ఆఫ్-రోడర్‌ను వచ్చే ఏడాది మధ్య భాగం నాటికి భారత మార్కెట్లో ప్రవేశపెట్టవచ్చని సమాచారం.

జిమ్నీ (Jimny) ఎస్‌యూవీని భారతదేశంలో విడుదల చేయాలా వద్దా..? : మారుతి సుజుకి

ప్రీమియం ఫీచర్లతో కూడిన మహీంద్రా థార్ ఎస్‌యూవీ ధర రూ. 12 లక్షలకు పైగానే ఉన్న నేపథ్యంలో, మారుతి సుజుకి తమ జిమ్నీ ఎస్‌యూవీని రూ. 10 లక్షల రేంజ్ లో గనుక విడుదల చేసినట్లయితే, ఇది ఈ విభాగంలోని మరిన్ని వ్యాపార అవకాశాలను దక్కించుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో, మారుతి సుజుకి ఇప్పుడు తమ జిమ్నీని భారతదేశంలో ప్రవేశపెట్టడం గురించి అభిప్రాయ సేకరణ చేస్తోంది. ఈ సందర్భంగా జిమ్నీకి వినియోగదారుల నుండి సానుకూల స్పందన లభిస్తోందని కంపెనీ పేర్కొంది.

జిమ్నీ (Jimny) ఎస్‌యూవీని భారతదేశంలో విడుదల చేయాలా వద్దా..? : మారుతి సుజుకి

ఈ విషయంపై మారుతి సుజుకి ఇండియా సీనియర్ సేల్స్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, తాము జిమ్నీ ఎస్‌యూవీ లాంచ్ గురించి కస్టమర్‌లను ఫీడ్‌బ్యాక్ కోసం అడుగుతున్నామని, ఈ విషయంలో తమకు సానుకూల స్పందన వచ్చిందని చెప్పారు. మారుతి సుజుకి యొక్క మాతృ సంస్థ అయిన సుజుకి బ్రాండ్‌ ద్వారా విక్రయించబడుతున్న జిమ్నీ ఎస్‌యూవీకి ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. గత 50 ఏళ్ల సంప్రదాయంతో ఆధునిక యుగం కస్టమర్లను ఆకట్టుకునే ఫీచర్లతో ఇది విక్రయించబడుతోంది.

జిమ్నీ (Jimny) ఎస్‌యూవీని భారతదేశంలో విడుదల చేయాలా వద్దా..? : మారుతి సుజుకి

మారుతి సుజుకి ఈ జిమ్నీ ఎస్‌యూవీని గత సంవత్సరం ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో కూడా ప్రదర్శించింది. దీన్నిబట్టి చూస్తుంటే, మరో ఏడాది లోగా ఇది భారత మార్కెట్లోకి విడుదల చేయబడుతుందని భావిస్తున్నారు. కానీ, మారుతి సుజుకి మాత్రం భారతదేశంలో ఈ ఎస్‌యూవీకి మంచి ఆదరణ లభిస్తుందో లేదో తెలియని అయోమయంలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఎస్‌యూవీ మార్కెట్ ట్రెండ్ సక్సెస్ కళ్లకు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నటికీ, మారుతి సుజుకి మాత్రం వెయిట్ అండ్ వాచ్ పాలసీని ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది.

జిమ్నీ (Jimny) ఎస్‌యూవీని భారతదేశంలో విడుదల చేయాలా వద్దా..? : మారుతి సుజుకి

సుజుకి జిమ్నీ ఎస్‌యూవీ విషయానికి వస్తే, అంతర్జాతీయ మార్కెట్లోల ఇది 3-డోర్ మరియు 5-డోర్ వెర్షన్లలో అమ్ముడవుతోంది మరియు ఇది 5-సీటర్ వెర్షన్ తో మాత్రమే అందుబాటులో ఉంటుంది. జపాన్ మార్కెట్లో 3-డోర్ వెర్షన్ ఎక్కువగా అమ్ముడవుతుంది. కాగా, మనదేశం కోసం మారుతి సుజుకి ప్రత్యేకంగా 5-డోర్ వెర్షన్ జిమ్నీని విడుదల చేసే అవకాశం ఉంది. మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్ వెర్షన్ 3,850 మిమీ పొడవును, 1,645 మిమీ వెడల్పును, 1,730 మిమీ ఎత్తును మరియు 2,550 మిమీ వీల్‌బేస్‌ను కలిగి ఉంటుందని సమాచారం.

జిమ్నీ (Jimny) ఎస్‌యూవీని భారతదేశంలో విడుదల చేయాలా వద్దా..? : మారుతి సుజుకి

గ్లోబల్ వెర్షన్ సుజుకి జిమ్నీ ఎస్‌యూవీ డిజైన్‌ను గమనిస్తే, ఇందులో ముందు వైపు గుండ్రటి హెడ్‌ల్యాంప్ క్లస్టర్, బ్లాక్ హనీకోంబ్ గ్రిల్, హెడ్‌ల్యాంప్ క్లస్టర్‌కు పక్కనే గుండ్రటి టర్న్ ఇండికేటర్స్, గుండ్రటి ఫాగ్‌ల్యాంప్స్ మరియు సిల్వర్ స్కిడ్ ప్లేట్‌తో కూడిన బ్లాక్ కలర్ ఫ్రంట్ బంపర్ ఉన్నాయి. వెనుక వైపు హై మౌంటెడ్ స్టాప్ లాంప్ మరియు బ్లాక్ రియర్ బంపర్‌లు కూడా ఇందులో గమనించవచ్చు. ఈ ఎస్‌యూవీ సైడ్ ప్రొఫైల్ చాలా మినిమలిస్టిక్‌గా ఉంటుంది. బ్లాక్ ప్లాస్టిక్ క్లాడింగ్‌తో కూడిన పెద్ద వీల్ ఆర్చెస్, యు-ఆకారపు మెషీన్డ్ డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, ఫ్లష్ టైప్ డోర్ హ్యాండిల్స్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

జిమ్నీ (Jimny) ఎస్‌యూవీని భారతదేశంలో విడుదల చేయాలా వద్దా..? : మారుతి సుజుకి

సుజుకి జిమ్నీ ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే, 5-డోర్ వెర్షన్‌లో 1.5 లీటర్, 4-సిలిండర్, కె15బి, డిఓహెచ్‌సి 16 పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 101 బిహెచ్‌పి శక్తిని, 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 130 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ మరియు 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో జతచేయబడి ఉంటుంది. మారుతి తమ ఎర్టిగా, సియాజ్ మరియు విటారా బ్రెజ్జా మోడళ్లలో కూడా ఇదే రకం ఇంజన్ ను ఉపయోగిస్తోంది.

Most Read Articles

English summary
Maruti suzuki asking customers for feedback on jimny suv india launch details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X