హమ్మయ్యా.. సాధారణ స్థితికి చేరుకోనున్న Maruti Suzuki కార్ల ఉత్పత్తి!

సెమీకండక్టర్ చిప్స్ కొరత కారణంగా, దేశంలోని అనేక ఆటోమొబైల్ కంపెనీలు తమ వాహనాల ఉత్పత్తిలో అంతరాయాన్ని ఎదుర్కుంటున్న సంగతి తెలిసినదే. ఈ సమస్యను ఎదుర్కుంటున్న కంపెనీలలో భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా కూడా ఒకటి.

హమ్మయ్యా... సాధారణ స్థితికి చేరుకోనున్న Maruti Suzuki కార్ల ఉత్పత్తి!

ఎలక్ట్రానిక్ చిప్స్ కొరత కారణంగా, మారుతి సుజుకి గత కొన్ని నెలలుగా తమ కార్ల ఉత్పత్తిని తగ్గిస్తూ వచ్చింది. అయితే, వచ్చే నెల నుండి మారుతి సుజుకి కార్ల ఉత్పత్తి సాధారణ స్థాయికి చేరుకోవచ్చనని, నవంబర్ 2021 నెలలో కంపెనీ 1,45,000 యూనిట్ల నుండి 1,50,000 యూనిట్ల మధ్యలో వాహనాలను ఉత్పత్తి చేయగలదని కంపెనీ పేర్కొంది.

హమ్మయ్యా... సాధారణ స్థితికి చేరుకోనున్న Maruti Suzuki కార్ల ఉత్పత్తి!

గత నెలలతో పోల్చుకుంటే, ప్రస్తుతం సెమీకండక్టర్ల సరఫరా కాస్తం మెరుగ్గా ఉండటంతో కంపెనీల కార్ల ఉత్పత్తి మునుపటి కన్నా మెరుగ్గా ఉండబోతోంది. మారుతి సుజుకి త్వరలోనే తమ పాపులర్ మోడళ్లైన స్విఫ్ట్, డిజైర్, విటారా బ్రెజ్జా కార్ల ఉత్పత్తిని పెంచనుంది. సమాచారం ప్రకారం, ఈ ఉత్పత్తి సంఖ్య అంచనాను మారుతి సుజుకి తమ విడిభాగాల సరఫరాదారులకు అందించింది.

హమ్మయ్యా... సాధారణ స్థితికి చేరుకోనున్న Maruti Suzuki కార్ల ఉత్పత్తి!

విడిభాగాల సమస్య కారణంగా, మారుతి సుజుకి గడచిన సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలల్లో కార్ల ఉత్పత్తిలో 50-60 శాతం తగ్గుదలను చూసింది. ఇందుకు ప్రధాన కారణం నేటి ఆధునిక కార్లలో చాలా ముఖ్యమైన సెమీకండక్టర్ చిప్స్ లభ్యత తక్కువగా ఉండటమే. అయితే, ఇప్పుడు వీటి సరఫరా సాధారణ స్థితికి చేరుకుంటున్న నేపథ్యంలో చాలా వరకూ ఆటోమొబైల్ కంపెనీలు తమ కార్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే దిశగా అడుగులు వేస్తున్నాయి.

హమ్మయ్యా... సాధారణ స్థితికి చేరుకోనున్న Maruti Suzuki కార్ల ఉత్పత్తి!

కోవిడ్-19 తర్వాత పరిస్థితులు మెరుగుపడుతున్న నేపథ్యంలో, మలేషియాలో సెమీకండక్టర్ల ఉత్పత్తి తిరిగి ట్రాక్‌లోకి రాబోతోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో డిసెంబర్ 2021 లో మారుతి సుజుకి కార్ల ఉత్పత్తి నవంబర్‌ 2021 నెల కంటే ఎక్కువగా ఉండవచ్చని అంచనా. గడచిన సెప్టెంబర్ నెలతో పోలిస్తే, అక్టోబర్ నెలలో కంపెనీ మొత్తం ఉత్పత్తి 20 శాతం ఎక్కువగా ఉంటుందని, అలాగే అక్టోబర్ నెలతో పోలిస్తే వచ్చే నవంబర్ నెలలో వాహనాల ఉత్పత్తి 40 శాతం ఎక్కువగా ఉంటుందని అంచనా వేయబడింది.

హమ్మయ్యా... సాధారణ స్థితికి చేరుకోనున్న Maruti Suzuki కార్ల ఉత్పత్తి!

మలేషియాలో సెమీకండక్టర్ల ఉత్పత్తి పెరగడంతో, ఈ ఏడాది డిసెంబర్ నాటికి పరిస్థితి సాధారణం అవుతుందని భావిస్తున్నారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ రావడానికి ముందు, మారుతి సుజుకి యొక్క సగటు ఉత్పత్తి జనవరి మరియు మార్చి త్రైమాసికంలో 1,67,000 యూనిట్లుగా ఉండేది. అయితే, చిప్స్ కొరత కారణంగా గత కొన్ని నెలలుగా ఈ సంఖ్యలో భారీ తగ్గుదల కనిపించింది.

హమ్మయ్యా... సాధారణ స్థితికి చేరుకోనున్న Maruti Suzuki కార్ల ఉత్పత్తి!

మలేషియాలో ఉత్పత్తి చేయబడిన ఎలక్ట్రానిక్ చిప్స్ భారతదేశానికి చేరుకోవడానికి సుమారు 6 నుండి 8 వారాల సమయం పడుతుందని, వీటి ఉత్పత్తి సెప్టెంబర్ మరియు అక్టోబర్‌లలో 100 శాతానికి చేరుకుంటుందని, కాబట్టి నవంబర్ మరియు డిసెంబర్‌ నెలల్లో వాహనాల ఉత్పత్తి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుందని భావిస్తున్నారు.

హమ్మయ్యా... సాధారణ స్థితికి చేరుకోనున్న Maruti Suzuki కార్ల ఉత్పత్తి!

భారతీయ ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (SIAM) నివేదిక ప్రకారం, నవంబర్ 2021 లో మారుతి సుజుకి 1,50,000 యూనిట్లను ఉత్పత్తి చేయగలిగితే, ఇది గత నాలుగేళ్లలో అత్యుత్తమ పనితీరు అవుతుంది. అంతకు ముందు, కంపెనీ నవంబర్ 2017 లో 1,54,000 యూనిట్లను ఉత్పత్తి చేసింది. కాగా, గడచిన సెప్టెంబర్ 2021 లో కేవలం 81,278 యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేసింది, ఇది గత ఎనిమిదేళ్లలో కనిష్టంగా ఉంది, అయినప్పటికీ కంపెనీ కార్లకు మాత్రం డిమాండ్ పెరుగుతూనే ఉంది.

హమ్మయ్యా... సాధారణ స్థితికి చేరుకోనున్న Maruti Suzuki కార్ల ఉత్పత్తి!

గత మూడు నెలల్లో మారుతి సుజుకి సగటు ఉత్పత్తి 1,21,000 యూనిట్లు, కాగా సెప్టెంబర్ 2021 లో దాదాపు 1 లక్ష కార్లను ఉత్పత్తి చేసింది. కాకపోతే, ఈ ఎలక్ట్రానిక్ చిప్స్ కొరత కారణంగా వీటిలో 20 శాతం కార్లను కంపెనీ డీలర్‌షిప్‌లకు పంపలేకపోయింది. ఈ నేపథ్యంలో, సెమీకండక్టర్ చిప్స్ సరఫరా సాధారణ స్థాయికి చేరుకోగానే, రాబోయే నెలల్లో డీలర్‌షిప్‌ల కోసం ఇప్పటికే స్టాక్ చేసిన మరిన్ని వాహనాలను కంపెనీ రవాణా చేయడం ప్రారంభించే అవకాశం ఉంది.

హమ్మయ్యా... సాధారణ స్థితికి చేరుకోనున్న Maruti Suzuki కార్ల ఉత్పత్తి!

ఈ చిప్స్ కొరత కారణంగా మారుతి సుజుకి పాత ఆర్డర్‌లు 1,70,000 యూనిట్ల నుండి 2,50,000 యూనిట్లకు పెరిగినట్లు సమాచారం. ప్రస్తుతం డీలర్‌షిప్‌లో కొన్ని వారాలకు సరిపడా ఇన్వెంటరీ మాత్రమే మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం, భారతదేశంలో పండుగ సీజన్ నడుస్తున్న నేపథ్యంలో, రాబోయే వారాల్లో వాహనాల డెలివరీలను తీసుకోవాలనుకునే కస్టమర్లను కంపెనీ ఏవిధంగా సంతృప్తి పరుస్తుందో వేచి చూడాలి.

హమ్మయ్యా... సాధారణ స్థితికి చేరుకోనున్న Maruti Suzuki కార్ల ఉత్పత్తి!

గడచిన సెప్టెంబర్ 2021 నెలలో మారుతి సుజుకి అమ్మకాలు పరిశీలిస్తే, కంపెనీ అమ్మకాలు 57 శాతం క్షీణతను నమోదు చేశాయి. సెప్టెంబర్ 2021 లో మారుతి సుజుకి దేశీయ విపణిలో 63,111 యూనిట్ల కార్లను విక్రయించింది, గత ఏడాది ఇదే సమయంలో (సెప్టెంబర్ 2020 లో) ఇవి 1,47,912 యూనిట్లుగా నమోదయ్యాయి. కంపెనీ లైనప్‌ లోని ఎర్టిగా, ఎక్స్‌ఎల్6 వంటి కార్లు మినహా మిగిలిన అన్ని కార్ల విక్రయాలు తగ్గుముఖం పట్టాయి.

హమ్మయ్యా... సాధారణ స్థితికి చేరుకోనున్న Maruti Suzuki కార్ల ఉత్పత్తి!

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం

మారుతి సుజుకి కార్ల కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న కస్టమర్‌ లకు ఇది నిజంగా గొప్ప వార్తే. ఈ పరిణామాలు చూస్తుంటే, వచ్చే ఏడాది నుండి మారుతి సుజుకి కార్ల కోసం వెయిటింగ్ పీరియడ్ మరియు కార్ల డెలివరీలు సాధారణ స్థితికి చేరుకుంటాయని తెలుస్తోంది.

Most Read Articles

English summary
Maruti suzuki car production to reach normal level from next month details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X